• facebook
  • whatsapp
  • telegram

వ్యుత్పత్యర్థాలు

* అంధకారం = లోకులను అంధులుగా చేసేది - చీకటి

* అనలుడు = లోకానికి జీవనాధారమైనవాడు - అగ్ని

* అనిమిషులు = రెప్పపాటు లేనివారు - దేవతలు

* అనిలుడు = ప్రాణులకు జీవనాధారమైనవాడు - వాయువు

* అమృతం = మరణం లేకుండా చేసేది - సుధ

* ఇతిహాసం = ఇలా జరిగిందని చెప్పేది - తొల్లిటి కథ

* ఉరగం = రొమ్ముతో పాకేది - పాము

* ఉర్వి = విశాలమైంది - భూమి

* కంఠీరవం = కంఠంలో ధ్వని కలది - సింహం

* క్ష్మా = భారం వహించడంలో ఓర్పు కలది - భూమి

* కేశం = శిరస్సున ఉండేది - వెంట్రుక

* ఖగం = ఆకాశంలో పోయేది - పక్షి

* ఛాందసుడు = ఛందోరూపమైన వేదం చదివినవాడు - బ్రాహ్మణుడు

* తార = దీనితో నావికులు తరింతురు - చుక్క

* దినకరుడు = దినాన్ని కలుగజేసేవాడు - సూర్యుడు

* ధరణి = సమస్తాన్ని ధరించేది - భూమి

* నందనుడు = సంతోషాన్ని కలిగించేవాడు - కొడుకు

* భూజం = భూమి నుంచి పుట్టింది - చెట్టు

* వారిజం = నీటి నుంచి పుట్టింది - పద్మం

* వారిజగర్భుడు = పద్మం గర్భంగా ఉన్నవాడు - బ్రహ్మ

* స్రవంతి = పర్వతాదుల నుంచి స్రవించేది - నది

* అంబుజ నాభుడు = పద్మం నాభియందు కలవాడు - విష్ణువు

* అకూపారం = కుత్సితముగాని దరిగల్గినది - సముద్రం

* అక్షరం = నాశనం లేనిది - వర్ణం, పరబ్రహ్మం

* అతిథి = తిథి, వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు - ఆగంతకుడు

* ఆత్మజుడు = తనవల్ల పుట్టినవాడు - కుమారుడు

* క్ష్మాపాలుడు = భూమిని పాలించేవాడు - రాజు

* గురువు = అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు - ఉపాధ్యాయుడు

* జలజాతం = నీటి నుంచి పుట్టింది - పద్మం

* దాశరథి = దశరథుడి కుమారుడు - రాముడు

* మధువ్రతం = మధువు సేకరించడం వ్రతంగా కలిగినది - తుమ్మెద

* పంచాస్యం = వెడల్పైన ముఖం కలది - సింహం

* భూసురులు = భూమిమీద దేవతలు - బ్రాహ్మణులు

* భృంగం = నీలిమను భరించేది - తుమ్మెద

* ధర = సమస్తాన్ని తనలో ధరించేది - భూమి

* ధూర్జటి = భారమైన జడలు కలిగిన వాడు - శివుడు

* మౌక్తికం = ముత్యపు చిప్ప నుంచి వచ్చేది - ముత్యం

* శైలం = శిలలను తనయందు కలిగింది - పర్వతం

* హస్తి = హస్తం కలది - ఏనుగు

* అంగన = శ్రేష్టమైన అవయవాలు కలది - స్త్రీ

* ఈశ్వరుడు = స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు - శివుడు

* కరి = తొండం కలది - ఏనుగు

* చిత్రగ్రీవం = చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠాన్ని కలిగినది - పావురం

* ఝరి = కాలక్రమంలో స్వల్పమైపోయేది - ప్రవాహం

* తాపసుడు = తపస్సు చేసేవాడు - ముని

* దేహుడు = దేహం కలవాడు - ప్రాణి

* పతివ్రత = పతిని సేవించుటయే నియమంగా కలిగింది - సాధ్వి

* పక్షి = పక్షాలు కలది - పిట్ట

* పవనజుడు = పవనుడి వల్ల పుట్టినవాడు - హనుమంతుడు

* పార్వతి = హిమవంతుడనే పర్వతరాజు కూతురు - పార్వతి

* పుత్రుడు = పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు - కుమారుడు

* పురంధ్రి = గృహాన్ని ధరించేది - ఇల్లాలు

* భవాని = భవుని భార్య - పార్వతి

* మిత్రుడు = సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు - సూర్యుడు

* ముని = మౌనందాల్చి ఉండేవాడు - రుషి

* మూషికం = అన్నాదులను దొంగలించేది - ఎలుక

* మోక్షం = జీవుణ్ని పాశం నుంచి విడిపించేది - ముక్తి

* వనజం = వనం (నీటి)లో నుంచి పుట్టింది - పద్మం

* శివుడు = సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు, మంగళప్రదుడు - ఈశ్వరుడు

* సన్యాసి = సర్వమూ న్యాసం చేసినవాడు - రుషి

* సముద్రం = చంద్రోదయం వల్ల ఎక్కువగా వృద్ధి పొందేది - వార్ధి

* జలధి = జలాన్ని ధరించింది - సముద్రం

మాదిరి ప్రశ్నలు

1. అమరావతిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు. గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి.

1) హరించేవి      

2) హర్షం తెప్పించేవి 

3) మనోహరంగా ఉండేవి 

4) దొంగిలించేవి

2. శివుడు ముక్కంటి. గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి.

1) సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు

2) అందరి కోర్కెలను తీర్చేవాడు

3) మూడు కన్నులు కలవాడు

4) ఐశ్వర్యం ఇచ్చేవాడు

3. గత శతాబ్దం నుంచి భారతదేశ ప్రగతి మరింత ఇనుమడించింది.

1) సంవత్సరాల కాలం  

2) వంద సంవత్సరాలకాలం  

3) వెయ్యి సంవత్సరాల కాలం  

4) ఇరవై అయిదు సంవత్సరాల కాలం

4.  రాణీ రుద్రమ రాజ్య పాలనలోపేరుగాంచిన అంగన. గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి.

1) మంచి అవయవములు కలది 

2) దుకాణాలను నిర్వహించేది

3) వివిధ శాఖలను నైపుణ్యంతో నిర్వహించేది

4) పతిని సేవించడమే వ్రతంగా కలది

5. ‘విషయాదులతో హరించేది’ వ్యుత్పత్తి పదం?

1) హరి     2) కరి 

3) హృదయం     4) హరం

6. ‘చిత్రగ్రీవం’ వ్యుత్పత్యర్థం .....

1) చిత్రమైన గ్రాసం కలది 

2) చిత్రమైన నడుం కలది 

3) చిత్రమైన ముఖం కలది 

4) చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది

7. ఉదకాన్ని ధరించేది - వ్యుత్పత్యర్థ పదం? 

1) ఉదధి     2) జాతకర్ణి 

3) కేసరి     4) ఉసురు

8. సీత, సావిత్రి, అనసూయ పతివ్రతలు. గీతగీసిన పదానికి వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి.

1) సమాన సామర్థ్యం కలది 

2) పతిని సేవించడమే వ్రతంగా కలది 

3) భర్త అడుగుజాడల్లో నడిచేది 

4) అందరి కోర్కెలు తీర్చేవారు

9. అపారమైన తీరం కలది - వ్యుత్పత్తి అర్థం..... 

1) ఉదధి     2) కడలి 

3) అంబుధి     4) పారావారం

10. తీయనైన భాష తెలుగు భాష - గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం ఏది?

1) భేషజంతో కూడింది 

2) భాష మాట్లాడేది  

3) భాషించేది 

4) భూషించేది

11. పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు ...... 

1) కొడుకు     2) కుమారుడు 

3) పుత్రుడు     4) తనూభవుడు

12. ‘నీలిమను భరించేది’ అనే వ్యుత్పత్యర్థం కలిగిన పదం ఏది? 

1) తారుణ్యం     2) భృంగం 

3) కరి     4) మూషికం

13. మననం చేయదగినది - వ్యుత్పత్యర్థ పదాన్ని గుర్తించండి.

1) దిక్కు     2) చిరంజీవి 

3) తంత్రం     4) మంత్రం

14. పరాశర మహర్షి కుమారుడు అనే వ్యుత్పత్తిని ఇచ్చే పదం ఏది?

1) వ్యాసుడు     2) బాదరాయణుడు 

3) పారాశర్యుడు     4) వాసిష్టుడు

15. పొందదగింది అనే వ్యుత్పత్యర్థం కలిగిన పదం ఏది? 

1) రాశి    2) ద్రవ్యం    3) హేమం    4) రజితం

16. అవనిని కాలుష్యం కోరల నుంచి రక్షించడం అందరి బాధ్యత.

1) అవయవములు కలది 

2) వాతావరణాన్ని ఇచ్చేది 

3) ప్రజలను రక్షించేది 

4) జనులు దీనిలో నివసిస్తారు

17. తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు?

1) అతిథి     2) రాజు 

3) దేవుడు     4) మనిషి

18. ‘నూరు సంవత్సరాల పరిమితి ఉన్న కాలం’ అనే వ్యుత్పత్యర్థాన్ని కలిగిన పదం కిందివాటిలో ఏది?

1) పంచాబ్దం     2) సహస్రాబ్దం 

3) దశాబ్దం     4) శతాబ్దం

19. సత్పురుషులయందు పుట్టింది - అనే   వ్యుత్పత్యర్థాన్ని కలిగిన పదం ఏది? 

1) ధాన్యం     2) ధనువు 

3) సత్యం     4) ధార్మికతం

20. వృద్ధిపొందినవాడు - అనే వ్యుత్పత్యర్థాన్ని కలిగిన పదం ఏది? 

1) అది    2) వృద్ధుడు    3) హరి    4) పథం

21. సర్వభూతాల యందు స్నేహయుక్తుడు. దీనికి వ్యుత్పత్యర్థం ఏది? 

1) మిత్రుడు     2) సూర్యుడు 

3) చంద్రుడు     4) ఇంద్రుడు

22. శిలలను తనయందు కలిగింది - దీనికి సరిపోయే వ్యుత్పత్యర్థ పదం ......

1) ఉపలం     2) రాయి 

3) శైలం     4) నగం

23. పక్షాలు కలది - దీనికి వ్యుత్పత్యర్థం  ఏది? 

1) రాజు      2) కన్ను  

3) రాత్రి      4) పక్షి

24. నేటి భారత పురంధ్రి అన్ని రంగాల్లో ముందంజ వేస్తోంది.

1) పురాలను ఏలేది 

2) గృహాలను భరించేది

3) పూలమాలను ధరించేది

4) అందరి తప్పులను భరించేది

25. అంగన అనే పదానికి వ్యుత్పత్యర్థం ..... 

1) శ్రేష్ఠమైన అంగాలు కలది 

2) అంగ దేశంలో పుట్టింది

3) అంగుళం పొడవు కలది 

4) అంగాలు కలది

26. ‘ప్రకాశింపజేసేది’ - వ్యుత్పత్యర్థం కలిగిన పదం ఏది?

1) దీపం    2) గృహం    3) పందిరి    4) పథం

27. నశింపనిది అనే వ్యుత్పత్తి కలిగిన పదం ఏది?

1) అవని    2) అక్షరం    3) వారధి    4) దీపం

సమాధానాలు

1 - 3    2 - 1    3 - 2    4 - 1    5 - 3    6 - 4    7 - 1    8 - 2    9 - 4    10 - 3     11 - 3    12 - 2    13 - 4    14 - 2    15 - 2     16 - 3    17 - 1    18 - 4    19 - 3    20 - 2     21 - 1    22 - 3    23 - 4    24 - 2    25 - 1    26 - 1    27 - 2


 

Posted Date : 11-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌