• facebook
  • whatsapp
  • telegram

మొక్కల విజ్ఞానం - వృక్షశాస్త్రం

1. జతపరచండి.

I) 19వ శతాబ్దం A) టాక్సానమీ
II) 18వ శతాబ్దం B) కణశాస్త్రం
III) 20వ శతాబ్దం C) కణజాలవర్థనం
IV) 17వ శతాబ్దం D) జన్యుశాస్త్రం

సరైన జోడింపు 
          I   II   III   IV
జ:     D   A   C   B

2. జతపరచండి.

I) చైనీయులు మొక్కలు సాగుచేయడం A) 1300 B.C.
II) అధర్వణ వేదం B) 340 B.C.
III) వ్యవసాయంపై మొదటి గ్రంథం C) 2500 B.C.
IV) డీ హిస్టోరియా ప్లాంటారం D) 2000 B.C.

 సరైన జోడింపు
         I    II   III  IV   
జ:    C   D   A   B

 

3.  కింది శాస్త్రజ్ఞులను ఆరోహణ క్రమంలో అమర్చండి.
  A) ఆంటన్ వాన్ లీవెన్‌హక్     B) గాస్పర్డ్ బాహిన్
  C) రాబర్ట్ హుక్                   D) కెమరారియస్
  E) నెహీమియా గ్రూ, మార్సిలో మాల్ఫీజి
జ:  BCAED

 

4.  ముందు మొక్కలను దేనిలో మొదట వర్ణించారు?  
జ: అధర్వణ వేదం

5. మొక్కల అంతర్నిర్మాణ లక్షణాలను మొదట వర్ణించింది-
జ: థియోఫ్రాస్టస్

 

6. జతపరచండి.

I)  హీరోగ్లైఫిక్స్ A) కెమరారియస్
II)  హెర్బల్స్ B) లిన్నేయస్
III)  లైంగిక ప్రత్యుత్పత్తి  C) ఈజిప్షియన్స్
IV)  లైంగిక వర్గీకరణ విధానం D) పునరుజ్జీవన కాలం

సరైన జోడింపు
      I    II    III   IV
జ:  C   D   A    B

 

7. ఒకే శతాబ్దానికి చెందిన వాటిని జతపరచండి.

I) మొదటిసారిగా ద్వినామ నామీకరణ విధానాన్ని  ప్రవేశపెట్టడం A) దారువు ద్వారా నీటి రవాణా
II) ద్వినామ నామీకరణ   వాడుకలోకి తేవడం B) జైమేజ్ ఎంజైమ్‌ను కనుక్కోవడం
III) వృక్ష కణజాల అంతర్నిర్మాణం C) మైక్రోగ్రాఫియా
IV) అనువంశిక సూత్రాలు  D) మొక్కల్లో లైంగికోత్పత్తి

సరైన జోడింపు
       I    II     III    IV
జ:   C   A    D     B

8. బోటనీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
జ: గ్రీక్

 

9. కింది పదాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.
A) బౌస్కీన్      B) బోటనీ      C) బౌస్    D) బొటేన్
జ: CADB

 

10. పైరు మొక్కలు, ఫల వృక్షాల సమాచారాన్ని చిత్రాల రూపంలో నమోదు చేయడాన్ని ఏమంటారు?
జ: హీరోగ్లైఫిక్స్

 

11. మొక్కల అంతర్నిర్మాణ లక్షణాలను దీనిలో మొదట వివరించారు.
జ: డీ హిస్టోరియా ప్లాంటారం

 

12. జతపరచండి.

I) కలుపు మొక్కలు A) అధర్వణ వేదం
II) అడవులు B) డీ హిస్టోరియా ప్లాంటారం
III) మందు మొక్కలు C) కృషిపరాశరం
IV) 500 మొక్కల బాహ్య, అంతర్నిర్మాణ లక్షణాలు D) వృక్షాయుర్వేదం

       I    II   III  IV
జ:   C   D   A   B

13. మందు మొక్కల గ్రంథాలను ఈ విధంగా అంటారు
జ: హెర్బల్స్

 

14. 17వ శతాబ్దంలో టాక్సానమీ, శరీరధర్మ శాస్త్రాలను అభివృద్ధి పరిచింది
జ: లిన్నేయస్, ప్రీస్ట్లీ

 

15. జతపరచండి.

I) కణాన్ని మొదట కనుక్కున్నది A) నెహీమియా గ్రూ, మాల్ఫీజి
II) వృక్ష సజీవ కణాన్ని మొదట కనుక్కున్నది B) రాబర్ట్ హుక్
III) అంతర్నిర్మాణం అధ్యయనం C) స్టీఫెన్ హేల్స్
IV) మొదట శరీరీధర్మ శాస్త్ర అధ్యయనం చేసినవారు D) ఆంటన్ వాన్ లీవెన్‌హక్

    III   II    I   IV
జ: B   D   A   C 

 

16. జతపరచండి.

I) లిన్నేయస్ A) ఇండియన్
II) గ్రెగర్ జాన్ మెండెల్ B) గ్రీక్
III) వి.ఎస్. రాందాస్ C) స్వీడిష్
IV) అరిస్టాటిల్ D) జెకెస్లోవేకియా
  E) అమెరికన్

సరైన జోడింపు 
      III    II     I    IV
జ:  C    D    A    B

17. ఏ శతాబ్దంలో వృక్షశాస్త్రంలోని వివిధ శాఖల్లో ముఖ్యంగా కణజీవశాస్త్రంలో వేగంగా అభివృద్ధి కనిపించింది?
జ: 20

 

18. సరికాని జతను గుర్తించండి.
1) అనువంశికతలో క్రోమోజోమ్‌ల పాత్ర - సట్టన్, బొవేరి
2) RNA జన్యుస్వభావం - ఫ్రాంకెల్ కోన్‌రాట్
3) DNA అనువంశిక స్వభావం - వాట్సన్, క్రిక్
4) కృత్రిమ జన్యు నిర్మాణం - హెచ్.జె. ఖొరానా
జ: 3 (DNA అనువంశిక స్వభావం - వాట్సన్, క్రిక్)

 

19. కణజాలవర్థనంతో సంబంధం లేని శాస్త్రజ్ఞులను గుర్తించండి.
జ: వెంట్, మహేశ్వరి

 

20. C3, C4తో సంబంధమున్న వారు వరుసగా
జ: కెల్విన్, స్లాక్

 

21. యూరియేజ్‌ను స్ఫటికీకరణ చేసినదెవరు?
జ: సమ్నర్

22. కిందివారిలో కాంతిచర్యతో సంబంధంలేని శాస్త్రజ్ఞుడు(లు) -
1) రూబెన్, కామెన్    2) హిల్    3) ఆర్నాన్     4) ప్రీస్ట్లీ
జ: 4 (ప్రీస్ట్లీ)

 

23. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను ఎవరు కనుక్కున్నారు?
జ: నాల్, రుస్కా

 

24. TCA వలయాన్ని కనుక్కున్నది -
జ: హెచ్.ఎ. క్రెబ్స్

 

25. 19వ శతాబ్దానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్త-
జ: ఎండ్లీకర్

 

26. ఏకకణ ప్రొటీన్‌లుగా ఉపయోగపడే మొక్కల జత
జ: క్లోరెల్లా, స్పైరులీనా

 

27. ఏ మొక్కల నుంచి బయోడీజిల్‌ను ఉత్పత్తి చేస్తారు?
జ: పొంగామియా, జట్రోపా

 

28.  నిశ్చితం (A): జట్రోపా, పొంగామియా పెట్రోమొక్కలు.
       కారణ0 (R): అవి హైడ్రోకార్బన్‌లను అధికంగా కలిగి ఉంటాయి. 
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

29.  కిందివారిలో ఒకరు పేలినాలజీకి చెందినవారు కాదు.
1) మహేశ్వరి                  2) పి.కె.కె. నాయర్
3) సి.జి.కె. రామానుజం    4) వోడ్‌హౌజ్
జ: 1 (మహేశ్వరి)

 

30. వ్యోమగాములు ఉపయోగించే SCP
జ: క్లోరెల్లా

 

31. సూక్ష్మజీవికాని జీవఎరువు.
జ: అజొల్లా

 

32. జతపరచండి.

I) మృత్తిక క్రమక్షయం A) పూతికాహారులు
II) మృత్తిక కాలుష్యం B) జీవ ఎరువులు
III) హరితగృహప్రభావం C) బయోరెమిడియేషన్
IV) పోషక పదార్థాల పునఃచక్రీయం D) విరివిగా మొక్కలు నాటడం
V) మృత్తిక కాలుష్యం, నీటి కాలుష్యం E) ఇసుకను పట్టుకునే మొక్కలు

సరైన జోడింపు
      I    II   III  IV  V
జ:  E  C   D   A   B

33.  కిందివాటిలో ఒకటి మొక్కల వర్గీకరణకు మౌలిక ఆధారం
1) అంతర స్వరూప శాస్త్రం    2) పిండోత్పత్తి శాస్త్రం
3) కణజీవశాస్త్రం               4) స్వరూప శాస్త్రం
జ: 4 (స్వరూప శాస్త్రం)  

 

34. అంతర్నిర్మాణశాస్త్రం దేని శాఖ?
జ:  అంతరస్వరూప శాస్త్రం

 

35. ఫలాలను ఇచ్చే మొక్కల సూక్ష్మసిద్ధబీజాల గురించి తెలియజేసే శాస్త్రం-
జ:  పేలినాలజీ

 

36. వృక్షశాస్త్ర వివిధ శాఖల నుంచి లభించే సమాచారం ఆధారంగా ఏర్పడిన శాఖ
జ: సిస్టమేటిక్ బోటనీ

 

37. జతపరచండి.

I) స్వయంపోషక థాలోఫైట్‌లు A) టెరిడాలజీ
II) పరపోషిత థాలోఫైట్‌లు B) శైవల శాస్త్రం
III) వృక్షరాజ్యపు ఉభయచరాలు C) శిలీంద్ర శాస్త్రం
IV) మొదటి నాళికా సహిత మొక్కలు D) బ్రయాలజీ

      I    II   III  IV
జ:  B   C   D   A

38. గతం, ప్రస్తుత కాలంలోనూ భూమండలంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కల వితరణ గురించి తెలిపే శాస్త్రం
జ: ఫైటోజియాగ్రఫీ

 

39. శిలాజాల గురించి తెలిపే శాస్త్రం
జ: పేలియో బోటనీ

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌