• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఉనికి - భౌగోళిక అంశాలు

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మెక్‌మోహన్‌ రేఖ కింది ఏ రెండు దేశాల మధ్య ఉంది? (జూనియర్‌ స్టెనో, 2010)

జ: భారత్‌ - చైనా
 

2. భారత ప్రధాన భూభాగపు దక్షిణ ప్రాంతం? (అసిస్టెంట్‌ టీఎంవీఐ, 2009)
జ: కన్యాకుమారి

 

3. కిందివాటిలో భూపరివేష్టిత రాష్ట్రం ఏది?
     1) గుజరాత్‌      2) మధ్యప్రదేశ్‌      3) ఆంధ్రప్రదేశ్‌      4) మహారాష్ట్ర
జ: 2 (మధ్యప్రదేశ్‌)

 

4. కింది ఏ దేశంతో భారతదేశానికి సమష్టి సరిహద్దు లేదు? (జేఎల్, 2004) 
     1) అఫ్గానిస్థాన్‌      2) బంగ్లాదేశ్‌      3) నేపాల్‌      4) బర్మా
జ: 1 (అఫ్గానిస్థాన్‌)

 

5. భారతదేశ మొత్తం భూభాగ వైశాల్యం ఎంత? (జేఎల్, 2006)
జ: 32,87,263 చ.కి.మీ.

6. వైశాల్యంలో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం? (జేఎల్, 2011)
జ: లక్షదీవులు

 

7. భారత్, మాల్దీవులను వేరుచేసే జలమార్గం (గ్రూప్‌ 1, 2007)
జ: 8º జలమార్గం

 

8. సర్‌క్రీక్‌ వివాదం కింది ఏయే దేశాల మధ్య ఉంది? (గ్రూప్‌ 1, 2004)
     1) భారత్‌ - పాకిస్థాన్‌      2) నార్వే - స్వీడన్‌     3) మయన్మార్‌ - థాయ్‌లాండ్‌      4) నేపాల్‌ - చైనా
జ: 1 (భారత్‌ - పాకిస్థాన్‌)

 

9. కిందివాటిలో మూడు దేశాలతో సరిహద్దు గల రాష్ట్రాలు? (గ్రూప్‌ 4, 2011)
     1) జమ్ముకశ్మీర్, పశ్చిమ్‌ బంగ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌
     2) పశ్చిమ్‌ బంగ, మణిపూర్, జమ్ముకశ్మీర్, గుజరాత్‌
     3) జమ్ముకశ్మీర్, త్రిపుర, సిక్కిం, పశ్చిమ్‌ బంగ 
     4) పశ్చిమ్‌ బంగ, నాగాలాండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌
జ: 1 (జమ్ముకశ్మీర్, పశ్చిమ్‌ బంగ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌)

 

10. భారత్, అఫ్గానిస్థాన్‌లను వేరుచేసే రేఖ (డీఈవో, 2010)
జ: డ్యూరాండ్‌ రేఖ

 

11. భారతదేశం ఎన్ని దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది? (పీఎల్, 2011)
జ: 7

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌