• facebook
  • whatsapp
  • telegram

తుది మెరుగులతో మెరిపిద్దాం!

* ఎంసెట్‌ - 2020

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ తేదీలపై స్పష్టత వచ్చేసింది. కరోనా విపత్తు కారణంగా వాయిదా పడిన ఎంసెట్‌ను నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. చాలామంది విద్యార్థులు ఇప్పటికే ప్రిపరేషన్‌ పూర్తిచేశారు. పరీక్ష సమయం  దగ్గరపడుతున్నందున తుది సన్నద్ధతపై మరింత దృష్టిపెడితే మంచి ర్యాంకు తెచ్చుకోవచ్చు. ‘ఇదివరకు చదివినవే కదా!’ అని నిర్లక్ష్యం చేయకూడదు. మిగిలున్న ఈ కొద్దిరోజుల్లో ఏ మెలకువలు పాటించాలో చూద్దాం!

రసాయన శాస్త్రం
గతంలో అసలు చదవని విషయాలు నేర్చుకునే బదులు ప్రాథ]మిక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తూ, అవసరమైన సూత్రాలూ భావనలను మననం చేయాలి. మాక్‌ టెస్టులనూ, గత ప్రశ్నపత్రాలనూ రాసి సాధన చేయటం చాలా ప్రధానం. ఎందుకంటే వీటిలో అనేక అంశాలు పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మెరుగైన ర్యాంకు సాధించడం కష్టమేమీ కాదు.
వ్యూహాత్మకమైన తయారీతో రసాయన శాస్త్రంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలు అనుసరిస్తే అత్యధిక మార్కులు సాధించుకోవచ్చు. ఇప్పుడు మిగిలివున్న కొద్దిరోజుల్లో పాత సంవత్సరాల ప్రశ్నపత్రాల్లో ఎక్కువగా పునరావృతమైన ప్రశ్నలను సాధన చేయాలి. తెలుగు అకాడమీ వారి పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇస్తూ సన్నద్ధతను సులభతరం చేసుకోవచ్చు.
తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే కి¨ంద పేర్కొనే ముఖ్యమైన పాఠ్యాంశాలపై శ్రద్ధ పెట్టాలి.
 

1) అకర్బన రసాయన శాస్త్రం (ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ)
* పీ, డీ, ఎఫ్‌’ బ్లాక్‌ ఎలిమెంట్స్‌
* కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌
* మెటలర్జీ
* పాలిమర్స్‌
* బయో మాలిక్యూల్స్‌
* సర్ఫేస్‌ కెమిస్ట్రీ
* ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ (మొదటి సంవత్సరం)
కెమిస్ట్రీ ఇన్‌ ఎవిరీ డే లైఫ్‌
ప్రతి పాఠ్యాంశంలోని ఉదాహరణల మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తూ సాధన చేస్తే స్కోరింగ్‌కు అవకాశాలు ఎక్కువ.
కెమికల్‌ బాండింగ్, మోల్‌ కాన్సెప్ట్, థెర్మో డైనమిక్స్‌ ఎక్కువసార్లు అభ్యాసం చెయ్యాలి.
 

2) భౌతిక రసాయన శాస్త్రం (ఫిజికల్‌ కెమిస్ట్రీ)
దీనిలో రకరకాల ప్రక్రియల వెనుక వుండే భౌతిక సూత్రాలనూ, నియమాలనూ అధ్యయనం  చేయాలి.
* థెర్మో డైనమిక్స్‌ 
* కెమికల్‌ కైనటిక్స్‌
* ఎలక్ట్రో కెమిస్ట్రీ
* స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్‌  
* కెమికల్‌ ఈక్విలిబ్రియమ్‌
* అయోనిక్‌  ఈక్విలిబ్రియమ్‌ 
* మొలారిటీ
మొలాలిటీ
మోల్‌ ఫ్రాక్షన్‌
ఈ పాఠ్యాంశాలన్నీ సిద్ధాంత సంబంధమైనవి. సులువుగా ఉండే గణనం కాబట్టి అంకెలకు భయపడాల్సిన అవసరం లేదు.
 

3) కర్బన రసాయన శాస్త్రం ( ఆర్గానిక్‌ కెమిస్ట్రీ)
ఎంసెట్‌ పరంగా చూస్తే ఈ భాగంలో 80% ప్రశ్నలు రెండో సంవత్సరంలోని పాఠ్యాంశాల నుంచే వచ్చే అవకాశాలు ఎక్కువ.
ముఖ్యంగా-
రియాక్షన్‌ మెకానిజమ్స్‌ SN1, SN2 నేమ్‌డ్‌ రియాక్షన్, మ్యాపింగ్‌  ప్రశ్నలు, రియాజంట్‌ చర్యలు మొదలైనవాటిపై ప్రత్యేక దృష్టి అవసరం.
మొదటి సంవత్సరం పాఠ్యాంశాల్లో
అటామిక్‌ స్ట్రక్చర్‌లో క్వాంటమ్‌ నంబర్స్, పీరియాడిక్‌ టేబుల్‌లో పీరియాడిక్‌ ప్రాపర్టీస్, స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్‌లో గ్రాహమ్స్‌ లా, డాల్టన్స్‌ లా మాలిక్యులర్‌ వెలాసిటీ, కైనటిక్‌ ఎనర్జీలో గణనం /అంకెల మీద శ్రద్ధ ఉండాలి.
పైన చెప్పిన పాఠ్యాంశాలను సమయస్ఫూర్తితో, పక్కా ప్రణాళికతో చదివితే అధిక మార్కులు తెచ్చుకోవచ్చు.

ఉదాహరణల మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తూ సాధన చేస్తే స్కోరింగ్‌కు అవకాశాలు ఎక్కువ.

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల సహనానికీ, పట్టుదలకూ ఎంసెట్‌- 2020 పరీక్ష పెడుతోందనే చెప్పాలి. ఐపీఈ పరీక్షలు పూర్తయిన 5 నెలల తరవాత ఎంసెట్‌ నిర్వహిస్తుండడం వల్ల కొందరు విద్యార్థులు తమ సబ్జెక్టుల్లో కాన్సెప్టులను మర్చిపోయివుండొచ్చు. ఇప్పుడు పరీక్షకు నెల వ్యవధి కూడా లేనందున వారిలో కొంత ఆందోళన సహజం. కానీ ఏ మాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ బాగా చదివున్నవే.. సమర్థంగా పునశ్చరణా, వీలైనన్ని నమూనా పరీక్షలూ రాస్తే మంచి ర్యాంకు తెచ్చుకోవడం సాధ్యమే!

ప్రశ్న పూర్తిగా చదివాకే...
* ప్రశ్నలను జాగ్రత్తగా మొత్తం చదవాలి. సరైన/ సరి కాని వాక్యాన్ని సరిగ్గా చదివి సమాధానాన్ని ఎంచుకోవాలి.
* కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే ప్రశ్న చదివేటప్పుడే ఎలిమినేషన్‌ ప్రక్రియ ద్వారా సంబంధం లేని జవాబులను వదిలేసి, సరైన జవాబును ఊహించవచ్చు.
* నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు కాబట్టి అన్ని ప్రశ్నలకూ తప్పక సమాధానాలు గుర్తించండి. సమాధానం తెలియకపోయినా ఊహకు అందినంతవరకు సరైనదని భావించినది గుర్తించండి.
* ఏ ప్రశ్ననూ వదిలి పెట్టవద్దు. మార్కు వస్తే వస్తుంది. లేకపోతే పోయేదేమీ లేదు!
 

భౌతిక శాస్త్రం
భౌతిక శాస్త్రంలో అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో సన్నద్ధత సాగించాలి. ఆయా అంశాల ఫార్ములాలపై పట్టు సాధించటం అవసరం. చివరి పది రోజులూ గ్రాండ్‌ టెస్టులు రాయాలి. ప్రతిరోజూ నాలుగు గంటల సమయం ఫిజిక్స్‌ కోసం కేటాయించటం మేలు. ప్రాబ్లమ్స్‌ సాధనకు ఎక్కువ సమయం వెచ్చించాల్సివుంటుంది.
 

ఎంపీసీ విద్యార్థులు
ప్రభుత్వ కళాశాలలో సీటు తెచ్చుకోవాలంటే ఎంసెట్‌లో మంచి ర్యాంకు అవసరం. దీనికోసం మిగిలిన సబ్జెక్టులతో పాటు ఫిజిక్స్‌లో వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించాలి. ఇప్పుడున్న సమయంలో ప్రతి చాప్టర్‌లోనూ ఫార్ములాలు, కాన్సెప్టులపై దృష్టి పెట్టాలి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే 80 శాతం ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోనే అడుగుతున్నారని తెలుస్తుంది.
 

ఫిజిక్స్‌లో రివిజన్‌కు ముఖ్యంగా శ్రద్ధ చూపాల్సిన అంశాలు-
మొదటి సంవత్సరంలో...
* హీట్‌
* ఆసిలేషన్స్‌ 
* గ్రావిటేషన్‌ 
* వర్క్, ఎనర్జీ, పవర్‌ 
* లాస్‌ ఆఫ్‌ మోషన్‌ 
రెండో సంవత్సరంలో...
* వేవ్‌ మోషన్‌
కరంట్‌ ఎలక్ట్రిసిటీ
* అటామిక్‌ ఫిజిక్స్‌
* న్యూక్లియర్‌ ఫిజిక్స్‌
* సెమీ కండక్టర్‌
 

బైపీసీ విద్యార్థులు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని షార్ట్‌కట్‌ ఫార్ములాలు, కాన్సెప్టులు, నోట్స్‌ పునశ్చరణకు వినియోగించుకోవాలి. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ సిలబస్‌ ఆధారంగానే ఉంటాయి. అకాడమీ పుస్తకాల్లో హైలైట్‌ చేసిన అంశాలను కచ్చితంగా చదవాలి.
ఫిజిక్స్‌లో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే ఎక్కువ నమూనా టెస్టులు సాధన చేయాలి. మొదట ఒక వారం ప్రథమ సంవత్సరపు అంశాలు, రెండో వారం ద్వితీయ సంవత్సరపు అంశాలపై సిద్ధం కావాలి. చివరి ఐదు రోజులూ గ్రాండ్‌ టెస్టులు రాయాలి. కాన్సెంటు ప్రశ్నలపై ఎక్కువ సమయం వెచ్చిస్తే ప్రయోజనం కలుగుతుంది.
మొదటి సంవత్సరంలో...
అధికంగా రివిజన్‌ చేయాల్సినవి
* యూనిట్స్‌ 
* కైనమాటిక్స్‌         
* లాస్‌ ఆఫ్‌ మోషన్‌     
* వర్క్‌-ఎనర్జీ
* ఆసిలేషన్స్‌ 
* గ్రావిటేషన్‌ 
* హీట్‌
రెండో సంవత్సరంలో...
అధికంగా రివిజన్‌ చేయాల్సినవి
* కరంట్‌ ఎలక్ట్రిసిటీ
* ఎలక్ట్రో మాగ్నటిజం
* మోడర్న్‌ ఫిజిక్స్‌
వేవ్‌ మోషన్‌
* వేవ్‌ ఆప్టిక్స్‌
* గ్రావిటేషన్‌ 
* హీట్‌
అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే ఎక్కువ నమూనా టెస్టులు సాధన చేయాలి.

Posted Date : 05-11-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 
 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌