• facebook
  • whatsapp
  • telegram

 వైరస్

 వైరస్

మానవుల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు 
 
పోలియో     
» ఈ వ్యాధి 'ఎంటిరోవైరస్' లేదా 'పోలియోవైరస్' వల్ల సంక్రమిస్తుంది.    
పోలియోవైరస్
» ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
» ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.
» పోలియోను 'శిశు పక్షవాతం' అని కూడా అంటారు.     
» జూనాస్ సాల్క్ అనే శాస్త్రవేత్త పోలియో టీకాను కనుక్కున్నాడు.     
» ఇంజక్షన్ ద్వారా తీసుకునే పోలియో టీకాను 'సాల్వాక్' అంటారు.     
» నోటి ద్వారా తీసుకునే చుక్కల మందును 'సాబిన్' అంటారు.     
» పోలియో వల్ల చాలకనాడులు నశించిపోయి కాళ్లూ, చేతులు చచ్చుబడిపోతాయి.     
» 7 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
వ్యాధి లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారం, తీవ్రమైన జ్వరం, అతిసారం, పక్షవాతం.  

  
జలుబు (రొంప)     
» 'రినో వైరస్' అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది.     
» దీనికి గాలి వాహకంగా పనిచేస్తుంది.     
» దీనివల్ల ముక్కు తీవ్రంగా ప్రభావితమవుతుంది.     
» వ్యాధి సోకిన వ్యక్తుల శ్వాసనాళాల నుంచి ఈ వైరస్ విడుదలవుతుంది.     
» ఒకటి లేదా 2 రోజుల్లో ఇది సంక్రమిస్తుంది.     
వ్యాధి లక్షణాలు: ముక్కు కారడం, తలనొప్పి, దగ్గు, కొద్దిగా జ్వరం రావడం.     


మశూచి     
» ఈ వ్యాధినే 'స్మాల్‌పాక్స్ (Smallpox) ' లేదా 'స్పోటకం' అని అంటారు.     
» 'వరియొల వైరస్' వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» మొత్తం శరీరం ఈ వ్యాధికి లోనవుతుంది.     
» ప్రత్యక్ష స్పర్శ, రోగి వాడిన వస్తువులను వాడటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాధికి మొదటిసారిగా టీకా మందును కనిపెట్టాడు.     
» మశూచిని భారత్‌లో పూర్తిగా నిర్మూలించారు.     
వ్యాధి లక్షణాలు:     
» అకస్మాత్తుగా లేదా క్రమంగా జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి.     
» ఈ వ్యాధి సోకిన మూడోరోజు శరీరం మీద ఎర్రని చిన్న గుల్లలు ఏర్పడి బొబ్బలుగా మారతాయి.     
» చివరకు ఒకలాంటి ద్రవంతో పొక్కులుగా మారతాయి. ఈ పొక్కులు శరీరంపై గుంటలతో కూడిన మచ్చల్ని శాశ్వతంగా ఏర్పరుస్తాయి.     


రేబిస్     
» ఈ వ్యాధి వల్ల 'జల భీతి' కలుగుతుంది. అందువల్ల దీన్ని 'జల భీతి' వ్యాధి అని కూడా అంటారు.     
» 'రేబిస్ వైరస్' అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది.    
రేబిస్ వైరస్
» రేబిస్ వైరస్‌నే 'రాబ్డో వైరస్' అని కూడా అంటారు.
» కుక్క కాటు ద్వారా ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» 2 నుంచి 16 వారాల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరింత ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు.     
వ్యాధి లక్షణాలు:     
» తలనొప్పి, జ్వరం, నీటిని చూస్తే భయం, వణుకు, పక్షవాతం, వాంతులు, గొంతు వాపు.     
» ఈ వ్యాధి నివారణకు 'యాంటీ రేబిస్' అనే మందును ఇస్తారు.     
» యాంటీ రేబిస్‌ను లూయీపాశ్చర్ కనుక్కున్నాడు.     
» ఈ వ్యాధి నివారణకు వాడే మరో మందు 'రేబీపోల్'.    

 
డెంగ్యూ     
» ఈ వ్యాధిని ఎల్లో ఫీవర్, బ్రేక్ ఫీవర్, బోన్ ఫీవర్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.    
డెంగ్యూ వైరస్
» డెంగ్యూ వైరస్ (ఆర్బో వైరస్) ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
» పగటి పూట కుట్టే 'ఎడిస్ ఈజిప్టు' అనే దోమకాటు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» ఈ వ్యాధి వల్ల రక్తఫలకికల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది.     
» 4 నుంచి 8 రోజుల్లో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యాధి వస్తుంది.     
» కీళ్లు, చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి.     
వ్యాధి లక్షణాలు:     
» తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, కొన్ని రోజుల పాటు చర్మం మీద చిన్న చిన్న గుల్లలు ఈ వ్యాధి వల్ల ఏర్పడి అలాగే ఉండిపోవడం.     


గవద బిళ్లలు (మంప్స్)     
» 'పారా మిక్సో వైరస్' అనే వైరస్ వల్ల ఇవి సంక్రమిస్తాయి.     
» లాలాజలంలోని, చీమిడిలోని వైరస్ శరీరంలోకి ప్రవేశించి లాలాజల గ్రంథుల మీద దాడిచేస్తుంది.     
» ప్రత్యక్ష స్పర్శ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.     
» 12 నుంచి 21 రోజులు ఈ వ్యాధి సంక్రమించడానికి పడుతుంది.     
» గొంతు, మెడ, దవడలు ప్రభావానికి గురవుతాయి.     
» ఈ వ్యాధికి ఎక్కువగా దవడలు ప్రభావితమవుతాయి.     
» ఈ ప్రభావమనేది 7 నుంచి 10 రోజుల పాటు ఉంటుంది.     
వ్యాధి లక్షణాలు: చెవుల దగ్గర, దవడల దగ్గర లాలాజల గ్రంథులు వాయడం.     


తట్టు (మీజిల్స్ లేదా పొంగు)     
» 'పారా మిక్సోవైరస్' వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.     
» వ్యాధి సంక్రమించడానికి 10 నుంచి 14 రోజుల సమయం పడుతుంది.     
» చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.     
» ఈ వ్యాధి నివారణకు MMR (Measles, Mumps, Rubella) వ్యాక్సిన్ ఇస్తారు.     
వ్యాధి లక్షణాలు:     
» జలుబు, జ్వరం, తలనొప్పి, తుమ్ములు, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం.     
» వ్యాధి సోకిన 4 రోజుల తర్వాతే ఈ ఎర్రని గుల్లలు ఏర్పడతాయి.    

 
చికెన్ ఫాక్స్ (అమ్మవారు) (ఆటలమ్మ)     
» 'వెరిసెల్లా వైరస్' వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.    


వెరిసెల్లా వైరస్
» చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.
» తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
» వ్యాధి సంక్రమణకు 2 నుంచి 5 రోజులు పడుతుంది.     
వ్యాధి లక్షణాలు:     
» జలుబు, జ్వరం, తలనొప్పి, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం.     
» ఏర్పడిన గుల్లలు 5 నుంచి 20 రోజుల లోపల రాలిపోతాయి.     
» వైరస్ సోకిన 36 గంటల్లో గుల్లలు ఏర్పడతాయి.     
మెదడువాపు వ్యాధి (జపనీస్ ఎన్‌సెఫలైటిస్)     
» 'ఎన్‌సెఫాలిటిస్ (ఆర్బో వైరస్) వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» ఆడ క్యూలెక్స్ దోమ పందిని కుట్టి, మనిషిని కుడితే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.     
» 4 నుంచి 21 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» మెదడు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.     
» బెల్లడోనా మందును ఈ వ్యాధి చికిత్సకు వాడతారు.     
వ్యాధి లక్షణాలు:     
» అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, వాంతులు, మత్తుగా ఉండటం, మెడ బిగుసుకుపోవడం, వెన్నునొప్పి. మానసిక అస్థిరత్వం.     
» ఈ వ్యాధి వల్ల అంధత్వం, చెవుడు, పక్షవాతం, మనోవైకల్యం లాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయి.     
చికున్ గున్యా     
» 'ప్లావీ వైరస్ (ఆల్ఫా వైరస్)' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.    
ప్లావీ వైరస్
» ప్లావీ వైరస్‌నే 'చిక్ వైరస్' లేదా 'CK వైరస్' అని కూడా అంటారు.
» ఈ వ్యాధిని మొదటగా టాంజానియా (ఆఫ్రికా)లో గుర్తించారు.
» 'ఎడిస్ ఈజిప్టి' అనే దోమ కాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» ఆఫ్రికాలో 'మాకొండే' అనే భాషలో, కెన్యాలోని 'స్వాహిలీ' అనే భాషలో చికున్ గున్యా అంటే వంగి నడవటం అని అర్థం.     
వ్యాధి లక్షణాలు:     
» జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య వాపులు, కండరాల వాపులు     


హెపటైటిస్     
» 'హెపటైటిస్-బి' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» 'హెప' అంటే కాలేయం అని అర్థం.     
» ఇది కాలేయానికి వచ్చే వ్యాధి.     
» మొదటిసారిగా హైదరాబాద్‌లోని శాంతా బయోటెక్ అనే సంస్థ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనిపెట్టింది.     
» వ్యాక్సిన్ పేరు 'శాన్‌వాక్స్'.     
వ్యాధి లక్షణాలు:     
» జ్వరం, వికారం, పచ్చకామెర్లు, కాలేయంలో వాపు.     
ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ)     
» 'ఆర్థోమిక్సో వైరస్' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» ఈ వ్యాధికి గాలి వాహకంగా పనిచేస్తుంది.     
» కండరాలు, గొంతు, ఊపిరితిత్తులు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి.     
» 1, 2 రోజుల్లోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
వ్యాధి లక్షణాలు:     
» జ్వరం, కండరాల నొప్పి, గొంతు పుండు పడటం, పొడి దగ్గు.     
» ఈ వ్యాధి ప్రభావంతో ఊపిరితిత్తుల మీద బ్యాక్టీరియా దాడి చేస్తుంది. ఇది 'న్యూమోనియా'కు దారితీసే అవకాశముంది.     


హెర్పెస్ సింప్లెక్స్

» 'హెర్పెస్ సింప్లెక్స్' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.     
» లాలాజలం, మలం, కలుషితమైన వస్తువులు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.     
వ్యాధి లక్షణాలు:     
» చర్మంపై, శ్లేష్మపటలంపై అక్కడక్కడా బొబ్బల్లాంటి గుల్లలు.     
ఎయిడ్స్     
» AIDS - Acquired Immuno Deficiency Syndrome     
» AIDSను కలుగచేసే వైరస్ HIV.     
» HIV విస్తరణ రూపం Human Immuno Deficiency Virus.     
» హ్యూమన్ టి సెల్ (ల్యూకేమియా వైరస్/రెట్రో వైరస్) ఈ వ్యాధికి కారకాలు.     
» లైంగిక సంబంధాలు, రక్తం, సిరంజీలు ఈ వ్యాధి సంక్రమించడానికి దోహదం చేస్తాయి.     
» రోగ నిరోధక వ్యవస్థపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.     
» HIV వైరస్‌ను 1983లో 'ల్యూక్ మాంటెగ్నర్' అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు.     
» ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు.     
» ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు: LAV - 2     
» LAV - 2 విస్తరణ రూపం: Lymphadenopathy Associated Virus - 2     
» 1984లో అమెరికాకు చెందిన 'రాబర్ట్ గాలో' అనే శాస్త్రవేత్త ఇదే వైరస్‌ను కనిపెట్టాడు.     
» ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు 'HTLV-III'.     
» 'HTLV - III' విస్తరణ రూపం Human T-Cell Lympotropic Virus-III.     
» ప్రపంచంలోనే మొదటిసారిగా మానవుల్లో ఈ వ్యాధిని 1981లో అమెరికాలో కనుక్కున్నారు.     
» మన దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధిని 1986లో చెన్నైలో కనుక్కున్నారు.     
» 1987లో హైద‌రాబాద్‌లో ఈ వ్యాధి కేసు మొదటిసారిగా నమోదైంది.     
» ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా.     
» భారత్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.     
» ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న జిల్లా గుంటూరు.     
» ఈ వ్యాధి లక్షణాలు వ్యాధిని సోకిన తర్వాత 3-5 సంవత్సరాల మధ్యలో కనిపిస్తాయి.     
» 20-49 సంవత్సరాల వయసువారే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.     
» ఎయిడ్స్ / HIV వ్యాధి ఉన్న స్త్రీ గర్భం దాల్చితే పుట్టే శిశువుకు కూడా HIV సంక్రమిస్తుంది.     
» పుట్టే శిశువుకు ఈ వైరస్ సోకకుండా వైద్యుడి పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.     
» HIV వైరస్ రిట్రో విరిడే అనే కుటుంబానికి చెందింది.     
» HIV ఉన్న RNA 'రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్' అనే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది.     
వ్యాధి లక్షణాలు:     
» పదేపదే జ్వరం రావడం, తరచుగా విరేచనాలు, దగ్గు, న్యూమోనియా, రక్త నాళాలు చిట్లడం, బరువు విపరీతంగా తగ్గిపోవడం, చర్మ వ్యాధులు, రాత్రిపూట తీవ్రమైన చెమటలు పట్టడం, లింఫ్ గ్రంథుల్లో వాపు.     
» ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిందో 'సీడీ - 4' కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు.     
» ఆరోగ్యవంతమైన మానవుడిలో సీడీ - 4 కణాల సంఖ్య ప్రతి మిల్లీమీటరుకు రక్తంలో 500 నుంచి 1500 వరకు ఉంటాయి.     
» HIV వైరస్ తరచూ తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకే మందు తయారుచేయడమనేది కష్టసాధ్యమౌతోంది.

Posted Date : 24-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌