• facebook
  • whatsapp
  • telegram

మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం - II

1. మానవుడిలో శోషరస వ్యవస్థ
జ: వివృత రకం

 

2. కేశనాళికల్లోకి ప్రవేశించిన కణబాహ్య ద్రవం
జ: శోషరసం

 

3. కింది అంశాలను అధ్యయనం చేయండి.
a. శోషరస వ్యవస్థ వివృత రకం
b. శోషరస ముఖ్యవాహిక ఎడమ అంతర గళసిర, ఎడమ అథోజత్రుకాసిర కలిసే చోట పూర్వమహాసిరలోకి తెరచుకుంటుంది.
c. టాన్సిల్స్, ఉండూకం శోషరస అవయవాలే.
d. శోషరస కణుపుల్లో హానికర సూక్ష్మజీవులు నాశనమవుతాయి.
పై వాటిలో సరైన వ్యాఖ్యలు
జ: ఎ - బి - సి - డి

 

4. మానవుడి గుండె ద్వారా జరిగే రక్తప్రసరణ మార్గం
జ: ఎడమ కర్ణిక - ఎడమ జఠరిక - దేహభాగాలు - కుడి కర్ణిక - కుడి జఠరిక

 

5. వీటి మధ్య ఉండే రంధ్రం దగ్గర మిట్రల్ కవాటం ఉంటుంది.
జ: ఎడమ కర్ణిక - ఎడమ జఠరిక

6. స్నాయురజ్జువులు ఇక్కడ ఉంటాయి.
జ: జఠరికలు

 

7. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) సిరాకర్ణికా కణుపు - కర్ణికల గోడలు - కర్ణికా జఠరికా కణుపు - బండిల్ ఆఫ్ హిస్ - జఠరికల గోడలు - పుర్కింజే తంతువులు
2) సిరాకర్ణికా కణుపు - కర్ణికల గోడలు - కర్ణికా జఠరికా కణుపు - బండిల్ ఆఫ్ హిస్ - పుర్కింజే తంతువులు - జఠరికలు
3) సిరాకర్ణికా కణుపు - కర్ణికా జఠరికా కణుపు - కర్ణికలు - బండిల్ ఆఫ్ హిస్ - జఠరికలు
4) సిరాకర్ణికా కణుపు - కర్ణికలు - బండిల్ ఆఫ్ హిస్ - కర్ణికా జఠరికా కణుపు - జఠరికలు
జ: 2 (సిరాకర్ణికా కణుపు - కర్ణికల గోడలు - కర్ణికా జఠరికా కణుపు - బండిల్ ఆఫ్ హిస్ - పుర్కింజే తంతువులు - జఠరికలు)

 

8. కింది అంశాలను పరిశీలించండి.
ఎ. కర్ణికలు, జఠరికలను వెలుపలి వైపు వేరుచేస్తూ కర్ణికా జఠరికా పటలం ఉంటుంది.
బి. రెండు జఠరికలను వెలుపలి వైపు వేరుచేస్తూ ఏటవాలుగా జఠరికాంతర గాడి ఉంటుంది.
సి. ఒక్కో కర్ణికా పరభాగం వైపునకు పెరిగి ఉండే భాగాన్ని కర్ణికా ఉండూకం అంటారు.
డి. పిండదశలో జఠరికాంతర పటలంలో ఫాసా ఒవాలిస్ ఉంటుంది.
పైవాటిలో సరైనవి
జ: బి - సి

9. కింది అంశాలను చదవండి.
ఎ. ధమనులు రక్తాన్ని గుండె నుంచి వివిధ భాగాలకు రవాణా చేస్తాయి.
బి. ధమనుల లోపలి కుహరం ఇరుకుగా, కవాటయుతంగా ఉంటుంది.
సి. ధమనులు ఎల్లప్పుడూ కేశనాళికలతో మొదలవుతాయి.
డి. ధమని బాహ్య కంచుకం స్థితిస్థాపక కొల్లాజెన్ తంతువులతో ఏర్పడుతుంది.
పైవాటిలో సరైన అంశాలు గుర్తించండి.
జ: ఎ - డి

 

10. కింది అంశాలు అధ్యయనం చేయండి.
ఎ. రక్తస్కందనాన్ని హోమియోస్టాసిస్ అని కూడా అంటారు.
బి. రక్త స్కందనం అనేది ప్లాస్మాలో జరిగే మార్పు.
సి. సీరంలో స్కందన కారకాలైన ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజెన్ ఉండవు.
డి. రక్తపుగడ్డను థ్రాంబస్ అంటారు.
పై అంశాల్లో సరికాని దాన్ని గుర్తించండి.
జ:

11. కిందివాటిని జతపరచండి.

A. ఫోరామెన్ ఒవేల్ I. కర్ణికాజఠరికా కణుపు
B. ఎక్టోపిక్ లయారంభకం II. పిండదశలో గుండె
C. మీడియాస్టినం III. పుపుస, దైహిక చాపాలు
D. లిగమెంటం ఆర్టీరియోజం IV. గుండె

జ:  A    B   C     D 
     II     I    IV    III

 

12. కిందివాటిని జతపరచండి.

A. ఫాసా ఒవాలిస్ I. పుపుస చాపం
B. బండిల్ ఆఫ్ హిస్ II. పర మహాసిర
C. యూస్టాచియన్ కవాటం III. కర్ణికాంతర పటలం
D. అర్ధచంద్రాకార కవాటాలు IV. జఠరికాంతర పటలం

జ:   A     B    C   D 
      III    IV    II    I

13. కింది అంశాలు అధ్యయనం చేయండి.
ఎ. రక్తస్కందనానికి కాల్షియం అయాన్లు అవసరం.
బి. రక్తనిధుల్లో రక్తాన్ని నిల్వ చేయడానికి సోడియం సిట్రేట్/ ఆగ్జలేట్ లేదా EDTA ను వాడతారు.
సి. హెపారిన్ ఒక ప్రతిస్కందక పదార్థం. దీన్ని మాస్ట్ కణాలు, బేసోఫిల్స్ ఉత్పత్తి చేస్తాయి.
డి. హెపారిన్ అనే పదార్థం యాంటీథ్రాంబిన్ చర్యలను తగ్గిస్తుంది.
పైవాటిలో సరైన అంశాలు
జ: ఎ, బి, సి

 

14.  కిందివాటిని జతపరచండి.

A. కౌమాడిన్ I. బేసోఫిల్స్
B. హెపారిన్ II. విటమిన్ K కి వ్యతిరేకం
C. EDTA III. అంతర్జన్య ఫథం
D. హేజ్‌మన్ కారకం IV. రక్తాన్ని నిల్వ ఉంచేది

జ: A   B   C    D 
     II    I   IV   III

15. కింది పట్టిక పరిశీలించండి.

పైవాటిలో సరైన అంశాలు -
జ: బి, డి

 

16. కింది అంశాలు అధ్యయనం చేయండి.

సరైన అంశాలు గుర్తించండి.
జ: ఎ, బి

17. గుండెగోడలో కింది పొరలు ఉంటాయి.
ఎ. ఎపికార్డియం బి. మయోకార్డియం సి. కుడ్యస్తరం డి. ఎండోకార్డియం
వీటిని లోపలి నుంచి బయటకు సరైన వరస క్రమంలో అమర్చండి.
జ: డి, బి, ఎ, సి

 

18. రక్తప్రవాహం ఆధారంగా కిందివాటిని వరస క్రమంలో అమర్చండి.
ఎ. కుడికర్ణిక             బి. మహాసిరలు       సి. కుడిజఠరిక

  డి. పుపుస చాపం     ఇ. ఊపిరితిత్తులు     ఎఫ్. ఎడమ కర్ణిక

 జి. ఐక్యపుపుస సిర   హెచ్. ఎడమ జఠరిక
జ: బి - ఎ - సి - డి - ఇ - జి - ఎఫ్ - హెచ్

 

19. వ్యాఖ్య (A): మానవుడి గుండెలో కుడి జఠరికలోని ఆమ్లజని రహిత రక్తం ఎల్లప్పుడూ పుపుస చాపంలోకి మాత్రమే ప్రవహిస్తుంది.
    కారణం (R): పుపుస చాపం పీఠభాగంలో ఉండే పుపుస కవాటం రక్తాన్ని తిరిగి వెనక్కి ప్రవహించనీయదు.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

 

20. వ్యాఖ్య (A): ఊపిరితిత్తుల నుంచి ఎడమ కర్ణికలోకి ఆమ్లజనియుత రక్తం చేరుతుంది.
      కారణం (R): త్రిపత్ర కవాటం ఎడమ కర్ణిక నుంచి ప్రవహించడాన్ని మాత్రమే అనుమతిస్తుంది.
జ: A నిజం కానీ, R నిజం కాదు.

21. శోషరస వ్యవస్థ ముఖ్య విధి-
జ: కణాంతర ద్రవాన్ని రక్తంలోకి తిరిగి పంపడం.

 

22. కరోనరీ ధమని వ్యాధికి కారణం-
జ:  గుండె కండరాలకు  రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం

 

23. టాకీకార్డియా అంటే
జ:  గుండె వేగంగా కొట్టుకోవడం

 

24. రక్త స్కందనంలో జరిగే వివిధ దశలను వరసక్రమంలో అమర్చండి.
ఎ. ప్రోథ్రాంబిన్ ఉత్తేజితం ఏర్పడటం      బి. థ్రాంబిన్ ఏర్పడటం 
 సి. కరగని ఫైబ్రిన్ ఏర్పడటం              డి. కరిగే ఫైబ్రిన్ ఏర్పడటం
జ: ఎ - బి - డి - సి

 

25. మయోకార్డియం వీటితో ఏర్పడుతుంది.
జ: హృదయ కండరాలు

 

26.  ప్రాథమిక వృక్కాల ప్రాథమిక విధి-
జ:  ద్రవాభిసరణ క్రమత

 

27.  హృదయావరణ గ్రంథులు వీటి విసర్జకావయవాలు-
జ:  మొలస్క్‌లు

28. బౌమన్ గుళికలో రక్తకేశనాళికా గుచ్ఛం వీటి శాఖలతో ఏర్పడుతుంది.
జ: అభివాహి ధమనిక, అపవాహి ధమనిక

 

29. రెనిన్ ఈ సమయంలో విడుదలవుతుంది.
జ: అభివాహి ధమనికలో రక్తపీడనం తగ్గినప్పుడు

 

30. . ఏంజియోటెన్సిన్ II విధి-
జ: ఆల్డోస్టిరోన్ ఉత్పత్తిని ప్రేరేపించడం

 

31. ఆరంభ రహిత పదార్థం
జ:  క్రియాటినైన్

 

32. హెన్లీ శిక్యం చుట్టూ ఉన్న కేశనాళికల వల-
జ:  పెరిట్యూబులార్ వల

 

33. కిందివాటిని జతపరచండి.

A. కేలిక్స్‌లు I. పిరమిడ్‌ల కొనభాగాలు
B. వృక్క సూక్ష్మాంకురాలు II. వల్కలం భాగాలు
C. హెన్లీశిక్యం III. మూత్రాన్ని నిల్వ చేయడం
D. బెర్టిన్ స్తంభాలు IV. పిరమిడ్‌లు అమరి ఉన్న వృక్కద్రోణి అంచులు
  V. మూత్రగాఢతను పెంచడం

జ:  A   B   C    D
     IV   I    V    II

 

34.  కిందివాటిని జతపరచండి.

A. అమ్మోనియా I. ఉభయచరం
B. యూరియా II. మంచినీటి టీలియాస్ట్‌లు
C. యూరిక్ ఆమ్లం III. క్రియాటినిన్
D. ఏత్రెషోల్డ్ పదార్థాలు IV. కీటకాలు

జ: A    B    C    D
     II     I    IV    III

 

35. కిందివాటిని జతపరచండి.

A. గుచ్ఛగాలనం I. బెల్లినీ నాళం
B. అవైకల్పిక జలశోషణ II. హెన్లీశిక్యపు అవరోహి నాళిక
C. వైకల్పిక జలశోషణ III. బౌమన్ గుళిక
D. మూత్రం ఏర్పడటం IV. సామీప్య సంవళిత నాళిక
  V. దూరస్థ సంవళిత నాళిక

జ:  A   B    C   D
     III   IV   V    I

36. కింది అంశాలు అధ్యయనం చేయండి:

పై వాటిలో సరైనవి గుర్తించండి.
జ: ఎ - బి

 

37. వ్యాఖ్య (A): హెన్లీ శిక్య ఆరోహి నాళిక ద్వారా వృక్క ద్రవం ప్రవహించేటప్పుడు దాని గాఢత క్రమంగా తగ్గుతుంది.
    కారణం (R): హెన్లీ శిక్యపు ఆరోహి నాళం గోడ నీటిని శోషించదు కానీ, దాని ద్వారా అయాన్లు మెడుల్లరీ ద్రవంలోకి శోషణం చెందుతాయి.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

 

38. వ్యాఖ్య (A): మూత్రంలో గ్లూకోజ్ ఉండదు.
      కారణం (R): గ్లూకోజ్ అధికారంభ పదార్థం.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

39. మానవుడి మూత్రపిండంలోని రక్తనాళాలు కింద పేర్కొన్నారు.
ఎ. వృక్కసిర    బి. వృక్క ధమని   సి. అభివాహి ధమనిక    డి. అపవాహి ధమని
వృక్క ప్రమాణంలో వీటి ద్వారా రక్తప్రసరణ మార్గాన్ని వరస క్రమంలో చూపండి.
 జ: బి - సి - డి - ఎ

 

40. కింద పేర్కొన్న వృక్కప్రమాణ భాగాలు పరిశీలించండి.
ఎ. సామీప్య సంవళిత నాళిక     బి. సేకరణ నాళం

సి. దూరస్థ సంవళిత నాళిక      డి. హెన్లీ శిక్యం

ఇ. మాల్ఫీజియన్ దేహం
పైవాటి ద్వారా వృక్క ద్రవం ప్రవహించే మార్గాన్ని సరైన వరస క్రమంలో అమర్చండి.
 జ: ఇ - ఎ - డి - సి - బి

 

41.  కింది అంశాలు అధ్యయనం చేయండి.
ఎ. ఆక్సిడేటివ్ డీ అమీనేషన్ వల్ల అమైనో ఆమ్లాల నుంచి అమ్మోనియా ఏర్పడుతుంది.
బి. అమ్మోనియా, యూరియాల కంటే యూరిక్ ఆమ్లం తక్కువ విషప్రభావం కలిగి ఉంటుంది.
సి. అరాఖ్నిడ్‌లలో కాక్సల్ గ్రంథులు ఉంటాయి.
డి. మూత్రం ఏర్పడటంలో రెన్నిన్ ముఖ్యపాత్ర వహిస్తుంది.
పైవాటిలో సరైన అంశాలను గుర్తించండి.

1) ఎ - బి - సి    2) బి - సి - డి     3) ఎ - సి - డి    4) అన్నీ సరైనవే
జ: 4( అన్నీ సరైనవే)

 

42. కింది అంశాలు అధ్యయనం చేయండి.
ఎ. మూత్రపిండాలు తిరో ఆంత్రవేష్ణ అవయవాలు
బి. ఏంజియోటెన్సిన్ - 2 అథివృక్క వల్కలాన్ని ప్రేరేపించి ఆల్డోస్టిరాన్‌ని స్రవింపజేస్తుంది.
సి. మూత్రం విసర్జించడాన్ని మిక్చురిషన్ అంటారు.
డి. మూత్రపిండాలు విఫలమైనప్పుడు డయాలసిస్ జరుపుతారు.
ఇ. క్రస్టేషియన్లలో కాక్సల్ గ్రంథులు ఉంటాయి.
పైవాటిలో సరికానిది ఏది?
జ:  ఇ

 

43.  మానవుడిలో ముఖ్య విసర్జక పదార్థాలు
 జ: కాలేయంలో ఉత్పత్తి అయి మూత్రపిండాల ద్వారా బయటకు వెళతాయి.

 

44.  గ్లూకోజ్ ముఖ్యంగా శోషణం చెందే భాగం-
జ: సామీప్య సంవళిత నాళిక

45. మానవుడిలో కాలేయం నుంచి గుండెకు చేరే రక్తంలో అధికంగా ఉండేది.
జ: యూరియా

Posted Date : 15-10-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌