• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్ర వర్గీకరణ

1. కింది శాస్త్రవేత్తలను వారు ప్రతిపాదించిన వర్గీకరణ వ్యవస్థలతో జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
A) 2 రాజ్యాల వర్గీకరణ I) ఆర్.హెచ్.విట్టేకర్
B) 4 రాజ్యాల వర్గీకరణ II) కార్ల్‌వోస్
C) 6 రాజ్యాల వర్గీకరణ III) కోప్‌లాండ్
D) 5 రాజ్యాల వర్గీకరణ IV) లిన్నేయస్
  V) హెకెల్

సరైన జోడింపు
       A     B     C    D
జ:  IV     III     II     I

2. విట్టేకర్ వర్గీకరణలో కణకవచం ఉన్న జీవులను ఎన్ని రాజ్యాల్లో చూడవచ్చు?
జ: 4

 

3. విట్టేకర్ తన వర్గీకరణ వ్యవస్థలో నిజకేంద్రక జీవులకు ఎన్ని రాజ్యాలను కేటాయించాడు?
జ: 4

 

4. విట్టేకర్ వర్గీకరణలోని ఎన్ని రాజ్యాల్లో ఏకకణ జీవులు ఉన్నాయి?
జ: 2

 

5. ఎర్రరక్తం ఉన్న, ఎర్రరక్తం లేని జీవులను గుర్తించిన శాస్త్రవేత్త-
జ: అరిస్టాటిల్

 

6. కేంద్రకపూర్వ, నిజకేంద్రక జీవులను గుర్తించనిది-
జ: లిన్నేయస్

 

7. విట్టేకర్ వర్గీకరణలో పరపోషితాలను ఎన్ని రాజ్యాల్లో చూడవచ్చు?
జ: 2

 

8. కింది రాజ్యాల్లోని జీవులు నిజకేంద్రకాలు, స్వయంపోషకాలు
       1) ప్రొటిస్టా   2) ప్లాంటే    3) మోనీరా   4) శిలీంద్రాలు
జ: 2 (ప్లాంటే)

9. కణకవచంలోని పదార్థాన్ని ఆధారం చేసుకుని జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I) సెల్యులోజ్ A) యూబ్యాక్టీరియా
II) కైటిన్ B) మైకోప్లాస్మా
III) మ్యూరిన్  C) ఆక్టినోమైసిటీస్
IV) మైకాలిక్ ఆమ్లం D) శిలీంద్రాలు
  E) ఆకుపచ్చని మొక్కలు

సరైన జోడింపు
       I      II     III     IV
జ:   E    D     A      C

 

10. కణకవచం వేటిలో ఉండదు?
జ: మైకోప్లాస్మా, జంతువులు

11. విట్టేకర్ వర్గీకరణ ప్రకారం కింది జీవులను వాటి రాజ్యాలతో జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I) క్లోరెల్లా A) ఫంగి
II) అనబీనా B) ప్రొటిస్టా
III) న్యూరోస్పోరా C) అనిమేలియా
IV) వివృత బీజం D) మోనీరా
  E) ప్లాంటే

సరైన జోడింపు
      I     II      III      IV
జ:  B    D     A       E

 

12. నిశ్చితం (A): ఆర్కిబ్యాక్టీరియాలు అతికఠినమైన ఆవాసాల్లో జీవిస్తాయి.
వివరణ (R): వీటి కణకవచాల్లో శాఖాయుత లిపిడ్ శృంఖలాలు ఉంటాయి.
జ: A, R రెండూ సరైనవి A కు R సరైన వివరణ.

 

13. ఏకకణ నిర్మిత, నిజకేంద్రక, స్వయంపోషక జీవులు ఏ రాజ్యంలో కనిపిస్తాయి?
జ: ప్రొటిస్టా

14. కిందివాటిలో సరికాని జతను పేర్కొనండి.
      1) మిథనోజెన్స్ - రూమినేట్ జంతువుల జీర్ణాశయం
      2) ఆక్టినోమైసిటీస్ - శాఖారహిత తంతురూప బ్యాక్టీరియాలు
      3) వేడినీటి చలమలు - థర్మోఅసిడోఫిల్స్
      4) అత్యధిక లవణయుత ప్రాంతాలు - హాలోఫిల్స్
జ: 2 (ఆక్టినోమైసిటీస్ - శాఖారహిత తంతురూప బ్యాక్టీరియాలు)

 

15. మీసోజోమ్‌లను ఏర్పరిచేది-
జ: కణత్వచం

 

16. ఎక్కువగా బ్యాక్టీరియాలు-
జ: పరపోషితాలు

 

17. బ్యాక్టీరియాలోని కణాంగాలు-
జ: రైబోజోమ్‌లు

 

18. ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియ చూపే అతి ఆదిమ జీవులు-
జ: నీలి ఆకుపచ్చ శైవలాలు

 

19. జీవపదార్థం... సెంట్రోప్లాజం, క్రోమోప్లాజంగా వేటిలో విభజితమై ఉంటుంది?
జ: సయనో బ్యాక్టీరియా

20.  ప్లూరోనిమోనియా లాంటి జీవులు వేటికి చెందినవి?
జ: మైకోప్లాస్మా

 

21. కిందివాటిలో చాలావరకూ పూతికాహారులు లేదా విచ్ఛిన్నకారులు-
      1) మైకోప్లాస్మాస్   2) ఆక్టినోమైసిటీస్   3) సయనో బ్యాక్టీరియా   4) యూబ్యాక్టీరియా
జ: 2 (ఆక్టినోమైసిటీస్)

 

22. పోషణను అనుసరించి కిందివాటిలో ఎక్కువగా-
       ఎ. యూబ్యాక్టీరియా - పరపోషితాలు
       బి. సయనో బ్యాక్టీరియా - కిరణజన్య సంయోగక్రియ జరిపేవి
       సి. మైకోప్లాస్మా - వ్యాధి జనకాలు
       డి. ఆక్టినో మైసిటీస్ - పూతికాహారులు
జ: ఎ, బి, సి, డి సరైనవి

 

23. హిటరోసిస్ట్ కింది చర్యలో తోడ్పడుతుంది.
    1) అలైంగికోత్పత్తి                 2) నత్రజని స్థాపన        

   3) కిరణజన్య సంయోగక్రియ   4) అకినీట్‌లను ఏర్పరచడంలో
జ: 2 (నత్రజని స్థాపన)

24. హార్మోగోనియాలు వేటిలో ఏర్పడతాయి?
జ: సయనోబ్యాక్టీరియా

 

25. సయనోఫైసిలోని ప్రత్యేక నిర్మాణాలు-
     ఎ. హిటరోసిస్ట్‌లు  బి. అకినీట్‌లు    సి. హార్మోగోనియాలు  డి. ట్రైకోమ్‌లు
జ: ఎ, సి, డి

 

26. హార్మోగోనియాలు దేనిలో తోడ్పడతాయి?
జ: అలైంగికోత్పత్తి

 

27. అలైంగికోత్పత్తిలో సయనోఫైసిలో ఏర్పడేవి-
జ: హార్మోగోనియా, అకినీట్‌లు

 

28. నిశ్చితం (A): నాస్టాక్ నత్రజని స్థాపనలో తోడ్పడుతుంది.
      వివరణ (R): నాస్టాక్‌లో chl - a ఉంటుంది.
జ: A, R రెండూ సరైనవి. కానీ, A కు R సరైన వివరణ కాదు.

 

29. నిశ్చితం (A): వర్షాకాలం నేలలు జారుతాయి.
     వివరణ (R): నీలి ఆకుపచ్చ శైవలాలు తడినేలలపై పెరుగుతాయి.
జ: A, R రెండూ సరైనవి A కు R సరైన వివరణ.

30. జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I) కణకవచంలో సిలికా A) ప్లాస్మాత్వచం
II) క్రోమోప్లాజమ్ B) డయాటమేసియస్ మృత్తిక
III) మీసోజోమ్‌లు C) డయాటంలు
IV) కైసిల్‌గర్ D) నీలి ఆకుపచ్చ శైవలాలు

సరైన జోడింపు
      I      II     III    IV
జ:  C    D     A     B

 

31. కిందివాటిలో మైకోప్లాస్మాకు సంబంధించనిది
    1) కణకవచం                     2) అవికల్ప అవాయు  జీవులు        

    3) నిర్దిష్టంగాలేని కేంద్రకం      4) మంత్రగత్తె చీపురుకట్ట
జ: 1 (కణకవచం)

 

32. కిందివాటిలో లైంగికోత్పత్తి సందర్భంలో వేటిలో ఆక్సోస్పోరులు ఏర్పడతాయి.
      1) డెస్మిడ్‌లు               2) నీలి ఆకుపచ్చ శైవలాలు              

     3) ప్రొటిస్టా                   4) డయాటంలు
జ: 4 (డయాటంలు)

 

33. వేటి కణకవచంపై సెల్యులోజ్ ఫలకాలు ఉంటాయి?
జ: డైనోఫ్లాజెల్లేట్స్

34. మీసోకారియాన్ వీటి ప్రత్యేక లక్షణం.
జ: డైనోఫ్లాజెల్లేట్స్

 

35. మధ్యధరా సముద్రంలోని ఎరుపు అలలకు కారణం-
జ: గోనియాలాక్స్

 

36. నిశ్చితం (A): డైనోఫ్లాజెల్లేట్‌ను విర్లింగ్ విప్స్ అని అంటారు.
      వివరణ (R): ఇవి బొంగరం లాంటి చలనాలను చూపిస్తాయి.
జ: A, R రెండూ సరైనవి A కు R సరైన వివరణ.

 

37. కిందివాటిని పునరుత్తేజక సిద్ధబీజాలు అంటారు.
    1) హిటరోసిస్ట్‌లు                                2) ఆక్సోస్పోరులు            

   3) ఎండోస్పోరులు (అంతఃసిద్ధబీజాలు)      4) అకినీట్‌లు
జ: 2 (ఆక్సోస్పోరులు)

 

38. కిందివాటిలోని కేంద్రకం మిగతా వాటి కేంద్రకం కంటే భిన్నమైంది.
     1) క్రైసోఫైటా   2) డైనోఫ్లాజెల్లేట్స్    3) డయాటంలు   4) డెస్మిడ్‌లు
జ: 2 (డైనోఫ్లాజెల్లేట్స్)

 

39. శైవల శిలీంద్రాలు అంటే..
జ: ఫైకోమైసిటీస్

40. నిశ్చితం (A): నీలి ఆకుపచ్చ శైవలాలను రైతులకు మిత్రులుగా భావిస్తారు.
       వివరణ (R): అవి రైతులకు నత్రజనిని స్థాపన చేస్తాయి.
జ: A సరైంది, R తప్పు.

 

41. ట్రైకోడెర్మా వేటికి చెందింది?
జ: డ్యుటిరోమైసిటీస్

 

42. కిందివాటిని జతపరచండి

పట్టిక - 1 పట్టిక - 2
I) పఫ్‌బాల్స్ A) ఆస్కోమైసిటీస్
II) బ్రాకెట్ ఫంగై B) ఇంపర్‌ఫెక్ట్ ఫంగై
III) క్లబ్ ఫంగై C) పాలీపోరస్
IV) సాక్ ఫంగై D) బెసీడియా మైసిటీస్
  E) లైకోపెర్డాన్

సరైన జోడింపు
      I     II    III    IV
జ:  E   C    D     A

43. అన్నిరకాల లైంగికోత్పత్తి విధానాలను కిందివాటిలో చూడవచ్చు.
     1) ఫంగై                    2) ఫైకోమైసిటీస్                

    3) ఆస్కోమైసిటీస్        4) బెసీడియోమైసిటీస్
జ: 2 (ఫైకోమైసిటీస్)

 

44. జీనోములు సంయోగం చెందడం, విడిపోవడం చూపేది-
జ: ఆస్కస్, బెసీడియం

 

45. జన్యుశాస్త్రంలో ఏ మొక్కను విరివిగా వాడారు?
జ: న్యూరోస్పోరా

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌