• facebook
  • whatsapp
  • telegram

స్టాయికియోమెట్రి

1. క్షార యానకంలో అననుపాత చర్యను జరిపే మూలకం/ మూలకాలు
     1) P      2) S      3) Cl      4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: 3 భిన్న ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించడం వల్ల P, S, Cl అననుపాత చర్యల్లో పాల్గొంటాయి.

 

2. KIO3 + 5 KI + 6 HCl   3 I2 + 6 KCl + 3 H2O కు సంబంధించి సరైన వ్యాఖ్య ఏది?
     1) అయొడైడ్ I2గా క్షయకరణం చెందుతుంది.
     2) IO3- అయొడిన్‌గా ఆక్సీకరణం చెందుతుంది.
     3) I ఆక్సీకరణ స్థితి - 1 (KI) నుంచి 0 (I2) కు పెరుగుతుంది.
     4) Cl ఆక్సీకరణ స్థితి - 1 (HCl) నుంచి +1 (KI) కు పెరుగుతుంది.
సమాధానం: (3)
వివరణ: KIలో I ఆక్సీకరణ స్థితి = -1, I2లో = 0

     1) 2, 5, 8      2) 2, 5, 16      3) 5, 2, 8      4) 5, 2, 16
సమాధానం: (2)


4. [Cr(NH)3)4 Cl2]+లో Cr ఆక్సీకరణ స్థితి ఎంత?

      1) +3       2) +2       3) +1       4) +6
సమాధానం: (1)
వివరణ: Cr ఆక్సీకరణ స్థితి: x + 4(0) + 2(1) = +1 
                                   
 x = 1 + 2 = +3.

5. KI ఆమ్లీకృత KMnO4 తో చర్య జరిపి అంతిమంగా ఏర్పరచిన సమ్మేళనంలో "Cr" ఆక్సీకరణస్థితి ఎంత?
      1) +6       2) +2       3) +3       4) +4
సమాధానం: (3)
వివరణ: Cr2O7-2 + 14 H+ + 6 I-  
 2 Cr+3 + 7 H2O + 3 I2

6. అణు ద్రవ్యరాశి 60 ఉన్న ఒక కర్బన సమ్మేళనంలో C = 20%, H = 6.67%, N = 46.67% (మిగిలింది ఆక్సిజన్) ఉన్నాయి. దీన్ని వేడి చేస్తే అమ్మోనియా వాయువుతో పాటు ఒక ఘనపదార్థం మిగిలింది. ఈ ఘనపదార్థానికి క్షార కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కలిపితే నీలిరంగు వచ్చింది. అయితే ఆ సమ్మేళనం ఏది?
      1) CH3NCO       2)(NH2)2CO       3) CH3CONH2       4) CH3CH2CONH2
సమాధానం: (2)


 

7. బాష్ప సాంద్రత అంటే


     
సమాధానం: (3)


 

8. కింద తెలిపిన జంటల్లో బహ్వనుపాత నియమాన్ని వివరించేది ఏది?
      1) CuO, Cu2O   2) H2S, SO2  3) NH3, NCl3  4) CS2, FeSO4
సమాధానం: (1)
వివరణ: CuO, Cu2O లో 'O' పరమాణువుల ద్రవ్యరాశి, 'O'ల నిష్పత్తి = CuO : Cu2O = 1 :  1/2 

           = 2 : 1 కాబట్టి బహ్వనుపాత నియమాన్ని పాటిస్తుంది.
 

9. 3 గ్రాముల లోహాక్సైడ్‌ను పూర్తిగా లోహ క్లోరైడ్‌గా మార్చారు. దీని నుంచి 5 గ్రాముల క్లోరైడ్ వస్తే, ఆ లోహం తుల్య భారం ఎంత?
      1) 20       2) 12       3) 3.325       4) 33.25
సమాధానం: (4)

10. కింద తెలిపిన వాటిలో అత్యధిక సంఖ్యలో అణువులు ఉండేది
       1) STP వద్ద 100 cc CO2     2) STPవద్ద 200 cc NH3
       3) STPవద్ద 50 cc SO2        4) STP వద్ద 150 cc N2
సమాధానం: (2)
వివరణ: STP వద్ద ఘనపరిమాణం  
 అణువుల సంఖ్య. NH3 ఘనపరిమాణం ఎక్కువ కాబట్టి దీనిలోనే అణువులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.
 

11. ఒక ప్రయోగానికి అసలు విలువ 3 గ్రా. అయితే ఒక విద్యార్థి నాలుగు సార్లు ప్రయోగం చేస్తే 2.94, 2.97, 2.99, 3.01 గ్రాములు వచ్చాయి. వీటిలో వచ్చిన ప్రయోగ విలువలు 3.01 గ్రా., 2.99 గ్రా. వరుసగా
       1) రెండూ కచ్చితంగా లేవు           2) రెండూ వాస్తవంగా లేవు
       3) రెండూ కచ్చితంగా ఉన్నాయి    4) రెండూ కచ్చితంగా, వాస్తవంగా ఉన్నాయి
సమాధానం: (4)
వివరణ: రెండు విలువలు 3 గ్రా.కు దగ్గరగా ఉండటంతో అవి కచ్చితం, వాస్తవం.

 

12. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
       1) సున్నా కాని అంకెలన్నీ సార్థక అంకెలే.
       2) సున్నా కాని అంకెలకు ముందు ఉండే సున్నాలు సార్థకమైనవి.
       3) సున్నా కాని అంకెల మధ్య ఉండే సున్నాలు సార్థకమైనవి.
       4) 0.200 గ్రాముల్లో 3 సార్థక అంకెలు ఉన్నాయి.
సమాధానం: (2)
వివరణ: సున్నా కాని అంకెలకు ముందు ఉండే సున్నాలు సార్థకమైనవి కావు.

13. ఆమ్ల యానకంలో పర్మాంగనేట్ అయాన్ తుల్యభారం ఎంత?
       1) 23.78     2) 31.6      3) 158      4) 119
సమాధానం: (1)

14. 1.25 గ్రా./లీ. సాంద్రత ఉండే 3 M NaCl ద్రావణం మొలాలిటీ ఎంత?
       1) 3.79 m    2) 2.79 m     3) 1.79 m     4) 3 m
సమాధానం: (2)

15. ఓజోన్ రంధ్రం ఏర్పడే దృగ్విషయం దేనికి ఉదాహరణ?
      1) ఆక్సీకరణం     2) క్షయకరణం     3) రిడాక్స్    4) పైవేవీకావు
సమాధానం: (3)
వివరణ: భావన

 

16. HAuCl4 సమ్మేళనంలో Au ఆక్సీకరణ స్థితి ఎంత?
      1) +1    2) +2     3) 0     4) +3
సమాధానం: (4)
వివరణ: HAuCl4 = + 1 + x - 4 = 0      x = + 3

సమాధానం: (1)
వివరణ:
 లో Cl ఆక్సీకరణ స్థితి = +7. ఇది క్షయకరణం మాత్రమే చెందుతుంది.

18. C3O2 లో ప్రతి కార్బన్‌పై ఉండే ఆక్సీకరణ స్థితులు ఏవి?
       1)  4/3, 4/3, 4/3 
   2) 2, 2, 0
       3)  +2, 0, +2         4)  0, 2, 0
సమాధానం: (3)
వివరణ: C3O2లో "C"ఆక్సీకరణ స్థితులు O-2 = C+2 = C0 = C+2 = O-2

"C" సగటు ఆక్సీకరణ స్థితి =  4/3 .
 

19. BCl3 నుంచి 21.6 గ్రాముల బోరాన్ మూలకం రావడానికి అవసరమయ్యే H2 వాయువు ఘనపరిమాణం ఎంత? (273 K, 1 అట్మా)
       1) 44.8 లీ.     2) 67.2 లీ.    3) 22.4 లీ.    4) 89.6 లీ.
సమాధానం: (2)
వివరణ: 2 BCl3  +      3 H2
 2 B     +    6 HCl
                3 × 22.4 = 67.2 L         2 × 10.8 = 21.6 గ్రా.

20. ఒక వాయు మిశ్రమంలో ఘనపరిమాణాత్మకంగా 50% హీలియం, 50% మీథేన్ ఉన్నాయి. ఈ మిశ్రమంలో భారాత్మకంగా ఉండే మీథేన్ శాతం ఎంత?
      1) 20%       2) 50%       3) 75%       4) 80%
సమాధానం: (4)
వివరణ: He, CH4 మోలార్ నిష్పత్తి = 1 : 1
          వాటి భారాల నిష్పత్తి = 4 : 16 = 1 : 4
           CH4 భారశాతం = 4/5 
 × 100 = 80%.
 

21. NaOH + H3PO4 NaH2PO4 + H2O చర్యలో ఫాస్ఫారికామ్లం తుల్యభారం ఎంత?
      1) 49       2) 98       3) 24.5       4) 16.5
సమాధానం: (2)
వివరణ: చర్యలో H3PO4లో 1 H స్థానభ్రంశం చెంది NaH2PO4 ఏర్పడుతుంది.
             H3PO4 తుల్యభారం = 98/1 
= 98

22. STP వద్ద 3.65 గ్రా. HCl ఏర్పడటానికి అవసరమయ్యే H2, Cl2 వాయువుల ఘనపరిమాణాలు వరుసగా ఎంత?
        1) 1.12 L, 1.12 L         2) 1.12 L, 2.24 L          3) 1 L, 1 L         4) 2.24 L, 1.12 L
సమాధానం: (1)

వివరణ:   H2   +   Cl2     2 HCl
             22.4 L    22.4 L  
  2 × 36.5 గ్రా.
                ?              ?      
     3.65 గ్రా.


           
 

23. ఒక మూలకానికి చెంది x200 - 90%, x199 - 8%, x202 - 2% ఉన్నాయి. x అనే మూలకం సగటు పరమాణు ద్రవ్యరాశి ఎంత?

    1) 199 amu     2) 206 amu    3) 200 amu   4) 209 amu
సమాధానం: (3)

24. 80 గ్రాముల ఆక్సిజన్‌లో ఉండే పరమాణువుల సంఖ్యకు సరిసమానమైన సంఖ్యలో అణువులు ఉండేది
       1) 40 గ్రా. H2     2) 10 గ్రా. H2    3) 1 గ్రా. H2     4) 5 గ్రా. H2
సమాధానం: (4)


25. ఎన్ని మోల్‌ల Mg3(PO4)2 లో 0.25 మోల్‌ల ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి?
       1) 6.15 × 10-3    2) 1.25 × 10-2    3) 3.125 × 10-2    4) 2.5 × 10-2
సమాధానం: (3)

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌