• facebook
  • whatsapp
  • telegram

6 - 9 అధ్యాయాలు (సీనియర్ ఇంటర్)

1. నిశ్చితం (A): మొక్కలు జీవించినంతకాలం పెరుగుదలను అనిశ్చితంగా కొనసాగించగలిగే శక్తిని కలిగి ఉంటాయి.
వివరణ (R): వాటి దేహంలోని కొన్ని ప్రదేశాల్లో విభాజ్య కణజాలాలు ఉంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

2. కింది వ్యాఖ్యలను అధ్యయనం చేసి, సరికాని దాన్ని గుర్తించండి.
     1) వైరస్‌ల వర్గీకరణలో ICTV ప్రకారం 3 వర్గీకరణ స్థాయులు మాత్రమే ఉన్నాయి.
     2) HIV అనేది AIDS ను కలిగించే వైరస్ ప్రజాతి.
     3) నామీకరణలో ప్రజాతి పేరు, జాతి పేరు చివర వైరస్ అని ఉంటుంది.
     4) పోలియో వైరస్ బహు భుజాకృతిలో ఉంటుంది.
జ: 2 (HIV అనేది AIDS ను కలిగించే వైరస్ ప్రజాతి.)

 

3. ABA రసాయనికంగా వీటిని పోలి ఉంటుంది.
     A) ఇథిలీన్         B) GA               C) డార్మిన్     D) ఆక్సిన్‌లు 
     E) ఆబ్సిసిన్ II   F) సైటోకైనిన్‌లు     G) నిరోధకం B
జ: CEG

4. కింది హార్మోన్ పరిపక్వం చెందిన ఫలాల్లో శ్వాసక్రియా క్లైమాక్టిక్‌ను ప్రేరేపిస్తుంది.
     1) బోల్టింగ్‌ను ప్రేరేపించే హార్మోన్
     2) మామిడిలో పుష్పోత్పత్తిని ప్రేరేపించే హార్మోన్
     3) టొమాటోలో అనిషేక ఫలనాన్ని ప్రేరేపించే హార్మోన్
     4) అబ్బురపు కాండాలు ఏర్పడటానికి తోడ్పడే హార్మోన్
జ: 2 (మామిడిలో పుష్పోత్పత్తిని ప్రేరేపించే హార్మోన్)

 

5. కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
     A. బ్యాక్టీరియాలో సంయుగ్మం అనేది సంయుగ్మ ప్లాస్మిడ్‌ల సహాయంతో జరుగుతుంది.
     B. జిండర్, లీడర్‌బర్గ్ చేసిన ప్రయోగాల వల్ల DNA జన్యుపదార్థం అని కనుక్కున్నారు.
     C. కొన్ని బ్యాక్టీరియాలను బయోసెన్సార్స్‌గా ఉపయోగిస్తారు.
     D. లూయీపాశ్చర్‌ను బ్యాక్టీరియాలజీ పితగా భావిస్తారు.
జ: A

 

6. ఒకే క్రోమోజోమ్‌లోని జన్యువుల జతల మధ్య పునఃసంయోజన పౌనఃపున్యాన్ని ఉపయోగించి క్రోమోజోమ్‌ల పటాలను నిర్మించింది.
జ: స్టర్టెవాంట్

7. నిశ్చితం (A): జన్యువుల్లో వాటి లక్షణాలను వ్యక్తీకరించడానికి కావాల్సిన విషయ పరిజ్ఞానం ఉంటుంది.
వివరణ (R): జన్యువులు వాటి లక్షణాల వ్యక్తీకరణకు కావాల్సిన అవకాశాన్ని, వాతావరణం దానికి కావాల్సిన కార్యరూపం దాల్చే పరిస్థితిని కలిగిస్తుంది.
జ: A సరైంది. R తప్పు.

 

8. వైరస్‌లో ఉండేది?
జ: RNA లేదా DNA

 

9. నిశ్చితం (A): ఆంకో వైరస్‌లు క్యాన్సర్‌ను కలిగిస్తాయి.
    వివరణ (R): మానవ పాపిల్లోమా వైరస్ మానవుల్లో మాత్రమే క్యాన్సర్‌ను కలిగిస్తుంది.
జ: A సరైంది. R తప్పు.

 

10. క్యాన్సర్ కణాలు ఈ రకమైన ఉత్పరివర్తనాలను చూపుతాయి.
జ: క్రోమోజోమ్‌ల విపథనాలు

11. జతపరచండి.


ఇదే సరైన జోడింపు.
      I   II   III   IV
జ: C  D   B   A

 

12. జతపరచండి.

ఇదే సరైన జోడింపు.
      I    II   III   IV
జ: C   D   A   B

13. కింది పెరుగుదల పరామితులను, పెరిగే భాగాలతో జతపరచండి.

ఇదే సరైన జోడింపు.
      I  II    III   IV
జ: B  D   C   A

 

14. జతపరచండి.

ఇదే సరైన జోడింపు.
      I  II   III   IV
జ: B  D   A   C

Posted Date : 24-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌