• facebook
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

1. ముల్లికన్ నూనె చుక్క పరికరంతో దేన్ని కొలుస్తారు?

సమాధానం: (3)
వివరణ: ఎలక్ట్రాన్ మీది ఆవేశం 'e' ను కొలిచేందుకు.

 

2. టెలివిజన్ తెరపై బొమ్మలు కనిపించడానికి కారణం
1) ఆనోడ్ కిరణ నాళిక, ప్రతిదీప్తి                           

2) కాథోడ్ కిరణ నాళిక, ప్రతిదీప్తి
3) ఆనోడ్ కిరణ నాళిక, ఉష్ణరహిత ప్రకాశ గుణం       

4) కాథోడ్ కిరణ నాళిక, ఉష్ణ రహిత ప్రకాశ గుణం
సమాధానం: (2)
వివరణ: కాథోడ్ కిరణనాళిక, ప్రతిదీప్తి.

 

3. Cr పరమాణువు (Z = 24) భూస్థాయిలో ఉంది. l = 1, l = 2 ఎజిముతల్ క్వాంటమ్ సంఖ్యలు ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యలు వరుసగా
1) 16, 5       2) 16, 4        3) 12, 4       4) 12, 5
సమాధానం: (4)

వివరణ: l = 1 = p ఉపస్థాయి       2p లో 6 + 3p లో 6 = 12 ఎలక్ట్రాన్లు. 
            l = 2 = d ఉపస్థాయి      3dలో 5 ఎలక్ట్రాన్లు.

 

4. ఒక ఎలక్ట్రాన్‌కు దాని స్థానంలో అనిశ్చితత్వం 1 స్థాయిలో ఉన్నప్పుడు, దాని వేగంలో అనిశ్చితత్వం ఎంత?
1) 5.8 × 105 m sec-1           2) 5.8 × 105 cm sec-1          3) 5.8 A°         4) 5.8 pm
సమాధానం: (1)
వివరణ:

5. పౌనఃపున్యాలు υ1, υ2; గతిజశక్తుల నిష్పత్తి 1 : k ఉండే కాంతి ఎలక్ట్రాన్లు ఒక ఉపరితలం నుంచి ఉద్గారమైతే, ఆరంభ పౌనఃపున్యం υo ను ఏ విధంగా సూచించవచ్చు?
1) υ2 - υ1/k        2) υ2 - υ1/ k - 1       3) kυ2 - υ1/ k - 1       4) kυ1 - υ2/ k - 1
సమాధానం: (4)
వివరణ:

6. ఒక లోహానికి ఆరంభ పౌనఃపున్యం 0) 7 × 1014 s-1. υ = 1 × 1015 s-1 పౌనఃపున్యం ఉండే ఎలక్ట్రాన్లు ఢీకొన్నప్పుడు, బయటకు వెలువడే ఎలక్ట్రాన్ల గతిజశక్తి ఎంత?
1) 1.99 × 10-19 K.J.       2) 1.99 × 10-19 k.cal       3) 1.99 × 10-19 J     4) 1.99 × 10-19 cal
సమాధానం: (3)
వివరణ : గతిజశక్తి  = K.E. = h(υ - υo) = 6.626 × 10-34 Js (1 × 1015 s-1 - 7 × 1014 s-1)
                                   = 1.99 × 10-19 J.

 

7. d ఆర్బిటాల్‌లో పరిభ్రమించే ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ కోణీయ ద్రవ్యవేగం ఎంత?

సమాధానం: (2)
వివరణ:

8. H పరమాణువు లైమన్ శ్రేణిలో కనిష్ఠ, గరిష్ఠ పౌనఃపున్యాలు వరుసగా
1) 91.2 nm, 121.5 nm        2) 912 nm, 1215 nm
3) 41.2 nm, 102.6 nm       4) 364.3 nm, 564.3 nm
సమాధానం: (1)
వివరణ:

9. ఒక ఆర్బిటాల్‌లో n = 4, l = 2, m = 0 క్వాంటం సంఖ్యలు ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య
1) 10            2) 0           3) 2          4) 1
సమాధానం: (3)
వివరణ: n = 4, l = 2, m = 0 అంటే అది 4dz2 ఆర్బిటాల్. దీనిలో గరిష్ఠంగా 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి.

10. కింది క్వాంటమ్ సంఖ్యలు ఉండే ఎలక్ట్రాన్లను నింపే (శక్తి పెరిగే) వరుస క్రమాన్ని గుర్తించండి.

1) b > c > a > d     2) c > b > a > d     3) d < a < c < b   4) b > c = a > d
సమాధానం: (3)
వివరణ: 3d, 4s, 3p, 3s ల n + l విలువలు వరుసగా 5, 4, 4, 0.
... d < a < c < b .

 

11. 3978 A° తరంగదైర్ఘ్య వికిరణాలను లోహ తలంపై పడేలా చేస్తే, శూన్య వేగం ఉండే ఎలక్ట్రాన్లు ఉద్గారమయ్యాయి. పని ప్రమేయం (W0) ఎంత?
1) 0 J          2) 5 cal           3) 9.4 × 10-19 J          4) 5 × 10-19 J
సమాధానం: (4)
వివరణ:

12. కింది వ్యాఖ్యల్లో సరైనవాటిని గుర్తించండి.
ఎ) ష్రోడింగర్ సమీకరణ సాధన ఫలితాలు E, ψ లను ఇస్తాయి.
బి) ష్రోడింగర్ సమీకరణ సాధన ఫలితాలు అన్ని క్వాంటం సంఖ్యలను ఇస్తాయి.
సి)  
 మొత్తం శక్తి ఆపరేటర్.
డి) ష్రోడింగర్ సమీకరణం త్రిమితీయ ప్రదేశంలో ఎలక్ట్రాన్ చలనాన్ని వర్ణిస్తుంది.
1) ఎ, బి, సి            2) ఎ, సి, డి              3) ఎ, బి, డి       4) పైవన్నీ సరైనవే
సమాధానం: (2)
వివరణ: ష్రోడింగర్ సమీకరణం ప్రధాన, ఎజిముతల్, అయస్కాంత క్వాంటం సంఖ్యలను ఇవ్వగలదు. స్పిన్ క్వాంటం సంఖ్యను ఇవ్వలేదు.

13. 5 × 1014 Hz పౌనఃపున్యం గల 1 మోల్ ఫోటాన్ల వికిరణ శక్తి సుమారుగా ఎంత?
1) 3.3 × 10-19 J        2) 3.3 K.J.       3) 200 K.J. mol-1       4) 200 J mol-1
సమాధానం: (3)
వివరణ: E = N. h.υ = 6.023 × 1023 × 6.626 × 10-34 × 5 × 1014 = 200 KJ mol-1.

14. హైడ్రోజన్ వర్ణపటంలో బోర్ శ్రేణి మొదటి రేఖ తరంగసంఖ్య 15,200 cm-1. అయితే Be+3 లో బోర్ శ్రేణి మొదటి రేఖ తరంగ సంఖ్య ఎంత?
1) 5.4 × 105 cm-1          2) 2.43 × 105 cm-1        

3) 3.43 × 105 cm-1        4) 4.43 × 105 cm-1
సమాధానం: (2)
వివరణ:

15. 3pలో ఉండే కోణీయ, గోళీయ నోడ్‌ల సంఖ్యలు వరుసగా
1) 1, 1         2) 0, 1           3) 2, 1      4) 1, 2
సమాధానం: (1)
వివరణ: కోణీయ నోడ్‌లు (నోడల్ తలాలు) = l = 1 (p ఆర్బిటాల్‌కు)
             గోళీయ నోడ్‌లు (నోడ్‌లు) = n - l - 1 = 3 - 1 - 1 = 1.

16. H పరమాణువు అయనీకరణ ఎంథాల్పీ 13.6 e.V. అయితే ఎలక్ట్రాన్ భూస్థాయి నుంచి తర్వాతి పైస్థాయికి దూకడానికి అవసరమయ్యే శక్తి ఎంత?
1) 3.4 e.V.    2) 10.2 e.V.       3) 12.1 e.V.        4) 1.5 e.V.
సమాధానం: (2)
వివరణ:

17. పరమాణు వ్యాసార్ధం 10-8 సెం.మీ. క్రమంలోను, కేంద్రక వ్యాసార్ధం 10-13 సెం.మీ. క్రమంలోనూ ఉంటే, పరమాణువులో కేంద్రకం ఆక్రమించే భాగం (సెం.మీ.లలో) ఎంత?
1) 10-26       2) 10-16        3) 10-21          4) 10-15
సమాధానం: (4)

వివరణ :

18. 1.656 nm తరంగదైర్ఘ్యం ఉండే వికిరణం ద్రవ్యవేగం ఎంత?
1) 4 × 10-24 kg m sec-1      2) 4 × 10-25 kg m sec-1
3) 4 × 10-24 g cm sec-1      4) 4 × 10-25 g cm sec-1
సమాధానం: (2)

వివరణ:

19. ఒక పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ 600 m/s వేగంతో 0.005% కచ్చితత్వంతో ప్రయాణిస్తుంది. అయితే ఎలక్ట్రాన్ ఉండదగు స్థానంలో కచ్చితత్వం ఎంత?
1) 3.84 × 10-3 m      2) 5.1 × 10-3 m       3) 1.92 × 10-3 m      4) 1.52 × 10-4 m
సమాధానం: (3)
వివరణ:

20. ఉద్గార ప్రక్రియ కక్ష్యా వ్యాసార్ధం 1.9044 nmతో ప్రారంభమై 0.8464 nmతో ముగిస్తే, వర్ణపట ప్రాంతం, శ్రేణి పేర్లు వరుసగా
1) 6 నుంచి 4, బ్రాకెట్ శ్రేణి         2) 5 నుంచి 2, బామర్ శ్రేణి
3) 7 నుంచి 3, పాషన్ శ్రేణి         4) 9 నుంచి 5, ఫండ్ శ్రేణి
సమాధానం: (1)
వివరణ:

21. 13.2 Ao వ్యాసార్ధం ఉండే కక్ష్యకు ఇచ్చే గుర్తు ఏమిటి?
1) K        2) L       3) O          4) M
సమాధానం: (3)
వివరణ:

22. నియాన్ వాయువు 616 nm వద్ద ఉద్గారం జరిగితే, అది 30 సెకన్లలో ప్రయాణించే దూరం ఎంత?
1) 3 × 108 m      2) 9 × 109 m       3) 3 × 108 cm     4) 9 × 109 cm
సమాధానం: (2)
వివరణ:

23. బ్రోమిన్ పరమాణువులో అత్యంత తక్కువ ప్రభావక కేంద్రకావేశ ఎలక్ట్రాన్లు ఉండే ఆర్బిటాల్ ఏది?
1) 1s        2) 2p         3) 3d        4) 4p
సమాధానం: (4)
వివరణ: 4p ఎలక్ట్రాన్లు కేంద్రకానికి చాలా దూరంలో ఉండటం వల్ల వీటికి ప్రభావక కేంద్రకావేశం చాలా తక్కువగా ఉంటుంది.

24. గతిజశక్తి : స్థితిజశక్తి : మొత్తం శక్తి ఏది?
1) +1 : -2 : -1       2) -1 : -2: +1        3) 1 : 2 : 1       4) -1 : +2 : -1
సమాధానం: (1)
వివరణ:

25. నైట్రోజన్‌కు 1s7 ఎలక్ట్రాన్ విన్యాసం రాయడమంటే ఏ నియమాన్ని అతిక్రమించడం అవుతుంది?
1) హుండ్ నియమం      2) ఆఫ్ బౌ నియమం       3) పౌలీ వర్జన సూత్రం     4) పైవన్నీ
సమాధానం: (3)
వివరణ: పౌలీ వర్జన సూత్రాన్ని అతిక్రమించడం.

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌