• facebook
  • whatsapp
  • telegram

తరంగ చలనం  

1. కంపన పరిమితి A ఉన్న తిర్యక్ తరంగంలో కణం గరిష్ఠ వేగం తరంగ వేగానికి నాలుగురెట్లు. అప్పుడా తరంగ తరంగదైర్ఘ్యం-
జ:  

 

2. ఒక తరంగం పౌనఃపున్యం 120 .Hz. 9m దూరంలో ఉన్న రెండు బిందువుల మధ్య దశాభేదం 1080º. ఆ తరంగ వేగం.
జ: 360 m/s

 

3. కంపించే ఒక తీగ రేఖీయ సాంద్రత 1.3 × 10-4 kg/m. ఆ తీగలో ప్రయాణించే తిర్యక్ తరంగాన్ని y = 0.021 sin (x + 30t) తో వివరిస్తే, ఆ తీగలోని తన్యత ఎంత? (ఇక్కడ x మీటర్లలో, t సెకన్లలో ఉంది)
జ: 0.12 N

 

4. ఒక సోనామీటరు తీగ స్వేచ్ఛా చివర సాపేక్ష సాంద్రత 4 ఉన్న వస్తువును వేలాడదీస్తే, ఆ తీగ ప్రాథమిక పౌనఃపున్యం 200 Hz. ఆ వస్తువును నీటిలో వేలాడదీస్తే, ఆ తీగ ప్రాథమిక పౌనఃపున్యం-
జ:     

 

5. 1.5 m పొడవున్న స్టీలు తీగ సాంద్రత 7.7 × 103 kg/m3, యంగ్ గుణకం 2.2 × 1011 N/m2. దానిపై తన్యత కలగజేస్తే ఏర్పడే స్థితిస్థాపక వికృతి 1%.  దాని కంపనాల ప్రాథమిక పౌనఃపున్యం-
జ: 178 Hz

 

6. ఒక మూసిన గొట్టంలోని కంపనాలు మొదటి అతిస్వరంలో ఉన్నాయి, అవి తెరిచిన గొట్టంలోని మూడో అనుస్వర కంపనాలతో అనునాదంలో ఉన్నాయి. ఆ గొట్టాల పొడవుల నిష్పత్తి-
జ: 1 : 2 

 

7. సోనామీటరు తీగ కంపనాల పౌనఃపున్యాన్ని 20% పెంచడానికి అవసరమయ్యే తన్యతలో పెరుగుదల-
జ: 44%

 

8. A, B అనే రెండు ధ్వనిజనకాలు 680 Hz పౌనఃపున్యం ఉన్న శబ్దాన్ని కలిగిస్తున్నాయి. ఒక పరిశీలకుడు A నుంచి B కి 'u' స్థిర వేగంతో కదులుతున్నాడు. గాలిలో ధ్వనివేగం 340 ms-1 అయితే అతడు సెకనుకు 10 విస్పందనాలు వినడానికి కావలసిన 'u' విలువ ఎంత?
జ: 2.5 ms-1

 

9. ఒక జనకం ఉత్పత్తి చేసే ధ్వని పౌనఃపున్యం 400 Hz. కానీ, పరిశీలకుడు వినే పౌనఃపున్యం 390 Hz. అయితే-
a) పరిశీలకుడు జనకం వైపు కదులుతున్నాడు.
b) ధ్వనిజనకం పరిశీలకుడివైపు కదులుతోంది.
c) పరిశీలకుడు జనకం నుంచి దూరంగా కదులుతున్నాడు.
d) ధ్వనిజనకం పరిశీలకుడి నుంచి దూరంగా కదులుతోంది.
జ: (c), (d) రెండూ సరైనవి.

 

10. 5 r.p.s.తో భ్రమణం చేసే బల్లకేంద్రం నుంచి 0.7 m దూరంలో ఉన్న ఒక జనకం ఉత్పత్తి చేసే ధ్వని పౌనఃపున్యం 1000 Hz. గాలిలో ధ్వని వేగం 352 ms-1 అయితే బల్ల వెలుపల నిశ్చలస్థితిలోని పరిశీలకుడు వినగలిగే గరిష్ఠ పౌనఃపున్యం-
జ: 1067 Hz

 

11. 40 cm పొడవున్న ఒక సోనామీటరు తీగతో ఒక శ్రుతిదండం 5 విస్పందనాలను కలిగిస్తుంది. ఆ తీగపొడవును 1 cm తగ్గించినప్పటికీ విస్పందనాల సంఖ్య అంతే ఉంది. ఆ శ్రుతిదండ పౌనఃపున్యం-
జ: 395

 

12. ఒక టోనోమీటరులో 16 శ్రుతిదండాలున్నాయి. ప్రతిదండం దాని తర్వాత దానితో సెకనుకు 4 విస్పందనాలు కలిగి ఉంది. కనిష్ఠ పౌనఃపున్యం 60 Hz అయితే, గరిష్ఠ పౌనఃపున్యం ఎంత?
జ: 120Hz

 

13. రెండు సమాంతర కొండల మధ్య నిలబడిన వ్యక్తి ఒక తుపాకీ పేల్చాడు. మొదటి ప్రతిధ్వనిని 1.5 సెకన్లలో, రెండో ప్రతిధ్వనిని 2.5 సెకన్లలో విన్నాడు. ధ్వనివేగం 332 ms-1 అయితే కొండల మధ్య దూరాన్ని కనుక్కోండి. మూడో ప్రతిధ్వనిని ఎప్పుడు వింటాడు?
జ: 664 m, 4S

 

14. ఘనపరిమాణం 100 × 40 × 10 m3 ఉన్న ఒక హాలులో 1000 మంది ప్రేక్షకులు కూర్చోగలుగుతారు. హాలు ఖాళీగా ఉన్నప్పుడు దాని ప్రతినాదకాలం 8.5 సెకన్లు. ఇప్పుడు ఈ హాలు మొదటి అర్ధభాగంలో 500 మంది ప్రేక్షకులు కూర్చుంటే, ప్రతినాదకాలం 6.2 సెకన్లకు మారుతుంది. అయితే ఒక్కొక్క ప్రేక్షకుడి సగటు శోషణ గుణకం ఇంచుమించుగా-
జ: 0.6

 

15. కిందివాటిలో ప్రతినాద కాలాన్ని ప్రభావితం చేయలేనిది ఏది?
1) ఆడిటోరియం ప‌రిమాణం     2) ధ్వని పౌనఃపున్యం
3) గోడ‌ల స్వభావం                4) గోడ‌లు, క‌ప్పు, నేల వైశాల్యం
జ: ఆడిటోరియం పరిమాణం

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌