• facebook
  • whatsapp
  • telegram

వృక్షశాస్త్రం



1. కిందివాటిలో ఒకటి జీవులను నిర్వచించే లక్షణం కాదు
1) స్పృహ
2) జీవక్రియ
3) క్షోభ్యత
4) పెరుగుదల
సమాధానం: 4 (పెరుగుదల)

 

2. కలుషితమైన నీటిలో మంజరులను ఏర్పరిచే మొక్కలకు సంబంధించిన కింది లక్షణాల్లో ఒకటి వాటికి చెందింది కాదు.
1) వాటి కణాల్లో వర్ణరహితమైన సెంట్రోప్లాజం చుట్టూ వర్ణయుతమైన క్రోమోప్లాజం ఉంటుంది.
2) అవి కిరణజన్య సంయోగక్రియలో మొదటిసారిగా ఆక్సిజన్‌ను విడుదల చేసే నిజకేంద్రక ఆదిమ జీవులు.
3) వాటిలో హిటరోసిస్ట్‌లనే ప్రత్యేక కణాలు ఉంటాయి.
4) అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో అవి హార్మోగోనియాలను ఏర్పరుస్తాయి.
సమాధానం: 2 (అవి కిరణజన్య సంయోగక్రియలో మొదటిసారిగా ఆక్సిజన్‌ను విడుదల చేసే నిజకేంద్రక ఆదిమ జీవులు.)

3. కిందివాటిలో సరికాని జతను పేర్కొనండి.
1) మొక్కల స్వరూపశాస్త్రం మూల సూత్రాలను మొదటిసారిగా వెల్లడించింది - కాజెస్ ఆఫ్ ప్లాంట్స్
2) ద్వినామ నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది - బాహిన్
3) మొదటిసారిగా మందు మొక్కల వర్ణన, ఉపయోగాలు - వృక్షాయుర్వేదం
4) మొదటిసారిగా బ్యాక్టీరియా అధ్యయనం - లీవెన్‌హక్
సమాధానం: 3 (మొదటిసారిగా మందు మొక్కల వర్ణన, ఉపయోగాలు - వృక్షాయుర్వేదం)

 

4. నిశ్చితం (A): మాస్ మొక్కలకు చాలా పర్యావరణ ప్రాముఖ్యం ఉంది.
     వివరణ (R): మాస్ మొక్కలు అత్యంత వృద్ధి చెందిన బ్రయోఫైట్‌లు.
1) A, R సరైనవి. A కు R సరైన వివరణ.
2) A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.
3) A సరైంది. R తప్పు.
4) A తప్పు. R సరైంది.
సమాధానం: 2 (A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.)

5. నగ్న పుష్పాలు, గాల్ పుష్పాలు, వంధ్య పుష్పాలు వరుసగా కిందివాటిలో ఉంటాయి.
1) యూఫోర్బియా, ఫైకస్, కొలకేసియా
2) యూఫోర్బియేసి, మొరేసి, ఆస్టరేసి
3) మ్యూసా, ఫైకస్, కోకోస్
4) సయాథియం, స్పాడిక్స్, హైపన్‌థోడియం
సమాధానం: 1 (యూఫోర్బియా, ఫైకస్, కొలకేసియా)

 

6. కిందివాటిని జతపరచండి.
పట్టిక - I                                                   పట్టిక - II
I. ఊక                                                        A. అనకార్డియం
II. కేశగుచ్ఛం                                              B. వరి
III. పత్రం లాంటి పుచ్ఛాలు                           C. ట్రైడాక్స్
IV. అనృతఫలం పైన, నిజఫలం కింద             D. అనాస
ఇదే సరైన జోడింపు
     I   II  III  IV                     I   II   III   IV
1) A   B   C    D                  2) C   D    B     A                 
3) B   C   D   A                   4) B   C    A     D
సమాధానం: 3 (B  C  D  A)

7. కిందివాటిని అధ్యయనం చేసి సరైన మొక్కల సమూహంతో జతపరచండి.
పట్టిక - I                                                                                    పట్టిక - II
I. రెండు రకాల సంయోగ బీజాలు చలనాలు చూపుతాయి                A. ఫెర్న్‌లు
II. రెండు రకాల సంయోగ బీజాలు చలనాలు చూపవు                     B. రోడోఫైసి
III. బీజానికి అనేక శైలికలు ఉంటాయి.                                            C. రాక్‌వీడ్
IV. పురుష బీజానికి 2 పార్శ్వ అసమాన కశాభాలు ఉంటాయి.           D. శైవలాలు
ఇదే సరైన జోడింపు
     I   II  III  IV                     I   II   III  IV
1) A   C   B    D                  2) C   B    A     D                
3) C   A   D   B                   4) D   B    A    C
సమాధానం: 4 (D  B  A  C)

 

8. కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
A. అల్యురాన్ పొరలోని కణాల్లో జీనోమ్‌ల సంఖ్య
B. హైబిస్కస్ పరాగకోశంలోని సూక్ష్మసిద్ధ బీజాశయాల సంఖ్య
C. గడ్డి మొక్క విత్తనంలో ఉండే ఉపరిస్తరాల సంఖ్య
D. బఠాణీ స్థూలసిద్ధ బీజంలో జరిగే సమవిభజనల సంఖ్య
E. 3 విత్తనాలను ఏర్పరచడానికి జరిగే క్షయకరణ విభజనలు
1) BACED                2) CBAED                 3) DAEBC                  4) CAEDB
సమాధానం: 2 (CBAED)

9. గణిత శాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య ఉన్న స్వరూప సంబంధ విభేదాలలు, పోలికలను లెక్కకట్టడానికి కిందివాటిలో దేన్ని ఉపయోగిస్తారు?
1) ఒమేగా టాక్సానమీ
2) సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం
3) కణాధార వర్గీకరణ శాస్త్రం
4) రసాయనిక వర్గీకరణ శాస్త్రం
సమాధానం: 2 (సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం)

 

10. ద్విసహపార్శ్వనాళికా పుంజాలున్న కలిగిన కుటుంబంలో ఈ కింది లక్షణాల్లో ఒకటి కనిపించదు. అది ఏంటంటే...
1) పత్రవృంతం కాండంతో ఆశ్లేషితమవడం
2) పరాగకోశం పీఠ సంయోజితం
3) అండకోశాథ్స్థిత పుష్పం
4) సామాన్య కీలాగ్రం
సమాధానం: 4 (సామాన్య కీలాగ్రం)

11. ఈ కిందివాటిని జతపరచండి.
పట్టిక - I                                                                               పట్టిక - II
I. క్షయకరణం చెందిన సహ ఎంజైమ్‌ల నుంచి ATP -                A. కణద్రవ్యం
ఏర్పరచడం
II. G-3-P ను గ్లూకోజ్‌గా మార్చడం                                         B. మైటోకాండ్రియా
III. కొవ్వు సమృద్ధిగా ఉన్న అంకురించే విత్తనాల్లో ఉండేవి          C. హరిత రేణువు
IV. జైలులోజ్‌ను రైబోజ్‌గా మార్చేది                                           D. గ్లయాక్సీసోమ్‌లు
ఇదే సరైన జోడింపు
     I   II   III  IV                         I    II   III  IV
1) C   D    A     B                     2) D    A    B    C               
3) B   A    D    C                      4) A    C    B    D
సమాధానం: 3 (B  A  D  C)

 

12. ఇన్యులిన్ కిందివాటి బహ్వణువు
1) ఫ్రక్టోజ్               
2) గ్లూకోజ్              
3) సెల్యులోజ్              
4) సుక్రోజ్
సమాధానం: 1 (ఫ్రక్టోజ్)

13. క్రోమోజోమ్‌లు చీలిపోవడం, సమజాతీయ క్రోమోజోమ్‌లు విడిపోవడం వరుసగా వీటిలో జరుగుతుంది
సమాధానం: చలనదశ, చలనదశ I

 

14. లేత కాండం, పత్రవృంతానికి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేది
సమాధానం: స్థూలకోణ కణజాలం

 

15. కింది ఏవిధంగా అమరి ఉండే దారువు, పోషక కణజాలాల మధ్య సంశ్లేషక కణజాలం ఉంటుంది?
1) భిన్న వ్యాసార్ధాలలో
2) ఒకే వ్యాసార్ధంలో
3) బాహ్య ప్రథమదారుకం కలిగి ఉండి, భిన్న వ్యాసార్ధంలో
4) ఒకే వ్యాసార్ధంలో, బాహ్య ప్రథమ దారుకం దారువును కలిగి ఉన్నది
సమాధానం: 3 (బాహ్య ప్రథమదారుకం కలిగి ఉండి, భిన్న వ్యాసార్ధంలో)

 

16. పొట్టిగా, దృఢంగా, చేవదేరి మందమైన బెరడుతో కప్పిన కాండాలు వీటి లక్షణం
సమాధానం: ఎడారి మొక్కలు

 

17. గ్లూకోజ్‌ను పాలిశాకరైడ్‌గా మార్చేటప్పుడు
సమాధానం: 10% నష్టం

18. నిశ్చితం (A): బ్రయోఫిల్లంలో బాష్పోత్సేకం, CO2 స్థాపన రాత్రి మాత్రమే జరుగుతాయి.
       వివరణ (R): బ్రయోఫిల్లం C4 మార్గాన్ని చూపుతుంది.
1) A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.
2) A సరైంది. R తప్పు.
3) A తప్పు. R సరైంది.
4) A, R సరైనవి. A కు R సరైన వివరణ.
సమాధానం: 1 (A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.)

 

19. కిందివాటిలో ఏ ఆవశ్యక ఖనిజ పోషకం మొక్కకు చాలా ఎక్కువ మొత్తంలో అవసరం
A) C, H, O                                 B) C, N                      
C) N                                          D) C, H, O, N
1) D                         2) C                          3) B                        4) A
సమాధానం: 2 (C)

Posted Date : 24-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌