• facebook
  • whatsapp
  • telegram

పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణశాస్త్రం

1. కర్లీటాప్ వైరస్ పోషక కణజాలం ద్వారా వ్యాప్తి చెందుతుందని ఎవరు తెలిపారు?
జ: కాథరిన్ ఈసో

 

2. మొక్కల జీవశాస్త్రంలో ఏ గ్రంథాన్ని 'వెబ్‌స్టర్ గ్రంథం' లాంటిదని అంటారు?
జ: ది అనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్

 

3. కణజాలాలు ఏర్పడటానికి కిందివాటిలో ఏది అవసరం?
    1) కణకవచం      2) ప్లాస్మాత్వచం      3) కేంద్రకం    4) మధ్య పటలిక
జ: 4 (మధ్య పటలిక)

 

4. స్థానాన్ని అనుసరించి విభాజ్య కణజాలం ఎన్ని రకాలు?
జ: 3

 

5. ద్విదళ బీజాల్లో మాత్రమే ఉండే విభాజ్య కణజాలం-
జ: పార్శ్వ విభాజ్య కణజాలం

6. కింది ఏ విభాజ్య కణజాలాలు స్థూపాకారంలో ఉంటాయి?
     1) కాండాగ్రం                           2) మూలాగ్రం          

    3) పార్శ్వ విభాజ్య కణజాలాలు    4) గ్రౌండ్ విభాజ్య కణజాలాలు
జ: 3 (పార్శ్వ విభాజ్య కణజాలాలు)

 

7. పిండంలోని కణజాలం-
జ: విభాజ్య కణజాలం

 

8. ద్వితీయ విభాజ్య కణజాలాలను ఏర్పరిచేది-
జ: శాశ్వత కణజాలం

 

9. ప్రాథమిక విభాజ్య కణజాలాలు వేటిలో ఉంటాయి?
     1) వేరుకొన    2) కాండాగ్రం  3) పుంజాంతస్థ విభాజ్య కణావళి   4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

10. కిందివాటిలో ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలం కానిదేది?
    1) ద్విదళ బీజకాండంలోని బెండు విభాజ్య కణావళి
    2) ద్విదళ బీజవేరులోని నాళికా విభాజ్య కణావళి
    3) పుంజాంతస్థ విభాజ్య కణావళి                          
    4) పుంజాంతర విభాజ్య కణావళి
జ: 4 (పుంజాంతర విభాజ్య కణావళి)

11. కింది ఏ మొక్కల సముదాయం నుంచి విభాజ్య కణావళి ఏర్పడుతుంది?
     1) శైవలాలు     2) శిలీంద్రాలు     3) బ్రయోఫైటా     4) టెరిడోఫైటా
జ: 3 (బ్రయోఫైటా)

 

12. శాఖలు, పత్రాలు, మొగ్గలు, పుష్పాలు మొదలైనవన్నీ వేటి నుంచి ఏర్పడతాయి?
జ: ప్రాథమిక విభాజ్య కణాజాలం

 

13. ద్వితీయ విభాజ్య కణావళి ఎల్లప్పుడూ-
జ: పార్శ్వ

 

14. మొక్క పొడవు దేని సహాయంతో పెరుగుతుంది?
జ: అగ్రస్థ విభాజ్య కణావళి

 

15. ఏకదళబీజాల్లోని గడ్డి కుటుంబానికి చెందిన మొక్కజొన్న కాండం పొడవు పెరగడానికి తోడ్పడేది ఏది?
జ: అగ్రస్థ, మధ్యస్థ విభాజ్య కణజాలాలు


16. జీవక్రియలను మాత్రమే నిర్వహించే శాశ్వత, సరళ కణజాలం ఏది?
జ: మృదు కణజాలం

 

17. జీవక్రియలను నిర్వహించడంతో పాటు యాంత్రిక ఆధారాన్నిచ్చే శాశ్వత, సరళ కణజాలం
జ: స్థూలకోణ కణజాలం

18. యాంత్రిక ఆధారాన్ని మాత్రమే ఇచ్చే శాశ్వత, సరళ కణజాలం ఏది?
జ: దృఢ కణజాలం

 

19. మొదట ఏర్పడిన ఆదిమ కణజాలం ఏది?
జ: మృదు కణజాలం

 

20. కణాంతరావకాశాలు ఉండే సరళ కణజాలాలు ఏవి?
జ: మృదు కణజాలం

 

21. మృదు కణజాలం ఏ కణకవచంలోని పదార్థం?
జ: సెల్యులోజ్

 

22. నీటి మొక్కల ప్రతిభాగంలో ఉండే మృదు కణజాల రకం-
జ: వాయుపూరిత మృదు కణజాలం

 

23. కిందివాటిలో మృదు కణజాలం నిర్వర్తించని విధి -
      1) స్రావ క్రియ    2) కిరణజన్య సంయోగక్రియ   3) నిల్వ చేయడం   4) విసర్జన క్రియ
జ: 4 (విసర్జన క్రియ)

 

24. మొక్కల ప్రాథమిక నిర్మాణాల్లో అత్యధిక ప్రదేశాన్ని ఆక్రమించేది ఏది?
జ: మృదు కణజాలం

 

25. మృదు కణజాలంలో పక్కన ఉండే కణాలను కలిపేది ఏది?
జ: కణద్రవ్యపు పోగులు

26. ఏకదళ బీజాల్లో లేని సరళ కణజాలం-
జ: స్థూలకోణ కణజాలం

 

27. కిందివాటిలో స్థూలకోణ కణజాలం వేటిలో ఉండదు?
      1) ద్విదళ బీజవేరు    2) ఏకదళ బీజకాండం      
      3) ఏకదళ బీజవేరు    4) అన్నీ
జ: 4) అన్నీ

 

28. స్థూలకోణ కణజాలం నిర్వర్తించే విధులేమిటి?
జ: కిరణజన్య సంయోగక్రియ, యాంత్రిక ఆధారం

 

29. ద్విదళ బీజకాండంలో స్థూలకోణ కణజాల స్థానం
జ: బాహ్యచర్మం, వల్కలం మధ్య

 

30. సమజాతీయ అథశ్చర్మం లేదా మాసికలుగా అథశ్చర్మం స్థూలకోణ కణజాలంతో నిర్మితమై వరుసగా కిందివాటిలో దేనిలో ఉంటుంది?
      1) పైసం, కుకుర్బిటా                 2) హీలియాంథస్, మొక్కజొన్న
      3) కుకుర్బిటా, హీలియాంథస్     4) పైసం, హీలియాంథస్
జ: 1 (పైసం, కుకుర్బిటా)

31. స్థూలకోణ కణజాల కణకవచం ఏవిధంగా ఉంటుంది?
జ: మూలల్లో మందంగా, ఇతరచోట్ల పలుచగా

 

32. స్థూలకోణ కణజాలంలో మందంగా ఉండే పదార్థం ఏది?
జ: సెల్యులోజ్, పెక్టిన్, హెమీసెల్యులోజ్

 

33. స్థూలకోణ కణజాలంలోని కణాల్లో అత్యధిక ప్రదేశాన్ని ఆక్రమించేది ఏది?
జ: రిక్తిక

 

34. మొక్క అంగం వంగినా విరగకపోవడానికి కారణం స్థూలకోణ కణజాలం. ఈ వ్యాఖ్య కిందివాటిలో దేంతో సరిపోతుంది?
       1) ద్విదళ బీజకాండం, శాఖలు, పత్రవృంతం
        2) లేత ద్విదళ బీజకాండం, ఏకదళ బీజకాండం
        3) పత్రవృంతం, పుష్పవృంతం, లేత ద్విదళ బీజకాండం
        4) ఏకదళ బీజకాండం, పత్రవృంతం, పుష్పవృంతం.
జ: 3 (పత్రవృంతం, పుష్పవృంతం, లేత ద్విదళ బీజకాండం)

 

35. కిందివాటిలో దేనిలో లిగ్నిన్ ఉంటుంది?
      1) మృదు కణజాలం        2) దృఢ కణజాలం
     3) స్థూలకోణ కణజాలం     4) దృఢ కణజాలం, స్థూలకోణ కణజాలం
జ: 2 (దృఢ కణజాలం)

36. లేత ఏకదళ బీజకాండానికి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేది ఏది?
జ: దృఢ కణజాలం

 

37. ద్విదళ బీజాలకు చెందిన లేత కుకుర్బిటా కాండానికి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేది ఏది?
జ: స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం

 

38. కింది కణకవచాల్లో వేటిలో గుంటలు ఉంటాయి?
     1) మృదు కణజాలం         2) దృఢ కణజాలం          

    3) విభాజ్య కణజాలం        4) స్థూలకోణ కణజాలం
జ: 2 (దృఢ కణజాలం)

 

39. మొక్కలో అతిపొడవైన కణాలు -
జ: నారలు

 

40. అవకాశికలు ఉండేది-
జ: నారలు, దృఢ కణాలు

 

41. నిర్జీవ కణాల్లోని ఖాళీ ప్రదేశాన్ని ఏవిధంగా పిలుస్తారు?
జ: అవకాశిక

42. జతపరచండి. (దృఢ కణాలకు సంబంధించి)

I. ఫలకవచం A) టీ
II. ఆకులు B) జామ
III. బీజ కవచాలు C) నట్స్
IV. గుజ్జు D) లెగ్యూమ్

      I    II    III    IV
జ: C    A    D    B

 

43. వేటి గుజ్జులో దృఢ కణాలుంటాయి?
జ: పియర్, సపోటా, జామ

 

44. జతపరచండి.

I. ఒకేరకం కణాలు A) దారువు
II. వివిధరకాల కణాలు B) సరళ కణజాలం
III. నిర్జీవ కణజాలం C) పోషక కణజాలం
IV. సజీవ కణజాలం D) సంక్లిష్ట కణజాలం

     I     II   III     IV
జ: B   D    A     C

45. నిశ్చితం (A): దారువు నిర్జీవ కణజాలం.
      వివరణ (R): దారువులోని అన్నిరకాల కణాలు నిర్జీవం.
జ: A సరైంది, R సరైందికాదు.

 

46. కిందివాటిలో దారువు వేటిని సరఫరా చేస్తుంది?
       1) నీరు, ఖనిజాలు                      2) నీరు, కర్బన ద్రావితాలు
       3) నీరు, ఖనిజాలు, అమైడ్లు          4) నీరు, ఆహారం
జ: 3 (నీరు, ఖనిజాలు, అమైడ్లు)

 

47. పుష్పించే మొక్కల్లో నీటిని రవాణా చేసేది ఏది?
జ: దారుకణాలు, దారునాళాలు

 

48. నాళికాయుత పుష్పించని మొక్కల్లో నీటిని రవాణా చేసేది ఏది?
జ: దారుకణాలు

 

49. వివృతబీజాల్లో నీటిని రవాణా చేసేది ఏది?
జ: దారుకణాలు మాత్రమే

 

50. కిందివాటిలో దారునాళాలు వేటిలో ఉంటాయి?
      1) టెరిడోఫైట్‌లు           2) పుష్పించే మొక్కలు          

      3) ఆవృతబీజాలు         4) వివృతబీజాలు
జ: 3 (ఆవృతబీజాలు)


51. జతపరచండి.

I. నిలువు రవాణా A) దారు మృదుకణజాలం
II. నీటి వ్యాసార్ధపు రవాణా B) దారునారలు
III. కొవ్వులు, టానిన్‌లను నిల్వచేయడం C) రేఖా మృదుకణజాలం
IV. యాంత్రిక ఆధారం D) దారుకణాలు, దారునాళాలు

     I    II   III   IV
జ: D  C   A    B

 

52. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
       1) ప్రాథమిక దారువు ప్రథమ దారువు, అంత్య దారువుగా విభేదనం చెందుతుంది.
       2) ద్వితీయ కాండంలో అత్యధిక ప్రదేశాన్ని ద్వితీయ దారువు ఆక్రమించుకుంటుంది.
       3) ప్రథమ దారుకణాలు ఎల్లప్పుడూ చిన్నగా ఉంటాయి.
       4) ద్వితీయ దారువులో దారు మృదుకణజాలం ఉండదు.
జ: 4 (ద్వితీయ దారువులో దారు మృదుకణజాలం ఉండదు.)

53. జతపరచండి.

I. అంతర ప్రథమ దారుకం A) ఫెర్న్‌లు
II. బాహ్య ప్రథమ దారుకం B) అంత్యదారువు దవ్వవైపు
III. మధ్యస్థ దారుకం C) వేరు
IV. కేంద్రాభిసార దారువు D) కేంద్రాపసార దారువు

      I    II     III     IV
జ: D   C     A      B

 

54. దారువులోని సజీవ కణజాలం ఏది?
జ: దారు మృదుకణజాలం

 

55. నిశ్చితం (A): అంత్య దారు కణాలు పెద్దవి.
      వివరణ (R): ప్రథమ దారుకణాలు మొదట ఏర్పడతాయి.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ కాదు.

 

56. దృఢంగా ఉండని నిర్జీవ కణజాలం
జ: ప్రాథమిక దారువు

57. నిశ్చితం (A): ప్రథమ దారువు, అంత్య దారువుగా ప్రాథమిక దారువు విభేదనం చెందుతుంది.
      వివరణ (R): ద్వితీయ దారువు దృఢంగా ఉంటుంది.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ కాదు.

 

58. నిశ్చితం (A): కాండంలో లేదా వేరులో ద్వితీయ వృద్ధి తర్వాత ప్రథమ దారువు అంత్య దారువులను చూపదు.
       వివరణ (R): ద్వితీయవృద్ధిలో మృదుకణజాలం ఏర్పడదు.
జ: A సరైంది, R సరైందికాదు,

 

59. ద్వితీయ దారువుకు మరో పేరు ఏమిటి?
జ: వుడ్

 

60. పోషక కణజాలంలోని నిర్జీవ కణజాలం
జ: పోషకనారలు

 

61. ఆవృతబీజాల పోషక కణజాలంలో లేని కణాలు -
జ: చాలనీ కణాలు, ఆల్బుమినస్ కణాలు

 

62. వివృతబీజాల పోషక కణజాలంలో ఉండేవి-
జ: చాలనీ కణాలు, ఆల్బుమినస్ కణాలు

63. నిశ్చితం (A): చాలనీ కణాలు సజీవం.
       వివరణ (R): వాటిలో కేంద్రకం ఉండదు.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ కాదు.

 

64. ఆవృతబీజాల పోషక కణజాలంలో ఏం ఉంటాయి?
     1) చాలనీ నాళకణాలు                             2) సహకణాలు        

    3) పోషక మృదుకణజాలం, పోషక నారలు     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

65. వివృతబీజాల చాలనీ కణాలు, ఆవృతబీజాల చాలనీ నాళకణాలు వాటి విధులు నిర్వర్తించడానికి వేటితో వరుసగా కలిసి ఉంటాయి?
జ: ఆల్బుమినస్ కణాలు, సహకణాలు

 

66. నిశ్చితం (A): చాలనీ కణాల ద్వారా జరిగే సేంద్రియ పదార్థాల రవాణాను సహకణాలు నియంత్రిస్తాయి.
       వివరణ (R): చాలనీ కణాల్లో కేంద్రకం ఉండదు.
జ: A సరైందికాదు, R సరైంది.

 

67. పోషక మృదుకణజాల కణాల ఆకారం-
జ: పొడవైన, స్థూపాకారం, మొనదేలి

 

68. పోషక నారలు సాధారణంగా వేటిలో ఉంటాయి?
జ: ద్వితీయ పోషక కణజాలం

69. పోషక మృదుకణజాలాన్ని నిల్వ చేసేది-
జ: రెసిన్‌లు, లేటెక్స్, మ్యూసిలేజ్

 

70. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
       1) ఏకదళ బీజాల్లో పోషక మృదుకణజాలం ఉండదు.
       2) ద్వితీయ పోషక కణజాలంలో పోషక నారలు ఉంటాయి.
       3) పోషక నారలు శాఖాయుతం.
       4) అంత్యపోషక కణజాలంలో చాలనీ నాళాలు ప్రథమ పోషక కణజాలంలో కంటే పెద్దవిగా ఉంటాయి.
జ: 3 (పోషక నారలు శాఖాయుతం.)

 

71. చాలనీ నాళకణాలు, సహకణాలను కలిపేది-
జ: గర్త క్షేత్రాలు


72. జ్యూట్ నారల స్వరూపం-
జ: బాస్ట్ నారలు

 

73. కిందివాటిలో పోషక నారలు కానివి-
      1) కోకోస్ నారలు   2) జ్యూట్   3) ఫ్లాక్స్     4) హెంప్
జ: 1 (కోకోస్ నారలు)

74. కణజాల వ్యవస్థలను ఏ లక్షణం ఆధారంగా విభజించారు?
జ: నిర్మాణం, స్థానం

 

75. కింది ఏ కణాల కణకవచాలు అసమాన మందంగా ఉంటాయి?
      1) బాహ్య చర్మకణాలు           2) అనుబంధ కణాలు        

      3) రక్షక కణాలు                  4) సహాయక కణాలు
జ: 3 (రక్షక కణాలు)

 

76. కిందివాటిలో పత్రరంధ్ర చలనాలను నియంత్రించేది ఏది?
     1) బాహ్య చర్మం                         2) సహకణాలు            

    3) బాహ్య చర్మం, సహకణాలు         4) రక్షక కణాలు
జ: 4(రక్షక కణాలు)

 

77. పైసమ్, గడ్డి మొక్కల్లో రక్షక కణాల ఆకారం వరుసగా-
జ: చిక్కుడు - ముద్గదాకారం

 

78. కిందివాటిలో పత్రరంధ్ర పరికరంలో ఉండనివి?
      1) బాహ్య చర్మ కణాలు            2) రక్షక కణాలు             

    3) సహాయ కణాలు                  4) పత్రరంధ్రం
జ: 1 (బాహ్య చర్మ కణాలు)

 

79. సంధాయక కణజాల వ్యవస్థలో లేనిది-
జ: బాహ్య చర్మం, నాళికాపుంజాలు

80. పత్ర సంధాయక కణజాల వ్యవస్థ అంటే ఏమిటి?
జ: పత్రాంతరం

 

81. ద్వి సహపార్శ్వ నాళికాపుంజంలో దారువు, పోషక కణజాలం-
జ: ఇరువైపులా విభాజ్య కణావళి వీటిని వేరు చేస్తుంది


82. సోలనేసి, కుకుర్బిటేసిలోని ద్వి సహపార్శ్వ నాళికా పుంజాల్లోని నాళికా కణజాలాల సంఖ్య ఎంత?
జ: 3

 

83. ద్విదళ బీజవేరు అడ్డుకోతను ఏకదళ బీజవేరు అడ్డుకోత నుంచి వేరు చేయడానికి కింది ఏ లక్షణం తోడ్పడుతుంది?
      1) మొదటిదానిలో పెద్ద దవ్వ, రెండోదానిలో అస్పష్టమైన దవ్వ
      2) మొదటిదానిలో 6 నాళికా పుంజాలు, రెండోదానిలో 2 నుంచి 4 నాళికా పుంజాలు
      3) మొదటిదానిలో అస్పష్టమైన దవ్వ, రెండోదానిలో బహు ప్రథమ దారుకం
      4) మొదటిదానిలో బహు ప్రథమ దారుకం, రెండోదానిలో పెద్ద దవ్వ
జ: 3 (మొదటిదానిలో అస్పష్టమైన దవ్వ, రెండోదానిలో బహు ప్రథమ దారుకం)

 

84. బహు ప్రథమ దారుకాన్ని దేనిలో చూడవచ్చు?
జ: ఏకదళ బీజవేరు

85. నిశ్చితం (A): ద్విదళ బీజకాండంలో నాళికా పుంజాలు వివృతం.
       వివరణ (R): విభాజ్య కణజాలాన్ని కలిగి ఉండటంతో అవి ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలాన్ని ఏర్పరుస్తాయి.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

 

86. కాస్పేరియన్ మందాలకు కారణం-
జ: సూబరిన్

 

87. ద్విదళ బీజవేరులో పరిచక్రం చేసే పని-
జ: విభాజ్య కణావళిగా మారి, అంతర్జనిత అంగాలను ఏర్పరుస్తుంది.

 

88. ద్విదళ బీజవేరులో విభాజ్య కణావళి దేని నుంచి ఏర్పడుతుంది?
         1) పోషక కణజాలం కింద            2) దారువుకు, పోషక కణజాలానికి మధ్య
         3) ప్రథమ దారువుపై పరిచక్రం     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

89. సంశ్లేషక కణజాలం ఎక్కడ ఉంటుంది?
జ: దారువు, పోషక కణజాలాల మధ్య

 

90. ద్విదళ బీజవేరులో ద్వితీయాభివృద్ధి జరిగేటప్పుడు ఏ కణజాలం పునర్విభేదనం చెందుతుంది?
జ: దారువు, పోషక కణజాలాల మధ్య ఉండే పరిచక్రం; మృదు కణజాలం

91. నిశ్చితం (A): వేరులో నాళికా పుంజాలను సంవృతం అంటారు.
       వివరణ (R): దారువు, పోషక కణజాలం వేర్వేరు వ్యాసార్ధాల్లో ఉంటాయి.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

 

92. ప్రసరణ స్తంభంలో ఉండేవి-
జ: అంతశ్చర్మం కింద ఉండే అన్ని కణజాలాలు

 

93. నిశ్చితం (A): ఏకదళ బీజవేరు ద్వితీయాభివృద్ధిని చూపదు.
       వివరణ (R): దీనిలో పెద్ద దవ్వ ఉంటుంది.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ కాదు.

 

94. ద్విదళబీజ కాండంలో కణాంతరావకాశాలు దేనిలో స్పష్టంగా ఉంటాయి?
జ: దవ్వ, వల్కలం

 

95. సంయుక్త, సహపార్శ్వ నాళికాపుంజాలు వేటిలో ఉండవు?
జ: వేరు

 

96. సంయుక్త, సహపార్శ్వ నాళికా పుంజాలు ఒక వలయంలా కిందివాటిలో దేనిలో అమరి ఉంటాయి?
       1) ద్విదళ బీజకాండం         2) ద్విదళ బీజవేరు          

       3) ఏకదళ బీజవేరు          4) ఏకదళ బీజకాండం
జ: 1 (ద్విదళ బీజకాండం)

97. ద్విదళ బీజ కాండం అడ్డుకోతను ఏ లక్షణాలతో గుర్తించవచ్చు?
జ: స్థూలకోణ కణజాలం ఉన్న అథశ్చర్మం, వివృతనాళికా పుంజాల వలయం

 

98. కిందివాటిలో ద్విదళబీజ కాండం ప్రత్యేక లక్షణం-
      1) దృఢ కణజాల నిర్మిత అథశ్చర్మం                      2) వివృతనాళికా పుంజాల వలయం
      3) చెల్లా చెదురుగా ఉండే నాళికా పుంజాలు           4) పెద్ద దవ్వ
జ: 2 (వివృతనాళికా పుంజాల వలయం)

 

99. నిశ్చితం (A): పిండి పొర ద్విదళబీజ కాండంలో మాత్రమే ఉంటుంది.
       వివరణ (R): వేరులోని అంతశ్చర్మంలో టాంజెన్షియల్, వ్యాసార్ధపు గోడలు సూబరిన్‌ను కలిగి ఉంటాయి.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ కాదు.

 

100. ద్విదళ బీజకాండంలోని పరిచక్రం ఎలా ఉంటుంది?
         1) విచ్ఛిన్నంగా   2) దృఢ కణజాలం     3) పోషక కణజాలంపై    4) అన్నీ
జ: 4 (అన్నీ)

101. జతపరచండి.

I. కాస్పేరియన్ మందాలు A) ద్విదళ బీజ కాండం
II. పెద్ద దవ్వ B) ద్విదళ బీజకాండం అంతశ్చర్మం
III. పిండి పొర C) ద్విదళ బీజకాండం పరిచక్రం
 IV. దృఢ కణజాలం  D) ఏకదళ బీజవేరు

      I    II   III   IV
జ:  D   A    B      C

 

102. అంత్యదారు కణాలు దేనిలో దగ్గరగా వస్తాయి?
జ: ద్విదళ బీజవేరు

 

103. శరీరధర్మ క్రియల్లో తోడ్పడే ఏక కణ నిర్మాణాలేవి?
జ: మూలకేశాలు

 

104. దవ్వరేఖలు దేనిలో ఉంటాయి?
జ: ద్విదళ బీజకాండం

 

105. అంతశ్చర్మం దేనికి చెందిన భాగం?
జ: వల్కలం

106. పరిచక్రం దేనికి చెందిన భాగం?
జ: ప్రసరణ స్తంభం

 

107. ప్రసరణ స్తంభం చుట్టూ ఉండేది-
జ: పరిచక్రం

 

108. దవ్వరేఖలు దేనికి చెందిన భాగం?
జ: నిజ ప్రసరణ స్తంభం

 

109. ద్విదళ బీజకాండంలో పరిచక్రం ఏ ఆకారంలో ఉంటుంది?
జ: అర్ధ చంద్రాకారం

 

110. ద్వితీయాభివృద్ధికి ముందు ద్విదళ బీజకాండంలో అత్యధిక ప్రదేశాన్ని ఆక్రమించేది ఏది?.
జ: ప్రసరణ స్తంభం

 

111. ద్విదళ బీజ ప్రాథమిక కాండ నిర్మాణంలోని కింది భాగాలను వరుస క్రమంలో అమర్చండి.
      A) అంత్యదారువు                B) అంతశ్చర్మం                 C) ప్రథమదారువు
      D) విభాజ్య కణావళి             E) పరిచక్రం                       F) పోషక కణజాలం
జ: BEFDAC

 

112. దారునాళాలు శ్రేణుల్లో దేనిలో అమరి ఉంటాయి?
జ: ద్విదళ బీజకాండం

113. కేంద్రాపసార నాళికా పుంజాలు దేనిలో ఉంటాయి?
జ: ఏకదళ బీజకాండం

 

114. కిందివాటిలో ద్విరూప నాళికా పుంజాలు దేనిలో ఉంటాయి?
     1) ఏకదళ బీజవేరు            2) ఏకదళ బీజకాండం          

    3) ద్విదళ బీజవేరు             4) ద్విదళ బీజకాండం
జ: 2 (ఏకదళ బీజకాండం)

 

115. దృఢకణజాలం దేనిలో ఉంటుంది?
      A) ద్విదళ బీజకాండ పరిచక్రం                        B) ఏకదళ బీజకాండ నాళికాపుంజం తొడుగు
      C) ఏకదళ బీజకాండ అథశ్చర్మం                    D) ద్విదళ బీజవేరు పరిచక్రం
జ: ABC

 

116. జతపరచండి.

I. దృఢ కణజాల నిర్మిత అథశ్చర్మం A) ఏకదళ బీజవేరు
II. అస్పష్టమైన దవ్వ B) ద్విదళ బీజకాండం
III. స్థూలకోణ కణజాల నిర్మిత అథశ్చర్మం C) ఏకదళ బీజకాండం
IV. బహుళ ప్రథమ దారుకం D) ద్విదళబీజ వేరు

      I    II    III   IV
జ:  C   D    B    A

117. సంధాయక కణజాలం దేనిలో అధిక ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది?
జ: ఏకదళ బీజకాండం

 

118. ఏకదళ బీజకాండంలోని లయజాతకుహరంలో ఉండేది-
జ: నీరు

 

119. ఏకదళ బీజకాండంలో దారునాళాల అమరిక ఎలా ఉంటుంది?
జ: V లేదా Y ఆకారం

 

120. లేతగా ఉన్న పొడవైన జొన్నకాండం దేని నుంచి రక్షణ పొందుతుంది?
జ: అథశ్చర్మం

 

121. తక్కువ సంఖ్యలో దారునాళాలు కిందివాటిలో ఏ దారువులో ఉంటాయి?
        1) ద్విదళ బీజకాండం       2) ఏకదళ బీజవేరు      3) ఏకదళ బీజకాండం     4) ద్విదళ బీజవేరు
జ: 3 (ఏకదళ బీజకాండం)

 

122. లేత, పొడవైన ద్విదళ బీజకాండం గాలికి వంగుతుంది కానీ కింది ఏ నిర్మాణం వల్ల విరగదు?
      1) స్థూలకోణ నిర్మిత అథశ్చర్మం                          2) దృఢ కణజాల నిర్మిత అథశ్చర్మం
      3) మృదు కణజాల నిర్మిత అథశ్చర్మం                 4) దృఢ కణజాల నిర్మిత పుంజం తొడుగు
జ: 1 (స్థూలకోణ నిర్మిత అథశ్చర్మం)

123. నిశ్చితం (A): ఏకదళ బీజకాండంలో నాళికా పుంజాలు చెల్లా చెదురుగా ఉంటాయి.
        వివరణ: (R): అవి సంయుక్త, సహపార్శ్వ, సంవృతం.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ కాదు.

 

124. నిశ్చితం (A): ద్విదళ బీజాల పత్రాలను పృష్ఠోదర పత్రాలు అంటారు.
        వివరణ: (R): ఉదరతలంలో స్తంభాకార కణావళి అధిక సంఖ్యలో హరితరేణువులను కలిగి ఉండటం వల్ల ఆ తలానికి గాఢమైన రంగు వస్తుంది.
జ: A సరైంది, R సరైందికాదు.

 

125. పృష్ఠోదర పత్రం యొక్క పత్రాంతరం-
      1) ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించుకుంటుంది                              2) విషమజాతం
      3) కిరణజన్యసంయోగక్రియ, వాయుప్రసరణలను జరుపుతుంది    4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

126. పృష్ఠోదర పత్రంలో పత్రరంధ్రాలు రెండువైపులా ఉన్నప్పుడు-
జ: ఒక్కోసారి ఉదరతలంలో ఉండవు.

 

127. ఈనెలు వేటితో నిర్మితమవుతాయి?
జ: సంయుక్త, సహపార్శ్వ, సంవృత నాళికాపుంజాలు

128. ద్విదళ బీజ పత్రంలో దారువు, పోషక కణజాలాల స్థానాలు వరుసగా-
జ: ఉదర తలం, పృష్ఠ తలం

 

129. స్తంభాకార కణావళి స్పాంజి కణజాలం నుంచి ఏ లక్షణంలో విభేదిస్తుంది?
     1) స్థానం     2) విధులు        3) కణ ఆకారం         4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

130. ఈనెల వ్యాపన రకం ఏ లక్షణంలో ప్రతిబింబిస్తుంది?
జ: నాళికాపుంజాల పరిమాణం

 

131. స్పాంజి కణజాలం నిర్వర్తించే విధులు-
జ: కిరణజన్యసంయోగక్రియ, వాయుప్రసరణ

 

132. నిశ్చితం (A): పృష్ఠోదర పత్రంలో పృష్ఠతలం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
        వివరణ: (R): స్తంభాకార కణావళి అధిక హరితరేణువులతో పృష్ఠతలం వైపు ఉంటుంది.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

 

133. అవభాసిని దేనిలో మందంగా ఉంటుంది?
జ: ఎడారి మొక్కలు

134. సమద్విపార్శ్వ పత్రం ప్రత్యేకత-
       1) సమజాత పత్రాంతరం                              2) రెండువైపులా పత్రరంధ్రాలు
       3) ఒకే పరిమాణంలో ఉండే నాళికాపుంజాలు    4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

135. విభేదనం చెందని పత్రాంతరం ఉన్న పత్రం-
   1) రెండువైపులా ఒకే రంగు చూపుతుంది.                          2) పత్రరంధ్రాలను రెండువైపులా కలిగి ఉంటుంది.
   3) ఒకే పరిమాణంలో ఉండే నాళికాపుంజాలతో ఉంటుంది.       4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

136. బుల్లీఫామ్ కణాల ప్రత్యేక లక్షణం-
      1) ఈనెల వెంబడి మాత్రమే ఉంటాయి      2) గడ్డి మొక్కల్లో మాత్రమే ఉంటాయి
      3) అభ్యక్ష తలంలో మాత్రమే ఉంటాయి    4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

137. నిశ్చితం (A): బుల్లీఫామ్ కణాలు నీటి నష్టాన్ని తగ్గిస్తాయి.
        వివరణ: (R): అవి పత్రాలు శ్లథస్థితిలో ఉన్నప్పుడు లోపలికి ముడుచుకునేలా చేస్తాయి.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

138. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
       1) బుల్లీఫామ్ కణాలు స్ఫీతస్థితిలో ఉన్నప్పుడు పత్రాలు బహిర్గతమవడానికి తోడ్పడతాయి.
       2) బుల్లీఫామ్ కణాలు రూపాంతరం చెందిన పృష్ఠతలంలో ఉన్న బాహ్యచర్మ కణాలు.
       3) బుల్లీఫామ్ కణాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
       4) బుల్లీఫామ్ కణాలు గడ్డిమొక్కల్లో మాత్రమే ఉంటాయి
జ: 3 (బుల్లీఫామ్ కణాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.)

 

139. నిశ్చితం (A): సమద్విపార్శ్వ పత్రాలు రెండువైపులా ఒకే రంగులో ఉంటాయి.
        వివరణ: (R): వాటిలో విభేదనం చెందని పత్రాంతరం ఉంటుంది.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

 

140. నిశ్చితం (A): పుష్పించే మొక్కల్లో ద్వితీయవృద్ధి ద్విదళ బీజాల్లో మాత్రమే కనిపిస్తుంది.
        వివరణ: (R): పార్శ్వవిభాజ్య కణావళి ద్విదళ బీజాల్లో ఉంటుంది. ఏకదళ బీజాల్లో ఉండదు.
జ: A సరైందికాదు, R సరైంది.

 

141. లెంటి రంధ్రాల ఆకారం-
జ: కటకాకారం

 

142. దారుయుత కాండాల్లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది?
జ: లెంటిరంధ్రాలు

143. ద్వితీయ కాండంలో లెంటి రంధ్రాలు చూపే భాగం-
జ: బెండు

 

144. నిశ్చితం (A): అంతర్దారువు నీటిని రవాణా చేయదు.
        వివరణ: (R): అంతర్దారువు యాంత్రిక ఆధారన్నిస్తుంది.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ కాదు.

 

145. కిందివాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
       1) అంతర్దారువు పరిమాణం ఒకే తీరుగా ఉంటుంది.
       2) ద్వితీయకాండంలో దారువు అంతా అంతర్దారువే.
       3) రసదారువు క్రమేణా అంతర్దారువుగా మారుతుంది.
       4) అంతర్దారువు ద్విదళబీజ కాండ మధ్యభాగంలో మాత్రమే ఉంటుంది.
జ: 3 (రసదారువు క్రమేణా అంతర్దారువుగా మారుతుంది.)

 

146. పత్రాలు ముడుచుకోవడం, విచ్చుకోవడం వేటి సహాయంతో జరుగుతుంది?
జ: బుల్లీఫామ్ కణాలు

 

147. ద్వితీయ దారువు దృఢంగా ఉండటానికి కారణం-
జ: లిగ్నిన్ నిర్మితం

148. నిశ్చితం (A): ద్వితీయ ద్విదళబీజకాండ మధ్యభాగం శిలీంద్రాలు, బ్యాక్టీరియాతో నశించిపోయినా మొక్క సజీవంగానే ఉంటుంది.
        వివరణ: (R): అంతర్దారువు యాంత్రిక ఆధారాన్ని మాత్రమే ఇస్తుంది.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

 

149. నిశ్చితం (A): ద్వితీయ దారువు అంతా ఒకే రకం.
        వివరణ: (R): మొక్కలు భిన్న సమయాల్లో భిన్నరకాల దారువులను ఏర్పరుస్తాయి.
జ: A సరైందికాదు, R సరైంది.

 

150. దేనిలో ప్రాథమిక దవ్వ రేఖలు ఉండవు కానీ ద్వితీయ దవ్వ రేఖలుంటాయి?
జ: ద్విదళ బీజవేరు

 

151. ద్వితీయవృద్ధిలో ద్విదళ బీజవేరులో వంపులుగా ఉన్న వలయాకారంలో విభాజ్యకణావళి 3 భాగాలుగా ఏర్పడుతుంది. వాటి క్రమం.......
         A) దారువు, పోషక కణజాలాల మధ్య ఉండే సంశ్లేషక కణజాలం నుంచి
         B) ప్రథమ దారువుపైన ఉండే పరిచక్రం నుంచి
         C) పోషక కణజాలం కింద
జ: C B A

152. నాళికా విభాజ్యకణావళి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. కానీ దీనిలో 2 రకాల విభాజ్యకణావళి ఉంటుంది. ద్వితీయాభివృద్ధి జరిగేటప్పుడు ఏర్పడే విభాజ్యకణావళి మాసిక ఏది?
జ: పుంజాంతర విభాజ్యకణావళి

 

153. పుంజాంతర విభాజ్యకణావళి అనేది-
జ: ద్వితీయ, పార్శ్వ

 

154. పుంజాంతర విభాజ్యకణావళిని ఏర్పరిచే మృదుకణజాలం ఏది?
జ: దవ్వరేఖలు

 

155. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
         1) నాళికా విభాజ్యకణావళి ఒకే తీరుగా క్రియావంతంగా ఉంటుంది.
         2) పుంజాంతస్థ విభాజ్యకణావళి ఒకే వరుసలో ఉంటుంది.
         3) నాళికా విభాజ్యకణావళి నిర్జీవ కణజాలం కంటే సజీవ కణజాలాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది.
         4) ద్వితీయ వృద్ధి తర్వాత ప్రాథమిక పోషక కణజాలం ప్రాథమిక దారువు.
జ: 2 (పుంజాంతస్థ విభాజ్యకణావళి ఒకే వరుసలో ఉంటుంది.)

 

156. నిశ్చితం (A): వసంతదారువు ఎక్కువ పరిమాణంలో ఏర్పడుతుంది.
        వివరణ: (R): మొక్కకు ఎక్కువ మొత్తంలో నీరు, ఖనిజాలు అవసరం.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

157. శరద్దారువు లక్షణాలు-
    1) ఎక్కువ సాంద్రత        2) ముదురు రంగు         3) అధిక దారునాళాలు, సన్నటి అవకాశిక          4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

158. సరికాని జతను గుర్తించండి.
       1) వసంత దారువు - తొలి దారువు                             2) శరద్దారువు - మలిదారువు
       3) వార్షిక వలయం - పెరుగుదల వలయం                    4) రసదారువు - వైట్‌వుడ్
జ: 4(రసదారువు - వైట్‌వుడ్)

 

159. జతపరచండి.

I. వసంత దారువు A) ముదురు రంగు
II. శరద్దారువు B) నీటి రవాణా
III. అంతర్దారువు C) తక్కువ సాంద్రత
IV. రసదారువు D) యాంత్రిక ఆధారం

       I    II   III     IV
జ:  C   A    D     B

160. నిశ్చితం (A): నాళికా విభాజ్యకణావళి వసంత రుతువులో ఎక్కువ దారువును, శరత్ రుతువులో తక్కువ దారువును ఏర్పరుస్తుంది.
        వివరణ: (R): విభాజ్యకణావళి క్రియాశీలతను అనేక క్రియాత్మక, ఆవరణ కారకాలు నియంత్రిస్తాయి.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

 

161. వసంతదారువు శరద్దారువును ఏ లక్షణాల్లో విభేదిస్తుంది?
      1) రంగు                    2) పరిమాణం                3) అవకాశిక పరిమాణం, సాంద్రత                4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

162. ఏ ప్రదేశాల్లో పెరిగే మొక్కల్లో వార్షిక వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి?
జ: సమశీతోష్ణ ప్రాంతాలు

 

163. నిశ్చితం (A): అంతర్దారువు నీటిని రవాణా చేయదు.
        వివరణ: (R): వాటి కణజాలాలు టానిన్‌లు, నూనెలు, జిగుర్లు, ఆవశ్యక తైలాలతో నిండి ఉంటాయి.
జ: A, R సరైనవి, A కు R సరైన వివరణ.

 

164. అంతర్దారువు రసదారువును ఏ లక్షణాల్లో విభేదిస్తుంది?
      1) పరిమాణం      2) రంగు         3) విధులు          4) అన్నీ
జ: 4 (అన్నీ)

165. ఫెల్లోజెన్ అనేది-
        1) ప్రసరణ స్తంభేతర విభాజ్యకణావళి              2) పూర్తిగా ద్వితీయం
        3) నాళికా కణజాలాలను ఏర్పరచదు             4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

166. పరిచర్మంలోని కణజాలాల క్రమం-
          A) ద్వితీయ వల్కలం             B) బెండు
          C) అంతశ్చర్మం                   D) బెండు విభాజ్యకణావళి
          E) పరిచక్రం                       F) ద్వితీయ పోషక కణజాలం
జ: B D A మాత్రమే

 

167. బెరడు అంటే అన్ని కణజాలాలు. అవి ఏమిటంటే?
జ: నాళికా విభాజ్యకణావళిపై ఉండేవి

 

168. మృదు బెరడు, దృఢ బెరడు వరుసగా ఏవిధంగా ఏర్పడతాయి?
జ: రుతువులో మొదట్లో రుతువులో చివర్లో

 

169. బండి చక్రాలు తయారు చేయడానికి ఉపయోగపడేది-
జ: అంతర్దారువు

170. బెండుకణాల కణకవచాల్లో ఉండే పదార్థం ఏది?
జ: సూబరిన్

 

171. ఆరేళ్ల వయసు ఉండే వృక్షం చూపే 6 వలయాలు-
జ: వసంత దారువు, శరత్ దారువు

 

172. ఒక వృక్షం సంవత్సరానికి అడుగు చొప్పున పెరుగుతుంది. ఒక మహిళ అమెరికా వెళ్లేటప్పుడు ఆ కాండానికి నేలపైన అడుగు ఎత్తులో మేకు కొట్టింది. 6 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఆమెకు మేకు కాండం మీద ఎక్కడ కనిపిస్తుంది?
జ: నేలపైన ఒక అడుగు

Posted Date : 02-12-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌