• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ రసాయనశాస్త్రం

1. హరితగృహ ప్రభావాన్ని గరిష్ఠంగా కలిగించే వాయువు ఏది?
    1) CFC      2) O3    3) H2O  4) CO2
సమాధానం: (4)
వివరణ: CO2 - 50%, CFC - 17%, O3 - 8%, H2O - 2%.

 

2. కిందివాటిలో వాటిలో PAN ఏది?


        
సమాధానం: (3)

వివరణ: పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్    
 

3. కిందివాటిలో ఓజోన్ పొర క్షీణతకు మూల కారణం ఏది?
    1) Cl2       2) Cl      3) ClO    4) 2, 3 రెండూ
సమాధానం: (2)
వివరణ: ఒక Cl వెయ్యికి మించిన O3 అణువులను ధ్వంసం చేస్తుంది.

 

4. నీటిలో ఫాస్ఫేట్ ఎరువులు కలవడం వల్ల ఏర్పడే ప్రభావాన్ని ఏమంటారు?
    1) యూట్రోఫికేషన్            2) ఆమ్లవర్షం
    3) హరితగృహ ప్రభావం       4) భూకాలుష్యం
సమాధానం: (1)
వివరణ: సరస్సులో పోషకాల గాఢత పెరగడం వల్ల.

 

5. పంటలపై డీడీటీని చల్లడం వల్ల ఏర్పడే దుష్ఫలితం ఏది?
   1) వాయు కాలుష్యం        2) భూకాలుష్యం              

    3) నీటి కాలుష్యం            4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: DDT జీవక్షయం కానిది కావడం వల్ల 3 రకాల కాలుష్యం ఏర్పడుతుంది.

6. ఆమ్లవర్షం pH విలువ ఎంత?
   1) 7.4      2) 5.6      3) 7   4) 2.9
సమాధానం: (2)
వివరణ: ఆమ్లవర్షం pH = 5.6

 

7. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది?
   1) మిథైల్ ఐసో సైనేట్                 2) మిథైల్ ఐసో సైనైడ్
    3) మిథైల్ ఐసో సయనమైడ్        4) మిథైల్ ఐడో సైనైడ్
సమాధానం: (1)
వివరణ: మిథైల్ ఐసో సయనేట్ ఫార్ములా CH3NCO.

 

8. కిందివాటిలో కాంతి రసాయన పొగమంచుకు కారణమయ్యేది ఏది?
  1) NO     2) హైడ్రోకార్బన్లు       3) 1, 2 రెండూ         4) SO2
సమాధానం: (3)
వివరణ: NO, హైడ్రోకార్బన్లు కలిసి కాంతి రసాయన పొగమంచును ఏర్పరుస్తాయి.

9. కిందివాటిలో దేనివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది?
   1) అగ్నిపర్వతం బద్ధలవడం      2) అడవులు దహనం కావడం
  3) 1, 2 రెండూ                       4) పైవేవీకావు
సమాధానం: (3)
వివరణ: అడవులు దహనం చెందడం, అగ్ని పర్వతాలు బద్ధలవడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది.

 

10. ట్రోపో ఆవరణంలో O3 ఎక్కువగా ఉంటే ఏమవుతుంది?
     1) భూగోళం వేడెక్కుతుంది      2) ఓజోన్ పొర క్షీణిస్తుంది
    3) 1, 2 రెండూ                      4) పైవేవీకావు
సమాధానం: (1)
వివరణ: O3 హరితగృహ వాయువు. ఇది పరారుణ వికిరణాన్ని సంగ్రహించి, భూతాపాన్ని పెంచుతుంది.

 

11. కిందివాటిలో ఏ వాయువుల వల్ల పొగమంచు ఏర్పడుతుంది?
     1) O2, O3      2) S, N ల ఆక్సైడ్‌లు    3) O3, N2        4) O2, N2
సమాధానం: (2)
వివరణ: S, N ల ఆక్సైడ్‌లు పొగమంచును ఏర్పరుస్తాయి.

12. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
    1) N, S ల ఆక్సైడ్‌ల వల్ల ఆమ్ల వర్షం వస్తుంది.
    2) ఓజోన్ పొర క్షీణించడానికి CFC లు కారణం.
    3) హరితగృహ ప్రభావమే భూతాపానికి కారణం.
    4) సూర్యుడి నుంచి వచ్చే పరారుణ కిరణాలను భూమిని చేరనీయకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది.
సమాధానం: (4)
వివరణ: ఓజోన్ పొర సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకర అతినీలలోహిత కిరణాలను భూమిని చేరనీయకుండా కాపాడుతుంది.

 

13. హరిత రసాయనశాస్త్రం అంటే ఏమిటి?
     1) కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కల గురించి అధ్యయనం చెయ్యడం
    2) ప్రమాదకరమైన రసాయనాల వాడకాన్ని, ఉత్పత్తిని తగ్గించడం
    3) రసాయన చర్యల్లో ఆకుపచ్చ రంగును ఉత్పత్తి చెయ్యడం
    4) ఓజోన్ పొర క్షీణతకు సంబంధించింది
సమాధానం: (2)
వివరణ: హరిత రసాయనశాస్త్రం అంటే ప్రమాదకర రసాయనాల వాడకాన్ని, ఉత్పత్తిని తగ్గించడం.

14. మిథనమైన్, ఫాస్‌జీన్ మధ్య చర్య జరిగితే
      1) భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు వస్తుంది.
      2) పొగమంచుకు కారణమయ్యే ద్రవం వస్తుంది.
     3) ఊపిరి ఆడని వాయువు వెలువడుతుంది.
     4) మినిమాటాకు కారణమయ్యే ఘనపదార్థం ఏర్పడుతుంది.
సమాధానం: (1)
వివరణ: CH3NH2 + COCl2 

​​​​​​ CH3NCO + 2 HCl

15. ఏ ప్రాంతంలో మేఘాలు ఏర్పడతాయి?
     1) ట్రోపో ఆవరణం     2) మీసో ఆవరణం
     3) స్ట్రాటో ఆవరణం     4) ఐనో ఆవరణం
సమాధానం: (3)
వివరణ: స్ట్రాటో ఆవరణంలో ఎక్కువ నీటిఆవిరి ఉండటం వల్ల మేఘాలు ఏర్పడతాయి.

 

16. ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లం/ ఆమ్లాలు
    1) HNO3      2) H2SO     3) H2CO3    4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: ఆమ్లవర్షంలో HNO3, H2SO4, H2CO3 ఉంటాయి.

17. ఓజోన్ పొర క్షీణించడం వల్ల జరిగే నష్టం
    1) శరీర వయసు మళ్లడం           2) శుక్లాలు, చర్మ క్యాన్సర్
   3) ఫైటో ప్లాంటులు చనిపోవడం    4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: ఓజోన్ పొర క్షీణించడం వల్ల ఇవన్నీ జరుగుతాయి.

 

18. 500 ppm కు మించిన సల్ఫేట్‌లు దేనికి కారణమవుతాయి?
     1) విరేచన ప్రభావం      2) బ్లూబేబీ సిండ్రోమ్
    3) క్యాన్సర్                  4) కెయిజన్ వంపులు
సమాధానం: (1)
వివరణ: 500 ppm కు మించిన సల్ఫేట్ల వల్ల విరేచన ప్రభావం కలుగుతుంది.

 

19. కొన్ని దేశాల్లో తాగే నీటిలో 1 ppm ఫ్లోరైడ్ గాఢతను ఉంచడానికి కారణం ఏమిటి?
     1) ఫ్లోరోసిస్ రాకుండా చెయ్యడానికి
     2) దంతాలు పసుపు రంగులోకి మారకుండా చెయ్యడానికి
    3) దంతక్షయాన్ని కాపాడటానికి, పిప్పి పళ్లు రాకుండా చెయ్యడానికి
   4) దొడ్డి కాళ్లు రాకుండా చెయ్యడానికి
సమాధానం: (3)

వివరణ: తాగునీటిలో 1 ppm గాఢత ఉండే ఫ్లోరైడ్‌ల మూలంగా దంతక్షయాన్ని నివారించవచ్చు.
 

20. కిందివాటిలో కలుపు మొక్క నివారిణి ఏది?
    1) NaClO3       2) Na3AsO3    3) NaClO4    4) 1, 2 రెండూ
సమాధానం: (4)
వివరణ: NaClO3, Na3AsO3 కలుపు మొక్క నివారిణులు.

 

21. పురపాలక మురుగు BOD విలువ ఎంత?
    1) 100 నుంచి 4,000 ppm వరకు    2) 10 నుంచి 400 ppm వరకు
   3) 1 నుంచి 40 ppm వరకు              4) 10 నుంచి 4,000 ppm వరకు
సమాధానం: (1)
వివరణ: పురపాలక మురుగు BOD విలువ 100 నుంచి 4,000 ppm వరకు ఉంటుంది.

 

22. కింది ఏ సందర్భంలో వేసవిలో క్లోరిన్ సింక్‌లు ఏర్పడతాయి?
     1) NO2 వాయువు క్లోరిన్ మోనాక్సైడ్‌తో చర్య జరిపినప్పుడు
     2) CH4 వాయువు క్లోరిన్ మోనాక్సైడ్‌తో చర్య జరిపినప్పుడు
     3) 1, 2 రెండూ
     4) NO2 వాయువు O3 తో చర్య జరిపినప్పుడు
సమాధానం: (3)

వివరణ: 1, 2 రెండూ క్లోరిన్ సింకులు.
 

23. గాలిలో ఉండే ఆక్సిజన్ పీపీఎం ఎంత?
    1) 10      2) 2,00,000     3) 1,00,000    4) 20
సమాధానం: (2)
వివరణ: గాలిలో 2,00,000 ppm ఆక్సిజన్ ఉంటుంది.

 

24. గదిలో దోమలను పారదోలే రసాయనం ఒక
    1) పొగమంచు     2) సింకు     3) కాలుష్యం    4) మలినం
సమాధానం: (4)
వివరణ: గదిలో దోమలను పారదోలే రసాయనం వాతావరణంలోకి కొత్తగా ప్రవేశించి, వాతావరణాన్ని పాడుచేస్తుంది. కాబట్టి అది 'మలినం'.

 

25. 'ఆమ్లవర్షం' అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు?
      1) వెస్ చావిన్           2) రాబర్ట్ హెచ్. గ్రబ్స్
     3) రాబర్ట్ యాంగస్      4) రిచర్డ్ ఆర్. ష్రాక్
సమాధానం: (3)
వివరణ: ఆమ్లవర్షం అనే పదాన్ని తొలిసారిగా 'రాబర్ట్ యాంగస్' ఉపయోగించాడు.

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌