1. CCl4 ఐరన్ సమక్షంలో అతి తాపనీటి ఆవిరితో చర్య జరిపి వేటిని ఇస్తుంది?
1) HCl & COCl2 2) HOCl & CH4
3) COCl2 & HCl 4) చర్య లేదు
సమాధానం: (3)
వివరణ: CCl4 + H2O COCl2 + 2 HCl
2. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) ఫుల్లరీన్‌లో ఆరు కార్బన్లు ఉండే వలయాలు ఇరవై, అయిదు కార్బన్లు ఉండే వలయాలు పన్నెండు ఉంటాయి.
2) 5 కార్బన్ల వలయం 5 లేదా 6 కార్బన్ల వలయంతో సంలీనం చెందుతుంది.
3) ప్రతి కార్బన్ sp2 సంకరీకరణం చెందుతుంది.
4) C - C బంధదైర్ఘ్యం 1.43 A°, C = C బంధదైర్ఘ్యం 1.38 A°
సమాధానం: (2)
వివరణ: 5 కార్బన్ల వలయం కేవలం 5 కార్బన్ల వలయంతోనే సంలీనం చెందుతుంది. 6 కార్బన్ల వలయంతో సంలీనం చెందదు.
3. కిందివాటిలో సిలికేట్(లు)
1) ఆస్‌బెస్టాస్ 2) గాజు 3) సిమెంట్ 4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: SiO4-4 యూనిట్లు ఉన్నందున అన్నీ సిలికేట్‌లే.
4. సిలికోన్ నిర్మాణం దేన్ని పోలి ఉంటుంది?
1) కీటోన్ 2) ఆల్కహాల్ 3) ఈథర్ 4) 1, 2 రెండూ
సమాధానం: (1)
వివరణ: అనుభావిక ఫార్ములా: R2SiO (R = CH3 లేదా C6H5 సమూహం)
5. కిందివాటిలో సిలికా అస్ఫటిక రూపాంతరం ఏది?
1) క్వార్ట్‌జ్ 2) కీసెల్‌ఘర్ 3) క్రిస్టోబలైట్ 4) ట్రిడిమైట్
సమాధానం: (2)
వివరణ: కీసెల్‌ఘర్ మాత్రమే సిలికా యొక్క అస్ఫటిక రూపాంతరం. మిగిలినవి స్ఫటిక రూపాంతరాలు.
6. పొడి మంచు ఉపయోగం ఏమిటి?
1) ఐస్‌క్రీమ్‌లకు ప్రశీతకంగా 2) మంటలను ఆర్పడానికి
3) యూరియా తయారీలో 4) పైవన్నీ
సమాధానం: (1)
7. SiO2 లో O, Si పరమాణువులు ఒకదాని తర్వాత మరొకటి ఉంటూ ఎన్ని పరమాణువులున్న వలయాలు ఏర్పడతాయి?
1) 8 2) 6 3) 4 4) 2
సమాధానం: (1)
వివరణ: SiO2 లో O, Si పరమాణువులు ఒకదాని తర్వాత మరొకటి ఉంటూ 8 పరమాణువులు ఉండే వలయాలు ఏర్పడతాయి.
8. సిలికోన్‌లలో ఉండే బంధాలను గుర్తించండి.
1) - Si - C - Si - O - Si - 2) - Si - C - Si - C - Si -
3) - Si - O - Si - O - Si - 4) - Si - Si - Si - Si -
సమాధానం: (3)
వివరణ: సిలికోన్‌లలో - Si - O - Si - బంధాలు ఉంటాయి.
9. జతపరచండి.
సమూహం - I | సమూహం - II |
A) క్వార్ట్‌జ్ | I) నిర్జలీకరణి |
B) సిలికాజెల్ | II) వడబోత యంత్రాలు |
C) కీసెల్‌ఘర్ | III) సమయాన్ని కచ్చితంగా చూపే గడియారాలు |
D) సిలికోన్‌లు | IV) ఆల్కహాల్‌ను గాసోలిన్‌గా మార్చడానికి |
V) జలనిరోధక వస్త్రాలు |
A B C D A B C D
1) I II III IV 2) III I II V
3) III II I IV 4) IV I II V
సమాధానం: (2)
వివరణ: 2వది సరైన జత.
10. సిలికా వేటితో చర్య జరుపుతుంది?
1) Cl2 & H2 2) HCl & HNO3 3) Na & Mg 4) HF & NaOH
సమాధానం: (4)
వివరణ: SiO2 + 2 NaOH Na2SiO3 + H2O
SiO2 + 4 HF

11. H2CO3/ HCO3 - వ్యవస్థ రక్తం pH ను ............ మధ్య ఉంచుతుంది.
1) 7.26 నుంచి 7.42 2) 7.0 నుంచి 7.1
3) 7.1 నుంచి 7.2 4) 6.9 నుంచి 7.1
సమాధానం: (1)
వివరణ: pH విలువ 7.26 నుంచి 7.42 మధ్య ఉంటుంది.
12. CO2 లో C సంకరీకరణం ఏమిటి?
1) sp3 2) sp2 3) sp 4) sp3d
సమాధానం: (3)
వివరణ:

13. 373 K వద్ద మిథనోయిక్ ఆమ్లాన్ని గాఢ H2SO4 తో వేడి చేస్తే ఏమి వెలువడతాయి?
1) CO2 & H2 2) CO & H2O 3) CO2 & H2O 4) CO & H2
సమాధానం: (2)
వివరణ:
14. కిందివాటిలో ఏ అణువు సాకర్ బంతి ఆకృతిలో ఉంటుంది?
1) ఫుల్లరీన్ 2) గ్రాఫైట్ 3) వజ్రం 4) ట్రిడిమైట్
సమాధానం: (1)
వివరణ: ఫుల్లరీన్‌కు సాకర్ బంతిని పోలిన నిర్మాణం ఉంటుంది.
15. ఒక మోల్ గాఫ్రైట్, వజ్రం, ఫుల్లరీన్‌ల విలువలు వరుసగా
1) 1.9 KJ, 0 KJ, 38.1 KJ 2) 0 KJ, 38.1 KJ, 1.9 KJ
3) 0 KJ, 1.9 KJ, 38.1 KJ 4) 1.9 KJ, 38.1 KJ, 0 KJ
సమాధానం: (3)
వివరణ: కార్బన్ ప్రమాణ స్థితి గ్రాఫైట్. కాబట్టి దీనికి విలువ సున్నా. ఫుల్లరీన్‌కు ఏరోమాటిక్ స్వభావం ఉంది. ఇంకా ఇది C60.
16. ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం కార్బన్ స్థిరమైన రూపాంతరం ఏది?
1) వజ్రం 2) జాంతవ బొగ్గు 3) ఫుల్లరీన్ 4) గ్రాఫైట్
సమాధానం: (4)
వివరణ: ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం గ్రాఫైట్ చాలా స్థిరమైంది.
17. ఫుల్లరీన్ ఆవిష్కర్త(లు)
1) హెచ్.డబ్ల్యు. క్రోటో 2) ఇ. స్మాలే 3) ఆర్.ఎఫ్. కర్ల్ 4) పైవారందరూ
సమాధానం: (4)
వివరణ: ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ ఫుల్లరీన్‌లను కనుక్కున్నారు. 1996లో నోబెల్ బహుమతిని పొందారు.
18. GeO2, CO, PbO2 ల ప్రవృత్తి వరుసగా
1) ఆమ్ల, తటస్థ, ద్విస్వభావ 2) క్షార, తటస్థ, క్షార
3) ద్విస్వభావ, ఆమ్ల, క్షార 4) ఆమ్ల, తటస్థ, ఆమ్ల
సమాధానం: (1)
వివరణ: GeO, GeO2, SiO2, CO2 ఆమ్ల.
CO

SnO, PbO, SnO2, PbO2

19. 14వ గ్రూపు మూలకాల రుణ విద్యుదాత్మకతల సరైన క్రమాన్ని గుర్తించండి.
1) C > Si > Ge > Sn > Pb 2) C > Pb > Si = Ge = Sn
3) C > Si < Ge > Sn > Pb 4) C > Si > Ge < Sn < Pb
సమాధానం: (2)
వివరణ: పౌలింగ్ స్కేలు ప్రకారం రుణవిద్యుదాత్మకత విలువలు:
C = 2.5, Pb = 1.9, Si = 1.8, Ge = 1.8, Sn = 1.8.
20. కిందివాటిలో వాయురూపంలో ఉండే క్రియాజన్యాలను ఏర్పరచని చర్య ఏది?
1) CH4 + O2 2) ZnO + CO

3) SiO2 + NaOH


సమాధానం: (3)
వివరణ: CH4 + 2 O2

ZnO + CO

SiO2 + 2 NaOH

Fe2O3 + 3 CO

21. కిందివాటిలో దేనికి పారా అయస్కాంత స్వభావం లేదు?
1) CO 2) N2+ 3) O2 4) NO
సమాధానం: (1)
వివరణ: CO లో వేలన్స్ ఎలక్ట్రాన్లు = 4 + 6 = 10 (సరిసంఖ్య, డయా అయస్కాంత)
22. కార్బన్ హైడ్రైడ్‌లలో కార్బన్ ఆక్సీకరణ స్థితి ఎంత?
1) -4 2) + 4 3) + 2 4) 0
సమాధానం: (2)
వివరణ: ఉదా: CH4
H ఆక్సీకరణ స్థితి = -1 ∴ x + 4(-1) = 0
x - 4 = 0
∴ x = + 4
23. CaCO3 + కోక్ Y. ఈ చర్యలో Y
1) C2H6 2) CaC2 3) C2H2 4) C2H4
సమాధానం: (3)
వివరణ: CaCO3 + 4 C → CaC2 + 3 CO

24. 14వ గ్రూపు మూలకాల ప్రథమ అయనీకరణ ఎంథాల్పీ విలువల సరైన క్రమాన్ని గుర్తించండి.
1) C < Si < Ge < Sn < Pb 2) C > Si > Ge > Sn > Pb
3) C > Si > Ge < Sn > Pb 4) C > Si > Ge > Pb > Sn
సమాధానం: (4)
వివరణ: నడుమ వచ్చే ఎలక్ట్రాన్లు (d-, f-), వేలన్స్ ఎలక్ట్రాన్లను సరిగా పరిరక్షించక పోవడం వల్ల I.E.1 విలువలు: C = 1086, Si = 786, Ge = 761, Pb = 715, Sn = 708 KJ/మోల్.
25. జియొలైట్లకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది?
1) కొన్ని SiO4-4 యూనిట్లకు బదులు AlO4-5, AlO6-9 అయాన్లు వస్తాయి.
2) జియొలైట్‌లు అంటే త్రిమితీయ అల్లిక ఉండే అల్యూమినో సిలికేట్‌లు.
3) జియొలైట్‌లను కాటయన్ల వినిమయంలో ఉపయోగిస్తారు.
4) జియొలైట్‌లకు తెరచి ఉండే ఆకృతి వల్ల చిన్న అణువులను తీసుకోగలవు.
సమాధానం: (1)
వివరణ: జియోలైట్లలో SiO4-4 యూనిట్లను Na+ లేదా K+ లేదా Ca+2 లేదా Al+3 అయాన్లతో భర్తీ అవుతాయి.