• facebook
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ - ఆవర్తన ధర్మాలు

 
     1) 2                2) 544                 3) 5.6              4) 130
సమాధానం: (2)

 

2. కింది వాటిలో సరైన వ్యాఖ్యలేవి?
a) ఒకే మూలకానికి చెందిన ఐసోటోపులు అన్నింటికీ IE1 విలువలు ఒకే విధంగా ఉంటాయి.
b) Al, Mg వారధి మూలకాలు.
c) La, Lu విరళ మృత్తికలు.
d) N, P, O, S ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (E.G.E.) వరుస క్రమం N < P < O < S.
     1) a, c, d      2) a, b, d     3) a, b, c      4) b, c, d
సమాధానం: (3)
వివరణ: La విరళ మృత్తిక కాదు. కాబట్టి (c) తప్పు.

 

3. మెండలీవ్ ఆవర్తన పట్టికలో అసంగత శ్రేణి/ శ్రేణులు
      1) Ar, K      2) Co, Ni      3) Te, I      4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: అన్నీ అసంగత శ్రేణులే.

 

4. [Al Cl (H2O)5]+2 లో ఆక్సీకరణ స్థితి, సంయోజనీయత వరుసగా
      1) +2, 6        2) +3, 6        3) +2, 5       4) +3, 5
సమాధానం: (2)
వివరణ: x - 1 + 5 (0) = +2
          
 x = 2 + 1 = +3 (ఆక్సీరణ స్థితి)
సంయోజనీయత = 6 (Al చుట్టూ 6 లైగాండ్‌లు ఉన్నాయి).

 

5. పౌలింగ్ స్కేలుపై Be రుణవిద్యుదాత్మకత 1.5. ఇదే స్కేలుపై Al కి ఉండదగు రుణ విద్యుదాత్మకత ఎంత?
     1) 1.5      2) 1.8    3) 1.2       4) 2.1
సమాధానం: (1)
వివరణ: బెరీలియం Al తో కర్ణ సంబంధాన్ని కలిగి ఉంది. ఈ రెండు మూలకాల రుణ విద్యుదాత్మకత ఒకే విధంగా ఉంటుంది.

 

6. కింద తెలిపిన లాంథనాయిడ్ మూలకాల జంటల్లో లాంథనాయిడ్ సంకోచాన్ని ప్రదర్శించని జంటను గుర్తించండి.
       1) Eu, Yb       2) Ce, Lu   3) Eu, Pm    4) పైవేవీకావు
సమాధానం: (1)
వివరణ: Eu, Ybలు +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి. వీటికి భిన్న స్ఫటిక నిర్మాణం ఉంటుంది.

 

7. కిందివాటిలో ఒకే ధర్మాలను (దాదాపు) ప్రదర్శించే జతను గుర్తించండి.
       1) Zr, Hf    2) Mo, W    3) Nb, Ta    4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: లాంథనాయిడ్ సంకోచం కారణంగా 4d, 5d మూలకాలకు ఒకే విధమైన పరమాణు వ్యాసార్ధాలు, ధర్మాలు ఉంటాయి.

 

8. ఒకవేళ Z = 117 మూలకాన్ని కనుక్కుని ఉంటే దాని ఎలక్ట్రాన్ విన్యాసం, గ్రూపు సంఖ్యలు వరుసగా ఏమవుతాయి?
      1) [Rn] 5f14 6d10 7s1 7p6, 16      2) [Rn] 5f14 6d10 7s0 7p6 8s1, 7
      3) [Rn]5f14 6d10 7s2 7p5, 17       4) [Rn]5f11 6d10 7s2 7p6 8s2, 10
సమాధానం: (3)

వివరణ: Z = 117 = [Rn] 5f14 6d10 7s2 7p5
         గ్రూపు సంఖ్య = 10 + 2 + 5 = 17.

 

9. కిందివాటిలో బలమైన ఆమ్ల ఆక్సైడ్ ఏది?
      1) SO3      2) Cl2O7       3) P4O10        4) SiO2
సమాధానం: (2)
వివరణ: Cl కు అధిక రుణవిద్యుదాత్మకత ఉంది.

 

10. పరమాణు సంఖ్య 111 ఉండే మూలకం అధికారిక నామం ఏమిటి?
    1) అన్అన్అన్నియం    2) రాంట్‌జీనియం    3) 1, 2      4) మిట్నీరియం
సమాధానం: (2)
వివరణ: అధికారిక నామం రాంట్‌జీనియం.

 

11. C, F, O, N మూలకాల ద్వితీయ అయనీకరణ ఎంథాల్పీ విలువలు వరుసగా
     1) C > N > O > F    2) C < N < O < F    3) O > F > N > C   4) C < N > O < F
సమాధానం: (3)


 

12. భూస్థాయిలో హైడ్రోజన్ పరమాణువు ఎలక్ట్రాన్ శక్తి -2.18 × 10-18 J అయితే హైడ్రోజన్ పరమాణువు అయనీకరణ ఎంథాల్పీ (జౌల్/మోల్‌లలో) ఎంత?
    1) 1.31 × 106   2) 2.16 × 10-18    3) 2.62 × 106    4) 1.08 × 106
సమాధానం: (1)
వివరణ: I.E. = E∞ - E1 = 0 - (-2.18 × 10-18) = 2.18 × 10-18 J/ atom
                = 2.18 × 10-18 × 6.023 × 1028
                 = 1.31 × 106 J/ mole.

 

13. Cl + e-  Cl- చర్యలో ఒక అవగాడ్రో సంఖ్యలోని పరమాణువులకు విడుదలయ్యే శక్తితో
      Cl  Cl+ + e- చర్యలో ఎన్ని Cl పరమాణువులను అయనీకరణం చెందించవచ్చు? 
       (I.E. = 13 e.V., E.G.E. = 3.6 e.V., N = 6 × 1023)
       1) 21.74 × 1023    2) 4.6 × 1021   3) 1.66 × 10-23       4) 1.67 × 1023
సమాధానం: (4)
వివరణ: N × ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ = n × అయనీకరణ ఎంథాల్పీ


             

14. Ce సాధారణ ఆక్సీకరణ స్థితులు ఏవి?

          1) +2, +3    2) +2, +4     3) +3, +4      4) +3, +5
సమాధానం: (3)
వివరణ: Ce = 58 = [Xe] 4f1 5d1 6s2
       
   ఆక్సీకరణ స్థితులు = +3, +4.

15. V, Cr, Mn, ఐరన్‌లలో రెండో అయనీకరణ ఎంథాల్పీ ఎక్కువగా ఉండే మూలకం ఏది?
          1) Mn        2) Cr       3) V        4) Fe
సమాధానం: (2)
వివరణ: Cr = 24 = [Ar]4s1 3d5. సంగం నిండిన విన్యాసం 3d5 రావడానికి రెండో ఎలక్ట్రాన్‌ను తొలగించాల్సి వస్తుంది. కాబట్టి   విలువ Cr కు ఎక్కువగా ఉంటుంది.

 

16. కింది ఏ మూలక ఎలక్ట్రాన్ విన్యాసం అధిక ఆక్సీకరణ స్థితిని పొందగలదు?
      1) (n - 1)d5 ns2   2) (n - 1)d3 ns2    3) (n - 1)d5 ns1  4) (n - 1)d8 ns2
సమాధానం: (1)
వివరణ: (n - 1)d8 ns2 విన్యాసం +4 ఆక్సీకరణ స్థితిని మాత్రమే చూపిస్తుంది. (+10 మాత్రం కాదు)
             (n - 1)d5 ns2 విన్యాసం +7 ఆక్సీకరణ స్థితిని చూపిస్తుంది.

 

17. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
     1) వివిధ లాంథనాయిడ్‌ల రసాయనశాస్త్రం చాలావరకు పోలి ఉంటుంది.
     2) 4f, 5f ఆర్బిటాళ్లు సమానంగా పరిరక్షింపబడి ఉంటాయి.
     3) La, Lu లలో కేవలం d ఆర్బిటాళ్లు మాత్రమే పాక్షికంగా నిండి ఉంటాయి.
     4) d - బ్లాక్ మూలకాలకు ఊహించలేని విధంగా క్రమరాహిత్య రసాయన ధర్మాలు ఉన్నాయి.
సమాధానం: (2)
వివరణ: వేర్వేరు శక్తి స్థాయులకు చెందిన ఆర్బిటాళ్ల పరిరక్షక ప్రభావాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

 

18. కింద తెలిపిన సమజాతి శ్రేణుల్లో అయానిక వ్యాసార్ధాలు పెరిగే క్రమాన్ని గుర్తించండి.
     1) Cl-, Ca+2, K+, S-2        2) S-2, Cl-, Ca+2, K+
     3) Ca+2, K+, Cl-, S-2       4) K+, S-2, Ca+2, Cl-
సమాధానం: (3)
వివరణ: కేంద్రకావేశం తగ్గడం వల్ల అయానిక పరిమాణం పెరిగే క్రమం: Ca+2 <  K+ < Cl- < S-2.

 

19. కిందివాటిలో డాబర్‌నీర్ త్రికం/ త్రికాలు
      1) Li, Na, K     2) Ca, Sr, Ba    3) Cl, Br, I     4) పైవన్నీ
సమాధానం: (4)

వివరణ: 3 త్రికాలూ డాబర్‌నీర్ త్రికాలే.
 

20. Be, Al లకు కింద తెలిపిన ఒక ధర్మంలో తప్ప మిగిలిన వాటిలో సారూప్యత ఉంది. ఈ రెండు మూలకాలు భేదించే ధర్మం ఏది?
1) సమ్మేళనాల్లో అధిక సంయోజకతను ప్రదర్శించడం      2) సంయోజనీయ హైడ్రైడ్‌లను ఏర్పరచడం
3) బృహదణు హైడ్రైడ్‌లను ఏర్పరచడం                         4) వాటి ఆక్సైడ్‌లకు ద్విస్వభావం ఉండటం
సమాధానం: (1)
వివరణ: Be ప్రదర్శించే గరిష్ఠ సంయోజనీయత 4, Al చూపగల గరిష్ఠ సంయోజనీయత 6.

 

21. M అనే మూలకానికి 170, 340, 1870 కిలోకాలరీల వరుస అయొనైజేషన్ ఎంథాల్పీలు ఉంటే, ఆ మూలకం ఏర్పరిచే ఫాస్ఫేట్ ఫార్ములా ఏది?
      1) M2(PO4)3     2) MPO4    3) M3(PO4)2    4) M2PO4
సమాధానం: (3)

 

22. లాంథనాయిడ్ మూలకాలు ------ వ గ్రూపు ------ వ పీరియడ్‌లో ఉంటాయి.
        1) 13వ, 6వ    2) 4వ, 7వ    3) 5వ, 6వ    4) 3వ, 6వ
సమాధానం: (4)
వివరణ: అవి 3వ గ్రూపు, 6వ పీరియడ్‌లో ఉన్నాయి.

 

23. కిందివాటిలో సరైన బాహ్య స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం/ విన్యాసాలను గుర్తించండి.
        1) Ru = 4d7 5s1      2) Mo = 4d5 5s1          3) Rh = 4d8 5s1        4) అన్నీ సరైనవే
సమాధానం: (4)
వివరణ: అన్నీ అసంగత ఎలక్ట్రాన్ విన్యాసాలే. కాబట్టి అన్నీ సరైనవే.

 

24. కిందివాటిలో మిథనైడ్ (లు)
       1) CaC2   2) Be2C    3) Al4C3   4) 2, 3 రెండూ
సమాధానం: (4)
వివరణ: Be2C, Al4C3 లను జల విశ్లేషణ చేస్తే CH4 వస్తుంది.
             Be2C + 4 H2 CH4 + 2 Be(OH)2
             Al4C3 + 12 H2 3 CH4 + 4 Al(OH)3.

 

25. రెండో పీరియడ్ మూలకాల ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీ విలువల సరైన క్రమాన్ని గుర్తించండి.
1) Li < Be < B < C < N < O < F < Ne               
2) Li < Be < B < C < N > O < F < Ne
3) Li < Be > B < C < N > O < F < Ne
4) Li < Be > B < C > N < O < F < Ne
సమాధానం: (3)
వివరణ: Beకు 2s2, Nకు 2p3 స్థిర ఎలక్ట్రాన్ విన్యాసాలు ఉన్నాయి.
             కాబట్టి I.E.1 విలువలు: Li < Be > B < C < N > O < F < Ne.

Posted Date : 15-10-2020

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌