• facebook
  • whatsapp
  • telegram

కణ చక్రం - కణ విభజన

1. మైటాసిస్ (సమ విభజన) అని పేరు పెట్టింది ఎవరు?
జ: ఫ్లెమింగ్

 

2. 'కణ విభజన' అనే భావనను ఎవరు ప్రతిపాదించారు?
జ: రుడాల్ఫ్‌విర్షా

 

3. కండె పరికరం ఏర్పడని కణవిభజనను ఏమంటారు?
జ: ఎమైటాసిస్

 

4. సమవిభజన వేటిలో జరగదు?
జ: కేంద్రక పూర్వజీవులు

 

5. సమవిభజన మొక్కల్లో ఎక్కడ జరుగుతుంది?
జ: మూలాగ్రం, కాండాగ్రం

6. సమవిభజన కింది ఏ కణాల్లో జరుగుతుంది?
   1) శాఖీయకణాలు                2) ఏకస్థితిక కణాలు                

    3) ద్వయస్థితిక కణాలు        4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

7. సమవిభజనకు ఉన్న మరో పేరేమిటి?
    1) శాఖీయ కణవిభజన          2) ఈక్వేషనల్ కణవిభజన        

   3) సోమాటిక్ కణవిభజన         4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

8. ఆవృతబీజాల సూక్ష్మసిద్ధబీజం ఎన్ని సమవిభజనలు జరిగితే పురుష సంయోగ బీజదం ఏర్పడుతుంది?
జ: 2

 

9. స్థూలసిద్ధబీజం నుంచి స్త్రీ సంయోగబీజదం ఏర్పడటానికి జరిగే సమవిభజనల సంఖ్య
జ: 7

 

10. ఎక్స్‌ప్లాంట్ నుంచి కాలస్ ఏర్పడటానికి కింది వాటిలో ఏ చర్య జరుగుతుంది?
      1) మైటాసిస్                  2) మియాసిస్                  

      3) ఎమైటాసిస్                4) రిడక్షనల్ కణవిభజన
జ: 1 (మైటాసిస్)

 

11. మైటాసిస్‌ను అధ్యయనం చేయడానికి సరైన భాగం -
జ: వేరుకొన

12. మానవుల్లో కణచక్రానికి పట్టేకాలం ఎంత?
జ: 24 గంటలు

 

13. ఈస్ట్ కణ చక్రానికి పట్టేకాలం ఎంత?
జ: 90 నిమిషాలు

 

14. జతపరచండి.

I. మైటాసిస్ A) స్థూలసిద్ధబీజ మాతృకణాలు
II. ఎమైటాసిస్ B) సూక్ష్మసిద్ధబీజ మాతృకణాలు
III. మియాసిస్ C) క్యాన్సర్ కణాలు
IV. క్షయకరణ విభజన D) విభాజ్య కణాలు

      I      II     III     IV
జ:  D    C      A      B

 

15. అంతర్దశకు మరోపేరు-
     1) విరామ దశ                           2) తయారయ్యే దశ            

     3) దృశ్యమాన కణవిభజన దశ       4) అన్నీ
జ: 4 (అన్నీ)

16. కణవిభజనలో క్రోమోజోముల చలనాలను దర్శించడానికి తోడ్పడే మైక్రోస్కోప్ -
జ: దశాంతర మైక్రోస్కోప్

 

17. కండె పరికరం ఆకారం-
జ: తర్కురూపం

 

18. జతపరచండి.

I. G1 A) జీవక్రియాపరంగా అచేతనం
II. G2 B) 2C DNA 4C DNA గా మారుతుంది
III. G0 C) కణం పెరుగుతుంది, జీవక్రియాపరంగా క్రియాశీలత
IV. S D) కణద్రవ్యం పెరుగుతుంది.

       I    II     III     IV
జ:  C    D     A     B

 

19. సమవిభజన జరిగేటప్పుడు వృక్షకణాల్లో కనిపించని కింది ఏ ఘటన జంతుకణాల్లో కనిపిస్తుంది?
    1) కేంద్రక విభజన                2) క్రోమోజోమల్ విభజన    

   3) నక్షత్రాకారం ఏర్పడటం       4) కేంద్రకం మాయమవడం
జ: 3 (నక్షత్రాకారం ఏర్పడటం)

 

20. కణవిభజనను విర్షా ఏవిధంగా ప్రతిపాదించాడు?
జ: కణ రేఖీయ సిద్ధాంతం

21. మాతృకణంతో సమాన సంఖ్యలో క్రోమోజోములున్న పిల్లకణాలు ఏర్పడితే ఆ కణవిభజనను ఏమంటారు?
జ: మైటాసిస్

 

22. దృశ్యమాన కణవిభజన దశ అంటే...
జ: M దశ

 

23. G1 వేరుచేసేది
జ: M దశ, డీఎన్ఏ సంశ్లేషణ

 

24. ఏ దశలో డీఎన్ఏ ద్విగుణీకృతమవుతుంది?
జ: S

 

25. ఈ దశలో క్రొమాటిడ్ల సంఖ్య ద్విగుణీకృతమవుతుంది కానీ, క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది-
జ: S

 

26. క్రొమోజోముల సంఖ్య 2n స్థితిలో ఏ దశలో చూడవచ్చు?
      1) G1       2) G2         3) S      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

27. డీఎన్ఏ ప్రతికృతి సెంట్రియోల్ ద్విగుణీకృతమయ్యేది వరుసగా
జ: రెండోది కణద్రవ్యంలో మొదటిది కేంద్రకంలో; ఒకేసారి S లో

28. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
       1) జంతువుల్లో మైటాసిస్ ద్వయస్థితిక కణాల్లో మాత్రమే జరుగుతుంది.
       2) జంతువులు చిన్న వయసులో ఉన్నప్పుడే గుండె కణాలు విభజన చెందుతాయి.
       3) G0ను శాంతదశ అంటారు.
      4) మైటాసిస్ కేంద్రక విభజనలో క్రొమాటిడ్ల సంఖ్య పెరగదు, తగ్గదు.
జ: 4 (మైటాసిస్ కేంద్రక విభజనలో క్రొమాటిడ్ల సంఖ్య పెరగదు, తగ్గదు.)

 

29. ఏకస్థితిక కణాలు వేటిలో మైటాసిస్‌ను చూపుతాయి?
      1) మొక్కలు    2) సాంఘిక కీటకాలు     3) సిద్ధబీజాలు    4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

30. ఏ దశలో సెంట్రియోల్స్ వ్యతిరేక ధ్రువాలవైపు చలిస్తాయి?
జ: ప్రథమదశ

 

31. క్రోమోజోమల్ పదార్థం సంగ్రహణం చెందడానికి ప్రారంభమయ్యే దశ
జ: ప్రథమ దశ

 

32. ఆస్ట్రల్ స్పిండిల్ పరికరాన్ని జంతుకణాల్లో చూడవచ్చు. అదే నిమ్నజాతి మొక్కల్లో వేటిచుట్టూ ఏర్పడుతుంది?
జ: సెంట్రియోల్

33. ప్రథమదశ చివరలో కనిపించని కణాంగాలు-
     1) గాల్జీ సంక్లిష్టం     2) ER      3) కేంద్రకాంశం     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

34. కిందివాటితోపాటు ప్రథమదశ పూర్తవుతుంది?
1) క్రోమోజోమల్ పదార్థం సంగ్రహణ చెందడం     2) కేంద్రకత్వచం కనిపించదు
 3) కండెపరికరం ఏర్పడటం                          4) డీఎన్ఏ సంశ్లేషణ
జ: 2 (కేంద్రకత్వచం కనిపించదు)

 

35. కణచక్రంలోని ఘటనల క్రమం -
జ: G1, S, G2, M

 

36. నక్షత్రాలులేని కండె పరికరం ఎందులో ఏర్పడుతుంది?
జ: ఉన్నతశ్రేణి మొక్కలు

 

37. కణచక్రం నుంచి కణాలు నిష్క్రమించినప్పుడు వాటిని ఏ దశలో చూడొచ్చు?
జ: G0

 

38. మానవుడి దేహంలోని కణాలు ఎక్కువగా ఏ స్థితిలో ఉంటాయి?
జ: G0


39. కణచక్రంలో 95% ఉండేది-
జ: అంతర్దశ

 

40. ప్రథమదశలో డీఎన్ఏ క్రోమోజోమ్‌లోని, క్రొమాటిడ్‌లు వరుసగా
జ: 4C, 2

 

41. కిందివాటిలో ప్రథమదశకు సంబంధంలేని ఘటనను గుర్తించండి.
       1) క్రోమోజోమ్‌లు సంగ్రహణం చెందడం                  
       2) మైటాటిక్ కండె పరికరం ప్రారంభమవడం
       3) సెంట్రియోల్స్ వ్యతిరేక ధ్రువాల వైపునకు చలనం ప్రారంభమవడం
       4) సెంట్రోమియర్ విభజన చెందడం
జ: 4 (సెంట్రోమియర్ విభజన చెందడం)

 

42. M - దశ మొదలవడం, అంతమవడం వీటిలో వరుసగా-
     1) ప్రథమదశ, అంతిమదశ       2) ప్రథమదశ, కణద్రవ్య విభజన
     3) కేంద్రక విభజన, G1            4) ప్రథమదశ, G1
జ: 2 (ప్రథమదశ, కణద్రవ్య విభజన)

43. జతపరచండి.

I. కేంద్రకాంశం మాయమవడం A) మధ్యస్థ దశ
II. క్రోమోజోమ్‌ల స్వరూపం B) ప్రథమ దశ
III. క్రోమోజోమ్‌ల ఆకారం C) అంతిమ దశ
IV. 2C డీఎన్ఏతో కేంద్రకం D) చలన దశ

     I     II      III      IV
జ: A    B      C       D

 

44. క్రోమోజోమ్‌ల సంగ్రహణం ప్రారంభమవడం, ఆగిపోవడం వరుసగా ఈ దశల్లో-
      1) G2, ప్రథమదశ               2) ప్రథమదశ, చలనదశ
      3) మధ్యస్థదశ, చలనదశ      4) ప్రథమదశ, మధ్యస్థదశ
జ: 4 (ప్రథమదశ, మధ్యస్థదశ)

 

45. నిశ్చితం (A): క్రోమోజోమ్‌ల బాహ్య స్వరూపం సులభంగా అధ్యయనం చేయడానికి మధ్యస్థ దశ తోడ్పడుతుంది.
       వివరణ (R): మధ్యస్థదశలో క్రోమోజోమ్‌ల సంగ్రహణం పూర్తి అవుతుంది.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

46. కండెపోగులు క్రోమోజోమ్‌కు ఏ విధంగా అంటుకుంటాయి?
జ: ఒక్కో ధ్రువం నుంచి ఒకటి కైనెటోకోర్‌కు

 

47. మధ్యస్థదశలో ఏ పరిస్థితిని చూడవచ్చు?
జ: ఒక క్రోమోజోమ్, 2 కైనెటోకోర్‌లు, 2 కండెపోగులు

48. కాల్చిసిన్ ఒక రసాయనిక ఉత్పరివర్తకం లేదా మైటాటిక్ విషాన్ని ఏ దశలో ఉపయోగిస్తారు?
జ: మధ్యస్థదశ

 

49. కాల్చిసిన్‌ను దేని నుంచి పొందవచ్చు?
జ: మెడోసాఫ్రన్

 

50. కాల్చిసిన్‌ను మధ్యస్థదశలో ఉపయోగిస్తే-
    1) కండెపరికరం ఏర్పడదు
    2) కేంద్రకం ఒకటే కానీ క్రోమోజోముల సంఖ్య ద్విగుణీకృతమవుతుంది
    3) కండెపరికరం ఏర్పడదు; కేంద్రకం ఒకటే కానీ క్రోమోజోముల సంఖ్య ద్విగుణీకృతమవుతుంది.
    4) క్రోమోజోమ్‌లు రెట్టింపు కావడంతో కేంద్రకం పరిమాణం పెరుగుతుంది.
జ: 3 (కండెపరికరం ఏర్పడదు; కేంద్రకం ఒకటే కానీ క్రోమోజోముల సంఖ్య ద్విగుణీకృతమవుతుంది.)

51. ఆలియం సెపా శాఖీయ కణాలు సమవిభజన చెందేటప్పుడు మధ్యస్థదశలో సెంట్రోమియర్లు, క్రొమాటిడ్లు క్రోమోనిమాటా, టీలోమియర్లు వరుసగా
జ: 16, 32, 32, 64

 

52. ఆలియం సెపాలో మధ్యస్థదశలో క్రోమోజోముల్లోని డీఎన్ఏ పాలిన్యూక్లియోటైడ్‌ల పోచలు
జ: 64

 

53. కండె పరికరం ఆకారం, ధ్రువాలను బట్టి
జ: తర్కురూపం, ద్విధ్రువ

 

54. కండెపోగుల్లోని ప్రొటీన్
జ: ట్యుబ్యులిన్

55. మధ్యస్థదశలోని క్రోమోజోమ్ చూపేది-
        1) 2 కైనెటోకోర్‌లు ఒకదానికొకటి అంటుకొని ఉండటం.
        2) ప్రతి కైనెటోకోర్ ధ్రువానికి ఒక కండెపోగుతో అంటుకొని ఉండటం.
        3) ఒక సెంట్రోమియర్ రెండు కండె పోగులతో ఒక్కో ధ్రువానికి అంటుకొని ఉండటం.
        4) 2 కైనెటోకోర్‌లు ఒకదానికొకటి అంటుకొని ఉండటం., ప్రతి కైనెటోకోర్ ధ్రువానికి ఒక కండెపోగుతో అంటుకొని ఉండటం.
జ: 4 (2 కైనెటోకోర్‌లు ఒకదానికొకటి అంటుకొని ఉండటం., ప్రతి కైనెటోకోర్ ధ్రువానికి ఒక కండెపోగుతో అంటుకొని ఉండటం.)

 

56. మధ్యస్థదశలో ప్రతిక్రోమోజోమ్ ఏవిధంగా అంటుకుంటుంది?
జ: ఒక్కోధ్రువానికి ఒక కండెపొగుతో

 

57. నిశ్చితం (A): చలనదశలో క్రోమోజోమ్ ప్రాథమిక కుంచనం వద్ద మాత్రమే వంగుతుంది.
      వివరణ (R): కండెపోగులు ప్రాథమిక కుంచనం వద్ద మాత్రమే అంటుకుంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

58. కిందివాటిలో ఏ క్రోమోజోమ్ వంగదు?
     1) టీలోసెంట్రిక్, ఆక్రోసెంట్రిక్                 2) ఆక్రోసెంట్రిక్, మెటాసెంట్రిక్
     3) సబ్‌మెటాసెంట్రిక్, టీలోసెంట్రిక్         4) టీలోసెంట్రిక్ మాత్రమే
జ: 4 (టీలోసెంట్రిక్ మాత్రమే)

59. మధ్యస్థదశలో, చలనదశలోనూ ఈ క్రోమోజోమ్ ఒకే ఆకారాన్ని చూపుతుంది?
జ: టీలోసెంట్రిక్

 

60. అన్ని క్రోమోజోమ్‌లు ఏ దశలో ఒకే ఆకారాన్ని చూపుతాయి?
జ: మధ్యస్థదశ

 

61. కేంద్రకం - కణద్రవ్యం నిష్పత్తిని ఏది నియంత్రిస్తుంది?
జ: కణవిభజన

 

62. ఆలియం సెపా శాఖీయ కణాలు చలనదశలో చూపే క్రోమోజోమ్‌లు, క్రొమాటిడ్‌లు, డీఎన్ఏ వరుసగా
జ: 32, 32, 4C

 

63. క్రోమోజోమ్‌లు చలనదశలో చలించేటప్పుడు సెంట్రోమియర్లు, బాహువులు వరుసగా ఎటువైపు తిరిగి ఉండి చలిస్తాయి?
జ: ధ్రువం, మధ్యరేఖ

 

64. సెంట్రోమియర్ ఏ దశలో విభజన చెందుతుంది?
జ: చలన దశ

 

65. చలన దశ క్రోమోజోమ్‌లో క్రొమాటిడ్‌ల సంఖ్య
జ: 1

66. క్రోమోజోమ్‌లు ధ్రువాలకు వేటితో చేరతాయి?
జ: సెంట్రోమియర్‌లు

 

67. క్రొమాటిడ్‌ల సంఖ్య మారదు కానీ కేంద్రాకాల సంఖ్య ఈ దశలో రెట్టింపవుతుంది?
జ: అంతిమ దశ

 

68. జతపరచండి.

I. క్రొమాటిడ్ల విభజన A) అంతిమ దశ
II. సంగ్రహణం పూర్తిగా B) ప్రథమ దశ
III. క్రోమోజోమ్‌లు గుర్తింపును కోల్పోతాయి C) చలన దశ
IV. సెంట్రియోల్స్ ఎదురెదురు ధ్రువాలపై చలిస్తాయి D) మధ్యస్థ దశ

     I      II      III      IV
జ: C     D     A       B

 

69. క్రోమోజోమ్‌లు ముద్దలా కనిపించే దశ -
జ: అంతిమ దశ

 

70. కణాల గాయాలు మానడానికి తోడ్పడేది?
జ: సమ విభజన

71. నిశ్చితం (A): మొక్కల్లో కణద్రవ్య విభజన యాంత్రికం జంతువుల్లోని కణద్రవ్య విభజన యాంత్రికానికి భిన్నంగా ఉంటుంది.
       వివరణ (R): వృక్షకణాలు దృఢమైన కణకవచంతో ఉంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

72. కేంద్రక విభజన తర్వాత కణద్రవ్య విభజన జరగకపోతే కణ విభజనను ఏమంటారు?
జ: స్వేచ్ఛాకేంద్రక

 

73. కింది ఏ కణాలు ఎప్పటికప్పుడు పాత కణాలను కోల్పోయి కొత్త కణాలను ఏర్పరుస్తాయి?
      1) బాహ్యచర్మం పైపొర కణాలు         2) గొంతు పొరలోని పైపూత కణాలు
      3) రక్తకణాలు                              4) పైవన్నీ
జ: 4) పైవన్నీ

 

74. నిశ్చితం (A): మొక్కల్లో పెరుగుదల జీవితాంతం ఉంటుంది.
      వివరణ (R): అగ్రపార్శ్వ విభాజ్య కణాజాలాలు ఎప్పుడూ సమవిభజన చూపుతాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

75. కిందివాటిలో ఏవి ఏర్పడినప్పుడు స్వేచ్ఛాకేంద్రక విభజనలు కనిపిస్తాయి?
      1) అంకురచ్ఛదం       2) పిండకోశం      3) పిండం     4) అంకురచ్ఛదం, పిండకోశం
జ: 4 (అంకురచ్ఛదం, పిండకోశం)

76. కొబ్బరి నీరు స్వరూపం-
        1) ద్రవరూపంలో ఉన్న అంకురచ్ఛదం   2) అనేక స్వేచ్ఛాకేంద్రకాలు
        3) అన్ని కేంద్రకాలు త్రయస్థితికం         4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

77. ద్విధావిచ్ఛిత్తిలో జరిగే కణవిభజన-
జ: ఎమైటాసిస్

 

78. ద్విధావిచ్ఛిత్తిని చూపే కణాంగాలు ఏవి?
జ: మైటోకాండ్రియా

 

79. వేరుకొన, కాండాగ్రాల్లోని విభాజ్య కణజాలాలు 'n' సంఖ్యలో సమవిభజన చెందితే ఏర్పడే కణాలు-
జ: n + 1

 

80. కిందివాటిలో బహుకేంద్రకస్థితిని దేనిలో చూడవచ్చు?
      1) కొబ్బరి    2) కొబ్బరి నీరు   3) మామిడి రసం    4) ఆపిల్ రసం
జ: 2 (కొబ్బరి  నీరు)

 

81. మియాసిస్‌లో పాల్గొనే కణం-
జ: మియాసైట్

82. నిశ్చితం (A): సిద్ధబీజదం అన్ని కణాలు క్షయకరణ విభజన చూపుతాయి.
       వివరణ (R): ద్వయస్థితిక శాఖీయ కణాలు క్షయకరణ విభజనలో పాల్గొనవు.
జ: A సరైంది కాదు. R సరైంది.

 

83. ఆవృత బీజాల్లో క్షయకరణ విభజన కేంద్రాలు-
జ: పరాగకోశం, అండం

 

84. కేసరం ఏ భాగం క్షయకరణ విభజన చూపుతుంది?
జ: సూక్ష్మసిద్ధబీజాశయం

 

85. అండంలోని ఏ భాగం క్షయకరణ విభజన చెందుతుంది?
జ: అండాంతకణజాలం, స్థూలసిద్ధబీజాశయం

 

86. అండాంతకణజాలానికి మరొక పేరేంటి?
జ: స్థూలసిద్ధబీజాశయం

 

87. సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు ఏర్పడటానికి కావాల్సింది-
జ: మియాసిస్

 

88. కింది ఏ విభజన తర్వాత చతుష్కాలు ఏర్పడతాయి?
     1) మైటాసిస్   2) మియాసిస్   3) విచ్ఛిత్తి   4) ఎమైటాసిస్
జ: 2 (మియాసిస్)

89. నిశ్చితం (A): మియాసిస్‌ను క్షయకరణ విభజన (RD) అంటారు.
       వివరణ (R): మాతృకణంలోని క్రోమోజోమ్‌ల సంఖ్య పిల్ల కణాల్లో సగానికి తగ్గించబడుతుంది.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

90. లైంగికోత్పత్తి ద్వారా ప్రత్యుత్పత్తి చెందే జీవుల జీవితచక్రంలో జరిగే క్షయకరణ విభజనల సంఖ్య-
జ: ఒకటి మాత్రమే

 

91. క్షయకరణ విభజనలో ఏర్పడే పిల్లకణాలు-
జ: 4

 

92. క్షయకరణ విభజన తర్వాత మాతృకణం నుంచి ఏర్పడిన పిల్లకణాలు
జ: 4, ఏకస్థితికం

 

93. లైంగికోత్పత్తి చెందే థాలోఫైట్‌లలో మియోసైట్-
జ: సంయుక్తబీజం

 

94. పిండధారి మొక్కల్లో క్షయకరణ విభజన చెందేకణం-
జ: సిద్ధబీజమాతృకణం

 

95. టెరిడోఫైట్‌లలో క్షయకరణ విభజన చూపేది-
     1) సూక్ష్మసిద్ధబీజ మాతృకణాలు   2) స్థూలసిద్ధబీజ మాతృకణాలు
     3) సిద్ధబీజ మాతృకణాలు            4) అన్నీ
జ: 4 (అన్నీ)

96. పుష్పించే మొక్కల్లో క్షయకరణ విభజన చూపే కణాలు-
1) సూక్ష్మసిద్ధబీజమాతృకణాలు                   2) స్థూల సిద్ధ బీజమాతృకణాలు
3) సూక్ష్మ సిద్ధ బీజమాతృకణాలు, స్థూల సిద్ధ బీజమాతృకణాలు
4) జైగోట్ లేదా జైగోస్పోర్

జ: 3 (సూక్ష్మసిద్ధబీజమాతృకణాలు, స్థూల సిద్ధ బీజమాతృకణాలు)
 

97. మియాసిస్ -I, మియాసిస్ -IIను వేరు చేసేది-
జ: విభజనల మధ్యదశ

 

98. విభజనల మధ్యదశ అంతర్దశ నుంచి కింది ఏ లక్షణంలో విభేదిస్తుంది?
      1) ఇది తక్కువ కాలాన్ని తీసుకుంటుంది      2) దీనిలో G1, G2 ఉండవు
       3) దీనిలో G, S మాత్రమే ఉంటాయి            4) దీనిలో S ఉండదు
జ: 4) దీనిలో S ఉండదు

 

99. నిశ్చితం (A): మియాసిస్ వైవిధ్యాలను పెంచుతుంది.
      వివరణ (R): జీవపరిణామానికి వైవిధ్యాలు ముఖ్యం.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.

100. మధ్య పటలికకు పూర్వగామి
జ: కణఫలకం

 

101. కణఫలకం నుంచి మధ్య పటలిక ఏర్పడే విధం -
జ: కేంద్రాపసార

 

102. కిందివాటిలో దేని ఏర్పాటుతో కణద్రవ్య విభజన పూర్తవుతుంది?
      1) కణకవచం     2) కణఫలకం   3) మధ్య పటలిక    4) ఫ్రాగ్మోప్లాస్ట్
జ: 3 (మధ్య పటలిక)

 

103. కిందివాటిలో కణద్రవ్య విభజన దేనిలో జరగదు?
      1) రైజోపస్    2) మ్యూకర్    3) కొబ్బరి నీరు    4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

104. కణ ఫలకానికి పూర్వగామి-
జ: ఫ్రాగ్మోప్లాస్ట్

 

105. అత్యధిక కణాంగాల ద్విగుణీకృతం ఏ దశలో జరుగుతుంది?
జ: G1

106. కిందివాటిలో దేనిలో క్షయకరణవిభజనను పరిశీలించవచ్చు?
       1) సూక్ష్మసిద్ధబీజ జననం          2) స్థూలసిద్ధబీజ జననం          

       3) సంయోగబీజ జననం           4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

107. లైంగికోత్పత్తి చెందే జీవుల జీవితచక్రంలో కింది జత సంఘటనలు ఒకదానికొకటి వ్యతిరేకం-
       1) మైటాసిస్, మియాసిస్           2) మియాసిస్, పిండం
       3) మియాసిస్, ఫలదీకరణం       4) పిండం, మైటాసిస్
జ: 3 (మియాసిస్, ఫలదీకరణం)

 

108. కండె పరికరం లక్షణం-
జ: ద్విధ్రువ

 

109. అండం చూపే క్షయకరణ విభజనల సంఖ్య-
జ: 1

 

110. సూక్ష్మసిద్ధబీజాశయంలో జరిగే క్షయకరణ విభజనల సంఖ్య-
జ: అనేకం

 

111. n సంఖ్య విత్తనాలు ఏర్పడటానికి జరగాల్సిన క్షయకరణ విభజనలు-
జ: 

112. ప్రథమ దశ - I ను 5 దశలుగా విభజించడానికి ఆధారం-
జ: క్రోమోజోముల ప్రవర్తన

 

113. మియాసిస్ వివిధ దశలను ప్రదర్శించడానికి తోడ్పడేది ఏది?
జ: కాంతి సూక్ష్మదర్శిని

 

114. మియాసిస్‌లో క్రోమోజోములు కింది మార్పులను చూపుతాయి-
       1) సంఖ్యలో తగ్గింపు                                  2) స్వభావంలో మార్పు
       3) సంఖ్యలో తగ్గింపు, స్వభావంలో మార్పు      4) రంగులో మార్పు
జ: 3 (సంఖ్యలో తగ్గింపు, స్వభావంలో మార్పు)

 

115. క్షయకరణ విభజనలో క్రోమోజోములు సంఖ్యలో, స్వభావంలో కింది ఏ విభజనలో మార్పును చూపుతాయి?
        1) క్షయకరణ విభజన - I                                                   2) క్షయకరణ విభజన - II
        3) క్షయకరణ విభజన - I , క్షయకరణ విభజన - II             4) క్షయకరణ విభజన - II తర్వాత
జ: 3 (క్షయకరణ విభజన - I , క్షయకరణ విభజన - II)

 

116. క్షయకరణ విభజన - II ఉద్దేశ్యం-
జ: కణాల సంఖ్యను పెంచడం

117. జతపరచండి.

I. క్రోమోజోములు కనిపించడం ప్రారంభం A) పాకిటీన్
II. క్రోమోజోముల చతుష్కాలు B) డిప్లోటీన్
III. బైవలెంట్లు C) లెప్టోటీన్
IV. సినాప్టీనీమల్ సంక్లిష్టం కరిగిపోవడం D) జైగోటీన్

      I    II    III    IV
జ:  C    A     D      B

 

118. జైగోటీన్ ప్రత్యేక లక్షణం -
జ: బైవలెంట్లు

 

119. పైసం క్షయకరణ విభజనలో కనిపించే బైవలెంట్లు
జ: 7

 

120. ఏ ద్వయస్థితిక జీవిలోనైనా క్షయకరణ విభజనలో కనిపించే బైవలెంట్లు-
జ: ఏకస్థితిక సంఖ్య రెట్టింపునకు సమానం

 

121. మాతృ, పితృ క్రోమోజోములు ఒకదానికొకటి జతగా ఏర్పడటం ఏ దశలో జరుగుతుంది?
జ: జైగోటీన్

122. జైగోటీన్‌లో వేటి మధ్య సూత్రయుగ్మనం జరుగుతుంది?
జ: సమజాతీయ క్రోమోజోములు

 

123. కిందివాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
        1) ప్రథమశ్రేణిలో - I లో పాకిటీన్ అతి పెద్దదశ
        2) సమజాతీయ క్రోమోజోములకు చెందిన సోదరేతర క్రొమాటిడ్ల మధ్య వినిమయం జరుగుతుంది
        3) చతుష్కాల సంఖ్య బైవలెంట్ల సంఖ్యకు రెట్టింపు
        4) సినాప్టినీమల్ సంక్లిష్టం పాకిటీన్‌లో ఏర్పడుతుంది
జ: 1 (ప్రథమశ్రేణిలో - I లో పాకిటీన్ అతి పెద్దదశ)

 

124. పైసం సటైవంలో ఏర్పడే చతుష్కాలు
జ: 7

 

125. సినాప్టినీమల్ సంక్లిష్టాన్ని దేంతో చూడవచ్చు?
జ: ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని

 

126. వినిమయం జరిగేచోటు
జ: పునసంయోజక బొడిపె

 

127. వినిమయానికి కావాల్సిన ఎంజైమ్
జ: రికాంబినేజ్

128. జతపరచండి.

I. కేంద్రకత్వచం కరిగిపోవడం A) చలనదశ - I
II. సినాప్టీనిమల్ సంక్లిష్టం కరిగిపోవడం B) డయాకైనెసిస్
III. కయాస్మాట కరిగిపోవడం C) అంతిమదశ
IV. కండెపరికరం కరిగిపోవడం D) డిఫ్టోటీన్

     I    II   III   IV
జ: B    D    A     C

 

129. పైసం సటైవమ్‌లో ద్వయస్థితిక క్రోమోజోమ్‌ల సంఖ్య 14. మధ్యస్థదశ, మధ్యస్థదశ - I, చలనదశ, మధ్యస్థదశ - II లలో క్రోమోజోమ్‌ల సంఖ్యను వరుసగా తెలపండి.
జ: 14, 14, 28, 7

 

130. కింది ఘటనలను క్రమంగా అమర్చండి.
      A) రికాంబినేజ్                                              B) సినాప్టినీమల్ సంక్లిష్టం
      C) సమజాతీయ క్రోమోజోమ్‌లు విడిపోవడం         D) సూత్రయుగ్మనం
జ: D B A C

131. పాకిటీన్‌లో కింది ఘటనను చూడలేం-
         1) వినిమయం                       2) క్రియాత్మక రికాంబినేజ్
         3) అంతిమ  స్థితీకరణం            4) పునసంయోజన బొడిపె
జ: 3 (అంతిమ స్థితీకరణం)

 

132. సినాప్టినీమల్ సంక్లిష్టం కరగడం వల్ల జరిగేది-
జ: సమజాతీయ క్రోమోజోమ్‌లు విడిపోవడం

 

133. జతపరచండి.

I. క్రోమోజోమ్‌ల స్వభావంలో మార్పు A) డిప్లోటీన్
II. క్రోమోజోమ్‌ల సంఖ్యలో మార్పు B) పాకిటీన్
III. సమజాతీయ క్రోమోజోమ్‌ల మధ్య వికర్షణ C) జైగోటీన్
IV. సమజాతీయ క్రోమోజోమ్‌లు జతలుగా మారడం D) చలనదశ-I

       I    II   III   IV
జ:  B    D    A     C

 

134. క్షయకరణ విభజన - Iలో కండెపరికరం దేనిలో ఏర్పడుతుంది?
జ: డయాకైనెసిన్

135. జతపరచండి.

I. సోదరేతర క్రొమాటిడ్లు అంటుకుని ఉండేచోటు A) సెంట్రోమియర్
II. సోదర క్రొమాటిడ్లు అంటుకుని ఉండేచోటు B) కయస్మాటా
III. కండె పోగులు అంటుకుని ఉండేచోటు C) కైనైటోకోర్

     I     II   III
జ: B    A   C

 

136. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతానికి భౌతిక రుజువు ఏ దశలో కనిపిస్తుంది?
జ: మధ్యస్థ దశ - I

 

137. పైసమ్ సటైవ‌మ్‌లో  7 జతల క్రోమోజోమ్‌లు ఉన్నాయి. దీనిలో ఎన్ని క్రోమోజోమ్‌ల కూర్పులు ఉంటాయి?
జ: 27

 

138. మధ్యస్థదశ - I లో పైసమ్ సటైవమ్ క్రొమాటిడ్ల సంఖ్య-
జ: 28

 

139. మియాసిస్‌లో ఏర్పడే కండె పరికరాల సంఖ్య-
జ: 3

 

140. సమజాతీయ క్రోమోజోములు విడిపోవడం ఎక్కడ మొదలవుతుంది?
జ: సెంట్రోమియర్

141. సినాప్టోనీమల్ సంక్లిష్టం దేంతో తయారవుతుంది?
జ: ప్రొటీన్లు

 

142. పైసమ్ సటైవమ్ మధ్య దశాఫలకంలో మధ్యస్థ దశ - I , మధ్యస్థ దశ - II లో క్రోమోజోముల సంఖ్య
జ: 14, 7

 

143. జతపరచండి.

I. సెంట్రోమియర్లు వేరవుతాయి A) చలన దశ - I
II. కైనెటోకోర్‌లు వేరవుతాయి B) చలన దశ - I
III. సమజాతీయ క్రోమోజోమ్‌లు వేరవడం ప్రారంభం C) పాకిటీన్
IV. క్రోమోజోమ్ నిలువుగా 2 క్రొమాటిడ్లుగా విభజన చెందుతుంది D) చలన దశ

      I     II     III     IV
జ:  A    D     B      C

 

144. క్షయకరణ విభజన - I తర్వాత ఏర్పడిన పిల్లకణాలు మాతృకణాన్ని పోలి ఉండకపోవడానికి కారణమేమిటి?
జ: పాకిటీన్, చలనదశ - I

 

145. స్థూలసిద్ధబీజ మాతృకణం నుంచి మొదలుకుని 8 - కేంద్రకాల పిండకోశం ఏర్పడటానికి జరిగే క్షయకరణ విభజనలు, సమవిభజనలు
జ: 1, 7

146. న్యూరోస్పోరా (ఆస్కోమైసిటీన్)లోని ఆస్కస్ 8 ఆస్కోస్పోరులు ఏర్పడటానికి జరిగే విభజనలు
జ: 1 క్షయకరణ, 1 సమ విభజన

 

147. మియాసిస్‌లో డీఎన్ఏ ప్రతికృతి, సెంట్రోమియర్ విభజనలు
జ: 1, 1

 

148. దేనిలో క్రోమోజోమల్ సంగ్రహణం పూర్తవుతుంది?
జ: డిప్లోటీన్

Posted Date : 02-12-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌