• facebook
  • whatsapp
  • telegram

నైసర్గికస్వరూపాలు - హిమాలయ పర్వతాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఎవరెస్ట్‌ శిఖరం ఉన్న ప్రాంతం? (Group 2, 2004)

జ: కేంద్ర హిమాలయాలు
 

2. సాగర్‌మాతకు ఉన్న మరో పేరు? (Group 1, 2012)
జ: ఎవరెస్ట్‌

 

3. K2 పర్వతాగ్రం ఉన్న ప్రదేశం? (Jr. Steno, 2010)
జ:  కారకోరం

 

4. హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? (Group-1, 1999)
జ: హిమాద్రి

 

5. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ ఎక్కడ ఉంది?
జ: నేపాల్‌

 

6. ధవళగిరి శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? (Group-1, 1999)
జ: నేపాల్‌

7. హిమాచల్‌ పర్వతాలు - హిమాద్రి మధ్య ప్రసిద్ధిగాంచిన లోయ?
జ: కశ్మీర్‌లోయ

 

8. మికిర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: అసోం

 

9. కిందివాటిలో ఏ రాష్ట్ర తీరాన్ని కోరమండల్‌ తీరం అని పిలుస్తారు? (2010, గ్రూప్‌ - 1) 
1) గుజరాత్‌                 2) మహారాష్ట్ర
3) తమిళనాడు            4) కేరళ
జ: 3 (తమిళనాడు)

 

10. మలబార్‌ తీరప్రాంతపు బ్యాక్‌ వాటర్స్‌ను ఏమని పిలుస్తారు. (సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, 2009)
జ: లాగూన్‌లు

 

11. కృష్ణ, గోదావరి డెల్టాల మధ్య ఉన్న సరస్సు? (డీఎల్‌ - 2012)
జ: కొల్లేరు సరస్సు

 

12. కిందివాటిలో సుభాష్‌ చంద్రబోస్‌ ద్వీప్‌ అని దేన్ని పిలుస్తారు? 
1) నీల్‌ ఐలాండ్‌                  2) రాస్‌ ఐలాండ్‌ 
3) హేవ్‌లాక్‌ ఐలాండ్‌          4) కచ్చతీవు ఐలాండ్‌
జ: 2 (రాస్‌ ఐలాండ్‌ )

13. కథియవార్‌ తీరం అని ఏ రాష్ట్ర తీరాన్ని పిలుస్తారు?
జ: గుజరాత్‌

 

14. దేశంలో అతిపొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం?
జ: గుజరాత్‌

 

15. ఆసియా ఖండంలోనే మొదటి బ్లూఫ్లాగ్‌ బీచ్‌?
జ: చంద్రభాగ బీచ్‌

 

16. భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం భారతదేశంలో అతి పురాతనమైన ముడుత పర్వతాలు ఏవి?
జ: ఆరావళి పర్వతాలు

 

17. ‘రూర్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలిచే ప్రాంతం ఏది?
జ: ఛోటానాగ్‌పూర్‌ పీఠభూమి

 

18. గంగా - సింధు మైదానాల్లో ఉండే చిత్తడి ప్రాంతాన్ని ఏమంటారు?
జ: టెరాయి

 

19. దోఆబ్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
జ: పంజాబ్‌ - హరియాణా మైదానం

 

20. ‘బిహార్‌ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?
జ: కోసి నది

21. భారతదేశంలో అతిపెద్ద భౌతిక విభాగం?
జ: ద్వీపకల్ప పీఠభూమి

 

22. ఇటీవలి కాలంలో ఏర్పడిన ఒండలి నేలలను ఏమంటారు?
జ: ఖాదర్‌

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌