• facebook
  • whatsapp
  • telegram

మెడికల నెరవేరాలంటే!

ప‌క‌డ్బందీ వ్యూహం!

జాతీయస్థాయి మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్ష.. ‘నీట్‌’. బైపీసీ విద్యార్థులు ఈ ప‌రీక్ష‌పై దృష్టిసారిస్తారు. ప‌రీక్ష‌ సమయంలో సబ్జెక్టులవారీగా అనుసరించాల్సిన మెలకువలను తెలుసుకుందాం!

దేశవ్యాప్తంగా లక్షలమంది విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకుంటారు. రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్ర నుంచి అత్యధికులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ పెరుగుదలకు ముఖ్య కారణాలు రెండు.

1) సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీట్‌ విదేశాల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులు చేయడానికి తప్పనిసరి అయింది.
2) అన్ని రకాల ఆయుష్‌ కోర్సులకూ నీట్‌ ర్యాంకు అవసరం అవడం.

 

ఫిజిక్స్‌: సాధనే ముఖ్యం
నీట్‌ పరీక్షలో ఫిజిక్స్‌లో మెరుగైన స్కోరు చేయాలంటే ప్రాథమిక భావనల పట్ల పూర్తి పట్టు సాధించాలి. బాగా సాధన చేయాలి! ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి అధ్యాయానికీ చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని సాధన చెయ్యడం మేలు.
కాలిక్యులేషన్స్‌ పట్ల విముఖత తగ్గించుకుని ఏకాగ్రతతో చదివితే ఫిజిక్స్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడం సులువే. ముఖ్యంగా డిఫరెన్షియేషన్‌, ఇంటిగ్రేషన్‌ వంటి అప్లికేషన్స్‌ మీద తగినంత పట్టు సాధించాలి. సిద్ధాంతపరమైన (థియరీ) ప్రశ్నలపైనే ఆధారపడటం సరికాదు. ఎందుకంటే నీట్‌ ప్రశ్నపత్రంలో గణిత సంబంధ (కాలిక్యులేషన్స్‌) ప్రశ్నలే ఎక్కువ వస్తున్నాయి. 11, 12 తరగతుల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. గణిత సంబంధ అనువర్తనాల పట్ల భయాన్నీ, నిరాసక్తతనూ తగ్గించుకుని వాటిపై పట్టు సాధించాలి.


అత్యంత ముఖ్యమైన చాప్టర్లు
* మెకానిక్స్‌, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రిసిటీ అండ్‌ మాగ్నటిజం, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌లు అత్యంత ముఖ్యమైన చాప్టర్లు. వీటిపై ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే మంచిది. మెకానిక్స్‌ విభాగంలో కన్సర్వేషన్‌ ఆఫ్‌ మొమెంటమ్‌, యాంగ్యులర్‌ మొమెంటమ్‌, ఎనర్జీలతోబాటు టార్క్‌, మొమెంట్‌ ఆఫ్‌ ఇనర్షియా ఫార్ములాలకు ప్రాధాన్యమిస్తూ సాధన చెయ్యాలి.
* అటామిక్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, సెమికండక్టర్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ వంటి విభాగాల నుంచి థియరీ ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఎక్కువ.
* గ్రావిటేషన్‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌, మాగ్నటిజం వంటి అధ్యాయాల్లో ఉన్న విభిన్న అంశాలు, అనువర్తనాలు, ఫార్ములాలు పోల్చదగినవిగా ఉంటాయి.
* కరంట్‌ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రో మాగ్నటిజం వంటి చాప్టర్‌లలో సర్క్యూట్‌ ఆధారిత లెక్కలు జాగ్రత్తగా సాధన చెయ్యాలి. కెపాసిటర్‌, రెసిస్టెన్స్‌లతో గల సర్క్యూట్‌లలో బాలన్స్‌డ్‌ వీట్‌ స్టోన్‌ బ్రిడ్జి ఉందేేమో గమనించాలి. దానివల్ల కొన్ని సందర్భాల్లో లెక్కలు చూసిన వెంటనే సరైన సమాధానాన్ని గుర్తించే వీలుంది.
* ప్రతి చాప్టర్‌లోనూ గ్రాఫు ఆధారిత లెక్కలను కూడా అధ్యయనం చెయ్యాలి.

Posted Date : 22-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌