• facebook
  • whatsapp
  • telegram

నీట్‌ ర్యాంకుకు 16 సూత్రాలు 

1. పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌లలో తేడా లేదు. ఈ సమయంలో మన అకాడమీ పాఠ్యపుస్తకాలను చదివితే ‘నీట్‌’కు సరిపోతుంది.
2. బయాలజీ సిలబస్‌లో తెలుగు రాష్ట్రాల సిలబస్‌ అధికంగా ఉంది. కాబట్టి ప్రాస్పెక్టస్‌లోని సిలబస్‌ పక్కనపెట్టుకుని అదనపు అంశాలను తీసివేసి చదవాలి.
3. సీబీఎస్‌ఈ 11, 12 తరగతి పాఠ్యపుస్తకాలకు అదనంగా ఎరాటా, సప్లిమెంటరీ మెటీరియల్‌, సపోర్టింగ్‌ మెటీరియల్‌ ఉన్నాయి. వీటిని కూడా తప్పకుండా తీసుకుని చదవాలి.
4. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల వెబ్‌సైట్‌లోనే ఎగ్జంప్లర్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటిని తప్పకుండా చదవాలి. పుస్తకాలు మార్కెట్లో లభ్యమవుతాయి. లేదా వారి సైట్‌నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రింట్‌ తీసుకుంటే చదవటానికి సులువుగా ఉంటుంది.
5. ఎగ్జంప్లర్‌ ఉండేది ప్రశ్నల రూపంలోనే. వాటికి అధిక సమయం కేటాయించాలి.
6. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రయోగదీపికలు చదవాలి.
7. సీబీఎస్‌ఈలో 12వ తరగతిలోనే బోర్డు పరీక్షలుంటున్నాయి. సీనియర్‌ ఇంటర్‌ సిలబస్‌లో అధిక ప్రశ్నలు వస్తున్నాయి. నీట్‌-1 పరీక్షలో బోటనీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 27 ప్రశ్నలూ, ద్వితీయ సంవత్సరం నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. జవాలజీలో 19, 19; ఫిజిక్స్‌లో 22, 23; కెమిస్ట్రీలో 16, 29 ప్రశ్నలు మొదటి-రెండు సంవత్సరాల సిలబస్‌ నుంచి వరసగా వచ్చాయి.
8. ఫిజిక్స్‌లో గత ఏడాది రెండు పేపర్లు ( పరీక్షను రెండు సార్లు నిర్వహించారు), ఈ సంవత్సరం ఒక పేపరు విశ్లేషణ చూస్తే... మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం సిలబస్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి. అయినా తేడా చాలా స్వల్పమే!
9. ఎంసెట్‌ ఫిజిక్స్‌లో నిడివిగా ఉన్న లెక్కలు వస్తున్నాయి. నీట్‌లో మాత్రం సరళంగా ఉన్న, సిద్ధాంతపరమైన ప్రశ్నలు వస్తున్నాయి.
10. సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఎంసెట్‌ ఫిజిక్స్‌లో 10 శాతంలోపే. నీట్‌ ఫిజిక్స్‌లో కనీసం 30 శాతం వరకూ ఇవి ఉంటున్నాయి.
11. రసాయనశాస్త్రంలో అకర్బన, కర్బన, భౌతిక రసాయనశాస్త్రంలో దాదాపు సమ విభజనతో (మూడు విభాగాల నుంచి 15 చొప్పున ప్రశ్నలు) వస్తున్నాయి. వీటిలో భౌతిక రసాయనశాస్త్రానికి కొంత అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సివుంటుంది.
12. ప్రశ్నల సంఖ్య పెరిగి రుణాత్మక మార్కులు ఉన్నందున వేగం, కచ్చితత్వం పెంచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాయాలి.
13. ఇంతవరకూ విద్యార్థులకు ఎంసెట్‌ ప్రశ్నల అభ్యాసం ఎక్కువగా జరిగింది. ఈ రెండు నెలలూ నీట్‌-2 ప్రశ్నపత్రం దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రశ్నపత్రాలనూ, సీబీఎస్‌ఈ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలపై పట్టు ఉన్న అధ్యాపకులు ఇచ్చే ప్రశ్నపత్రాలనూ అధికంగా అభ్యాసం చేయాలి.
14. తెలుగు రాష్ట్రాల్లోని అధ్యాపకులు ఎక్కువగా ఎంసెట్‌కే ప్రాధాన్యం ఇచ్చివున్నారు. అందుకని సీబీఎస్‌ఈకి అధిక ప్రాధాన్యం ఉన్న ఉత్తరభారతదేశంలోని అధ్యాపకులు ఇచ్చే ప్రశ్నపత్రాలకు ప్రయోజనం ఎక్కువ. వీటిని అభ్యాసం చేస్తే పట్టు పెరుగుతుంది.
15. ఎంసెట్‌ బయాలజీలో ప్రశ్నలు చాలా నిడివిగా ఉంటున్నాయి. కానీ నీట్‌లో ఒకటి లేదా రెండు లైన్లలో ఉంటున్నాయి. ఆ విధానంలోనే అభ్యాసం చేయాలి.
16. ప్రాథమిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. అదనపు అంశాలకు కొంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఎక్కువ సమయం ప్రాథమిక అంశాలకు కేటాయిస్తేనే అధిక మార్కులు సాధించే వీలుంటుంది.

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌