• facebook
  • whatsapp
  • telegram

సంభావ్యత

1. ఒక ఆటలో గెలవడానికి ఉన్న సంభావ్యత 0.996. అయితే గెలవకపోవడానికి ఉన్న సంభావ్యత?

A) -1          B) 1         C) 0.0040           D) 0.4 

జవాబు : C
 

2. ఒక పని కావడానికి ఉన్న సంభావ్యత 'x' అయితే ఆ పని కాకపోవడానికి ఉన్న సంభావ్యత?

A) x - 1         B) 1 - x         C) 1 - 1/x             D) x

జవాబు : B
 

3. 'EENADU' అనే పదం నుంచి ఒక అక్షరాన్ని యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తే అది హల్లు కావడానికి ఉన్న సంభావ్యత?

A) 5/6            B) 4/6           C) 2/6        D) 1

జవాబు : C
 

4. ఆంగ్ల అక్షరమాల నుంచి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎంపిక చేస్తే అది అచ్చు కావడానికి ఉన్న సంభావ్యత?

A) 5/26          B) 21/26              C) 10/13        D) 11/13

జవాబు : A
 

5. 'x' అనే సంఖ్యను 1, 2, 3 ల నుంచి, 'y' అనే సంఖ్యను 1, 4, 9 ల నుంచి తీసుకుంటే p(xy < 9) =

A) 7/9            2) 2/3        C) 5/9       D) 1/9

జవాబు : C
 

6. ఒక సంచిలో 1 నుంచి 30 వరకు సంఖ్యలు ముద్రించిన కార్డులు ఉన్నాయి. అందులో నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది 2, 3 లతో భాగించగల సంఖ్య అయ్యే సంభావ్యత?

A) 1/3          B) 1/6          C) 3/5        D) 2/15

జవాబు : B
 

7. ఒక బాక్సులో 1 నుంచి 100 వరకు రాసిన టోకెన్స్‌ వేసి, అందులోనుంచి ఒక టోకెన్‌ తీస్తే అది పరిపూర్ణ ఘనసంఖ్య అయ్యే సంభావ్యత?

A) 1/50         B) 1/100          C) 1/75       D) 1/25

జవాబు : D
 

8. రెండు పాచికలను ఒకేసారి దొర్లించారు. పాచికలపై కనిపించే రెండు సంఖ్యల మొత్తం 10 కావడానికి సంభావ్యత?

A) 5/36         B) 4/36          C) 1/12        D) 1

జవాబు : C
 

9. ఒక పెట్టెలో 10 ఎరుపు, 5 తెలుపు, 6 పచ్చ రంగు గోళీలు ఉన్నాయి. పెట్టె నుంచి తీసిన ఒక గోళీ ఎరుపు రంగుది కావడానికి ఉన్న సంభావ్యత?

A) 5/21         B) 6/21        C) 10/23         D) 10/21

జవాబు : D
 

10. కిందివాటిలో ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించనిది?

A) 1/5          B) 12%           C) -0.004           D) 0.0007

జవాబు : C
 

11. వారంలో ఒక రోజును యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే ఆ రోజు బుధవారం లేదా ఆదివారం కావడానికి సంభావ్యత?

A) 1/7            B) 2/7          C) 4/7              D) ఏదీకాదు

జవాబు : B
 

12. కిందివాటిలో ఏది అసత్యం?

A) P(E) + P(Ē) = 1

B) రెండు పాచికలను విసిరితే మొత్తం అవకాశాల సంఖ్య 36

C) 0 P(E) 1

D) P(E) + P(Ē) = 0

జవాబు : D
 

13. మూడు నాణేలను ఒకేసారి ఎగురవేసినప్పుడు వచ్చే మొత్తం అవకాశాల సంఖ్య?

A) 1           B) 4       C) 3           D) 8

జవాబు : D
 

14. P(E) = U అనేది....

A) సంభవ ఘటన               B) అసంభవ ఘటన

C) కచ్చితమైన ఘటన        D) ఏదీకాదు

జవాబు : B
 

15. దృఢ ఘటన యొక్క సంభావ్యత?

A) 0          B) 1          C) 1          D) ఏదీకాదు

జవాబు : B

బిట్లు
 

1. రెండు నాణేలను ఒకేసారి ఎగురవేసినప్పుడు కనీసం ఒక బొమ్మపడే సంభావ్యత ఎంత?                     

జవాబు :  
 

2. ఒక పెట్టెలో 1 నుంచి 40 వరకు సంఖ్యలున్న పలకలు ఉన్నాయి. వీటి నుంచి యాదృచ్ఛికంగా ఒక పలకను తీసినప్పుడు దాని మీద ఉన్న సంఖ్య 23 కంటే తక్కువగా ఉండే ప్రధాన సంఖ్య అయ్యేందుకు సంభావ్యత ఎంత?    

జవాబు :        
 

3. రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు రెండింటి మీద సరిసంఖ్య వచ్చే సంభావ్యత ఎంత?            

జవాబు :   
 

4. ఒక కుటుంబంలోని ముగ్గురు పిల్లల్లో కనీసం ఒకరు మగపిల్లవాడు అవడానికి సంభావ్యత ఎంత?

జవాబు :  
 

5. 1, 2, 3, ....., 15 సంఖ్యల నుంచి ఎంపిక చేసిన ఒక సంఖ్య 4 యొక్క గుణిజం అయ్యే సంభావ్యత ఎంత? 

జవాబు :           
 

6. ఒక లీపు సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత?    

జవాబు :        
 

7. కచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎంత?                                                                                    
జవాబు : 1        

 

8. 52 కార్డులున్న పేక కట్ట నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది ఏస్ కాకపోవడానికి సంభావ్యత ఎంత?       
జవాబు :  

 

9. 1 నుంచి 30 వరకు గల సంఖ్యల నుంచి యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎంపిక చేస్తే అది ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత?       
జవాబు :     

 

10. ఒక సంచిలో 1 నుంచి 25 వరకు సంఖ్యలు వేసిన కార్డులు ఉన్నాయి. వీటి నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది 2, 3లతో భాగించబడటానికి సంభావ్యత ఎంత?     
జ:  

 

11. ఒక పాచికను విసిరినప్పుడు దానిపై 3 యొక్క గుణిజం వచ్చే సంభావ్యత ఎంత?                               
జవాబు :         

 

12. మూడు నాణేలను ఒకేసారి ఎగురవేసినప్పుడు కనీసం రెండు బొమ్మలు పడే సంభావ్యత ఎంత?           
జవాబు :  

 

13. ఒక పరీక్షలో ఒక ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఊహించే సంభావ్యత , తప్పు సమాధానాన్ని ఊహించే సంభావ్యత . అయితే x = ?       
జవాబు : 6        

 

14. 3, 5, 5, 7, 7, 7, 9, 9, 9, 9 ల నుంచి యాదృచ్ఛికంగా ఒక అంకెను ఎంపిక చేస్తే అది ఆ దత్తాంశపు సగటు అయ్యేందుకు సంభావ్యత ఎంత?               
జవాబు :   

 

15. కిందివాటిలో ఒక ఘటన సంభావ్యత కానిది?                                             
       1)        2) 15%        3) 0.8        4) 1.5
జవాబు : 1.5

 

16. అసాధ్య ఘటన యొక్క సంభావ్యత ఎంత?                                 
జవాబు :  0        

 

17. సాధారణ సంవత్సరంలో 53 శుక్రవారాలు వచ్చేందుకు సంభావ్యత ఎంత?                  
జ:  

 

18. ఒక సంవత్సరంలో యాదృచ్ఛికంగా ఒక నెలను ఎంపిక చేస్తే అది మార్చి లేదా మే నెల అయ్యే సంభావ్యత ఎంత?                             
జవాబు :      

 

19. "PRATIBHA" అనే పదం నుంచి ఒక అక్షరాన్ని ఎంపిక చేస్తే అది అచ్చు అయ్యే సంభావ్యత ఎంత?      
జవాబు :   

 

20. రెండంకెల సంఖ్యల నుంచి ఒక సంఖ్యను యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తే అది 10 యొక్క గుణిజం అయ్యే సంభావ్యత ఎంత?        
జవాబు :       

Posted Date : 01-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌