• facebook
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పొడిమంచు అని దేన్ని అంటారు?
జ: ఘనస్థితిలోని కార్బన్‌ డైఆక్సైడ్‌

 

2. విగ్రహాల తయారీ, విరిగిన ఎముకలకు కట్టు కట్టడానికి ఉపయోగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ రసాయన నామం?
జ: కాల్షియం సల్ఫేట్‌ హెమీహైడ్రేట్‌

 

3. కెంపు (రూబి) రత్నం ఏ లోహ సమ్మేళనం?
జ: అల్యూమినియం

 

4. లాఫింగ్‌ గ్యాస్‌ రసాయన నామం?
జ: నైట్రస్‌ ఆక్సైడ్‌

 

5. సోడా తయారీలో నీటిలో కరిగించే వాయువు?
జ: కార్బన్‌ డైఆక్సైడ్‌

 

6. నిప్పును ఆర్పే యంత్రం (Fire Extinguisher) లోని రసాయన పదార్థాలు విడుదల చేసే వాయువు?
జ: కార్బన్‌ డైఆక్సైడ్‌

 

7. హిమోగ్లోబిన్‌లో ఉండే లోహ అయాన్‌?
జ: ఇనుము

 

8. విటమిన్‌ - B12లో ఉండే లోహ అయాన్‌ ఏది?
జ: కోబాల్ట్‌

 

9. కాయలను కృత్రిమంగా పక్వానికి తెచ్చేందుకు ఉపయోగించే వాయువు?
జ: ఇథిలీన్‌

 

10. కృత్రిమ వర్షాన్ని సృష్టించడానికి ఉపయోగించే రసాయన సమ్మేళనం ఏది?
జ: సిల్వర్‌ అయోడైడ్‌, పొడిమంచు

 

11. జిప్సం రసాయన నామం?
జ: కాల్షియం సల్ఫేట్‌ డైహైడ్రేట్‌

 

12. సూపర్‌ ఫాస్ఫేట్‌ ఆఫ్‌ లైమ్‌ అనేది ఏ పదార్థాల మిశ్రమం?
జ: కాల్షియం డైహైడ్రోజన్‌ ఫాస్ఫేట్‌ + జిప్సం

 

13. విద్యుత్‌ శక్తిని నిల్వ ఉంచే ఆమ్ల నిక్షేప ఘటంలో ఉపయోగించే ఆమ్లం ఏది?
జ: సల్ఫ్యూరిక్‌ ఆమ్లం

 

14. కిందివాటిలో ఓజోన్‌కు సంబంధించి సరికానిది?
i) ఓజోన్‌ వాయువు అణు ఫార్ములా O3.
ii) ఇది వాతావరణంలోని స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది.
iii) దీన్ని క్రిమిసంహారిణిగా ఉపయోగిస్తారు.
iv) ఇది అతినీలలోహిత కిరణాలను శోషించుకోదు.
జ: iv మాత్రమే

 

15. కిందివాటిని జతపరచండి.
పదార్థం                                       రసాయన ఫార్ములా
a) ఫాస్‌జీన్‌                                  i) Ca(OCl)2
b) బాష్ప వాయువు                     ii) COCl2
c) బ్లీచింగ్‌ పౌడర్‌                          iii) CCl3NO2
జ: a-ii, b-iii, c-i

 

16. చెరుకు రసం నుంచి చక్కెరను స్ఫటికీకరించిన తర్వాత మిగిలే మాతృ ద్రవాన్ని ఏమంటారు?
జ: మొలాసిస్‌

 

17. రసాయనికంగా వంటసోడా అంటే?
జ: సోడియం బైకార్బొనేట్‌

 

18. కృత్రిమ సిల్క్‌ అని దేన్ని పిలుస్తారు?
జ: రేయాన్‌

 

19. 35 - 40 శాతం గల ఫార్మాల్డిహైడ్‌ జల ద్రావణాన్ని ఏమంటారు?
జ: ఫార్మలిన్‌

 

20. జీవరసాయన నమూనాలను నిల్వ చేయడానికి ఉపయోగించేది?
జ: ఫార్మలిన్‌

 

21. మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత?(ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్స్, 2017)
జ: స్థిరంగా ఉంటుంది

 

22. నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యధికంగా ఉంటుంది? (అసిస్టెంట్‌ ఇంజినీర్స్, ఏపీఆర్‌డబ్ల్యూఎస్‌ - 2013)
జ:  40C

 

23. కెల్విన్‌ కొలమానాన్ని దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? (ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, 2012)
జ: ఉష్ణోగ్రత

 

24. పర్వతాల మీద ఏ ఉష్ణోగ్రత వద్ద నీరు మరుగుతుంది? (ఏపీపీఎస్సీ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ ఇంజినీర్స్, 2012)
జ: 1000C కంటే తక్కువ

 

25. విలువైన రత్నం కెంపులో ప్రధానంగా అల్యూమినియం ఆక్సైడ్‌తో పాటు స్వల్పంగా ఉండే పదార్థం? (ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, 2012)
జ: క్రోమియం

 

26. గన్‌కాటన్‌ పేరుతో పిలిచే శక్తిమంతమైన విస్ఫోటనాకారి?(ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, 2012)
జ: సెల్యులోజ్‌ నైట్రేట్‌

 

27. గ్లాస్‌ ఊలు అంటే? (ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, 2012)
జ: అతి సన్నటి గాజు తంతువులు

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌