• facebook
  • whatsapp
  • telegram

కొలతలు, ప్రమాణాలు, మితులు

1. విశిష్ట ఉష్ణ సామర్థ్యం, విశిష్ట వాయు స్థిరాంకం-
జవాబు:  ఒకే మితులు కలిగి ఉంటాయి. 

 

2. కిందివాటిలో ఒక భౌతిక రాశికి ద్రవ్యరాశి రుణ మితులు ఉండవు-
పరమ పెర్మిటివిటీ, కెపాసిటీ, సార్వత్రిక గురుత్వ స్థిరాంకం, నిరోధం  
జవాబు:  నిరోధం

 

3. ఉష్ణ వాహకత్వ గుణకం మితిఫార్ములా-
జవాబు:  [MLT-3K-1]

 

4. B అయస్కాంత ప్రేరణ, I విద్యుత్ ప్రవాహం, υ పౌనఃపున్యం అయితే BI/υ2 మితులు ఏ భౌతికరాశి మితులకు సమానం?
జవాబు:  ద్రవ్యరాశి

 

5.  ఘర్షణ గుణకానికి-
జవాబు:   మితులు లేవు.

 

6. స్థితిస్థాపక గుణకానికి-
జవాబు:  మితులున్నాయి-

 

7. ఒక వస్తువు వేగం V దాని స్థానభ్రంశం S కు మధ్య సంబంధం  అయితే A, B, C ల మితి ఫార్ములాలు-
జవాబు:
 [LT-1], [L2T-1], [L]

 

8. ద్రవ్యరాశి, పొడవు, కాలం ప్రమాణాలను రెట్టింపు చేస్తే, ద్రవ్యవేగం ప్రమాణం-
జవాబు:  రెట్టింపు అవుతుంది

 

9. ద్రవ్యరాశి ప్రమాణం రెట్టింపు చేసి, పొడవు ప్రమాణం సగం చేస్తే పీడనం సంఖ్యాత్మక విలువ-
జవాబు:  1/4 వ వంతు అవుతుంది

 

10. ద్రవ్యరాశి, పొడవు, కాలం ప్రమాణాలు వరుసగా  1/2 kg, 2m, 10 S అయితే సామర్థ్యం కొత్త ప్రమాణం-
జవాబు:  1/500 W

 

11. గుణకం విలువ 12 poise అయితే SI పద్ధతిలో దాని విలువ-
జవాబు:  1.2 NSm-2

 

12. ఒక వస్తువు చేసిన పని 100 J. ద్రవ్యరాశి, పొడవు, కాలం కొత్త ప్రమాణాలు వరుసగా 0.1 kg, 0.1m, 0.1s అయితే కొత్త ప్రమాణాల్లో దాని సంఖ్యాత్మక విలువ ఎంత?
జవాబు:  1000

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌