• facebook
  • whatsapp
  • telegram

ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు

1. భారతదేశంలో ఆవరణ శాస్త్రపిత -
జ: రామ్‌దేవ్ మిశ్రా

 

2. రామ్‌దేవ్ మిశ్రా దేన్ని ప్రారంభించారు?
జ: ఆవరణ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు.

 

3. ఆవరణ శాస్త్రానికి మరో పేరు -
జ: ఆవరణ జీవశాస్త్రం

 

4. ఏ మొక్కల్లో పత్రరంధ్రాలు రాత్రిపూట తెరచుకుని ఉంటాయి?
జ: CAM మొక్కలు

 

5. ప్రతి సంవత్సరం ఆకులు రాల్చే వృక్షాలను వేటిలో చూడవచ్చు?
జ: ఆకురాల్చే అడవులు

6. ఒక ప్రత్యేక వాతావరణంలో కలిసి నివసించే నిర్దిష్ట వృక్ష, జంతు సముదాయాలను ఏమంటారు?
జ: బయోమ్

 

7. ఆవరణవ్యవస్థ అనిపేరు పెట్టింది ఎవరు?
జ: ఏ.జి. టాన్‌స్లే

 

8. కింది ఏ ప్రదేశంలో Flora, Fauna చాలా తక్కువగా ఉంటాయి?
  1) సముద్రతీరం               2) అడవి
 3) ఆకురాల్చే అడవులు     4) వర్షాధార ఉష్ణప్రాంత అడవులు
జ: 2(అడవి)

 

9. ఆవరణశాస్త్రాన్ని ఏ శతాబ్దంలో ప్రారంభించారు?
జ: 19వ

 

10. ఏ శాస్త్రజ్ఞుడితో ఆవరణ సంబంధ అధ్యయనాలు మొదలయ్యాయి?
జ: హెకెల్

 

11. ఎడారులు, అడవులు, టండ్రాలు అనేవి-
జ: బయోమ్‌లు

 

12. ఎడారి ఒక -
జ: బయోమ్

13. ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం-
జ: ఆవరణ వ్యవస్థ

 

14. ఉష్ణోగ్రత తీవ్రత, సమయాల్లోని వైవిధ్యాలకు కారణం?
జ: సూర్యుడి చుట్టూ భూమి భ్రమణం, దాని అక్షం ఒంగడం

 

15. జనాభా అంటే ఏమిటి?
జ: ఒక ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన ఒకేతీరు జీవుల గుంపు

 

16. సముదాయంలో ఇమిడి ఉండేవి, భిన్నమైనవి-
జ: ప్రజాతులు, జాతులు, ఒకే ప్రాంతం

 

17. జీవులకు అనుకూలనాలు దేనికి తోడ్పడతాయి?
జ: జీవిస్తూ ప్రత్యుత్పత్తి చెందడానికి

 

18. అతిపెద్ద ఆవరణ వ్యవస్థ
జ: జీవావరణం

 

19. భూమి నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం?
జ: అతిపెద్ద ఆవరణ వ్యవస్థ

 

20. యూజెన్ వార్మింగ్ ఒక
జ: వృక్షశాస్త్రజ్ఞుడు, ఆవరణ శాస్త్రవేత్త

21. యూజెన్ వార్మింగ్ ఏ దేశస్థుడు?
జ: డానిష్

 

22. జతపరచండి.

I. సాల్వీనియా A. పాక్షికంగా నీటిలో, పాక్షికంగా గాలిలో
II. హైడ్రిల్లా B. నీటిలో మునిగి, లగ్నీకరణం చెందిన
III. వాలిస్‌నేరియా C. లగ్నీకరణం చెందని, మునిగిన
IV. సాజిటేరియా D. స్వేచ్ఛగా తేలియాడే నీటి మొక్క

      I     II   III   IV       
జ:  D   C    B    A

23. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
     1) యుట్రిక్యులేరియా - మునిగిన వేర్లులేని   2) టైఫా - లిమ్నోఫిలా
     3) పిస్టియా - నింఫియా                           4) లెమ్నా- స్థాపన చెందని
జ: 3(పిస్టియా - నింఫియా)

 

24. నిశ్చితం (A): నీటిమొక్కలకు వేర్లు ద్వితీయ ప్రాముఖ్యాన్ని ఇస్తాయి.
      వివరణ (R) : వాటి ఆవాసంలో కావాల్సిన దానికంటే ఎక్కువ నీరు ఉంటుంది.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

25. నిశ్చితం (A): నీటిలో మునిగిన మొక్కల్లో వాయువుల వినిమయం ప్రత్యక్షంగా పలుచని కవచాలతో విసరణ ద్వారా జరుగుతుంది.
      వివరణ (R): వాటిలో పత్రరంధ్రాలు పూర్తిగా ఉండవు.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

26. నిశ్చితం (A): అన్ని నీటిమొక్కల్లో వాయుపూరిత మృదుకణజాలం ఉంటుంది.
      వివరణ (R): యాంత్రిక కణజాలం, దారువు తక్కువగా ఉంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.

 

27. భూమిపై ఎక్కువగా విస్తరించిన మొక్కలు ఏవి?
జ: మధ్యరకం మొక్కలు

 

28. మధ్యరకం మొక్కల్లో అనుకూలనాలు?
జ: అవసరం లేదు, ఏవో కొన్ని ఇతర ప్రత్యేకతలున్న ఆవాసాల్లో అవసరం

 

29. నిశ్చితం (A): అన్ని అల్పకాలికాలు ఏకవార్షికాలు.
      వివరణ (R): అన్ని ఏకవార్షికాలు అల్పకాలికాలు.
జ: A సరైంది. R సరైంది కాదు.

 

30. అల్పకాలికాలు ఏ ప్రాంతాల్లో పెరుగుతాయి?
జ: శుష్క

31. ట్రిబ్యులస్ ఒక
జ: అల్పకాలికం

 

32. మధ్యరకం మొక్కల ఆవాసంలో రంధ్రప్రదేశంలో ఏం ఉంటుంది?
జ: 50% గాలి, 50% నీరు

 

33. నీటి మొక్కల్లో ఏ రకమైన పత్రాలు ఉండవు?
జ: పొలుసాకులు

 

34. నిలుంబియమ్ లాంటి నీటి మొక్కల్లో పలుచటి పొరలాంటి అవభాసిని ఎక్కడ ఉంటుంది?
జ: పత్రం ఊర్థ్వ ఉపరితలంపై

 

35. నీటి మొక్కల విధి-
జ: గాలిని సేకరించి నిల్వచేయడం

 

36. నిశ్చితం (A): ఆవరణ సంబంధ అనుక్రమం జరిగే కొద్ది జీవద్రవ్యరాశి పెరుగుతుంది.
      వివరణ (R): జీవుల సంఖ్య, జాతుల సంఖ్య పెరుగుతుంది.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

37. కింది ఏ మొక్కల్లో జలాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి కాండం, పత్రం రూపాంతరం చెందుతాయి?
      1) అల్పకాలికాలు                  2) రసభరితాలు

      3) రసభరితం కాని మొక్కలు   4) అల్పకాలికాలు, రసభరితాలు
జ: 2 (రసభరితాలు)

 

38. కాజురైనా అనేది-
జ: రసభరితం కానిది

 

39. కీటకాహార నీటి మొక్క-
జ: యుట్రిక్యులేరియా

 

40. కిందివాటిలో సరైన వ్యాఖ్యను ఎన్నుకోండి.
       1) అన్ని బయోమ్‌లు ఒకే విధంగా ఉంటాయి.
       2) నీటి మొక్కలన్నింటిలో పత్ర ఊర్థ్వ ఉపరితలంపై అవభాసిని ఉంటుంది.
       3) నీటి మొక్కల అన్ని భాగాల్లో వాయుపూరిత మృదుకణజాలం ఉంటుంది.
       4) నీటి మొక్కలన్నింటిలో దారువు కుహరం ఉంటుంది.
జ: 3 (నీటి మొక్కల అన్ని భాగాల్లో వాయుపూరిత మృదుకణజాలం ఉంటుంది.)

41. ఆవరణ శాస్త్రం (Ecology) అని పేరు పెట్టింది ఎవరు?
జ: రీటర్

 

42. ఆవరణ శాస్త్రాన్ని మొదట నిర్వచించింది ఎవరు?
జ: హెకెల్

43. కిందివాటిలో మనిషి ఏ విభాగం కిందకి వస్తాడు -
      1) జనాభా      2) సముదాయం     3) అనుక్రమం     4) జనాభా, సముదాయం
జ: 4(జనాభా, సముదాయం)

 

44. దారువు కుహరం దేనిలో ఉంటుంది?
జ: హైడ్రిల్లా

 

45. జనాభాలో ఉండేది-
జ: స్వయంపోషకాలు, పరపోషితాలు

 

46. జతపరచండి.

I. కాండ రసభరితం A) ఆస్పరాగస్
II. పత్ర రసభరితం B) కాజురైనా
III. వేరు రసభరితం C) ఒపన్షియా
IV. రసభరితం కానిది D) ఎలో

       I    II   III   IV
జ:  C    D    A     B

 

47. టైఫా అనేది-
జ: ఉభయచర మొక్క

48. కిందివాటిలో నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు ఏవి?
      1) లెమ్నా     2) సాల్వీనియా    3) హైడ్రిల్లా    4) పిస్టియా
జ: 2 (సాల్వీనియా)

 

49. నీడలో పెరిగే మొక్కలు ఏవి?
జ: సియోఫైట్లు

 

50. రైజోఫోరా అనేది-
జ: హలోఫైట్

 

51. ప్రత్యక్షంగా ఎండలో పెరిగే మొక్కలు ఏవి?
జ: హీలియోఫైట్లు

 

52. దక్షిణ భారతదేశంలో లేని బయోమ్ ఏది?
జ: ఎడారులు

 

53. చేవదీరిన, పొట్టికాండాలను వేటిలో చూడవచ్చు?
జ: ఎడారి మొక్కలు

54. జతపరచండి.

I. వాయుపూరిత మృదుకణజాలం A) హాలోఫైట్లు
II. వివిపారి B) సమోద్బీజాలు
III. దిగబడిన పత్రరంధ్రాలు C) నీటి మొక్కలు
IV. ఆవాసంలో సమతుల్యమైన నీరు, వాయువుల పరిస్థితి D) ఎడారి మొక్కలు

      I     II    III     IV
జ: C     A     D       B

 

55. భారతదేశ జాతీయ పుష్పం -
జ: నిలుంబియం

 

56. వృక్ష శరీరధర్మ శాస్త్ర ప్రయోగాల్లో విరివిగా వాడే నీటి మొక్క ఏది?
జ: హైడ్రిల్లా

 

57. బహుళ బాహ్యచర్మాన్ని దేనిలో చూడవచ్చు?
జ: నీరియం

 

58. అనుక్రమం అని పేరు పెట్టినదెవరు?
జ: హల్ట్

59. అనుక్రమానికి మరో పేరేంటి?
జ: ఆవరణ వ్యవస్థ అభివృద్ధి

 

60. బాహ్యచర్మ కణాల్లో సిలికా స్ఫటికాలు ఉండటం ఏ మొక్కల లక్షణం?
జ: ఎడారి మొక్కలు

 

61. ఉష్ణప్రాంత, సమశీతోష్ణప్రాంత అడవుల్లో పెరిగే మొక్కలు?
జ: మధ్యరకం మొక్కలు

 

62. ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు 3 మొక్కలను ఇచ్చాడు. అవి ఊర్థ్వ బాహ్యచర్మంపై రెండు వైపులా, నిమ్న ఉపరితలంపై పత్రరంధ్రాలతో ఉన్నాయి. పత్రరంధ్రాలను అనుసరించి ఆ మొక్కలు వరుసగా
జ: నీటి మొక్కలు, మధ్యరకం మొక్కలు, ఎడారి మొక్కలు

 

63. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
        1) సముదాయాలు స్థిరంగా ఉంటాయి.
        2) ఏ అనుక్రమంలోనైనా చరమదశ ఒకే రకం.
        3) ఏ అనుక్రమంలోనైనా ప్రారంభపు మొక్కలు స్థిరంగా ఉండవు.
        4) అనుక్రమంలో క్రమకీయదశ అనేది ఒక దశ.
జ: 1 (సముదాయాలు స్థిరంగా ఉంటాయి.)

64. ద్వితీయ అనుక్రమం ప్రాథమిక అనుక్రమం కంటె వేగంగా జరుగుతుంది. ఎందుకంటే...
జ: అంతకుముందే కొంత మృత్తిక ఉంటుంది.

 

65. జలానుక్రమం, జలాభావాను క్రమంలో అంతిమ లక్ష్యం దీన్ని చేరడమే-
జ: మధ్యరకం పరిస్థితులు

 

66. ఏ అనుక్రమంలోనైనా సముదాయం బయటి వాతావరణ పరిస్థితులకు సమతౌల్యం చూపితే దాన్ని ఏమంటారు?
జ: చరమదశ సముదాయం

 

67. ఏ అనుక్రమంలోనైనా మధ్యమిక సముదాయాన్ని ఈవిధంగా అంటారు.
జ: క్రమకీయ దశ

 

68. ముందుగా ఎలాంటి జీవజాతులు లేనిచోట అనుక్రమం మొదలైతే అది-
జ: ప్రాథమిక అనుక్రమం

 

69. వరదలు, నిప్పు వల్ల జీవరాశులు పూర్తిగా నాశనమైనచోట అనుక్రమం మొదలైతే అది-
జ: ద్వితీయ అనుక్రమం

 

70. జలాభావాను క్రమంలో ప్రారంభపు మొక్కలు
జ: లైకెన్‌లు

71. కిందివాటిలోని సరికాని వ్యాఖ్య గుర్తించండి.
      1) ప్రాథమిక అనుక్రమం నెమ్మదిగా జరుగుతుంది.
      2) రాతి ఉపరితలంపై సారవంతమైన మృత్తిక ఏర్పడటానికి కనీసం వందేళ్లు పడుతుంది.
      3) అనుక్రమం జరిగినకొద్ది జంతువుల రకాలు; వాటి సంఖ్య, విచ్ఛిన్నకారులు కూడా మారతాయి.
      4) లైకెన్‌లు ఆమ్లాలను ఉత్పత్తిచేసి రాళ్లను కరిగిస్తాయి.
జ: 2 (రాతి ఉపరితలంపై సారవంతమైన మృత్తిక ఏర్పడటానికి కనీసం వందేళ్లు పడుతుంది.)

 

72. కిందివాటిలో ఒకటి స్థిరంగా ఉంటుంది.
      1) ప్రారంభపు మొక్కలు     2) వృక్ష ప్లవకాలు
      3) చరమదశ అడవులు     4) స్క్రబ్ దశ
జ: 3 (చరమదశ అడవులు)

 

73. నిశ్చితం (A): ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సముదాయాలన్నీ అనుక్రమం ద్వారా ఏర్పడినవే.
      వివరణ (R): అనుక్రమం, పరిణామం సమాంతరంగా జరిగిన ప్రక్రియలై ఉండవచ్చు.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

74. జలాభావాను క్రమంలో లైకెన్ల స్థానంలో వాటి తర్వాత ఈ మొక్కలను చూడవచ్చు.
జ: బ్రయోఫైట్‌లు

75. Arrange the different stages of Hydradch succession ina rsepuence
        A) మార్ష్-మిడోదశ                                   B) వృక్ష ప్లవకాలు       
        C) నీటిలో మునిగి స్వేచ్చగా తేలేదశ          D) అడవులు
        E) నీటిటో మునిగిన మొక్కల దశ             F) రీడ్ - స్వాంప్ దశ  
        G) స్క్రబ్ దశ
జ: BFEACGD

 

76. ఆవరణ సంబంధ సేవలకు మొదటిసారిగా విలువ కట్టింది ఎవరు?
జ: రాబర్ట్ కాన్‌స్టాంజా

 

77. జలానుక్రమం జరిగినకొద్ది-
     1) నీటి తోతు క్రమంగా తగ్గుతుంది.                              
     2) మృత్తిక మందం క్రమంగా పెరుగుతుంది
     3) వాతావరణంతోపాటు సముదాయాలు మారతాయి    
     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

78. మిలీనియం ఆవరణ వ్యసస్థ అసెస్‌మెంట్ ప్రకారం ఆవరణ వ్యవస్థ సంబంధ సేవల రకాలు-
జ: 4

79. జతపరచండి.

I. నియంత్రణాత్మక సేవలు A) నీటి పరిశుద్ధత
II. ఆధారపూర్వక సేవలు B) నీరు
III. సంస్కృతి సంబంధ సేవలు C) పరాగ సంపర్కం
IV. సరకుల రూప సేవలు D) విద్య

       I     II    III   IV
జ:  A    C     D     B

 

80. ఒక డాక్టర్ విద్యార్థికి శుద్ధి చేసిన నీరు తాగి, మంచిగా చదువుకుని నాణ్యత ఉండే దారాలతో తయారు చేసిన కొత్త దుస్తులు వేసుకోమన్నాడు. ఇవన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మొక్కల నుంచి వస్తాయి. ఈవిధంగా ఆ విద్యార్థి పొందే ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవలు వరుసగా
జ: నియంత్రణాత్మక సేవలు, సంస్కృతి సంబంధ సేవలు, సరకుల రూప సేవలు

 

81. ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవల విలువ
జ: 33 ట్రిలియన్ US డాలర్లు/సంవత్సరం

 

82. ప్రధానమైన పరాగ సంపర్క సహకారకం
జ: తేనెటీగ

83. పరాగ సంపర్క సహకారుల సంఖ్య తగ్గడానికి కారణం ఏమిటి?
        1) ఆవాసాలు నాశనమవడం
        2) కీటక నాశక పదార్థాలు వాడటం
        3) అటవీ భూములను గృహోపయోగాల కోసం ఉపయోగించడం        4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

84. ఒక మొక్క 264 గ్రాముల CO2, 108 గ్రాముల నీరు, 677.2 K.Cal. సౌరశక్తిని వినియోగించుకుని ఉత్పత్తి చేసేది
జ: 193 గ్రాముల O2, 162 గ్రాముల పాలిశాకరైడ్

 

85. ఒక గ్రాము పొడి సేంద్రియ పదార్థం ఉత్పత్తి చేయడానికి మొక్కకు కావలసిన CO2
జ: 1.63 గ్రా.

 

86. ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవల ప్రాముఖ్యం
జ: వాతావరణం, సహజ ఆవరణ వ్యవస్థలను కలిపి స్థిరత్వం

 

87. గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడానికి ఏం చేయాలి?
జ: అడవులను పెంచాలి

88. ఒక పత్రయుత ప్రౌఢమొక్క ఒక రుతువులో విడుదల చేసే ఆక్సిజన్ ఎంతమందికి ఒక సంవత్సరం పీల్చడానికి సరిపోతుంది.
జ: 10 మందికి

 

89. ఒక ప్రౌఢమొక్క ఒక సంవత్సరంలో ఎంత CO2 గ్రహిస్తుంది?
జ: 48 lb

 

90. నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ను పెంచేది-
జ: నీటిలో మునిగిన స్థూల మొక్కలు

 

91. ప్రపంచం యొక్క శ్వాసకోశాలు
జ: భూమిపై మొక్కలు, వృక్షప్లవకాలు

 

92. నీటిలో ఆక్సిజన్‌ను ప్రత్యక్షంగా విడుదల చేసే సూక్ష్మజీవులు
జ: సయనో బ్యాక్టీరియా

 

93. నిశ్చితం (A): మృత్తికను ఏర్పరచడం ద్వారా బ్యాక్టీరియా, లైకెన్‌లు ఆధారిత సేవల్లో పాత్ర వహిస్తాయి.
       వివరణ (R): అడవులను పెంచడం (అటవీ వర్థకం) ద్వారా ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించవచ్చు.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.

94. సుందర్‌బన్ అడవుల్లోని మాంగ్రూవ్‌లను వరదల నుంచి రక్షించడం కింద ఉదహరించిన ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలకు ఉదాహరణ
      1) ఆధారిత   2) నియంత్రణ  3) సరుకుల రూప   4) సంస్కృతి
జ: 2 (నియంత్రణ)

 

95. కిందివాటిలో వేటిని సంస్కృతి సంబంధ సేవల్లో చేర్చవచ్చు?
       1) తోటలను వృద్ధిపరిచి సహజ సౌందర్యాన్ని పెంచడం
       2) మొక్కల జీవవైవిధ్యాన్ని కాపాడటం
       3) తోటలను వృద్ధిపరిచి సహజ సౌందర్యాన్ని పెంచడం, మొక్కల జీవవైవిధ్యాన్ని కాపాడటం
       4) సముద్రతీరాన థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పరచడం
జ: 3 (తోటలను వృద్ధిపరిచి సహజ సౌందర్యాన్ని పెంచడం, మొక్కల జీవవైవిధ్యాన్ని కాపాడటం)

 

96. విత్తనాల వ్యాప్తికి తోడ్పడేవి ఏవి?
జ: పక్షులు

 

97. అడవుల్లో నేలమీద పడిన కాండాలను విచ్ఛినం చేయడానికి, పోషకపదార్థాల రిసైక్లింగ్‌లో ఏ పూతికాహారులు తోడ్పడతాయి?
జ: బ్యాక్టీరియా, లైకెన్‌లు

98. నీరియం పత్రం అడ్డుకోతను గుర్తించడానికి కింది ఏ లక్షణాలు ఉపయోగపడతాయి?
       A) బహుళ బాహ్యచర్మం        B) దిగబడిన పత్రరంధ్రాలు
       C) విషమ జాత పత్రాంతరం    D) పత్ర రంధ్ర కేశాలు
జ: A, B, D

Posted Date : 02-12-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌