• facebook
  • whatsapp
  • telegram

తరంగాలు (ధ్వని)

 కణాలను కలిగి ఉన్న ప్రావస్థ లేదా పదార్థాలను 'యానకం' అని అంటారు. ఈ యానకం ఘన, ధ్రవ, వాయుస్థితుల్లో ఉండవచ్చు.
   ఘనస్థితి యానకం: మంచు, ఇనుము మొదలైనవి
   ద్రవస్థితి యానకం: నీరు, ఆల్కహాల్ మొదలైనవి
   వాయుస్థితి యానకం: గాలి, హైడ్రోజన్ మొదలైనవి
 యానకంలో కలిగే అలజడినే 'తరంగం' (WAVE) అని అంటారు.
‣ వాస్తవిక, భౌతిక బదిలీ లేకుండా లేదా ద్రవ్యం మొత్తంగా ప్రవహించకుండా చలించే అలజడులను 'తరంగాలు'
అంటారు.
 తరంగాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి శక్తిని బదిలీ చేస్తాయి.
 తరంగాలు శక్తి రవాణాలను సూచిస్తాయి.
 అన్ని సంసర్గాలు (Communications) తప్పనిసరిగా తరంగాల ద్వారా జరిగే సంకేతాల ప్రసారాలపై ఆధారపడతాయి.
 తరంగాలు రెండు రకాలు
    1. యాంత్రిక తరంగాలు
    2. విద్యుదయస్కాంత తరంగాలు.
‣ తరంగ ప్రసరణకు 'యానకం' అవసరమైనటువంటి తరంగాలను యాంత్రిక తరంగాలు అని అంటారు.
 యానకం, శూన్యంలో కూడా ప్రసరించే తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అని పిలుస్తారు.
 యానకం లేని ప్రదేశాన్ని 'శూన్యం' అని అంటారు.
 యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు.
 తీగపై తరంగాలు, నీటి తరంగాలు, ధ్వని తరంగాలు, భూకంప తరంగాలు అనేవి యాంత్రిక తరంగాలు. ఇవి శూన్యంలో ప్రయాణించలేవు. వాటిలో ఆంగిక (Constituent) కణాలకు డోలనాలు ఉంటాయి.
‣ ఆంగిక కణాలు యానకం స్థితిస్థాపకతపై ఆధారపడి ఉంటాయి.

 

ధ్వని
 

 ధ్వని ఒక శక్తి స్వరూపం. ఇది కంపిస్తున్న తరంగాల రూపంలో అన్ని దిశల్లో ప్రయాణిస్తుంది. ఈ తరంగాలు మన చెవిలో కర్ణభేరిని 1/10 సెకన్ల కాలంలో తాకినట్లయితే మానవుడికి వినికిడి జ్ఞానం కలుగుతుంది.
 కంపించే కణాలు ఉన్న పదార్థాల్లో మాత్రమే ధ్వని జనించి ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రయాణిస్తుంది.
    ఉదా: ఇనుము, ఇత్తడి, రాగి మొదలైనవి.
 కంపించేందుకు వీలులేని కణాలు ఉన్న పదార్థాల్లో ధ్వని జనించదు, ప్రయాణించజాలదు.
    ఉదా: స్వచ్ఛమైన ప్లాస్టిక్ వస్తువులు, రబ్బరు, వరిపొట్టు, రంపపు పొట్టు, దూది బట్టలు, థర్మోకోల్ మొదలైనవి.
 ఇటువంటి పదార్థాలను ఉపయోగించి 'సౌండ్ ప్రూఫ్ రూమ్స్‌'ని నిర్మిస్తారు.
 ధ్వని తరంగాలు ప్రయాణించేందుకు యానకం అవసరం కాబట్టి ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశంలో ధ్వని వేగం శూన్యంగా ఉంటుంది. దీన్ని నిరూపించిన వారు 'రాబర్ట్ బాయిల్'.
 ఎటువంటి యానకం లేని విశ్వాంతరాళంలో, చంద్రునిపై ధ్వనివేగం శూన్యం.
ఉదా: చంద్రునిపై తూపాకి పేల్చినప్పుడు, అణుబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు వెలవడే ధ్వనిని వినలేము.
 చంద్రునిపై అనునాద ప్రయోగం 'రెసోనెన్స్ ఎక్స్‌పరిమెంట్', సంగీత కచేరి చేయలేము.
 చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల పగలు, రాత్రి సమయంలో ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుంది.
 చంద్రునిపై సగటు పగటి ఉష్ణోగ్రత 100ºC ఉంటుంది.
 కంపించే ప్రతి వస్తువు నుంచి ధ్వని పుడుతుంది.

 

శ్రావ్య అవధి

 ఆరోగ్యవంతుడైన మానవుడు 20 Hz నుంచి 20,000 Hz వరకు ధ్వని తరంగాలు మాత్రమే వినగలడు. ఈ అవధిని 'శ్రావ్య అవధి' అని ఈ తరంగాలను 'శ్రావ్య తరంగాలు' అని అంటారు.
 

పరశ్రావ్యాలు

 శ్రావ్య అవధిలో 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలను 'పరాశ్రావ్యాలు' అంటారు. వీటిని నేలపై ఉన్న పాము, సముద్రంలో ఉన్న తిమింగలాలు, కుక్కలు వినగలవు.
 పరశ్రావ్యాలు ఉత్పత్తి చేసేందుకు అత్యధిక శక్తి ఉన్న వస్తువులు అవసరం. కాబట్టి ఈ తరంగాలను సాధారణంగా భూమి కంపించినప్పుడు, అణుబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు, భారీ వాహనం అత్యధిక లగేజీని మోసుకెళ్తున్నప్పుడు ఈ తరంగాలు జనిస్తాయి.

 

అతిధ్వనులు
 శ్రావ్య అవధిలో 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలను 'అతిధ్వనులు' అంటారు. వీటిని ప్రయోగశాలలో ఫిజో (PIEZEVO) విద్యుత్ ఫలితం పద్ధతిలో తయారు చేస్తారు.
 అతిధ్వనులను కుక్క 50 వేల HZ వరకు, గబ్బిలం, తాబేలు, డాల్ఫిన్లు 1,00,000 Hz వరకు వినగలవు.

 

అనువర్తనాలు లేదా ఉపయోగాలు
 పాలలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నశింపచేసేందుకు
 సముద్రం లోతు కనుగొనేందుకు ఉపయోగించే సోనార్‌లో SONAR: Sound Navigation and Ranging.
 మొదట సోనార్‌ను నిర్మించిన వారు - నిక్సన్ (NIXON).
 0ºCల నీటి ఉపరితలంపై ఈ తరంగాలను పంపినప్పుడు 100ºC వద్ద మరుగుతున్న స్థితిని పొందుతుంది.
 దోమలను పారదోలేందుకు, చేపలను వేటాడేందుకు
 విరిగిన దంతాలను తొలగించేందుకు, సోల్డరింగ్‌లో
 కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి
 శరీర అంతర్భాగాలను స్కానింగ్ చేసేందుకు (అల్ట్రా స్కానింగ్)
 లోహఫలకం, పైపులు, బాయిలర్లలో పగుళ్లు ఏర్పడిన వాటిని గుర్తించేందుకు
 సముద్రంలో చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాలను గుర్తించేందుకు ఈ తరంగాలను వాడతారు.

 

తరంగాలు
 శక్తిని ఒక బిందువు నుంచి మరో బిందువుకు మోసుకొని పోయేదాన్ని తరంగం అని అంటారు.
          
తరంగం - లక్షణాలు
1) కంపన పరిమితి: కంపిస్తున్న కణం తన మధ్య బిందువు నుంచి పొందిన గరిష్ఠ స్థానభ్రంశాన్ని 'కంపన పరిమితి' అంటారు.
    ప్రమాణాలు: మి.మీ., సెం.మీ., మీ. మొదలైనవి.
2) తరంగదైర్ఘ్యం [Wave Length]: రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని తరంగదైర్ఘ్యం అంటారు.
    దీని ప్రమాణాలు: మి.మీ., సెం.మీ., మీ.
    చిన్న ప్రమాణం - ఆంగ్‌స్ట్రాం యూనిట్‌లు
     1 Angstrom = 10-8 సెం.మీ. [లేదా] 10-10 సెం.మీ.
3) ఆవర్తన కాలం: కంపిస్తున్న కణం ఒక కంపనం పూర్తి చేసేందుకు పట్టే కాలాన్ని 'ఆవర్తన కాలం' అంటారు. దీన్ని (T) తో సూచిస్తారు.
    ప్రమాణాలు: సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు మొదలైనవి.
4) పౌనఃపున్యం (Frequency): ఒక వస్తువు సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్యను 'పౌనఃపున్యం' అంటారు.
    ప్రమాణం: హెర్ట్జ్ (Hertz)
   
   f = పౌనఃపున్యం
  T = ఆవర్తనకాలం

 

తరంగాలు - రకాలు
 స్వభావాన్ని బట్టి తరంగాలు రెండు రకాలు
    1 విద్యుత్ అయస్కాంత తరంగాలు
    2 యాంత్రిక తరంగాలు
1. విద్యుత్ అయస్కాంత తరంగాలు:
 ఈ తరంగాలు ప్రయాణించేందుకు ఎటువంటి యానకం అవసరం లేదు. అంటే యానకంలో, శూన్యంలో కూడా ఈ తరంగాలు ప్రయాణిస్తాయి.
ఉదా: పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు, కాంతి తరంగాలు, x - కిరణాలు, రేడియో తరంగాలు, γ కిరణాలు మొదలైనవి.
 ఈ తరంగాల వేగం శూన్యంలో, గాలిలో కాంతివేగానికి సమానంగా ఉంటుంది.
                              C = 3 × 108 మీ./సె.


2. యాంత్రిక తరంగాలు
 ఈ తరంగాలు ప్రయాణించేందుకు 'యానకం' అవసరం కాబట్టి ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశంలో ఈ తరంగాల వేగం శూన్యం. ఉదా: ధ్వని తరంగాలు.
 సాధారణంగా తరంగాలు రెండు
1. అనుదైర్ఘ్య తరంగాలు
2. తిర్యక్ తరంగాలు
1. అనుదైర్ఘ్య తరంగాలు:
 తరంగ ప్రసరణ దిశ, యానకంలోని కణాల కదలిక దిశ రెండూ ఒకే దిశలో ఉంటాయి.
 దైర్ఘ్య తరంగాల్లో కంపించే వాయు కణాల సాంద్రత అధికంగా ఉన్న బిందువును 'సంపీడనం' అని, తక్కువగా ఉన్న బిందువును 'విరళీకరణం' అని అంటారు.
ఉదా: గాలిలో ధ్వని తరంగాలు ఎప్పుడూ దైర్ఘ్య తరంగాలే.
 రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని 'తరంగదైర్ఘ్యం' అంటారు. దీన్ని  తో సూచిస్తారు.
2. తిర్యక్ తరంగాలు:
 తరంగ ప్రసరణ దిశ, యానకంలోని కణాల కదలిక లంబంగా ఉంటాయి.
 గరిష్ఠ శక్తి ఉన్న బిందువును శృంగం అనీ, కనిష్ఠ శక్తి ఉన్న బిందువును ద్రోణి అనీ అంటారు.   

ఉదా: 1. ఘన, ద్రవ పదార్థాల్లో ధ్వని తరంగాలు, తిర్యక్ తరంగాల లాగా ప్రయాణిస్తాయి.
         2. కాంతి తరంగాలు అన్ని పారదర్శక పదార్థాలు (గాలి, నీరు, గాజు)లో తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. ఎందుకంటే కాంతి జనించడం, ప్రయాణించడం తిర్యక్ తరంగాల రూపంలో ఉంటుంది.

 

ధ్వని - ధర్మాలు
అనునాదం

 సమాన సహజ పౌనఃపున్యాలు ఉన్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అధిక కంపన పరిమితితో కంపించడాన్ని అనునాదం అంటారు.
 అనునాదం జరగాలంటే రెండు వస్తువుల పౌనఃపున్యాలు సమానం అవ్వాలి.
అనువర్తనాలు:
* పిల్లనగ్రోవి, ఈల, ట్రాన్సిస్టరు రేడియో పని చేసేందుకు ఈ ధర్మం వాడతారు.
* ఒక వాహనం నిర్దిష్టమైన వేగాన్ని అధిగమించిన తర్వాత దాని ఇంజిను నుంచి వెలువడే శబ్ద పౌనఃపున్యం, వాహనం సహజ పౌనఃపున్యానికి సమానమైనప్పుడు అనునాదం వల్ల ప్రత్యేకమైన శబ్దం వస్తుంది. దీన్ని Cratling of sound అంటారు.
* ఒక గాజుపలక పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యం ఉన్న స్వరాన్ని ఆలపించినప్పుడు. అనునాదం వల్ల ఆ గాజుపలక పగిలిపోతుంది
* కవాతు చేస్తూ చిన్న వంతెనను సమీపిస్తున్న సైనికులను కవాతు ఆపమని చెబుతారు. ఎందుకంటే అనునాదం వల్ల బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది.
* అనునాదం చెందే గాలి స్తంభాలను ఉపయోగించి గాలిలో ధ్వని వేగాన్ని లెక్కించే సూత్రం V = 2υ(
l2 - l1)
υ శృతి దండం పౌనఃపున్యం,
l1, l2 = నీటి మట్టాలు

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌