• facebook
  • whatsapp
  • telegram

గిరాకీలో అగ్రశ్రేణి... సీఎస్‌ఈ

సమకాలీన సమాజాన్ని అత్యంత ప్రభావ పరిచినశాఖ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ శాఖ. ప్రైవేటు ఉద్యోగాలకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఘనత నిస్సందేహంగా ఈ సీఎస్‌ఈకే చెందుతుంది. అత్యంత గిరాకీ ఉన్న శాఖగా మొదటి రెండు స్థానాల కన్నా ఎన్నడూ కిందకు వెళ్లని శాఖ ఇది.

కంప్యూటర్లు ఉపయోగించని రంగం దాదాపు లేదనే చెప్పొచ్చు. కంప్యూటర్లు ప్రపంచ గతినే మార్చగల శక్తి ఉన్నవి. వివిధ రంగాల్లో నూతన అన్వేషణలకు ఈ రంగం దోహదకారిగా ఉపయోగపడుతోంది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ టెక్నాలజీ రంగంలో తన ముద్ర వెయ్యగలుగుతోంది. త్వరితగతిన దొరికే ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు, త్వరితగతిన పురోగతి, ఎండసోకని ఉద్యోగం, సమాజంలో లభించే గౌరవం, విదేశీ ఉన్నత విద్యకు సులభమైన అవకాశం వంటి అనే కారణాల వల్ల కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అగ్రశ్రేణిలో వెలుగుతోంది

బీటెక్‌ చదవాలంటే....

ఈ కోర్సు విజయవంతంగా చెయ్యాలంటే అధ్యాపకులు చెప్పని అంశాల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలి. తార్కికమైన ఆలోచన, వేగంగా ఆలోచించడం, సృజనాత్మకత, వైవిధ్యమైన ఆలోచనా శక్తి, ఒకే సమస్యకు వివిధ మార్గాల్లో సమాధానాలు రాబట్టడం వంటి స్వీయ సామర్థ్యం ఉండాలి. ఇంటర్మీడియట్‌ స్థాయిలో మాతృకలు, సమితులు, ప్రమేయాలు వంటి సరళ బీజగణిత అంశాలపై మంచి పట్టు సాధించాలి. ఇంకా సంభావ్యత, గణాంక శాస్త్రంలో మంచి నేర్పు ఉండాలి. కంప్యూటర్‌ నిర్మాణం, క్రమసూత్ర పద్ధతుల రచన, విశ్లేషణ, సీ, జావా, డీబీఏమ్‌ఎస్‌ వంటివి మౌలిక సబ్జెక్టులు. వెబ్‌ టెక్నాలజీస్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌, సమాచార భద్రత వంటి ముఖ్యమైన సబ్జెక్టులు చదువుతారు. వీటితోపాటు శాస్త్రీయ పద్ధతిలో కంప్యూటర్‌ ప్రోగ్రాములు రచన చేసి మెలకువలు నేర్చుకుంటారు. అయితే ప్రతి క్షణం నూతన ఆవిష్కరణలతో ఎన్నో కొత్త మార్పులకు కేంద్రమైన ఈ శాఖలో రాణించాలంటే నిత్య విద్యార్థిగా ఉండటం తప్పనిసరి

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, డాటా అనలిస్ట్‌, డాటా సైంటిస్ట్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, డాటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, టెస్టర్‌ వంటి ఉన్నత మధ్య శ్రేణి ఉద్యోగాలతో పాటు వినియోగదారుడి కేంద్రమైన బీపీఓ, కేపీఓ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అయితే అవసరాలకు అనుగుణంగా మెలకువలు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు లభ్యమవడం లేదు. ప్రయోగాలు ప్రతి నిత్యం చేస్తూ కొన్ని ప్రాజెక్టులు చేసి, అనుభవం సంపాదించటం, పరిశ్రమల అంచనాలకు తగిన విధంగా సంసిద్ధులవటం చేస్తే విద్యార్థుల పురోగతికి ఈ శాఖలో ఆకాశమే హద్దు!

Posted Date : 23-10-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌