• facebook
  • whatsapp
  • telegram

తగ్గిన ఎంబీబీఎస్‌ బీ, సీ కేటగిరీల ఫీజులు

ఎంబీబీఎస్‌, దంత వైద్య విద్యలో కన్వీనర్‌ కోటా ఫీజు స్వల్పంగా పెరిగింది. ‘బీ, ‘సీ’ కేటగిరీల ఫీజులు తగ్గాయి. రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉండేలా కొత్త రుసుములను ఖరారు చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీటిపై న‌వంబ‌రు 2న‌ సమాలోచనలు జరిగాయి. ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించిన అనంతరం కొత్త ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.
 

ఎంబీబీఎస్‌లో..
* 2019-20 విద్యా సంవత్సరంలో కన్వీనర్‌ కోటా ఫీజు కింద రూ.12,155 వసూలు చేశారు. దీనిని తాజాగా రూ.15 వేలుగా నిర్ణయించారు.
* ‘బీ’ కేటగిరీ సీటు ఫీజు రూ.13,37,057 ఉండగా రూ.12,00,000గా పేర్కొన్నారు.
* ‘బీ’ కేటగిరీ ఫీజుపై ఐదు రెట్లకు మించకుండా ‘సీ’ కేటగిరీ సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. తాజాగా ‘బీ’ కేటగిరీ సీటు ఫీజుపై 3 రెట్ల కంటే ఎక్కువ ‘సీ’ కేటగిరీ కింద ఫీజు వసూలు చేయకూడదని పేర్కొన్నారు.

 

దంత వైద్య విద్యలో...
* 2019-20లో కన్వీనరు కోటా కింద రూ.12,155ను వసూలు చేశారు. దీనిని తాజాగా రూ.15వేలు చేశారు.
* ‘బీ’ కేటగిరీ సీటు రూ.5,46,978 ఉండగా దీనిని 4,00,000 చేశారు.
* ‘సీ’ కేటగిరీ సీటు ఫీజును ‘బీ’ కేటగిరీ ఫీజుపై ఐదింతలకు మించకుండా వసూలు చేస్తున్నారు. తాజాగా దీనిని 3 రెట్లకు మించకూడదని పేర్కొన్నారు.

 

సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో..
5 ప్రైవేటు వైద్య కళాశాలల్లో మాత్రమే సూపర్‌ స్పెషాలిటీ సీట్లున్నాయి. ప్రస్తుతం ఒక్కో సీటుకు రూ.24 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులో రూ.9 లక్షలు తగ్గించారు. కొత్త ఫీజు రూ.15 లక్షలు.

 

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌