• facebook
  • whatsapp
  • telegram

ఐరోపావారి రాక - వర్తక స్థావరాల స్థాపన

పోర్చుగీసు వారు

* తురుష్కులు 1453లో కాన్‌స్టాంట్‌నోపుల్‌ను ఆక్రమించారు. దీంతో తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఏకైక భూమార్గం మూసుకుపోయింది. పోర్చిగీసువారు తొలిసారిగా కొత్త సముద్రమార్గాలను అన్వేషించడం ప్రారంభించారు.
* పోర్చుగల్‌ రాజు హెన్రీ నావికా శిక్షణ పాఠశాలలు స్థాపించి నావికులను ప్రోత్సహించడంతో బార్తోలామియోడయాజ్‌ అనే నావికుడు తుపానుల అగ్రం/కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ను కనుక్కున్నాడు.
* పోర్చుగల్‌ నావికుడు వాస్కోడిగామా 1498, మే 17న కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ ద్వారా వచ్చి కేరళలోని కాలికట్‌ చేరుకున్నాడు. అక్కడి రాజు జామెరిన్‌ (రాజా మను విక్రమ వర్మ) పోర్చుగీసువారికి వ్యాపార అనుమతి మంజూరు చేశాడు.
* డి ఆల్మడా అనే పోర్చుగీసు గవర్నర్‌ సముద్ర వ్యాపార ఆధిపత్యం కోసం నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు.
* 1510లో పోర్చుగీసు గవర్నర్‌ ఆల్బూకర్క్‌ శ్రీకృష్ణదేవరాయలుతో సంధి చేసుకున్నాడు. అతడి సాయంతో బీజాపూర్‌ సుల్తాన్‌ను ఓడించి గోవాను సొంతం చేసుకున్నాడు.
* భారతదేశంలో పోర్చుగీసువారి తొలివర్తక స్థావరం కాలికట్‌. ప్రధాన వర్తక స్థావరం గోవా.
* భారతదేశానికి మొదటగా వచ్చిన ఐరోపా దేశంపోర్చుగల్‌. అయితే ఆంధ్రదేశంలో మాత్రం చివరగా అడుగుపెట్టారు. వీరు 1670లో మచిలీపట్నం (ఆంధ్రా)లో తొలి వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయిన పోర్చుగీసువారు గోవా, డయ్యూ, డామన్‌లను మాత్రమే తమ అధీనంలో ఉంచుకున్నారు. భారత ప్రభుత్వం 1961లో సైన్యాన్ని పంపి ఆపరేషన్‌ విజయ్‌ ద్వారా పోర్చుగీసువారి నుంచి గోవా, డయ్యూ, డామన్‌లను స్వాధీనం చేసుకుంది. అందుకే భారతదేశానికి తొలిసారి వచ్చిన, చివరగా వెళ్లిన ఐరోపా దేశంగా పోర్చుగల్‌ను పేర్కొంటారు.

డచ్చివారు
* 1605లో డచ్చివారు (నెదర్లాండ్స్‌/హాలెండ్‌) మచిలీపట్నం చేరుకుని మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా నుంచి వ్యాపార అనుమతిని పొందారు.
* వీరి తొలి వర్తక స్థావరం మచిలీపట్నం. ప్రధాన వర్తక స్థావరం నాగపట్నం. మొదట పులికాట్‌ వీరికి ప్రధాన వర్తక స్థావరంగా ఉండేది.
* ఆంధ్రదేశంలో అడుగుపెట్టిన తొలి ఐరోపా దేశం డచ్‌ నెదర్లాండ్స్‌. నీ డచ్చివారు 10 మంది ఆంగ్ల వర్తకులను చంపిన సంఘటన 1623లో జరిగింది. దీన్నే అంబాయినా వధ అంటారు. నాటి డచ్‌ గవర్నర్‌ వాన్‌స్పెల్ట్‌. నీ సుగంధ ద్రవ్యాల నుంచి వస్త్ర వ్యాపారంపై దృష్టిపెట్టిన తొలి ఐరోపా దేశం డచ్‌ నెదర్లాండ్స్‌. నీ డచ్‌వారు ఆంధ్రదేశంలోని పేటపోలి (కృష్ణా జిల్లా), నరసాపూర్‌, భీమునిపట్నం వంటి ప్రాంతాల్లో వర్తక స్థావరాలు స్థాపించారు.
* నాటి గోల్కొండ సుల్తాన్‌ మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా డచ్‌వారికి వజ్రాల గనులపై గుత్తాధికారాన్ని కల్పించారు. సొంతంగా నాణేలను ముద్రించుకోవడానికి అనుమతి ఇచ్చాడు.


డెన్మార్క్‌వారు
* డెన్మార్క్‌ (డ్రేన్స్‌)వారు 1615లో తమ తొలి వర్తక స్థావరాన్ని ట్రాంక్వీబార్‌లో ఏర్పాటు చేశారు. వీరి ప్రధాన వర్తక కేంద్రాన్ని సేరాంపూర్‌లో నెలకొల్పారు.

 

ఫ్రెంచివారు
* ఫ్రెంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1664లో ఏర్పాటయ్యింది. 1668లో ఔరంగజేబు అనుమతితో ఫ్రెంచివారు తమ తొలి వర్తక స్థావరాన్ని సూరత్‌లో స్థాపించారు. వీరు ఆంధ్రదేశంలో తొలి వర్తక స్థావరాన్ని 1669లో మచిలీపట్నంలో నెలకొల్పారు.
* ఫ్రాంకోయిస్‌ మార్టిన్‌ అనే ఫ్రెంచి అధికారి వాలికొండాపురం ప్రాంతాన్ని పొంది, అక్కడ పుదుచ్ఛేరి/ పాండిచ్చేరిని నిర్మించాడు. ఫ్రెంచివారి ప్రధాన వర్తక స్థావరం పుదుచ్చేరి. నీ వీరు 1708లో యానాం వద్ద వర్తక స్థావరాన్ని నెలకొల్పారు.
* ఆంధ్ర దేశానికి వచ్చిన ఐరోపా దేశాలు వరుసగా.. డచ్‌ నెదర్లాండ్స్‌, ఆంగ్లేయులు, ఫ్రెంచివారు, పోర్చుగీసువారు.

ఆంగ్లేయులు
* ఆంగ్లేయులు క్రీ.శ.1600లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆఫ్‌ ఇంగ్లండ్‌ను స్థాపించారు. మొదటి ఎలిజిబెత్‌ రాణి రాయల్‌ చార్టర్‌ చట్టం ద్వారా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి అనుమతిచ్చారు.
* వీరు 1611లో గ్లోబ్‌ నౌకలో హిప్పన్‌ నాయకత్వంలో మచిలీపట్నం చేరుకున్నారు. నాటి గోల్కొండ పాలకుడు మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా వారికి వ్యాపార అనుమతి మంజూరు చేశాడు. కానీ వీరు 1621లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు.
* 1608లో జహంగీర్‌ ఆస్థానానికి వచ్చిన విలియం హాకిన్స్‌ (ఆంగ్లేయుడు)కు వ్యాపార అనుమతిని ఇవ్వలేదు.
* 1615- 16లో సర్‌ థామస్‌ రో అనే ఆంగ్లేయుడు జహంగీర్‌ ఆస్థానానికి వచ్చి నూర్జహాన్‌ సహాయంతో వ్యాపార అనుమతిని పొందాడు. తమ తొలి వర్తక స్థావరాన్ని 1616లో సూరత్‌లో నెలకొల్పాడు.
* ఆంగ్లేయుల తొలి వర్తక స్థావరం సూరత్‌. ప్రధాన వర్తక స్థావరం మద్రాస్‌ (సెయింట్‌ జార్జికోట).నీ ఆంగ్లేయులు ఆంధ్రదేశంలోని పులికాట్‌ (1621), ఆర్ముగం/ ఆర్మగాన్‌ (1626), నిజాంపట్నం, భీమునిపట్నం (1632), విశాఖపట్నం (1682), ఇంజరం (1708)లో వర్తక స్థావరాలు నెలకొల్పారు.నీ ఆంగ్లేయులకు ఆంధ్ర దేశంలో అనేక ప్రయోజనాలు కల్పిస్తూ నాటి గోల్కొండ పాలకుడు అబ్దుల్లా కుతుబ్‌షా 1632లో గోల్డెన్‌ ఫర్మానా జారీ చేశాడు.నీ ఫ్రాన్సిస్‌ డే అనే ఆంగ్లేయుడు దామెర్ల సోదరుల నుంచి రెండు గ్రామాలను కొనుగోలు చేసి సెయింట్‌ జార్జ్‌ కోటను నిర్మించాడు (చెన్నపట్నం/చెన్నైను నిర్మించాడు).
* 1684లో మద్రాస్‌ ప్రెసిడెన్సీనీ, 1683లో మద్రాస్‌ నగరపాలక సంస్థనూ ఏర్పాటు చేసిన ఆంగ్లేయులు 1802లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని (వెల్లస్లీ) ఏర్పాటు చేశారు.
* ఆంగ్లేయులు కలకత్తాలో విలియం కోటను (జాబ్‌ చర్నాక్‌), కడలూరు వద్ద సెయింట్‌ డేవిడ్‌ కోటను కట్టించారు. నీ బొంబాయిని గొప్ప వాణిజ్య కేంద్రంగా జెరాల్డ్‌ ఆంగియర్‌ అభివృద్ధి చేశాడు. నీ 1717లో విలియం హామిల్టన్‌ అనే ఆంగ్ల వైద్యుడు మొగల్‌ చక్రవర్తి ఫరూక్‌ షియర్‌కు వచ్చిన వ్యాధిని నయం చేసి గోల్డెన్‌ ఫర్మానాను పొందాడు.

కర్ణాటక యుద్ధాలు
* 1740-1763 మధ్యకాలంలో ఆంగ్లేయులు, ఫ్రెంచివారికి మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి.
* 1740-48 మధ్య జరిగిన మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఆస్ట్రియా వారసత్వ సమస్య. నీ మొదటి కర్ణాటక యుద్ధం 1746లో కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌, ఫ్రెంచి గవర్నర్‌ డూప్లేల మధ్య జరిగింది. ఇదే శాంథోమ్‌ యుద్ధం. ఈ యుద్ధం 1748లో ఎక్స్‌-లా-చాపెల్‌ సంధి ద్వారా ముగిసింది. నీ రెండో కర్ణాటక యుద్ధం 1749-53 మధ్య జరిగింది. దీనికి కారణం కర్ణాటక, హైదరాబాద్‌ వారసత్వ తగాదాల్లో ఆంగ్ల, ఫ్రెంచి కంపెనీలు జోక్యం చేసుకోవడం. నీ నాజర్‌జంగ్‌ (హైదరాబాద్‌), అన్వరుద్దీన్‌ (కర్ణాటక)లను ఆంగ్లేయులు బలపరచగా; ముజఫర్‌ జంగ్‌, చందా సాహెబ్‌లను ఫ్రెంచివారు బలపరిచారు. నీ మొదట ఫ్రెంచి గవర్నర్‌ డూప్లే కర్ణాటకపై దండెత్తి, అన్వరుద్దీన్‌ను చంపి చందా సాహెబ్‌ను రాజుగా నియమించాడు. ఇదే 1749 - అంబూరు యుద్ధం. నీ రాబర్ట్‌ క్లైవ్‌ 1752లో కర్ణాటకపై దండెత్తి, ఆర్కాటు పట్టణాన్ని ముట్టడించి చందా సాహెబ్‌ను తొలగించి మహమ్మదాలీని నవాబు చేశాడు. ఈ సమయంలోనే రాబర్ట్‌ క్లైవ్‌ ‘ఆర్కాటు వీరుడు’గా పేరొందాడు. నీ హైదరాబాద్‌లో ముజఫర్‌, నాజర్‌ జంగ్‌లు హత్యకు గురికావడంతో ఫ్రెంచివారు సలాబత్‌జంగ్‌ను హైదరాబాద్‌ పాలకుడిగా నియమించారు. సలాబత్‌జంగ్‌ దానికి ప్రతిఫలంగా ఉత్తర సర్కారులను ఫ్రెంచివారికి ఇచ్చాడు. నీ బుస్సీ నాయకత్వంలో కొంత సైన్యం హైదరాబాదులో సలాబత్‌ జంగ్‌కు రక్షణగా నియమితమైంది. ఈయన ప్రమేయంతోనే విజయనగరం, బొబ్బిలి జమీందారుల మధ్య 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది. నీ రెండో కర్ణాటక యుద్ధం 1753లో పాండిచ్చేరి సంధితో ముగిసింది.నీ మూడో కర్ణాటక యుద్ధం 1756-63 మధ్య జరిగింది. ఈ యుద్ధానికి కారణం సప్తవర్ష సంగ్రామం (1756-63). మూడో కర్ణాటక యుద్ధం నాటి ఫ్రెంచి గవర్నర్‌ కౌంట్‌ డి బాలీ.
* ఈ యుద్ధంలో భాగంగా 1758లో చందుర్తి, 1759లో మచిలీపట్నం, 1760లో వందవాసి/ వాండీవాష్‌ యుద్ధాలు జరిగాయి. నీ మూడో కర్ణాటక యుద్ధానంతరం సలాబత్‌జంగ్‌ ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకిచ్చాడు.నీ భారతదేశంలో ఫ్రెంచివారి ప్రాబల్యాన్ని మూడో కర్ణాటక యుద్ధం అంతం చేసింది. ఈ యుద్ధం 1763 నాటి పారిస్‌ సంధితో ముగిసింది. నీ ఈ సంధి ద్వారా పాండిచ్చేరి, యానాం తప్ప మిగిలిన ఫ్రెంచి స్థావరాలన్నీ ఆంగ్లేయుల పరమయ్యాయి.

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌