• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భౌతికశాస్త్రం

 1. జె.జె. థామ్సన్ ప్రయోగంలో విద్యుత్, అయస్కాంత క్షేత్రాల ప్రభావంతో ఎలక్ట్రాన్ పుంజం అపవర్తనం చెందకుండా ప్రయాణించింది. ఆనోడ్, కేథోడ్‌ల మధ్య పొటెన్షియల్ భేదాన్ని నాలుగు రెట్లు, కెపాసిటర్ పలకల మధ్య పొటెన్షియల్ భేదాన్ని మూడు రెట్లు చేస్తే, ఎలక్ట్రాన్ పుంజం అపవర్తనం చెందకుండా ప్రయాణించడానికి అయస్కాంత క్షేత్ర తీవ్రతను ఎంత శాతం మార్చాలి?
జ:  50%

 

2. విద్యుత్ క్షేత్రం లేనప్పుడు ఒక ఆవేశపూరిత తైల బిందువు V0 చరమవేగంతో పడుతోంది. E పరిమాణం ఉన్న విద్యుత్ క్షేత్రంలో ఈ బిందువు స్థిరంగా ఉంది. ఈ తైల బిందువు 'q' అదనపు ఆవేశాన్ని పొందినప్పుడు V0 / 2 వేగంతో పైకి ప్రయాణిస్తే, ఆ బిందువుపై ఉన్న తొలి ఆవేశం ఎంత?
జ:  2 q

 

3.మిల్లికాన్ తైలబిందువు ప్రయోగంలో, ఒకే పరిమాణమున్న విద్యుత్ బలం పై, కింది దిశల్లో పనిచేస్తున్నప్పుడు, తైల బిందువు చరమవేగాలు వరసగా V1, V2 (గురుత్వ బలం కంటే విద్యుత్ బలం, ఎక్కువ). విద్యుత్ క్షేత్రం లేనప్పుడు, తైల బిందువు చరమవేగం ఎంత?
జ:  

 

4. తటస్థ హీలియం పరమాణువు నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తొలగించడానికి 24.6 eV శక్తి అవసరమైతే, దాని నుంచి రెండు ఎలక్ట్రాన్లను తొలగించడానికి అవసరమయ్యే శక్తి (eV ల్లో) ఎంత?
జ:  79.0

 

5. కాంతి విద్యుత్ ఫలిత ప్రయోగంలో, లోహతలంపై పతనం చెందిన కాంతి పౌనఃపున్యాన్ని X - అక్షంపై, నిరోధ పొటెన్షియల్‌ను Y - అక్షంపై సూచిస్తూ గీసిన గ్రాఫ్‌లో-
A) X, Y అక్షాలపై అంతర ఖండాలు, వేర్వేరు లోహాలకు, వేర్వేరుగా ఉంటాయి.
B) అన్ని లోహాలకు గ్రాఫ్ వాలు సమానమైన స్థిర విలువ ఉంటుంది.
జ:  ఎ, బి సరైనవి


 

6. కాంతి విద్యుత్ ఫలిత ప్రయోగంలో ఉద్గారి లోహ పలకకు నిట్టనిలువుగా పైన సేకరణి లోహపలక ఉంది. ఉద్గారి పలకకు పైన కాంతి జనకం ఉన్నప్పుడు, సంతృప్త కాంతి విద్యుత్‌ను గమనించారు. ఈ సందర్భంలో పరస్పరం సమాంతరంగా, నిట్టనిలువుగా కింది దిశలో విద్యుత్, అయస్కాంత క్షేత్రాలను ప్రయోగిస్తే-
జ:  అవరోధ పొటెన్షియల్ పెరుగుతుంది.


 

7. పని ప్రమేయం 2.5 eV ఉన్న లోహతలంపై    గా ఉన్న విద్యుదయస్కాంత వికిరణాలు పతనం చెందినప్పుడు వెలువడే కాంతి ఎలక్ట్రాన్ల గరిష్ఠ గతిశక్తి ఎంత?
జ:  1.625 eV

 

8. పని ప్రమేయం 1.5 eV, 10 సెం.మీ. వ్యాసార్ధం ఉన్న లోహగోళంపై ఒక కాంతిజనకం ఉంది. పతన ఫోటాన్ శక్తి 4.2 eV అయితే, కాంతి ఎలక్ట్రాన్ల ఉద్గారం ఆగిపోయే సమయానికి లోహగోళం నుంచి ఎన్ని ఎలక్ట్రాన్లు వెలువడతాయి?
జ:  1.875 × 108

 

9. మోస్లే నియమం    లో లక్ష్య లోహం పరమాణుసంఖ్య Z,  X - కిరణాల పౌనఃపున్యం , a, b లు స్థిరాంకాలు అయితే-
జ:  'a' వర్ణపటశ్రేణి, వర్ణపటరేఖలపై ఆధారపడుతుంది. కానీ, 'b' వర్ణపటశ్రేణిపై మాత్రమే ఆధారపడుతుంది. 


10. మిల్లికాన్ తైల బిందు ప్రయోగంలో 'Q' రుణావేశం ఉన్న తైల బిందువు విద్యుత్ క్షేత్రం లేనప్పుడు 'v' చరమ వేగంతో పడుతోంది. 'E' తీవ్రత ఉన్న విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు, ఆ బిందువు విరామంలో ఉంది. తైల బిందువు అదనంగా 'q' రుణావేశాన్ని పొందినప్పుడు, '3 v ' చరమవేగంతో పైకి చలించడం ప్రారంభిస్తే, Q : q = 
జ:  1 : 3
SOLUTION:
mg = 6πηrv ............. (1)
mg = EQ ................. (2)
mg + 6πηr (3v) = E (Q + q) ............ (3)
EQ + 3EQ = E (Q + q)
⇒ q = 3Q
⇒ Q : q = 1 : 3

11. సెకనుకు 8 × 1015 ఫోటాన్లను విడుదల చేస్తున్న 6.4 mW తీవ్రత ఉన్న ఏకవర్ణ కాంతి, లోహపు తలంపై పతనం చెందినప్పుడు, కాంతి ఎలక్ట్రాన్ల అవరోధి పొటెన్షియల్ 2 v అయితే, పని ప్రమేయం ఎంత?
జ:  3 eV
SOLUTION:
 


12. 3 సెం.మీ. వ్యాసార్ధం ఉన్న ఒక లోహపు గోళాన్ని, శూన్యం చేసిన గదిలో ఒక దారం సహాయంతో వేలాడదీశారు. ఈ గోళంపై 310 nm తరంగదైర్ఘ్యం ఉన్న అతినీలలోహిత కాంతి కొంత సమయం పతనం చెందినప్పుడు, మొత్తం 1011 J శక్తి పతనం చెందినట్లయ్యింది. కాంతి ఎలక్ట్రాన్లను విడుదల చేయడం వల్ల ఈ గోళ కేంద్రం వద్ద పొటెన్షియల్ ఎంత?
జ:  0.75 V

SOLUTION:

13. ఒక లోహపు ఆరంభ తరంగదైర్ఘ్యం λ0. ఈ లోహపు తలంపై  తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి పతనమైనప్పుడు, కాంతి ఎలక్ట్రాన్ల గరిష్ఠ వేగం 106 m/s. పతన కాంతి తరంగ దైర్ఘ్యాన్ని  కు తగ్గిస్తే, కాంతి ఎలక్ట్రాన్ల గరిష్ఠ వేగం (m/s) ఎంత?
జ:  2 × 106

SOLUTION:


 

 

14. 4.25 eV, 4.7 eV శక్తి ఉన్న ఫోటాన్లు A, B అనే రెండు లోహపు తలాలపై పతనం చెందినప్పుడు వెలువడిన కాంతి ఎలక్ట్రాన్ల గరిష్ఠ గతి శక్తులు వరుసగా TA eV, TB = (TA - 1.5)eV. కాంతి ఎలక్ట్రాన్ల డీబ్రోగ్లీ తరంగదైర్ఘ్యాల నిష్పత్తి , 

అయితే
a) లోహం A పని ప్రమేయం 3.75 eV
b) లోహం A పని ప్రమేయం 2.25 eV
c) లోహం B  పని ప్రమేయం 2.73 eV
d) లోహం B  పని ప్రమేయం 4.2 eV
జ:  b, d సరైనవి

SOLUTION:

15. 0.024 A0 తరంగదైర్ఘ్యం ఉన్న X -  కిరణాలు లోహపు తలంపై పతనమై, పరిక్షేపణం చెందినప్పుడు, పరిక్షేపణ ఫోటాన్ తరంగదైర్ఘ్యం పతన ఫోటాన్ తరంగదైర్ఘ్యానికి రెట్టింపైతే, వెనక్కి తిరిగిన ఎలక్ట్రాన్ శక్తి ఎంత?
జ:  2.6 × 105 eV
SOLUTION: When wavelength is doubled, energy becomes half. The remaining energy is transferred to electron.

16. X - కిరణ నాళానికి 10,000 V పొటెన్షియల్ తేడాను ప్రయోగిస్తే, పతన ఎలక్ట్రాన్ డీబ్రోగ్లీ తరంగదైర్ఘ్యానికి, విడుదలయ్యే X - కిరణాల కనిష్ఠ తరంగదైర్ఘ్యానికి నిష్పత్తి ఎంత? (ఎలక్ట్రాన్ e/m = 1.7 × 1011 C/Kg) 
జ:  0.1
SOLUTION:

17. లోహపు తలంపై 2 eV శక్తి ఉన్న ఫోటాన్ పతనమైనప్పుడు వెలువడిన ఎలక్ట్రాన్ల డీబ్రోగ్లీ తరంగదైర్ఘ్యం λ. పతన కాంతి తరంగదైర్ఘ్యాన్ని 60% తగ్గిస్తే, వెలువడిన ఎలక్ట్రాన్ల డీబ్రోగ్లీ తరంగదైర్ఘ్యం λ/2 అయితే, ఉద్గారి పని ప్రమేయం ఎంత?
జ:  1 eV

SOLUTION:

18. 2.25 × 108 m/s వేగంతో చలిస్తున్న కణం డీబ్రోగ్లీ తరంగదైర్ఘ్యం, ఫోటాన్ తరంగదైర్ఘ్యానికి సమానమైతే, కణం యెక్క గతిశక్తికి, ఫోటాన్ యొక్క శక్తికి ఉన్న నిష్పత్తి ఎంత?
జ: 
SOLUTION:

19. మోస్లే నియమం  లో Z లక్ష్యలోహం పరమాణు సంఖ్య, X - కిరణాల పౌనఃపున్యం υ, a, b లు స్థిరాంకాలైతే
జ:  'a' వర్ణపట శ్రేణి, వర్ణపట రేఖలపై ఆధారపడుతుంది. కానీ 'b' వర్ణపట శ్రేణిపై మాత్రమే ఆధారపడుతుంది
SOLUTION:

Where 'n' corresponds to spectral line and 'm' corresponds to spectral series. 'b' is a constant which depends on spectral series. For k series b = 1, l series b = 7.

Posted Date : 02-12-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌