• facebook
  • whatsapp
  • telegram

జీవ సాంకేతిక శాస్త్రం, సూత్రాలు, ప్రక్రియలు

1. కిందివారిలో ఎవరు రెస్ట్రిక్షన్ ఎంజైమ్‌లు డీఎన్ఏ పోచలను అతుక్కునే కొనలు గలవిగా కత్తిరిస్తాయని గమనించారు?
      1) హెర్బర్ట్ బోయర్         2) స్టాన్లీ కోహెన్    

     3) రెనె డెస్కొర్టిస్             4) హెర్బర్ట్ బోయర్, స్టాన్లీ కోహెన్
జ: హెర్బర్ట్ బోయర్

 

2. బ్యాక్టీరియమ్ కణాల్లోని ప్లాస్మిడ్‌ను కణం నుంచి వేరు చేసి వేరొక కణంలోని చొప్పించే పద్ధతిని ఎవరు అభివృద్ధి చేశారు?
జ: స్టాన్లీకోహెన్

 

3. EFB పూర్తి రూపం ఏమిటి?
జ: యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ

 

4. నిశ్చితం (A): కొన్ని వైవిధ్యాలు, పునసంయోజనాలు జీవికే కాకుండా జీవసమూహాలకు కూడా మేలుచేసేవిగా ఉండొచ్చు.
కారణం (R): లైంగిక ప్రత్యుత్పత్తి జన్యుసమాచారాన్ని భద్రపరుస్తుంది కానీ వైవిధ్యాలకు అనుమతి ఇవ్వదు.
జ: A సరైంది కానీ R సరైంది కాదు

5. కిందిజీవుల్లో దేని స్థానిక ప్లాస్మిడ్‌తో మొదటి పునసంయోజక డీఎన్ఏ రూపొందించారు?
       1) సాల్మోనెల్లా టైఫీమ్యూరియం              2) ఎశ్చరీషియా కోలై
       3) ఆగ్రోబాక్టీరియం ట్యూమిఫేషియన్స్      4) ప్రోపియోని బ్యాక్టీరియమ్
జ: సాల్మోనెల్లా టైఫీమ్యూరియం

 

6. 1972లో యాంటీబయోటిక్ నిరోధకత ఉన్న జన్యువును ప్లాస్మిడ్ డీఎన్ఏ నుంచి ఓ ముక్కను ఛేదించడం ద్వారా వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు?
జ: హెర్బర్ట్ బోయర్, స్టాన్లీ కోహెన్

 

7. 1963లో దేని నుంచి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్‌ను వివక్తం చేశారు?
జ: ఎశ్చరీషియాకోలై

 

8. Hind II ఎంజైమ్‌కు సంబంధించి కిందివాటిలో ఏవి సరైనవి కావు?
     A. విశిష్ట డీఎన్ఏ న్యూక్లియోటైడ్ వరుసక్రమంపై దాని పనితనం ఆధారపడి ఉంటుంది.
     B. అది ఎల్లప్పడూ డీఎన్ఏ అణువులను 5 నత్రజని క్షారాల జతలున్న నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి ఛేదిస్తుంది.
     C. అది మొదటగా ఆవిష్కరించిన లైగేజ్ ఎంజైమ్
జ: B C

 

9. EcoRI అనే ఎంజైమ్‌లో 'R' అక్షరం దేని నుంచి తీసుకున్నారు?
జ: విభేద నామం

10. రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్ డీఎన్ఏను వేటి మధ్య ఛేదిస్తుంది?
జ: చక్కెర, ఫాస్ఫేట్ వెన్నెముక

 

11. 5'  3' మార్గంలో ఉన్న ఒక డీఎన్ఏ పోచ GCCTAC వరుస క్రమాన్ని సూచిస్తే మరో పోచలోని పాలిండ్రోమిక్ క్రమం ఏ విధంగా ఉంటుంది?
జ: 3' CATCCG 5'

12. రెస్ట్రిక్షన్ ఎంజైమ్‌లకు సంబంధించి కిందివాటిలో ఏవి సరైనవి?
      A. ద్విసర్పిలాకార డీఎన్ఏలోని రెండు పోచలను వేర్వేరు ప్రదేశాల్లో ఛేదిస్తుంది.
      B. పాలిండ్రోమ్ స్థానాల మధ్య భాగానికి కొంచెం దూరంలో డీఎన్ఏ పోచలను ఛేదిస్తుంది.
      C. అభిముఖంగా ఉన్న పోచల్లోని అవే రెండు నత్రజని క్షారాల మధ్య ఛేదన జరుపుతుంది.
జ: ABC

 

13. టార్గెట్ డీఎన్ఏ నకళ్లు ఎక్కువ సంఖ్యలో కావాలనుకున్నప్పుడు దాన్ని ఇవి కలిగి ఉన్న వాహకంలో క్లోనింగ్ చేయాలి?
      1) ఎక్కువ సంఖ్యలో నకళ్లు జరగడానికి Ori సహాయపడుతుంది.
      2) ఆతిథేయికణంలో టార్గెట్ డీఎన్ఏ ప్రతికృతిని అనుమతిస్తుంది.
      3) సంలగ్నమైన డీఎన్ఏ నకళ్ల సంఖ్యను నియంత్రిస్తుంది.
      4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

14. క్లోనింగ్‌కు కిందివాటిలో ఏది అవసరంలేదు?
      1) Ori                         2) ఎంపిక చేయదగిన మార్కర్          

     3) తక్కువ అణుభారం      4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

 

15. క్లోనింగ్ లో ఏది పరివర్తనం చెందని వాటిని గుర్తించి తొలగించడంలో సహాయపడుతుంది?
జ: ఎంపికచేయదగిన మార్కర్

 

16. కిందివాటిలో క్లోనింగ్ వాహకానికి సంబంధించి సరికాని వాక్యాలు-
      A. ఎక్కువ అణుభారం కలిగి ఉండాలి.
      B. వరణం చేయదగిన మార్కర్లను కలిగి ఉండాలి.
      C. ఎక్కువ గుర్తింపు స్థానాలు కలిగి ఉండాలి.
జ: AC

 

17. మొక్కల్లో క్లోనింగ్ జరపడానికి అనువైన వాహకం ఏది?
జ: ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ T1 ప్లాస్మిడ్

 

18. జంతువుల్లో క్లోనింగ్ జరపడానికి అనువైన వాహకం ఏది?
జ: రెట్రోవైరస్

 

19. డీఎన్ఏ ప్రవేశించడానికి వీలుగా బ్యాక్టీరియమ్ కణాల సామర్థ్యాన్ని పెంచడానికి దేన్ని వాడతారు?
జ: Ca ద్విసంయోజక కేటయాన్

20. డీఎన్ఏను వేరుచేసేటప్పుడు జీవసంబంధ కవచాలను దేనిలో కరిగిస్తారు?
జ: పొడిచేసిన డిటర్జెంట్లు

 

21. శుద్ధ రూపంలో డీఎన్ఏను అవక్షేపం చేయడానికి దేన్ని కలపాలి?
జ: బాగా చల్లార్చిన ఇథనాల్

 

22. రైస్ట్రిక్షన్ ఎంజైమ్‌తో డీఎన్ఏను ఖండించే పద్ధతిని ఏమంటారు?
జ: జీర్ణక్రియ

 

23. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ జీర్ణక్రియ ప్రగతిశీలతను దేంతో తనిఖీ చేస్తారు?
జ: అగరోస్‌జెల్ ఎలక్ట్రోఫోరెసిస్

 

24. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్‌ను దేనికోసం వాడతారు?
జ: డీఎన్ఏ ముక్కలను వేరుచేయడానికి

 

25. అగరోస్ అనేది ఒక -
జ: సముద్ర కలుపు మొక్క నుంచి వచ్చిన సహజ పాలిమర్

 

26. వేరు చేసిన డీఎన్ఏ ముక్కలను దేని తర్వాత చూడగలం?
జ: ఎథిడియం బ్రోమైడ్‌తో అభిరంజనం చేయడం, UV వికిరణానికి గురిచేసాక

 

27. జెల్ ముక్క నుంచి డీఎన్ఏ బద్దీలను వేరుచేయడాన్ని ఏమంటారు?
జ: ఎల్యూషన్

28. వాంఛనీయ జన్యువును పరస్థానికంగా సంశ్లేషణ చేయడానికి ఎన్ని జతల ప్రైమర్లను వాడతారు?
జ: రెండు

 

29. డీఎన్ఏ పునరావృత విస్తరణను దేన్ని ఉపయోగించడం వల్ల సాధించవచ్చు?
జ: థెర్మస్ అక్వాటికస్ టాక్ పాలిమరేజ్

 

30. rDNA ఉన్న కణాలను మొదట మంచుగడ్డలపై ఇంక్యుబేట్ చేసి, ఆ తర్వాత ఉష్ణఘాతానికి గురిచేస్తారు. ఈవిధంగా చేసిన rDNA ను దేనిలోకి చొప్పించడం సాధ్యమవుతుంది?
జ: బ్యాక్టీరియా

 

31. rDNAను జంతుకణాల్లోకి సూక్ష్మ అంతక్షేపణ చేయడానికి కిందివాటిలో అనువైన పద్ధతి ఏది?
       1) ఉష్ణఘాతం               2) సూక్ష్మ అంతక్షేపణ        

      3) బాలిస్టిక్‌గన్ పద్ధతి       4) శక్తి తగ్గిన రోగకారి
జ: సూక్ష్మ అంతక్షేపణ

 

32. rDNA ను చొప్పించే జీన్‌గన్ పద్ధతిని వేటిలో అనుసరిస్తారు?
జ: మొక్కలు

33. rDNA చొప్పించే పద్ధతులను అనువైన జీవితో జతపరచండి.

I II
1) మొక్కకణం a) సూక్ష్మ అంతక్షేపణ
2) జంతుకణం b) ఉష్ణఘాతం
3) బ్యాక్టీరియా c) జీన్‌గన్

జ: 1-c; 2-a; 3-b
 

34. జీన్‌గన్ పద్ధతి (బయోలిస్టిక్) ద్వారా rDNA ను చొప్పించేందుకు కిందివాటిలో దేంతో డీఎన్ఏకు పూత పూస్తారు?
జ: 3 (బంగారం, టంగ్‌స్టన్)

 

35. ఒక ప్రోబ్ అంటే-
జ: వాంఛనీయ డీఎన్ఏలోని ఏదైనా ఒక భాగానికి సంపూరకంగా ఉండే రేడియోధార్మిక ఏకపోచ డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ.

 

36. జన్యుప్రోబ్స్‌ను ఎందులో వాడతారు?
జ: కాలనీ హైబ్రిడైజేషన్

 

37. ఒకవేళ ఒక కొత్త ఆతిథేయిలో ప్రొటీన్ సంకేత జన్యువు బహిర్గతమైతే దాన్ని ఏమంటారు?
జ: పునసంయోజిత ప్రొటీన్

38. ఏ విధానంలో స్టర్రింగ్ ట్యాంక్ రియాక్టర్ నుంచి చిన్న పరిమాణాల్లో వర్ధనాన్ని నియమిత కాలాల్లో తీయవచ్చు?
జ: నమూనా ఆశ్రయం

 

39. పరివర్తన చెందిన ఆతిథేయి కణాల ఎంపికకు దేన్ని ఉపయోగిస్తారు?
       1) ఎంపిక చేయదగిన మార్కర్       2) ఇన్సర్షనల్ ఆక్టివేషన్    

       3) కాలనీ హైబ్రిడైజేషన్                4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

40. డీఎన్ఏ లైగేషన్ జరిగేటప్పడు వాహక క్రమాలు మాత్రమే ఉండే కొన్ని వాహక అణువులు -
జ: మార్పుచెందని వాహకం

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌