• facebook
  • whatsapp
  • telegram

ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు

1. ఎం.ఎస్. స్వామినాథన్‌కు సంబంధించి కిందివాటిలో ఏవి నిజం?
        A. అతడు జన్యుశాస్త్రం, వృక్ష ప్రజననంలో నైపుణ్యం సాధించాడు.
        B. అతడు సువాసన ఇచ్చే బాస్మతిని అభివృద్ధి పరిచాడు.
        C. అతడు ప్రయోగశాల నుంచి భూమిపైకి మరియు  ఆహారభద్రత కార్యక్రమాలను మొదటిసారిగా  ప్రారంభించాడు.
         D. భారతరత్న పురస్కారం అతడిని వరించింది.
జ: A B C

 

2. ఎం.ఎస్. స్వామినాథన్‌కు కిందివాటిలో ఏ సంస్థతో దగ్గరి సంబంధం ఉంది?
1) ICRISAT     2) NBRI     3) CFTRI     4) IRRI
జ: 4 (IRRI)

 

3. క్రాప్ కాఫెటిరియా, క్రాప్ షెడ్యూలింగ్, జన్యుపరంగా పంట మొక్కల  అభివృద్ధి, దిగుబడి, సస్యాల్లో నాణ్యత లాంటి భావాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన ప్రఖ్యాత వ్యక్తి ఎవరు?
జ: ఎం.ఎస్. స్వామినాథన్

 

4. వృక్ష ప్రజనన సాక్ష్యాలతో భద్రపరచిన రికార్డులు ఏ కాలం నాటివి?
జ: 9000 - 11000 సంవత్సరాలు

 

5. ఏ ప్రజనన కార్యక్రమంలోనైనా కావాల్సిన అతి ముఖ్యమైన మూలాధారం ఏది?
జ: జన్యువైవిధ్యశీలత

 

6. ఒక నమూనా సస్యంలోని వివిధ రకాల యుగ్మవికల్పాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉన్న మొక్కల మొత్తం లేదా విత్తనాల సేకరణను ఏమంటారు?
జ: బీజపదార్థ సేకరణ

 

7. ప్రజనన కార్యక్రమంలో కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.
A. సంకర సంకరణం                  B. వైవిధ్యశీలత సేకరణ     
C. సాగు రకాల వ్యాపారీకరణ      D. విశ్లేషణ, జనకుల ఎంపిక
జ: B D A C

 

8. భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం శాతం ఎంత?
జ: 33%

 

9. సుమారు 62% భారత జనాభా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు.
జ: వ్యవసాయం

 

10. 1960 - 2000 మధ్యకాలంలో గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి ఎంతకు పెరిగింది?
జ: 75 మిలియన్ టన్నులు

 

11. 1960 - 2000 మధ్యకాలంలో వరి ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి ఎంతకు పెరిగింది?
జ: 889.5 మిలియన్ టన్నులు

 

12. ముఖ్యంగా వీటి అభివృద్ధి వల్ల గోధుమ, వరి ఉత్పత్తి అధికమైంది.
జ: గోధుమ, వరిలోని అర్ధవామన రకాలు

 

13. IRRI (అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ) ఏ ప్రదేశంలో ఉంది?
జ: ఫిలిఫ్పైన్స్

 

14. సొనాలికా, కల్యాణ్‌ సోనా దేనికి సంబంధించిన అధిక దిగుబడినిచ్చే రకాలు?
జ: గోధుమ

 

15. గోధుమ, మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించిన అంతర్జాతీయ కేంద్రం ఎక్కడ ఉంది?
జ: మెక్సికో

 

16. కిందివాటిలో ఏ వరి రకాలను IARIలో అభివృద్ధి చేశారు?
1) IR - 8      2) సోనాలికా    3) కల్యాణ్‌ సోనా     4) జయ, సోనా
జ: 1 (IR - 8)

 

17. వరికి చెందిన తైచుంగ్‌నేటివ్ - 1ను ఎక్కడ అభివృద్ధి చేశారు?
జ: తైవాన్

 

18. నిశ్చితం (A): శఖారమ్ అఫిసినారమ్ కాండాలు సన్నవి, ఎక్కువ చక్కెరతో ఉంటాయి.
       కారణం(R): దాన్ని ఉత్తర భారతదేశంలో సాగుచేసే శఖారమ్ బార్‌బెర్రితో విజయవంతంగా సంకరణం చేయవచ్చు.
     1) A, R రెండూ సరైనవి. Aకు R సరైన వివరణ.             
     2) A, R సరైనవి కానీ, Aకు R సరైన వివరణ కాదు.
     3) A సరైంది కానీ, R సరైంది కాదు.                         
     4) A సరైందికాదు కానీ, R సరైంది.
జ: 4 (A సరైందికాదు కానీ, R సరైంది.)

 

19. భారతదేశంలో అభివృద్ధి చేసిన వరికి సంబంధించి అధిక దిగుబడిని ఇచ్చే అర్ధవామన రకాలు ఏవి?
జ: జయ, రత్న

 

20. శఖారమ్ బార్‌బెర్రికి సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
      A. దీన్ని దక్షిణ భారతదేశంలో పెంచుతున్నారు.
      B. ఇది అధిక దిగుబడిని ఇస్తుంది.
      C. దీనిలో ఎక్కువ చక్కర ఉంటుంది.
1) A B      2) B C      3) A C       4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

 

21. కిందివాటిలో ఏది శిలీంద్రవ్యాధి కాదు?
1) చెరకు ఎర్రకుళ్లు తెగులు                2) క్రూసిఫెర్‌ల నల్లటి కుళ్లు
3) గోధుమవర్ణ కుంకుమ తెగులు        4) బంగాళాదుంప ఆకుతెగులు
జ: 2 (క్రూసిఫెర్‌ల నల్లటి కుళ్లు)

 

22. బంగాళాదుంప ఆకుతెగులు దీని వల్ల వస్తుంది?
జ: శిలీంద్రం

 

23. కింది రకాలను వాటి వ్యాధి ప్రతిరోధకతతో జతపరచండి.

I II
A. పూసాసర్ణిం బ్రాసికా I. నల్లకుళ్లు
B. పూసాశుభ్ర కాలీఫ్లవర్ II. బ్యాక్టీరియమ్‌లు తెగులు
C. పూసాకోమల్ బొబ్బర్లు III. తెల్లటి కుంకుమ తెగులు
D. పూసాసదాబహార్ మిరప IV. ఆకుముడత

       A     B     C     D
జ:  III     I      II     IV

 

24. పూసా సదాబహార్ అనేది దేనికి చెందిన ఆకుముడత ప్రతిరోధక రకం?
జ: మిరప

 

25. కిందివాటిలో ఏది ఒక గోధుమ రకం?
1) పూసా స్వర్ణిమ్     2) పూసా శుభ్ర   3) పూసా కోమల్   4) పైవాటిలో ఏదీకాదు
జ: 4 (పైవాటిలో ఏదీకాదు)

 

26. పత్ర, చారల కుంకుమ  తెగులుకు వ్యాధి నిరోధకత చూపే గోధుమ రకం ఏది?
జ: హిమగిరి

 

27. పర్బని క్రాంతి అనేది ఏ వ్యాధిని తట్టుకునే బెండ (ఎబెల్‌మాస్కస్ ఎస్కులెంటస్) రకం?
జ: పచ్చని మొజాయిక్ వైరస్

 

28. కిందివాటిలో ఏది మొక్కజొన్న కాండం తొలిచే పురుగులకు ప్రతిరోధకతను తయారుచేస్తుంది?
1) అధిక ఆస్కార్బిక్ ఆమ్లం                      2) తక్కువ నత్రజని శాతం
3) మొక్కజొన్నలో ఎక్కువ చక్కెర శాతం    4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)

 

29. బోల్‌వార్మ్స్‌కు సంబంధించిన కింది వ్యాఖ్యల్లో ఏది/ ఏవి సరైనవి కావు?
     A. అవి నున్నటి ఆకులతో ఆకర్షితమవుతాయి.
    B. అవి మకరందంలేని పత్తి రకాలను ఇష్టపడవు
    C. అవి గట్టి కాండాలతో ఆకర్షితమవుతాయి.
జ: B C

 

30. నిశ్చితం (A):  గోధుమ గట్టికాండాల నుంచి సాఫ్లై ఆహారం తీసుకోదు.
      కారణం (R):   పంటల్లో కీటక ప్రతిరోధకత అనేది స్వరూపాత్మక, జీవరసాయన లేదా శరీరధర్మశాస్త్ర
                          లక్షణాల వల్ల కలగవచ్చు.
1) A, R రెండూ సరైనవి A కు R సరైన వివరణ.    2) A, R రెండూ సరైనవి కానీ, A కు R సరైన వివరణకాదు.
3) A సరైంది కానీ, R సరైంది కాదు.                    4) A సరైంది కాదు కానీ, R సరైంది.
జ: 1 (A, R రెండూ సరైనవి A కు R సరైన వివరణ.)

 

31. కిందివాటిలో ఏవి ఓక్రా(బెండ) రకాలు?
1) పూసా సెమ్ 2, పూసా సెమ్ 3       2) పూసా గౌరవ్, పూసా సెమ్ 3    
3) పూసా సవానీ, పర్బని క్రాంతి         4) పర్బని క్రాంతి, పూసాగౌరవ్
జ: 3 (పూసా సవానీ, పర్బని క్రాంతి)

 

32. ఖాళీలను నింపండి.

జ: అఫిడ్స్, పూసాసెమ్ 2, ఓక్రా (బెండ)

 

33. ప్రజారోగ్యస్థితిని మెరుగుపరచడానికి ఎక్కువ విటమిన్, లవణాలు, ప్రొటిన్ లేదా కొవ్వు ఉండే పంటల ప్రజనాన్ని ఇలా పిలుస్తారు.
జ: బయోఫోర్టిఫికేషన్

 

34. బంగారు వరిలో ఏది అధికంగా ఉంటుంది?
జ: బి - కెరోటిన్

 

35. IARI విడుదల చేసిన కింది ఏ పంటలో విటమిన్ A పుష్కలంగా లేదు?
1) క్యారెట్       2) స్పినాచ్       3) బతువ         4) గుమ్మడి
జ: 3 (బతువ)

 

36. IARI విడుదల చేసిన కాకరలో ఏది పుష్కలంగా ఉంటుంది?
జ: విటమిన్ C

 

37. కింది IARI రకాల్లో ఏవి ఇనుము, కాల్షియాన్ని ఎక్కువగా కలిగి ఉన్నాయి?
1) స్పినాచ్, బతువ        2) క్యారెట్, గుమ్మడి          

 3) క్యారెట్, బీన్స్           4) స్పినాచ్, తోట బఠానీ
జ: 1 (స్పినాచ్, బతువ)

 

38. ఒక జంతువులో ఒక కిలో మాంసం తయారుకావడానికి  సుమారుగా ఎంత ధాన్యం అవసరం అవుతుంది?
జ: 3 - 10 కిలోలు

 

39. కిందివాటిలో ఏ శైవలం ఏకకణ ప్రొటీన్ ఉత్పత్తికి బాగా అనుకూలమైంది?
1) క్లామిడోమోనాస్     2) స్పైరులినా     3) మిథిలోఫిలస్     4) ఖీటోమియం
జ: 2 (స్పైరులినా)

 

40. కిందివాటిలో ఏ శిలీంద్రం ఏకకణ ప్రొటీన్ ఉత్పత్తికి అనువైంది కాదు?
1) మ్యూకర్       2) కాండిడా       3) శాఖరోమైసిస్      4) ఖీటోమియం
జ: 1 (మ్యూకర్)

 

41. కణజాల వర్ధన యానకాన్ని ఆటోక్లేవ్ చేయడానికి అవసరమైన పరిస్థితులు ఏవి?
జ: 15 నిమిషాలు 121oC, 15 పౌండ్ల పీడనం

 

42. కణజాల వర్ధనంలో ఉపయోగించే వైరస్ రహిత మొక్క భాగం ఏది?
జ: అగ్రవిభాజ్య కణజాలం

 

43. పొమాటోను ఎలా ఉత్పత్తి చేశారు?
జ: శాఖీయ సంకరణం

 

44. శాఖీయ సంకరాలకు సంబంధించి కిందివాటిలో ఏది నిజం?
    A. విభిన్న రకాల నుంచి వివిక్తం చేసిన రెండు జీవపదార్థకాలను సంయోగం చేయవచ్చు.
    B. సాధారణ లైంగిక ప్రక్రియలో భౌతిక లేదా రసాయనిక విరుద్ధత చూపే మొక్కల్లో ఇవి చేయవచ్చు.

  C. ఇది వృక్షకణాల్లో సూటిగా కణద్రవ్య కేంద్రక జీనోమ్‌ల మార్పిడికి అవకాశం ఇస్తుంది.
  D. శాఖీయ సంకరాల ద్వారా వాంఛనీయ లక్షణాల కలయిక ఎల్లప్పుడూ సాధ్యమే.
జ: ABC

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌