1. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) H2ను వనస్పతి, భారీ కర్బన రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు.
2) అంతరిక్ష పరిశోధనల్లో H2ను రాకెట్ ఇంధనంగా వాడతారు.
3) H2ను ఇంధన ఘటాల్లో ఉపయోగిస్తారు.
4) హైడ్రోజన్ Cu2Oను Cu గా క్షయీకరించలేదు.
సమాధానం: (4)
వివరణ: Cu అనేది H2కు దిగువన (చర్యాశీలత శ్రేణిలో) ఉండటం వల్ల హైడ్రోజన్ Cu2Oను Cuగా క్షయకరణం చేస్తుంది.
2. కింది ఏ సమ్మేళనానికి స్థిరానుపాత నియమం వర్తించదు?
1) సోడియం హైడ్రైడ్ 2) కాల్షియం ఆక్సైడ్
3) జిర్కోనియం హైడ్రైడ్ 4) కార్బన్ డయాక్సైడ్
సమాధానం: (3)
వివరణ: Zr1H1.3 - 1.75 మూలకాల నిష్పత్తి 1 : 1 కాదు, 1 : 2 కాదు.
3. నీటిలో బంధకోణం, ద్విధ్రువ భ్రామకాలు వరుసగా
1) 109.5o & 1.84 D 2) 104.5o & 1.84 D
3) 104.5o & 1.48 D 4) 104.5o & 0 D
సమాధానం: (2)
వివరణ: బంధకోణం = 104.5o, V ఆకృతి, µ = 1.84 D
4. H2O2, H2O, D2Oలకు 298 K వద్ద ద్వివిద్యుత్ నిరోధాల సరైన క్రమం
1) H2O2 > H2O > D2O 2) H2O > D2O > H2O2
3) D2O > H2O > H2O2 4) H2O2 > D2O > H2O
సమాధానం: (2)
వివరణ: H2O ద్వివిద్యుత్ స్థిరాంకం = 78.39
D2O ద్వివిద్యుత్ స్థిరాంకం = 78.06
H2O2 ద్వివిద్యుత్ స్థిరాంకం = 70.7
5. కిందివాటిలో వాయు ఉత్పన్నాలను ఇచ్చే చర్య/ చర్యలు
1) I2 + H2O + OH- 2) ఆమ్లీకృత KMnO4 + H2O2
3) 1 & 2 రెండూ 4) PbS + H2O2
సమాధానం: (3)
6. జియొలైట్‌లను ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు?
1) హైడ్రోకార్బన్ల భంజనంలో
2) ఆల్కహాల్‌ను గాసోలిన్‌గా మార్చడానికి
3) కఠినజలంలో కాఠిన్యతను తొలగించడానికి
4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: అన్నీ సరైనవే
7. మానవ శరీరం, మొక్కల్లో ఉండే నీటి శాతాలు, హిమానీనదాలు, నదుల నుంచి ప్రపంచంలో నీటి సరఫరా అంచనాల శాతాల సరైన క్రమం
1) మానవ శరీరం > మొక్కలు > నదులు > హిమానీలు
2) మొక్కలు > మానవ శరీరం > హిమానీలు > నదులు
3) మొక్కలు > మానవ శరీరం > నదులు > హిమానీలు
4) నదులు > మొక్కలు > మానవ శరీరం > హిమానీలు
సమాధానం: (2)
వివరణ: మొక్కలు = 95%, మానవ శరీరం = 65%
హిమానీలు = 2.04%, నదులు = 0.0001%
8. కింది ఏ భౌతిక ధర్మం నీటి కంటే భారజలానికి తక్కువ?
1) ద్వివిద్యుత్ రోధక స్థిరాంకం 2) ద్రవీభవన ఉష్ణం
3) సంఘనన ఎంథాల్పీ 4) బాష్పీభవన ఎంథాల్పీ
సమాధానం: (1)
వివరణ: H2O ద్వివిద్యుత్ స్థిరాంకం = 78.39, D2O = 78.06
9. మంచులో ప్రతి ఆక్సిజన్ పరమాణువు చుట్టూ ఉండే ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య
1) 2 2) 3 3) లెక్కించలేనన్ని 4) 4
సమాధానం: (4)
వివరణ: ప్రతి ఆక్సిజన్ చుట్టూ 4 ఆక్సిజన్ పరమాణువులు టెట్రాహెడ్రల్ ఆకృతి వచ్చేలా అమరి ఉంటాయి.
10. CuSO4. 5 H2O లో హైడ్రోజన్ బంధం ఉండే నీటి అణువుల సంఖ్య
1) 1 2) 2 3) 3 4) 4
సమాధానం: (1)
వివరణ: [Cu(H2O)]4 SO4 . H2Oలో బయట ఉన్న H2O హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తుంది.
11. జతపరచండి.
సమూహం - I | సమూహం - II |
a) C (ఘ) + H2O (వా) → CO (వా) + H2 (వా) | I) జల విశ్లేషణ |
![]() |
II) కోల్ గ్యాసిఫికేషన్ |
c) SiCl4 + 2 H2O → SiO2 (ఘ) + 4 HCl | III) వాటర్ గ్యాస్ షిఫ్ట్ చర్య |
d) H2O (ద్ర) + H2O (ద్ర) → H3O+ (జ.ద్రా.) + OH- (జ.ద్రా.) | IV) స్వయం అయనీకరణం |
V) విద్యుద్విశ్లేషణ |
A B C D A B C D
1) III II IV V 2) II III I IV
3) II I III IV 4) I II III IV
సమాధానం: (2)
వివరణ: రెండోది సరైన జత.
12. H2O2 తయారీలో పాల్గొన్న ఆమ్లం/ ఆమ్లాలు
1) 50% H2SO4 2) H2S2O8 3) H2SO5 4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: 2 H2SO4→ 2 H+ + 2 HSO4-
ఆనోడ్ వద్ద: 2 HSO4-→ H2S2O8 + 2e-
H2S2O8 + H2O → H2SO4 + H2SO5
H2SO5 + H2O → H2SO4 + H2O2
13. శాశ్వత కాఠిన్యతను తొలగించేది
1) బేకింగ్ సోడా 2) బట్టలు ఉతికే సోడా
3) సున్నపుతేట 4) చిలీ సాల్ట్ పీటర్
సమాధానం: (2)
వివరణ: CaCl2 + Na2CO3→ CaCO3 + H2O2
MgSO4 + Na2CO3→ MgCO3 + Na2SO4
14. కఠిన జలానికి లెక్కించిన సున్నాన్ని కలిపినప్పుడు ఏర్పడే అవక్షేపం(లు)
1) Mg(OH)2 2) CaCO3 3) 1 & 2 రెండూ 4) MgCO3
సమాధానం: (3)

15. కిందివాటిలో సరైన సమూహం/ సమూహాలను గుర్తించండి.
a) CrCl3. 6 H2O - సమన్వయ సంయోజనీయ జలం
b) BaCl2. 2 H2O - అల్పాంతరాళ జలం
c) CuSO4. 5 H2O - హైడ్రోజన్ బంధిత జలం, సమన్వయ సంయోజనీయ జలం
1) a, b, c, d 2) a, c 3) b, d 4) a, b, c
సమాధానం: (1)
వివరణ: అన్నీ సరైనవే.
16. కిందివాటిలో నిజమైన పెరాక్సైడ్ ఏది?
1) SO2 2) NO2 3) MNO2 4) BaO2
సమాధానం: (4)

17. 11.2 ఘనపరిమాణాల H2O2 మొలారిటీ ఎంత?
1) 1.0 2) 0.5 3) 0.75 4) 0.25
సమాధానం: (1)
వివరణ: H2O = H2O2 మొలారిటీ × 11.2
18. గది ఉష్ణోగ్రత వద్ద జలం, భారజలాల pH విలువలు
1) 7, 7 2) 7, 7.35 3) 7, 6.85 4) 7, 7.001
సమాధానం: (2)
వివరణ: H2O యొక్క pH = 7.0, D2O యొక్క pH = 7.35
19. గృహ, పారిశ్రామిక వ్యర్థాల కాలుష్య నివారణ అభిచర్యలో దేన్ని ఉపయోగిస్తారు?
1) అధిక ఆక్సిజన్ 2) అధిక ఓజోన్ 3) H2O2 4) పెర్‌హైడ్రాల్
సమాధానం: (3)
వివరణ: H2O2 వాతావరణాన్ని కలుషితం చెయ్యనందున, దాన్ని మురుగును శుద్ధిపరచడానికి ఉపయోగిస్తారు.
20. 50 మి.లీ. H2O2 నమూనా S.T.P.వద్ద 5000 మి.లీ. ఆక్సిజన్‌ను ఇస్తే ఆ నమూనా ఏది?
1) 100 ఘ.ప. H2O2 2) 17.9 N 3) 30.35% w/w 4) పైవన్నీ
సమాధానం: (4)
21. కిందివాటిలో దహన ఎంథాల్పీల సరైన క్రమాన్ని గుర్తించండి.
1) H2 > LPG > CH4 > ఆక్టేన్ (ద్ర) 2) ఆక్టేన్ (ద్ర) > LPG > CH4 > H2
3) LPG > H2 > ఆక్టేన్ (ద్ర) > CH4 4) ఆక్టేన్ (ద్ర) > H2 > LPG > CH4
సమాధానం: (2)
వివరణ: ద్రవ ఆక్టేన్ దహన ఎంథాల్పీ = 5511 KJ/మోల్
LPG దహన ఎంథాల్పీ = 2220 KJ/మోల్
CH4 ఆక్టేన్ దహన ఎంథాల్పీ = 880 KJ/మోల్
H2(వా) దహన ఎంథాల్పీ = 286 KJ/మోల్.
22. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) కొన్ని ఎరువుల కర్మాగారాల్లో D2O సహ ఉత్పన్నం.
2) H2O2ను సోడియం పెర్‌బోరేట్ తయారీలో ఉపయోగిస్తారు.
3) పెర్‌హైడ్రాల్ యాంటీసెప్టిక్.
4) H2O2కు NH3 స్థిరీకరణి.
సమాధానం: (4)
వివరణ: H2O2కు యూరియాను స్థిరీకరణిగా వాడతారు.
23. సముద్ర జలం నుంచి శుద్ధ జలాన్ని ఏ విధంగా పొందుతారు?
1) స్కంధనం 2) మడ్డి పేరుకునే చర్య
3) ఇగర్చడం 4) వ్యుత్క్రమ అభిసరణం
సమాధానం: (4)
వివరణ: వ్యుత్క్రమ ద్రవాభిసరణం ద్వారా శుద్ధమైన నీటిని పొందవచ్చు.
24. హైడ్రైడ్ సందు (Hydride gap) అంటే
1) 7, 8, 9వ గ్రూపు మూలకాలు లోహ హైడ్రైడ్లను ఏర్పరచక పోవడం.
2) H, లోహ పరమాణువు బంధదైర్ఘ్యం
3) 4, 5, 6 గ్రూపు మూలకాలు లోహ హైడ్రైడ్లను ఏర్పరచక పోవడం
4) హైడ్రైడ్ల సందులోకి మూలకాలు ప్రవేశించడం.
సమాధానం: (1)
వివరణ: 7, 8, 9వ గ్రూపు మూలకాలు హైడ్రైడ్లను ఏర్పరచక పోవడాన్ని 'హైడ్రోజన్ సందు' (Hydrogen gap)అంటారు.
25. H2O2 వాయు, ఘన ప్రావస్థల్లో డైహెడ్రల్ కోణాలు
1) 110o, 111o 2) 90.2o, 111.5o
3) 111.5o, 90.2o 4) 90o, 91o
సమాధానం: (3)
వివరణ: H2O2 వాయుస్థితి నుంచి ఘనస్థితికి మారేటప్పుడు డైహెడ్రల్ కోణం తగ్గుతుంది.