• facebook
  • whatsapp
  • telegram

దృశాశాస్త్ర్రం

1. ఒక పట్టకాన్ని గాలిలో ఉంచినప్పుడు దాని సందిగ్ధ కోణం C. దాని నుంచి బహిర్గామి కాంతి కిరణాన్ని పొందాలంటే పట్టకానికి ఎంత గరిష్ఠ పట్టకకోణం ఉండవచ్చు?
జ. 2C

 

2. ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం మీద కాంతి పడినప్పుడు, పతన, బహిర్గామి కిరణాలు పట్టకం భూమి పరంగా సౌష్టవతతో ఉంటే విచలన కోణం ఎంత?
జ. 30o

 

3. వక్రీభవన గుణకం 1.5 ఉన్న ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం మీద కాంతి కిరణం లంబంగా పతనమై, దాని రెండో వక్రీభవన తలం మీద పడినప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం చెందితే ఆ కాంతి కిరణం విచలన కోణం -
జ. 60o

4. వక్రీభవన గుణకం 1.5 ఉన్న పట్టకం పట్టక కోణం 4o. దాన్ని గాలిలో ఉంచితే కనిష్ఠ విచలన కోణం.
జ. 2o

5. పట్టక కోణం 2o ఉన్న పట్టకం వక్రీభవన గుణకం 1.5. దాన్ని వక్రీభవన గుణకం 4/3 ఉన్న నీటిలో ఉంచితే కనిష్ఠ విచలన కోణం -
జ.   

6. స్వల్ప పట్టక కోణం ఉన్న పట్టకం వక్రీభవన గుణకం 1.5. దాన్ని గాలిలో ఉంచినప్పుడు కనిష్ఠ విచలన కోణం, వక్రీభవన గుణకం 1.3 ఉన్న ద్రవంలో ఉంచినప్పుడు కనిష్ఠ విచలన కోణాల నిష్పత్తి -
జ. 6.5 : 2

 

7. ఒక పట్టకాన్ని కనిష్ఠ విచలన స్థానంలో ఉంచినప్పుడు- 
జ. పతన కోణం, బహిర్గామి కోణాలు సమానం.

 

8.  ఏ రంగు సందిగ్ధ కోణం కనిష్ఠంగా ఉంటుంది?
జ. ఊదా

 

9. ఒక సాంద్రతర యానక వక్రీభవన గుణకం    దాన్ని గాలి నుంచి వేరుచేసే తలం వద్ద సందిగ్ధ కోణం
జ. 45o

10. వక్రీభవన గుణకం 3/2 ఉన్న గాజు నుంచి వక్రీభవన గుణకం 4/3 ఉన్న నీటిని వేరుచేసే తలం వద్ద సందిగ్ధ కోణం
జ. sin-1 

 

11. రెండు యానకాలలో కాంతివేగాలు వరుసగా 1.25 × 108 m/s, 2.25 × 108 m/s. అయితే వాటిని వేరుచేసే తలంవద్ద సందిగ్ధ కోణం
జ. sin-1 

12. ఒక నీటి స్తంభంలో పైకి లేస్తున్న గాలి బుడగమీద తీవ్రమైన విసరిత కాంతి పడేటట్లు చేస్తే, ఆ బుడగ ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి కారణం కాంతి...
జ. సంపూర్ణాంతర కాంతి పరావర్తనం

 

13. గాజు పలకలో ఉన్న పగులును వంకరగా చూస్తే కింది విధంగా కనిపిస్తుంది.
జ. వెండిలా

 

14. సమాంతర తలాలున్న గాజు దిమ్మె మందం t. దాని వక్రీభవన గుణకం µ. దాని ఒక సమాంతర తలం మీద పతనకోణం i తో కాంతి పడి రెండో సమాంతర తలం నుంచి బహిర్గతమవుతుంది. కాంతి గాజు దిమ్మెలో ప్రయాణించిన దూరం...
జ.  

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌