• facebook
  • whatsapp
  • telegram

వాయుస్ధితి - స్టాయికియోమెట్రి

1. వాయుపీడనాన్ని తగ్గిస్తే-
జ:  అణువుల కదలికకు అవసరమైన ఖాళీ ప్రదేశం పెరుగుతుంది.

 

2. 'N' హైడ్రోజన్ అణువుల గతిజశక్తి -73oC వద్ద 'x' జౌల్స్. 127oC వద్ద ఆక్సిజన్ అణువుల గతిజశక్తి '4x' జౌల్స్ అయితే ఆక్సిజన్ అణువుల సంఖ్య-
జ:  2N

3. Cr(OH)3 + IO3-    CrO4-2 + I- సమీకరణాన్ని తుల్యం చేయడానికి అవసరమైన OHఅయాన్ల సంఖ్య-
జ:  4

 

4. 'x' గ్రా. Ag ను HNO3లో కరిగించి AgNO3 ఏర్పరచి, తరువాత ఆ ద్రావణాన్ని అధిక NaCl తో చర్యపొందిస్తే, 2.87 గ్రా. AgCl అవక్షేపితమైంది. అయితే 'x' విలువ?
జ:  2.16 gm

 

5. 20 మి.లీ. ఈథేన్ ను 100 మి.లీ. O2 లో మండించి గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరిచారు. అయితే స్థిర ఉష్ణోగ్రత, పీడనాల వద్ద మిగిలిన వాయువుల మొత్తం ఘ.ప.?
జ:  70 ml

6. 4 గ్రా. మీథేన్ ను మండించడానికి 21% O2 ఉన్న ఎన్ని లీ. గాలి అవసరం?
జ:  53.33 lit

 

7. 11.2 లీ. 80% HCl ను అధిక AgNO3లోకి పంపితే ఏర్పడే AgCl అవక్షేపభారం ఎంత? ('Ag' ప.భా. = 108)
జ:  57.4 gm

 

8. ఒక గ్రాము 'Mg' ఒక గ్రా. O2తో చర్యపొందితే, మిగిలిన 'O2' భారం-
జ:   1/3 gm 

 

9. 1.6 గ్రా. మలిన 'Ca' ను అధిక ఆమ్లంతో చర్యపొందిస్తే, 672 మి.లీ. H2 వాయువు STP వద్ద వెలువడుతుంది. అయితే 'Ca' లోహపు శుద్ధి శాతం-
జ:  75

 

10. ఒక అలంకరణ గోల్డ్ లో 16 (w/w%) Cu ఉంది. X గ్రా. ఆ మిశ్రమ లోహంలో [Au + Cu] 1023 పరమాణువుల కాపర్ ఉంది. అయితే ఆ మిశ్రమ లోహంలో గోల్డ్ భారం? (కాపర్ ప.భా. = 64)
జ:  56 g

 

11. 80% స్వచ్ఛమైన 'X' గ్రా. అల్యూమినియాన్ని అధిక ఆమ్లంతో చర్యపొందిస్తే 22.4 లీ.  H2 వాయువు వెలువడింది. అయితే 'X' = ?
జ:  21.6 g

12. క్షయకరణిగా పనిచేయలేని సల్ఫర్ ఉన్న సమ్మేళనం-
జ:  H2SO4

 

13. 50 గ్రా. ల 50% సున్నం 50% వరకు విఘటనం చెందింది. అయితే 273oC, 1 ఎట్మా వద్ద వెలువడే CO2 ఘ.ప.?
జ:  2.8 l

14. 0.2 మోల్ Ax B 0.5 మోల్ A2 + 0.4 మోల్స్ B3. ఈ దత్తాంశం నుంచి 'AB' అణుఫార్ములా?
జ:  A5B6

 

15. కింది వాటిలో అధిక సంఖ్యలో అయాన్ లు ఉన్నది-
1) 0.8 L of 2M Na2SO4
2) 0.7 L of  1M Cr2(SO4)3
3) 0.8 L of 0.5 M K2SO4 Al2(SO4)3
4) 0.6 L of 2 M CaCl2
జ:  0.8 L of 2M Na2SO4

 

16. మానవకణంలో D.N.A డైమర్అణుభారం 1.6 × 1012 amu. 1 × 1013 కణాలు మానవదేహంలో సరాసరి ఉన్నట్లయితే, 'D.N.A' మొత్తం ద్రవ్యరాశి గ్రాముల్లో-
జ:  1.6 × 1025

 

17. (A): బెంజిన్, ఎసిటలిన్ ఒకే అనుభావిక ఫార్ములా కలిగి ఉన్నాయి.
(R): బెంజిన్, ఎసిటలిన్‌లో కార్బన్ భారశాతం సమానం
జ:  Both A & R are true, R explains A.

18. 2 లీ. గాలిని 90% కాల్షియం కార్బైడ్ 10% కాల్షియం క్లోరైడ్ (1073 K వద్ద) మీదుగా పునారావృతంగా పంపితే, మిగిలిపోయిన గాలి ఘ.ప.-
జ:  20 ml

 

19. ఒక మోల్ ఆక్సాలిక్ ఆమ్లంతో చర్యపొందే ఆమ్లీకృత KMnO4 , ఆమ్లీకృత K3Cr2O7 మోల్‌ల సంఖ్యల నిష్పత్తి-
జ:  6 : 5

 

20. 0.5 మోల్‌ల BaCl2, 0.3 మోల్‌ల Na3PO4 తో చర్యపొందితే, ఏర్పడే బేరియం ఫాస్ఫేట్ గరిష్ఠమోల్‌ల సంఖ్య-
జ:  0.15

21. స్థిరపీడనం వద్ద ఒక వాయువు ఉష్ణోగ్రత 40ºC నుంచి 50ºC కి పెరిగింది. అయితే 50ºC వద్ద వాయు ఘనపరిమాణం -
జ:   

22. 60ºC వద్ద నీటి బాష్పపీడనం 15 mm. N2 వాయువున్న ఒక 2 లీటర్ల పాత్ర నీటి బాష్పంతో 60ºC వద్ద సంతృప్తం చెందింది. మొత్తం పీడనం 760 టార్, మిశ్రమం మొత్తాన్ని అదే ఉష్ణోగ్రత వద్ద 100 మి.లీ. పాత్రలోకి పంపితే N2, నీటి బాష్పాల పీడనాలు, మొత్తం పీడనాలు వరుసగా-
జ: 1220, 300, 1520

23. ఒక సమ్మేళనం వాయుస్థితిలో మోనోమర్, డైమర్‌గా ఉండగలదు. ఒక ప్రయోగంలో 96 గ్రా. సమ్మేళనాన్ని 33.6 లీ. పాత్రలో తీసుకుని 273ºC వద్ద వేడిచేస్తే, 2 ఎట్మా పీడనం కలిగింది. సమ్మేళనం భారయుతంగా 50%

డైమర్‌గా ఉంటే, మోనోమర్ అణుభారం-
జ: 48

 

24. 780 mm పీడనం వద్ద ఒక వాయువు ఒక రాయి మొత్తం ఘ.ప. 100 cc, పీడనాన్ని 1000 mm కు మారిస్తే, వాయువు, రాయి మొత్తం ఘ.ప. 80 cc. అయితే రాయి ఘ.ప.?
జ: 9.1 cc

 

25. ఒక కార్బన్ నమూనాలో 98% C- 12, 2% C- 14 ఉన్నాయి. అయితే 14గ్రా. నమూనాలో C- 14 పరమాణువుల సంఖ్య?
జ: 1.2 × 1022

 

26. 0.2 మోల్‌ల [CO(NH3)5SO4]Br, 0.2 మోల్‌ల [CO(NH3)5Br] SO4 లను కలిపి నీటిలో కరిగించి 2 లీ. ద్రావణం తయారుచేశారు.
1 లీ. మిశ్రమం + అధిక AgNO3  X (లేత పసుపు)
1 లీ. మిశ్రమం + అధిక BaCl2  Y (తెలుపు)
అయితే 'X', 'Y' మోల్‌ల సంఖ్యలు వరుసగా-
జ: 0.1, 0.1

 

27. ఒక కార్బన్ ఆక్సైడ్‌లో 50% భారయుతంగా ప్రతిమూలకం ఉంది. STP వద్ద ఒక లీ. దాని బాష్పాలు 13 గ్రా. భారంతో ఉంటే, ఆ ఆక్సైడ్ -
జ: C12O9

 

28. కొంత నిర్దిష్ట ద్రవ్యరాశి ఉన్న డోలమైట్ నమూనాను భస్మీకరణం చేస్తే, ఏర్పడిన అవశేషంలో మెగ్నీషియం మోల్ శాతం 33.33% అయితే, డోలమైట్‌లో లైమ్‌స్టోన్ ద్రవ్యరాశి శాతం?
జ: 70.4%

Posted Date : 02-12-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌