• facebook
  • whatsapp
  • telegram

జీవసాంకేతిక శాస్త్రం - దాని అనువర్తనాలు

1. కిందివాటిలో జీవసాంకేతిక శాస్త్రంలో ఏది కీలకమైన పరిశోధనాంశం కాదు?
1) సూక్ష్మజీవుల రూపంలో అత్యుత్తమ ఉత్ప్రేరకాలను అందుబాటులోకి తేవడం
2) అనుకూల పరిస్థితులను సృష్టించడం
3) శుద్ధమైన ప్రొటీన్ల కోసం అనుప్రవాహ ప్రక్రియ సాంకేతిక వినియోగం
4) ఏదీకాదు
జ. ఏదీకాదు

 

2. వ్యవసాయోత్పత్తుల అభివృద్ధి గణనీయంగా పెరగడాన్ని 'హరితవిప్లవం'గా ఎవరు పేర్కొన్నారు?
జ. విలియం గాడ్
 

3. హరితవిప్లవ పితగా ఎవరిని పరిగణిస్తారు?
జ. నార్మన్ ఎర్నెస్ట్. బోర్లాగ్

 

4. భారతదేశంలో హరిత విప్లవం సఫలమవడానికి కారుకులైనవారెవరు?
జ. ఎం.ఎస్. స్వామినాథన్

 

5. హరిత విప్లవం వల్ల అధిక దిగుబడి రావడానికి ముఖ్య కారణం?
A. మంచి యజమాన్య పద్ధతులు

B. మెరుగైన పంట రకాలు
C. ఆగ్రోకెమికల్స్ వినియోగం
జ. AC

 

6. హరిత విప్లవంలో ఇమిడి ఉన్న అంశాలు -
A. రసాయన ఎరువులు, చీడనాశకారులను తక్కువగా వినియోగించడం.
B. సహజ జాతి అవధులు లేకుండా చేయడం.
C. ఒక జాతి జన్యువులను సంబంధంలేని మరో జాతిలోకి బదిలీ చేయడం.
జ. ABC

 

7. కింది కీటకాల్లో వేటిని కొన్ని రకాల బాసిల్లస్ థురంజెన్సిస్ ప్రభావితంచేసి నాశనం చేస్తుంది?
1) ఆర్మీవార్మ్      2) బీటిల్స్       3) ఈగలు, దోమలు      4) పైవన్నీ
జ. 4 (పైవన్నీ)

 

8. కింది వాటిని జతపరచండి.

I II
1) టొబాకో బడ్‌వార్మ్ a) కోలియోప్టిరాన్స్
2) బీటిల్ b) డిప్టిరాన్స్
3) దోమ c) లెపిడాప్టిరాన్స్

జ. 1 - c; 2 - a; 3 - b

 

9. నిశ్చితం (A): క్రియాశీల టాక్సిన్ మిడ్‌గట్‌లోని ఉపరిస్థర కణాలను నాశనం చేస్తుంది, మరణాన్ని కలిగిస్తుంది.
కారణం (R): ప్రోటాక్సిన్ అన్నవాహికలోని క్షారగుణం pH వల్ల క్రియాశీల టాక్సిన్ రూపం తీసుకుంటుంది.
జ. A , R రెండూ సరైనవి. Aకు R సరైన వివరణ.

 

10. పత్తికాయ తొలిచే పురుగులను నియంత్రించే ప్రొటీన్లు ఏ జన్యువులతో సంకేతించబడతాయి?
      A. Cry I Ac       B. Cry II Ab       C. Cry I Ab
జ. AB

 

11. Cry I Ab జన్యువు దేన్ని నియంత్రించే ప్రొటీన్లతో సంకేతించబడుతుంది?
జ. కార్న్‌బోరర్

 

12. పొగాకు మొక్కల దిగుబడి తగ్గడానికి దాని వేళ్లలో సంక్రమించిన ఏ జీవి కారణం?
జ. మెలోయిడిగైనీ ఇన్‌కాగ్నిషియా

 

13. ఒక విశిష్ట mRNA సైలెన్సింగ్ దేని వల్ల జరుగుతుంది?
జ. సంపూరక RNA అణువు బంధితమై mRNA అనువాదాన్ని నిరోధిస్తుంది.

 

14. నిశ్చితం (A): ఆర్ఎన్ఏ వ్యతీకరణాన్ని మెలోయిడిగైనీ ఇన్‌కాగ్నిషియా సంక్రమణను నిరోధించడానికి ఉపయోగిస్తారు.
కారణం(R): ఆర్ఎన్ఏ వ్యతికరణం అన్ని నిజకేంద్రక జీవుల్లో ఒక కణరక్షణ పద్ధతిగా జరుగుతుంది.
జ. A సరైంది కానీ R సరైంది కాదు.

 

15. దేన్ని ఉపయోగించి RNA వ్యతికరణం ప్రారంభవుతుంది?
జ. ఆగ్రోబ్యాక్టీరియం ప్లాస్మిడ్

 

16. జీవసాంకేతిక శాస్త్రం అస్థిత్వంలోకి రాకముందు ఇన్సులిన్‌ను వేటి నుంచి నిష్కర్షించేవారు?
జ. పశువుల, పందుల క్లోమం

 

17. కిందివాటిలో ఏ సంస్థకు మానవ ఇన్సులిన్‌లోని A, B గొలుసులకు డీఎన్ఏ వరుసక్రమాల ఉత్పత్తితో సంబంధం ఉంది? 
1) ఎలి లిల్లీ
2) సాంటా బయోటెక్నాలజీ
3) సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ
4) బయోకాన్ కంపెనీ
జ. ఎలి లిల్లీ

 

18. వ్యాధులను ముందే గుర్తించడానికి సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది నిజం?
1) సీరం విశ్లేషణ ద్వారా వ్యాధులను ముందే గుర్తించడం సాధ్యం.
2) పునఃసంయోజక సాంకేతిక విధానంలో వ్యాధులను ముందే గుర్తించడం సాధ్యం.
3) PCR తో వ్యాధులను ముందే గుర్తించడం సాధ్యం.

4) ELISA తో వ్యాధులను ముందే గుర్తించడం సాధ్యం.
జ. పునఃసంయోజక సాంకేతిక విధానంలో వ్యాధులను ముందే గుర్తించడం సాధ్యం.

 

19. బ్యాక్టీరియా లేదా వైరస్‌లు అతి తక్కువ గాఢతలో ఉంటే దేంతో న్యూక్లికామ్లాలను విస్తరణ చేసి కనుక్కోవచ్చు?
జ. పాలిమరేజ్ చైన్ రియాక్షన్

 

20. ప్రతిరక్షక జనకం - ప్రతిరక్షకాల పరస్పర చర్యల ఆధారంగా చేసే ప్రక్రియ ఏది?
జ. ELISA

 

21. ప్రతిజనకాలు లేదా ప్రతిరక్షకాల ఉనికి ద్వారా వ్యాధిజనక సంక్రమణను ఎలా కనుక్కోవచ్చు?
జ. ELISA

 

22. వివాదాస్పద తల్లిదండ్రులను పరిష్కరించడానికి ఉత్తమమైన పద్ధతి-
జ. డీఎన్ఏ వేలి ముద్రణ

 

23. డీఎన్ఏ వేలిముద్రణ కిందివాటిలో దేనిలో సహాయపడుతుంది?
జ. ఫోరెన్సిక్ సైన్స్‌లో నేరస్థులను గుర్తించడం

 

24. జన్యుపరివర్తిత మొక్కలను పొందడానికి కిందివాటిలో దేన్ని సమర్థవంతమైన వాహకంగా వాడుతున్నారు?
జ. ఆగ్రోబ్యాక్టీరియం T1 ప్లాస్మిడ్

 

25. కింది జన్యుపరివర్తిత మొక్కల్లో ఏవి గాయాలను తట్టుకుని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి?
      1) జన్యుపరివర్తిత బంగాళాదుంప      2) ఫ్లావర్‌సేవర్ టొమాటో
      3) రౌండప్ రెడీ సోయాబీన్              4) పైవన్నీ
జ. 2 (ఫ్లావర్‌సేవర్ టొమాటో)

 

26. నిశ్చితం (A): జన్యుపరివర్తిత పద్ధతి ద్వారా పురుష వంధ్యత్వం ఉన్న బ్రాసికా నాపస్‌ను ఉత్పత్తి చేశారు. 
కారణం (R): పురుష వంధ్యత్వం విపుంసీకరణ సమస్యను తొలగిస్తుంది కానీ సంకర విత్తనాల ఉత్పత్తికి ఎక్కువ ఖర్చవుతుంది.
జ. A సరైంది కానీ R సరైంది కాదు.

 

27. కింది జన్యుపరివర్తిత రకాల్లో ఏది జీవ, నిర్జీవ ప్రతి బలాలను తట్టుకుంటుంది?
       1) బాస్మతి వరి రకం               2) రౌండప్ రెడీ సోయాబీన్
       3) జన్యు పరివర్తిత బొప్పాయి   4) జన్యుపరివర్తిత టొమాటో
జ. 1 (బాస్మతి వరి రకం)

 

28. జన్యు పరివర్తిత టొమాటో మొక్కలు ఏ వ్యాధిజనకానికి నిరోధకత చూపుతాయి?
జ. సూడోమోనాస్

 

29. ఫైటాప్థోరా శిలీంద్ర నిరోధకతను దేనిలో ప్రవేశపెట్టారు?
జ. జన్యుపరివర్తిత బంగాళాదుంప

 

30. GEAC అంటే ఏమిటి?
జ. జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రూవల్ కమిటీ

 

31. భారతదేశంలో సాగుచేస్తున్న వరి రకాలు సుమారుగా ఎన్నుంటాయని అంచనా వేశారు?
జ. 2,00,000

 

32. భారతదేశంలో పెంచుతున్న బాస్మతి వరి రకాల సంఖ్య-
జ. 27

 

33. సరైన అధికార పత్రం లేకుండా బహుళ జాతీయ కంపెనీలు వివిధ దేశాలకు సంబంధించిన జీవ వనరులను వాడటాన్ని ఏమంటారు?
జ. బయోపైరసీ

 

34. హక్కులు, పరిశోధన సమస్యలను పరిశీలించడానికి భారత హక్కుల బిల్లులో ఎన్నో సవరణకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది?
జ. రెండో

 

35. రింగ్‌స్పాట్ వైరస్‌కు నిరోధకత చూపేది ఏది?
జ. జన్యుపరివర్తిత బొప్పాయి

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌