• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ పై సందేహాలకు సమాధానాలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 

 

ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎంసెట్‌ పరీక్ష రానే వచ్చేసింది. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నేప‌థ్యంలో విద్యార్థులకు అనేక సందేహాలు ఉండటం సహజం. వారి అనుమానాలు నివృత్తి చేసేలా పరీక్ష ప్రక్రియపై faq's (frequently asked questions), వాటి జవాబులు..

 

ప్రశ్న: దరఖాస్తు ఏ మోడ్‌లో చేయాలి?

జవాబు: కేవలం ఆన్‌లైన్‌లోనే చేయాలి. 

 

ప్ర: ఫీజు ఎలా కట్టాలి?

జ: ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా కట్టొచ్చు. క్రెడిట్, డెబిట్, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ చెల్లించవచ్చు.. 

 

ప్ర: దరఖాస్తు చేరిందని ఎలా తెలుస్తుంది?

జ: దరఖాస్తు పూర్తిచేశాక మన మొబైల్‌ నంబర్‌కు ఒక రిజిస్ట్రేషన్‌ ఐడీ వస్తుంది. అలాగే మనం ఇచ్చిన వివరాలు బార్‌కోడ్‌తో సహా డేటాబేస్‌లో నిక్షిప్తం అవుతాయి.

 

ప్ర: దరఖాస్తులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం హాల్‌ టికెట్‌ నంబరు తప్పుగా రాస్తే ఏంచేయాలి?

జ: convenerapeapcet2022@gmail.com అనే మెయిల్‌ ఐడీకి మీ సంతకంతో కూడిన రిక్వెస్ట్‌ లెటర్‌ కాపీని స్కాన్‌ చేసి పంపాలి. దానికి సెకెండ్‌ ఇయర్‌ హాల్‌ టికెట్‌ లేదా మార్క్స్‌ మెమో కాపీని జతచేసి నంబరు మార్చుకునే అవకాశం కోరవచ్చు. 

 

ప్ర: ఏవైనా సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలా?

జ: అక్కర్లేదు. పరీక్ష సమయంలో దరఖాస్తు నకళ్లు తీసుకెళ్తే సరిపోతుంది. 

 

ప్ర: కుల ధ్రువపత్రాలు జతచేయాలా?

జ: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు కేటగిరీ ధ్రువపత్రాన్ని కౌన్సెలింగ్, అడ్మిషన్‌ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువపత్రాన్ని దరఖాస్తుతోపాటు పరీక్ష సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది.

 

ప్ర: అప్లికేషన్‌ ఫీజు ఎంత?

జ: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, బీసీలు రూ.550, జనరల్‌ విద్యార్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. 

 

ప్ర: ఒకసారి దరఖాస్తు సబ్మిట్‌ చేశాక తిరిగి ఎడిట్‌ చేయడం వీలవుతుందా?

జ: అనుమతించిన గడువులో కొన్ని ఫీల్డ్స్‌ మాత్రమే ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుంది. పేరు, తండ్రిపేరు, పుట్టినతేదీ వంటి వివరాలు మార్చుకోవాలంటే కన్వీనర్‌కు మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. 

 

ప్ర: ఒక స్ట్రీమ్‌లో పరీక్ష రాసేందుకు ఫీజు కట్టి దాన్ని వేరే స్ట్రీమ్‌లో రాసేందుకు మార్చుకోవడం వీలుపడుతుందా?

జ: లేదు, ఏ స్ట్రీమ్‌కి ఫీజు కడితే దానికే పరీక్ష రాయాలి. వేరే రాయాలి అనుకుంటే మళ్లీ ఫీజు కట్టాల్సిందే.

 

ప్ర: మీడియం ఎలా ఎంచుకోవాలి?

జ: పూర్తిగా ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే చదివిన వారు కావాలంటే ‘ఇంగ్లిష్‌ ఓన్లీ’ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో చదివిన వారికి వాటితోపాటూ ఇంగ్లిష్‌లోనూ పేపర్‌ ఉంటుంది. 

 

ప్ర: మీడియం తప్పుగా ఎంచుకుంటే ఏం చేయాలి?

జ: మార్చుకునేందుకు అవకాశం కోరుతూ కన్వీనర్‌కు రిజిస్టర్‌ అయిన ఐడీ నుంచి మెయిల్‌ చేయాలి. దానికి ఇంటర్‌ సెకెండ్‌ ఇయర్‌ హాల్‌ టికెట్‌ లేదా మార్క్స్‌ మెమో జత చేయాలి. 

 

ప్ర: ఎన్ని మార్కుల ప్రశ్నలుంటాయి?

జ: మూడు విభాగాల్లో 160 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. 

 

ప్ర: నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుందా?

జ: లేదు.

 

ముఖ్యమైన తేదీలు....

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌ ప్రారంభం: ఏప్రిల్‌ 11

పరీక్ష తేదీలు: జులై 4 - 8, 11 - 12.

ప్రిలిమినరీ కీ విడుదల (ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌): జులై 4వ వారం

ఫలితాల విడుదల (ఇంజినీరింగ్‌): ఆగస్టు 15లోపు

కౌన్సెలింగ్‌: సెప్టెంబర్‌ 2వ వారం 

 

తెలంగాణ ఎంసెట్‌

 

స్టడీమెటీరియల్ 

 

భౌతికశాస్త్రం
గణితశాస్త్రం
రసాయన శాస్త్రం
వృక్షశాస్త్రం
జంతుశాస్త్రం
నమూనా ప్రశ్నపత్రాలు
‣ పాత ప్రశ్నప‌త్రాలు

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోలీస్‌ కొలువు సాధించాలంటే?

‣ ఇంగ్లిష్‌ సన్నద్ధత ఈజీగా..!

‣ ‘డిజిటల్‌ సొసైటీ’లో ఎమ్మెస్సీ

‣ అధిక వేతనాలతో అవకాశాలు అందించే ఆస్ట్రో ఫిజిక్స్‌

‣ భారత విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ స్కాలర్‌షిప్స్‌

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌