• facebook
  • whatsapp
  • telegram

గృహ నిర్మాణం

మాదిరి ప్రశ్నలు

1. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యతా రేటు ఎంతగా ఉంది?

1) 65.35% 2) 66.35% 3) 67.35% 4) 68.35%

2. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సరైంది?
1) ఈ పథకం కింద అయ్యే వ్యయ్యాన్ని (1 నుంచి 10వ తరగతి వరకు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో భరిస్తాయి.
2) ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సంబంధించి 100 శాతం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
3) పాఠశాలల నమోదు, పాఠశాలల హాజరు పెంచడం; లింగ అంతరాన్ని, పోషకాహార లోపాన్ని తగ్గించడం; సామాజిక సమానత్వాన్ని పెంపొందించడం లాంటి లక్ష్యాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి.
4) పైవన్నీ

3. జగనన్న అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారులకు సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తారు?
1) రూ.10,000 2) రూ.12,500 3) రూ.15,000 4) రూ.17,500

4. వైఎస్‌ఆర్‌ విద్యోన్నతి పథకానికి సంబంధించి సరికానిది?
1) ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు ప్రొఫెషనల్‌ గైడెన్స్‌ను అందించడం.
2) ఈ పథకం కింద సంవత్సరానికి 3,850 సీట్లు కేటాయించారు.
3) గతంలో ఈ పథకం పేరు ఎన్టీఆర్‌ విద్యోన్నతిగా ఉండేది.
4) ఈ పథకం విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ఉద్దేశించింది.

5. వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ నిధికి 2019 - 20 రాష్ట్ర బడ్జెట్‌లో ఎంత మొత్తాన్ని కేటాయించారు?
1) రూ.160 కోట్లు 2) రూ.260 కోట్లు 3) రూ.360 కోట్లు 4) రూ.460 కోట్లు

6. జగనన్న అమ్మ ఒడి పథకం కోసం 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో ఎంత మొత్తాన్ని కేటాయించారు?
1) రూ.4,455.80 కోట్లు 2) రూ.5,455.80 కోట్లు
3) రూ.6,455.80 కోట్లు 4) రూ.7,455.80 కోట్లు

7. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి?
1) 8,048 2) 9,048 3) 1,048 4) 1,148

8. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఎంత మొత్తాన్ని అందిస్తారు?
1) రూ.1.5 లక్షలు 2) రూ.2.5 లక్షలు 3) రూ.3 లక్షలు 4) రూ.3.5 లక్షలు

9. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 108 సేవలను ఎప్పటి నుంచి అమలు చేస్తోంది?
1) 2005 2) 2006 3) 2007 4) 2008

10. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాంతంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు 2019 - 20 బడ్జెట్‌లో పేర్కొంది?
1) పాడేరు/అరకు 2) గురజాల 3) విజయనగరం 4) అన్నీ

11. రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి?
1) 55,607 2) 66,607 3) 77,607 4) 88,607

12. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ప్రారంభించి రానున్న అయిదేళ్లలో ఎన్ని గృహాలను నిర్మించాలని నిర్ణయించింది?
1) 12 లక్షలు 2) 17 లక్షలు 3) 25 లక్షలు 4) 35 లక్షలు

సమాధానాలు: 1-3, 2-4, 3-3, 4-4, 5-1, 6-3, 7-4, 8-2, 9-1, 10-4, 11-1, 12-3.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌