1. కింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి.
ఎ) మొక్క ఒక టాక్సాన్
బి) నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతాయి
సి) జీవులను నిర్వచించే లక్షణంగా 'పెరుగుదల'ను పరిగణనలోకి తీసుకోలేం
డి) మ్యూల్ ప్రత్యుత్పత్తి చెందదు
సరైన వ్యాఖ్యలను ఎన్నుకోండి.
జ: అన్నీ
2. 20వ శతాబ్ద డార్విన్-
జ: ఎర్నెస్ట్ మేయర్.
3. పెరుగుదల జంట లక్షణాలు-
జ: ద్రవ్యరాశిలో వృద్ధి, సంఖ్యలో వృద్ధి
4. జతపరచండి.
పట్టిక - 1 | పట్టిక - 2 |
I) శిలీంద్రాలు | A) ప్రరోహాలు ఏర్పడటం |
II) ఈస్ట్ | B) మ్యూల్ |
III) ప్రోటోనీమా | C) ముక్కలుగా విరగడం |
IV) ప్రత్యుత్పత్తి ఉండదు | D) సిద్ధబీజం |
E) నిర్జీవులు |
సరైన జోడింపు
I II III IV
జ: D A C E
5. ఈ జీవుల్లో పెరుగుదల ప్రత్యుత్పత్తికి పర్యాయం.
1) ఈస్ట్/అమీబా 2) బ్యాక్టీరియా 3) క్లామిడోమోనాస్ 4) అన్నీ
జ: 4(అన్నీ)
6. జీవుల ప్రత్యేక లక్షణం-
1) పెరుగుదల 2) ప్రత్యుత్పత్తి 3) జీవక్రియలు 4) అన్నీ
జ: 4 (అన్నీ)
7. జీవులకు చెందిన సాంకేతిక క్లిష్టమైన లక్షణం -
జ: క్షోభ్యత
8. జీవులను నిర్వచించదగిన లక్షణం -
జ: జీవక్రియలు
9. కిందివాటిలో సరైన వ్యాఖ్యను ఎన్నుకోండి.
1) జీవులను గుర్తించడానికి 'కప్లెట్' అనే విభిన్న లక్షణాల జంటను ఉపయోగిస్తారు
2) జీవ సంబంధ మ్యూజియాలను విద్యా సంస్థల్లో నెలకొల్పుతారు
3) RBG అతిపెద్ద హెర్బేరియం
4) మామిడి క్రమం సాపిండేల్స్
జ: 1 (జీవులను గుర్తించడానికి 'కప్లెట్' అనే విభిన్న లక్షణాల జంటను ఉపయోగిస్తారు)
10. సిస్టమాటిక్స్ అనే పదం ఈ భాష నుంచి తీసుకున్నారు
జ: లాటిన్
11. జీవశాస్త్ర నామంలోని రెండు పదాలను చేతిరాతతో రాసినప్పుడు వేర్వేరుగా పేరు కింద గీత గీస్తారు. దీని అర్థం-
1) అవి ముఖ్యమైనవి 2) మొదటిది ప్రజాతి, రెండోది జాతి
3) చదువరుల దృష్టిని ఆకర్షించడానికి 4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)
12. ICBN విస్తరించండి.
జ: International Code for Botanical Nomenclature
13. జతపరచండి.
పట్టిక - 1 | పట్టిక - 2 |
I) ఆరబెట్టిన మొక్క నమూనాలు | A) బొటానికల్ గార్డెన్స్ |
II) భద్రపరిచిన జంతు నమూనాలు | B) మ్యూజియం |
III) సజీవ మొక్కల నమూనాలు | C) ఫ్లోరా |
IV) మొక్కల నమూనాల విషయ సూచిక | D) హెర్బేరియం |
సరైన జోడింపు
I II III IV
జ: D B A C
14. జతపరచండి.
I) ఆవాసం, విస్తరణ | A) RBG |
II) ఒక వర్గం సమాచారం | B) హెర్బేరియం |
III) భవిష్యత్తులో గుర్తించడానికి ఉపయోగపడే గిడ్డంగి | C) మోనోగ్రాఫ్ |
IV) మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రం | D) ఫ్లోరా |
I II III IV
జ: D C B A
15. జతపరచండి.
I) IBG | A) ఇంటర్నేషనల్ ఫర్ ప్లాంట్స్ నామెన్క్లేచర్ |
II) RBG | B) లక్నో |
III) NBRI | C) హౌరా |
IV) ICBN | D) లండన్ (ఇంటర్నేషనల్ ఫర్ ప్లాంట్ ఐడెంటిఫికేషన్) |
I II III IV
జ: C B A D
16. కిందివాటిలో ఏది నమూనాల ప్రతిబింబాలను కలిగి ఉంటుంది?
1) హెర్బేరియం 2) డిజిటల్ హెర్బేరియం
3) మ్యూజియం 4) ఫ్లోరా
జ: 2 (డిజిటల్ హెర్బేరియం)
17. మనిషి క్రమం -
జ: ప్రైమేట
18. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.
A) నామీకరణ B) లక్షణాల వర్ణన C) గుర్తించడం
జ: BCA
19. అన్ని జీవుల నిర్వచింపదగిన లక్షణాలు-
A) పెరుగుదల B) జీవక్రియలు C) ప్రత్యుత్పత్తి D) క్షోభ్యత E) స్వయం స్పృహ
జ: BD మాత్రమే
20. మామిడి కుటుంబం-
జ: అనకార్డియేసి