• facebook
  • whatsapp
  • telegram

జంతువుల్లో సమన్వయం

 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. వినాళ గ్రంథులు స్రవించే కొన్ని రసాయన పదార్థాలు రక్తం ద్వారా ప్రయాణించి వివిధ జీవక్రియలను నియంత్రిస్తాయి. ఈ పదార్థాలను ఏమంటారు?
జ: హార్మోన్‌లు

 

2. కిందివాటిలో అంతరస్రావ్య వ్యవస్థలో ప్రధాన భాగాలేవి?
      i) అంతరస్రావ్య గ్రంథులు       ii) హార్మోన్‌లు        iii) హృదయం
జ: i, ii

 

3. కిందివాటిలో వినాళ గ్రంథులు ఏవి?
      ఎ) ఎక్సోక్రైన్‌ గ్రంథులు          బి) హెటిరోక్రైన్‌ గ్రంథులు
      సి) ఎండోక్రైన్‌ గ్రంథులు         డి) హైపర్‌ట్రోఫిక్‌ గ్రంథులు
జ: సి (ఎండోక్రైన్‌ గ్రంథులు)

 

4. అంతరస్రావ్య వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
జ: ఎండోక్రైనాలజీ

 

5. ఎండోక్రైనాలజీ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: థామస్‌ ఎడిసన్‌

 

6. కిందివాటిలో మానవ అంతరస్రావ్య వ్యవస్థలో భాగమైన గ్రంథులు ఏవి?
     i) పీనియల్‌ దేహం      ii) అవటు గ్రంథి      iii) అడ్రినల్‌ గ్రంథి      iv) హైపోథలామస్‌
జ: i, ii, iii, iv

 

7. కిందివాటిలో హార్మోన్‌లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది?
     ఎ) పిట్యూటరీ      బి) కాలేయం      సి) క్లోమం      డి) పారాథైరాయిడ్‌
జ: బి (కాలేయం)

 

8. ‘ఎమర్జెన్సీ హార్మోన్‌’ను స్రవించే గ్రంథి ఏది?
జ: అడ్రినల్‌

 

9. పారాథైరాక్సిన్‌ లోపం వల్ల వచ్చే వ్యాధి?
జ: టెటాని

 

10. కిందివాటిలో మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్‌ ఏది?
     ఎ) ఈస్ట్రోజన్‌      బి) ప్రొజెస్టిరాన్‌      సి) టెస్టోస్టిరాన్‌      డి) థైరాక్సిన్‌
జ: డి (థైరాక్సిన్‌)

 

11. యుక్తవయసులో కంఠంలోని మార్పునకు కారణమయ్యే హార్మోన్‌ ఏది?
జ: టెస్టోస్టిరాన్

 

12. థైరాక్సిన్‌ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి?
జ: గాయిటర్‌

 

13. థైరాక్సిన్‌ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది?
జ: అయోడిన్‌

 

14. శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్‌?
జ: ఆక్సిటోసిన్‌

 

15. మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రించే హార్మోన్‌ ఏది?
జ: ఆల్డోస్టిరాన్‌

 

16. కోపం రావడానికి కారణమయ్యే హార్మోన్‌?
జ: అడ్రినలిన్‌

 

17. పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి (ఫైట్‌ అండ్‌ ఫ్లైట్‌)గా దేన్ని పిలుస్తారు?
జ: అడ్రినల్‌

 

18. మెదడులో ఉండే గ్రంథి ఏది?
జ: పిట్యూటరీ

 

19. ఎపిథలామస్‌లో భాగమైన సీనియర్‌ దేహం లేదా ఎపిఫైసిస్‌ నుంచి స్రవించే హార్మోన్‌లు?
జ: మెలటొనిన్, సెరటొనిన్‌

 

20. అంతరస్రావ్య వ్యవస్థకు, నాడీ వ్యవస్థకు ప్రధాన సంధాన సేతువులా వ్యవహరించేది ఏది?
జ: హైపోథలామస్‌

 

21. హైపోఫైసిస్‌ లేదా హైపోథలామస్‌ సెరిబ్రి అని ఏ గ్రంథిని పిలుస్తారు?
జ: పిట్యూటరీ గ్రంథి

 

22. కిందివాటిని జతపరచండి.
జాబితా - ఎ                                                జాబితా - బి
i) థైమస్‌ గ్రంథి                                       a) సూప్రారీనల్‌ గ్రంథి
ii) అడ్రినల్‌ గ్రంథి                                     b) వినాళికా గ్రంథి
iii) పిట్యూటరీ గ్రంథి                                 c) మాస్టర్‌ గ్రంథి
జ: i-b, ii-a, iii-c

 

23. సైమండ్స్‌ వ్యాధికి కారణం?
జ: పెరుగుదల హార్మోన్‌ను అధికంగా స్రవించడం

 

24. థైరాయిడ్‌ పరీక్షలో నిర్ధారిస్తున్న T3, T4 లు అంటే
జ: ట్రై అయిడో థైరోనిన్, టెట్రా అయిడో థైరోనిన్‌

 

25. హైపర్‌ పారా థైరాయిడిజమ్‌ కిందివాటిలో దేనితో అనుసంధానమై ఉంటుంది?
     i) ఆస్టియో ఫ్లోరోసిస్‌                     ii) మూత్రపిండాల్లో రాళ్లు
     iii) అధికంగా దాహం వేయడం      iv) ఆస్టైటిస్‌ ఫైబ్రోసా సిస్టికా
జ: i, ii, iii, iv

 

26. కిందివాటిని జతపరచండి. 
క్లోమగ్రంథి కణం                                          స్రవించే హార్మోన్‌
i) α కణం (ఆల్ఫాకణం)                      a) పాంక్రియాటిక్‌ పాలీపెప్టైడ్‌లు
ii) β కణం (బీటాకణం)                       b) సొమాటోస్టాటిన్‌
iii) γ కణం (గామాకణం)                     c) గాస్ట్రిన్‌
iv) δ కణం (డెల్టాకణం)                      d) ఇన్సులిన్‌
v) f కణం                                       e) గ్లూకగాన్‌
జ: i-e, ii-d, iii-c, iv-b, v-a

 

27. స్త్రీలలో గర్భస్రావానికి ప్రధాన కారణం?
జ: ప్రొజెస్టిరాన్‌ తక్కువ స్రవించడం

 

28. థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల పసిపిల్లల్లో కలిగే వ్యాధి?
జ: క్రెటినిజమ్‌

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌