• facebook
  • whatsapp
  • telegram

జీవప్రపంచం

1. కింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి.
ఎ) మొక్క ఒక టాక్సాన్
బి) నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతాయి
సి) జీవులను నిర్వచించే లక్షణంగా 'పెరుగుదల'ను పరిగణనలోకి తీసుకోలేం
డి) మ్యూల్ ప్రత్యుత్పత్తి చెందదు
సరైన వ్యాఖ్యలను ఎన్నుకోండి.
జ: అన్నీ

 

2. 20వ శతాబ్ద డార్విన్-
జ: ఎర్నెస్ట్ మేయర్.

 

3. పెరుగుదల జంట లక్షణాలు-
జ: ద్రవ్యరాశిలో వృద్ధి, సంఖ్యలో వృద్ధి

4. జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I) శిలీంద్రాలు A) ప్రరోహాలు ఏర్పడటం
II) ఈస్ట్ B) మ్యూల్
III) ప్రోటోనీమా C) ముక్కలుగా విరగడం
IV) ప్రత్యుత్పత్తి ఉండదు D) సిద్ధబీజం
  E) నిర్జీవులు

సరైన జోడింపు
       I   II    III   IV
జ:  D   A   C    E

 

5. ఈ జీవుల్లో పెరుగుదల ప్రత్యుత్పత్తికి పర్యాయం.
1) ఈస్ట్/అమీబా   2) బ్యాక్టీరియా    3) క్లామిడోమోనాస్      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

6. జీవుల ప్రత్యేక లక్షణం-
1) పెరుగుదల   2) ప్రత్యుత్పత్తి    3) జీవక్రియలు    4) అన్నీ
జ:   4 (అన్నీ)

7. జీవులకు చెందిన సాంకేతిక క్లిష్టమైన లక్షణం -
జ: క్షోభ్యత

 

8. జీవులను నిర్వచించదగిన లక్షణం -
జ: జీవక్రియలు

 

9. కిందివాటిలో సరైన వ్యాఖ్యను ఎన్నుకోండి.
1) జీవులను గుర్తించడానికి 'కప్లెట్' అనే విభిన్న లక్షణాల జంటను ఉపయోగిస్తారు
2) జీవ సంబంధ మ్యూజియాలను విద్యా సంస్థల్లో నెలకొల్పుతారు
3) RBG అతిపెద్ద హెర్బేరియం
4) మామిడి క్రమం సాపిండేల్స్
జ: 1 (జీవులను గుర్తించడానికి 'కప్లెట్' అనే విభిన్న లక్షణాల జంటను ఉపయోగిస్తారు)

 

10. సిస్టమాటిక్స్ అనే పదం ఈ భాష నుంచి తీసుకున్నారు
జ: లాటిన్

 

11. జీవశాస్త్ర నామంలోని రెండు పదాలను చేతిరాతతో రాసినప్పుడు వేర్వేరుగా పేరు కింద గీత గీస్తారు. దీని అర్థం-
  1) అవి ముఖ్యమైనవి                             2) మొదటిది ప్రజాతి, రెండోది జాతి
  3) చదువరుల దృష్టిని ఆకర్షించడానికి        4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

12. ICBN విస్తరించండి.
జ: International Code for Botanical Nomenclature

 

13. జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I) ఆరబెట్టిన మొక్క నమూనాలు A) బొటానికల్ గార్డెన్స్
II) భద్రపరిచిన జంతు నమూనాలు B) మ్యూజియం
III) సజీవ మొక్కల నమూనాలు C) ఫ్లోరా
IV) మొక్కల నమూనాల విషయ సూచిక D) హెర్బేరియం

సరైన జోడింపు
      I     II    III    IV
జ:  D   B     A    C

 

14. జతపరచండి.

I) ఆవాసం, విస్తరణ A) RBG
II) ఒక వర్గం సమాచారం B) హెర్బేరియం
III) భవిష్యత్తులో గుర్తించడానికి ఉపయోగపడే గిడ్డంగి C) మోనోగ్రాఫ్
IV) మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రం D) ఫ్లోరా

      I     II    III   IV
జ:  D   C    B    A

15. జతపరచండి.

I) IBG A) ఇంటర్నేషనల్ ఫర్ ప్లాంట్స్ నామెన్‌క్లేచర్
II) RBG B) లక్నో
III) NBRI C) హౌరా
IV) ICBN D) లండన్ (ఇంటర్నేషనల్ ఫర్ ప్లాంట్ ఐడెంటిఫికేషన్)

        I    II     III   IV
జ:   C    B    A    D

 

16. కిందివాటిలో ఏది నమూనాల ప్రతిబింబాలను కలిగి ఉంటుంది?
1) హెర్బేరియం      2) డిజిటల్ హెర్బేరియం     3) మ్యూజియం        4) ఫ్లోరా
జ: 2 (డిజిటల్ హెర్బేరియం)

 

17. మనిషి క్రమం -
జ: ప్రైమేట

 

18. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.
A) నామీకరణ    B) లక్షణాల వర్ణన   C) గుర్తించడం
జ:  BCA

19. అన్ని జీవుల నిర్వచింపదగిన లక్షణాలు-
    A) పెరుగుదల           B) జీవక్రియలు           C) ప్రత్యుత్పత్తి    

   D) క్షోభ్యత         E) స్వయం స్పృహ
జ:  BD మాత్రమే

 

20. మామిడి కుటుంబం-
జ:  అనకార్డియేసి

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌