గత పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు
1. ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం ఏది? (ఏపీపీఎస్సీ గ్రూప్-1, 2010)
జ: కిలిమంజారో
2. ఎర్ర సముద్రం కిందివాటిలో దేనికి ఉదాహరణ? (జె.ఎల్., 2007)
1) ఎత్తైన నిర్మాణం 2) ముడుచుకున్న నిర్మాణం
3) పగులు లోయ 4) లావా నిర్మాణం
జ: 3(పగులు లోయ)
3. మన దేశంలో అత్యంత పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయి?
(జె.ఎల్., 2004, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, 2011)
జ: ఆరావళి పర్వతాలు
4. బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఉన్న ప్రదేశం? (ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, 2009)
జ: జర్మనీ
5. కిందివాటిలో ఏవి భూకంపాలను కలిగిస్తాయి? ( సివిల్స్, 2004)
i) భ్రంశం రూపొందడం ii) భ్రంశం వెంబడి చలనం
iii) అగ్ని పర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన ప్రభావం iv) శిలల ముడత
1) i, ii, iii 2) ii, iv 3) i, iii, iv 4) అన్నీ
జ: 4(అన్నీ)
6. సాత్పూరా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? (డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, 2011)
జ: నర్మద
7. అపలేచియన్ పర్వతశ్రేణి ఎక్కడ ఉంది? (ఎంటమాలజీ డిపార్ట్మెంట్ 2012)
జ: ఉత్తర అమెరికా