• facebook
  • whatsapp
  • telegram

వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్‌మెంట్ (Verification of Truth Statement)

జనరల్ స్టడీస్‌లోని లాజికల్ రీజనింగ్‌లో భాగంగా 'వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్‌మెంట్' నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక సంఘటన లేదా వస్తువు లేదా విభాగానికి సంబంధించి ప్రశ్న ఉంటుంది. దానికి అనుబంధంగా ఉండే ముఖ్యమైన భాగాన్ని లేదా అంశాన్ని అభ్యర్థులు గుర్తించాలి. ఇచ్చిన నాలుగు ఆప్షన్ల నుంచి సరైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా భౌగోళిక, సాంఘిక, క్రీడా, నిత్యజీవిత అనుభవాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఈ ప్రశ్నల వాక్యంలోని ఒక ప్రత్యేక పదానికి, ఇచ్చిన నాలుగు ఆప్షన్లతో దాదాపు దగ్గరి సంబంధం ఉంటుంది. వాటి నుంచి కచ్చితమైన జవాబును గ్రహించడంలోనే అభ్యర్థుల సామర్థ్యం వెల్లడవుతుంది. కొద్దిగా ఆలోచించి సమాధానాన్ని నిర్ణయించాలి. కింద ఇచ్చిన కొన్ని ప్రశ్నలు, వాటి వివరణాత్మక జవాబులను పరిశీలిస్తే ఈ విభాగంపై పట్టు సాధించవచ్చు.

1. మనిషి ఎప్పటికీ కలిగి ఉండేది?
ఎ) పళ్లు బి) కళ్లు సి) చేతులు డి) గుండె
జవాబు: డి
వివరణ: గుండె లేకపోతే మనిషి బతకలేడు. ఇచ్చిన ఆప్షన్లలో మిగతా అవయవాలు లేకపోయినా జీవించవచ్చు. కాబట్టి మనిషి ఎప్పటికి కలిగి ఉండాల్సింది కచ్చితంగా గుండె.

2. పుస్తకం ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) అంశాలు బి) పేజీలు సి) బొమ్మలు డి) విషయాలు
జవాబు: బి
వివరణ: పేజీలను కలిగి ఉంటేనే పుస్తకం అంటాం. పేజీలు లేకపోతే ఆప్షన్లలో ఇచ్చినవి ఏవీ ఉండవు. కాబట్టి 'పేజీలు' సమాధానం అవుతుంది.

3. పాఠశాల ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) భవనం బి) గ్రంథాలయం సి) నల్లబల్ల డి) తరగతులు
జవాబు: డి
వివరణ: తరగతులు ఉంటేనే పాఠశాల అంటారు. తరగతులు లేకుండా మిగతావి ఉన్నంత మాత్రాన దాన్ని పాఠశాల అనలేం. అందుకే 'తరగతులు' జవాబు.

4. వాతావరణం ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) ఆక్సిజన్ బి) తేమ సి) ఆర్ద్రత డి) గాలి
జవాబు: డి
వివరణ: ఇచ్చిన నాలుగు ఆప్షన్లు వాతావరణంలో భాగాలే. కానీ వాతావరణంలో అత్యధిక పరిమాణంలో ఉండేది 'గాలి'. అందుకే అదే సమాధానం అవుతుంది.

5. గడియారం ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) బ్యాటరీ బి) సంఖ్యలు సి) ముళ్లు డి) అలారం
జవాబు: సి
వివరణ: ముళ్లు లేకపోతే దాన్ని గడియారంగా భావించలేం. బ్యాటరీ, సంఖ్యలు, అలారం లేకపోయినా ముళ్లు ఉంటే దాన్ని గడియారంగా గుర్తించవచ్చు.

6. ఫ్యాన్ ఎల్లప్పుడూ కలిగి ఉండేది ?
ఎ) స్విచ్ బి) రెక్కలు సి) వైరు డి) కరెంట్
జవాబు: బి
వివరణ: ఫ్యాన్ కచ్చితంగా కలిగి ఉండాల్సింది రెక్కలు. అవి లేకుండా స్విచ్, వైరు, కరెంట్ ఉన్నా దాన్ని ఫ్యాన్‌గా పరిగణించలేం.

7. చెట్టు ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) పూలు బి) ఆకులు సి) వేర్లు డి) పండ్లు
జవాబు: సి
వివరణ: చెట్టు ఎల్లప్పుడూ కలిగి ఉండాల్సింది వేర్లు. ఎందుకంటే వేర్లు లేకపోతే చెట్టు జీవించలేదు. చెట్టు జీవించి ఉంటేనే పూలు, ఆకులు, పండ్లు ఉంటాయి.

8. వార్తా పత్రికలు ఎల్లప్పుడూ కలిగి ఉండేవి?
ఎ) వార్తలు బి) ప్రకటనలు సి) కాగితం డి) ఎడిటర్
జవాబు:
వివరణ: వార్తాపత్రికల్లో తప్పనిసరిగా ఉండాల్సింది వార్తలే. అవి లేకపోతే దాన్ని వార్తాపత్రిక అనలేం. కేవలం పేపర్, ఎడిటర్, ప్రకటనలు ఉన్నంత మాత్రాన దాన్ని వార్తాపత్రికగా భావించలేం.

9. రైలు ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) పట్టాలు బి) డ్రైవరు సి) ఇంజిన్ డి) గార్డు
జవాబు: సి
వివరణ: పట్టాలు, డ్రైవర్, గార్డు ఉన్నప్పటికీ ఇంజిన్ లేకపోతే రైలు నడవదు. కాబట్టి రైలు ఎల్లప్పుడూ కలిగి ఉండేది ఇంజిన్.

10. కలం ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) సిరా బి) ట్యూబ్ సి) నిబ్ డి) క్యాప్
జవాబు: సి
వివరణ: కలం ఎల్లప్పుడూ కలిగి ఉండాల్సింది నిబ్. ఎందుకంటే నిబ్ లేకపోతే సిరా, క్యాప్, ట్యూబ్ ఉన్నా దాంతో రాయడం కుదరదు.

11. ఒక పరిశ్రమ ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) పొగ గొట్టం బి) కార్మికులు సి) కరెంట్ డి) అమ్మకందార్లు
జవాబు: బి
వివరణ: పరిశ్రమలో కచ్చితంగా కార్మికులు ఉండాలి. వాళ్లు లేకపోతే దాన్ని పరిశ్రమగా గుర్తించలేం.

12. బల్బు ఎల్లపుడూ కలిగి ఉండేది?
ఎ) ఫిలమెంట్ బి) కాంతి సి) కరెంట్ డి) గ్లాస్
జవాబు:
వివరణ: బల్బ్ ఎల్లప్పుడూ కలిగి ఉండేది ఫిలమెంట్. కరెంట్, గ్లాస్, ఉన్నా ఫిలమెంట్ లేకపోతే దాన్ని బల్బ్‌గా పరిగణించం. కాంతి ఒక్క బల్బు నుంచే కాదు రకరకాలుగా కూడా వస్తుంది.

13. ఆసుపత్రి ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) గది బి) నర్సు సి) వైద్యులు డి) మంచం
జవాబు: సి
వివరణ: వైద్యులు లేకపోతే దాన్ని ఆసుపత్రి అనలేం. కాబట్టి అదే సమాధానం.

14. కారు ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) డ్రైవరు బి) డిక్కీ సి) చక్రాలు డి) బ్రేకులు
జవాబు: సి
వివరణ: కారు కదలాలంటే చక్రాలు ముఖ్యం. అవి లేకుండా డ్రైవరు, డిక్కీ, బ్రేకులు ఉన్నా ఉపయోగం లేదు.

15. పాటలో ఎప్పుడూ ఉండేవి?
ఎ) కోరస్ బి) సంగీతం సి) పదాలు డి) గాయకుడు
జవాబు: సి
వివరణ: పదాలు లేకపోతే పాట ఉండదు. కాబట్టి పాటకు కావాల్సింది పదాలే.

16. జైలు ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) ఊచలు బి) జైలరు సి) తాళాలు డి) లాయరు
జవాబు: సి
వివరణ: తాళాలు లేకపోతే జైలు అవదు. ఊచలు, జైలరు, లాయరు ఉన్నంత మాత్రాన జైలు అనలేం.

17. కొండ ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) ఎత్తు బి) జంతువులు సి) చెట్లు డి) నీరు
జవాబు:
వివరణ: కొండ ఎల్లప్పుడూ కలిగి ఉండేది ఎత్తు. ఎందుకంటే ఎత్తుగా ఉంటేనే దాన్ని కొండ అంటారు.

18. కెమెరా ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) కటకాలు (లెన్స్) బి) రీల్స్ సి) ఫ్లాష్ డి) ఫొటోగ్రాఫ్
జవాబు:
వివరణ: కటకాలు లేకుండా కెమెరా ఉండదు. కాబట్టి కెమెరాకు అవే ప్రధానం.

19. క్రికెట్‌కు అతి ముఖ్యమైంది?
ఎ) స్టంప్స్ బి) బ్యాట్ సి) పిచ్ డి) ప్యాడ్స్
జవాబు: బి
వివరణ: బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడలేం. మిగిలినవి లేకపోయినా ఆడవచ్చు. అందుకే అదే సమాధానం అవుతుంది.

20. పాలు ఎల్లప్పుడూ కలిగి ఉండేది?
ఎ) పంచదార బి) కొవ్వులు సి) కాల్షియం డి) నీరు
జవాబు: సి
వివరణ: పాలు ఎల్లప్పుడూ కలిగి ఉండేది కాల్షియం. ఎందుకంటే పంచదార, నీరు, కొవ్వులు లేకపోయినా పాలు ఉంటాయి.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌