• facebook
  • whatsapp
  • telegram

ఖనిజ పోషణ

1. ఆక్సిజన్ సమ్మార్జకంగా పనిచేసేది-
జ: హిమోగ్లోబిన్

 

2. కిందివాటిలో ఏ కణాలు విభజన చెందడం వల్ల లెగ్యుమినేసి వేర్లలో బుడిపెలు ఏర్పడతాయి.
ఎ) బాహ్య చర్మం   బి) వల్కలం    సి) అంతః చర్మం    డి) పరిచక్రం
1) ఎబి        2) బిసిడి      3) ఎబిసి        4) సిడి
జ: 4 (సిడి)

 

3. అమైడ్‌లు మొక్కల్లో ఇతర భాగాలకు వేటి ద్వారా రవాణా చెందుతాయి?
జ: దారువు

 

4. ఆక్సిజన్‌కు వాహకంగా పనిచేసేది
జ: లెగ్ - హిమోగ్లోబిన్

 

5. నైట్రోజినేజ్ ఎంజైమ్‌లో ఉండే ఖనిజ మూలకాలు
జ: Mo, Fe

 

6. ఒక నత్రజని అణువు స్థాపన చెందేటప్పుడు ఏర్పడే అమ్మోనియా అణువులకు, వినియోగమయ్యే ATPలకు మధ్య నిష్పత్తి
జ: 1 : 8

 

7. ఆల్నస్ వేర్లపై నత్రజని స్థాపన బుడిపెలను ఏది ఏర్పరుస్తుంది?
జ: ఫ్రాంకియా

 

8. 60 మూలకాలున్న మొక్కలో అన్ని కణాంగాలు ఉన్నప్పటికీ పత్రహరితం ఒక్కటే తయారు కాలేదు. ఏ మూలకం లోపం వల్ల ఇలా జరిగింది.
జ: Fe

 

9. పోషక కణజాలంలో సుక్రోజ్ రవాణా సరిగా జరగనప్పుడు లోపించిన మూలకాన్ని కింది ఏ మొక్కలోని క్రియాత్మక వ్యాధి వల్ల తెలుసుకోవచ్చు.
జ: బీటు దుంపలో కుళ్లు

 

10. జతపరచండి. 

పట్టిక - 1 పట్టిక - 2
I. బ్రాంజింగ్ A. వర్ణరహిత పత్రహరితం
II. సల్ఫర్ B. లెగ్యూమ్
III. మెగ్నీషియం లోపం C. నిర్హరిత ఈనెలు, గోధుమ రంగు మచ్చలు
IV. మాంగనీస్ విష లక్షణం D. లోప లక్షణాలు మొదట లేత పత్రాల్లో

     సరైన జోడింపు
      I      II      III     IV
జ: B     D      A      C

 

11. IAA ఆక్సిడేజ్ ఎంజైమ్‌కు ఉత్ప్రేరకారి అయిన ఒక సూక్ష్మ మూలకం సందిగ్ధ గాఢత కంటే ఎక్కువ లభ్యమైనప్పుడు అది ఏ మూలకాల లోపాన్ని ప్రేరేపిస్తుంది?
1) N, P, K    2) Fe, Mg, Ca     3) Fe, Cu, Ca  4) S, Mo, Fe
జ: 2 (Fe, Mg, Ca)

 

12. నిశ్చితం (A): సల్ఫర్, కాల్షియం చలన శీల మూలకాలు కావు.
      వివరణ (R) : సల్ఫర్, కాల్షియం కణ నిర్మాణాత్మక భాగాలుగా ఉంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.

 

13. హైడ్రోఫోనిక్స్‌ను ఎవరు మొదలుపెట్టారు?
జ: జూలియస్ వాన్‌సాక్స్

 

14. సల్ఫర్‌తోపాటు ప్రొటీన్‌లో ఉండే అమైనో ఆమ్లం
జ: సిస్టీన్

 

15. జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I. సల్ఫర్ A. కండె పరికరం ఏర్పాటు
II. కాపర్ B. పరాగరేణువులు మొలకెత్తడం
III. కాల్షియం C. ఫెరిడాక్సిన్
IV. బోరాన్ D. సైటోక్రోమ్ ఆక్సిడేజ్

 సరైన జోడింపు
      I     II    III    IV
జ: C    D    A      B

 

16. నైట్రోజినేజ్ ఎంజైమ్ కింది ఏ మూలకానికి సున్నితత్వాన్ని సూచిస్తుంది?
1) ఆక్సిజన్      2) సల్ఫర్      3) ఐరన్     4) కాపర్
జ: 1 (ఆక్సిజన్)

 

17. సోయాచిక్కుడు వేరుబుడిపెలో ఉండే నత్రజని ఏ విధంగా ఇతర భాగాలకు సరఫరా అవుతుంది?
జ: యూరైడ్‌ల ద్వారా 

 

18. నత్రజని స్వాంగీకరణలో జరిగిన మార్పుల వల్ల ఏర్పడేది-
జ: కర్బన నత్రజని

 

19. నత్రజని లోపించినప్పుడు కనిపించే లక్షణాలు -
జ: పుష్పాలు ఆలస్యంగా ఏర్పడటం, నిర్హరితం, కణవిభజన నిరోధింపబడటం

 

20. లోహాలు కానీ మూలకాలు ఏవి లోపించడమనేది మెక్కల్లో ఉండదు
జ: C, H, O

 

21. మొక్క ఎన్ని మూలకాలను ఖనిజ మూలకాల రూపంలో మృత్తిక నుంచి శోషిస్తుంది?
జ: 14

 

22. అణుపరీక్షలు జరిపే ప్రదేశాల్లో పెరిగే మొక్కలు ఏ మూలకాన్ని (రేడియోధార్మికత) సంచయనం చేసుకుంటాయి?
జ: స్ట్రాన్షియం

 

23. ఉన్నతశ్రేణి మొక్కలకు కింది మూలకాలు ఆవశ్యకం కాదు, కానీ లాభదాయకం. అవి
జ: సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం

 

24. శక్తి సంబంధ రసాయన పదార్థ భాగాల్లో ఉన్న ముఖ్యమైన ఆవశ్యక మూలకాలు
జ: Mg, P

 

25. కాంతి సంశ్లేషిత కార్బన్ స్థాపనలో తోడ్పడే ఎంజైమ్‌లను ఉత్తేజపరిచే ఆవశ్యక మూలకం ఏది?
జ: Mg

 

26. ఆల్కహాల్ డీ హైడ్రోజినేజ్‌కు ఉత్తేజకారి-
జ: Zn2+ 

 

27. పత్ర రంధ్రాలు తెరచుకునే, మూసుకునే విధానంలో కింది ఏ కేటయాన్ ముఖ్యపాత్ర వహిస్తుంది?
1) K       2) Cl      3) 1, 2        4) Mn

జ: 1 (K)
 

28. జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I. కాంతి నీటి విచ్ఛేదనం A. ఐరన్
II. పత్రహరితం ఏర్పడటం B. మాంగనీస్
III. DNA, RNA సంశ్లేషణ C. బోరాన్
IV. కార్బోహైడ్రేట్‌ల స్థానాంతరణ D. మెగ్నీషియం

   సరైన జోడింపు
      I      II    III       IV
జ:  B    A     D       C

 

29. నిశ్చితం (A): మొక్కలు చూపే లోప లక్షణానికి కారణమైన ఆవశ్యక మూలకం. అది లోపించినప్పుడు ఇంకా ఇతర మొక్కల్లో, ఏ లోప లక్షణాలనూ ప్రదర్శించదు.
      వివరణ (R): నిమ్మలో డైబాక్‌కు కారణం Cu లోపమే.
జ: A సరైంది. కానీ, R తప్పు. 

 

30. నత్రజని, మెగ్నీషియం, పొటాషియం లోప లక్షణాలు వేటిలో కనిపిస్తాయి?
జ: ముదురు పత్రాల్లో

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌