• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థిక విధానాలు  

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారత ఆర్థిక రాజ్యాంగంగా ఏ పారిశ్రామిక తీర్మానాన్ని అభివర్ణిస్తారు?
జ: పారిశ్రామిక తీర్మానం - 1956

 

2. ''వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడానికి భూ వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావడాన్ని భూసంస్కరణలు అంటారు". అని నిర్వచించింది ఎవరు?
జ: ఐక్యరాజ్య సమితి

 

3. 'భారతదేశంలో భూ సంస్కరణలు' అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
జ: ముఖర్జీ

 

4. లియాంటిఫ్ వైపరీత్యం కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?
      1) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, మూలధన వస్తువులనే ఎగుమతి, దిగుమతి చేయడం.
      2) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, మూలధన సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.
      3) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.
      4) శ్రమ సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి, దిగుమతి చేయడం.
జ: 3(మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.)

5. పారిశ్రామిక విధానం - 1991లోని ముఖ్యమైన ప్రతిపాదన-
జ: ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ప్రాధాన్యం ఉన్న పరిశ్రమల్లో 51% వరకు అనుమతించడం.

 

6. అధికారికంగా GATT, WTO లను ఎప్పుడు ఏర్పరిచారు?
జ: 1995

 

7. భారత్‌లో నూతన ప్రభుత్వ రంగ విధానం లక్షణం ఏమిటి?
      1) MOU పద్ధతిని ప్రవేశపెట్టడం
      2) ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ
      3) దీర్ఘరుగ్మత ఉన్న పరిశ్రమలను మూసివేయడం
      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

8. ఒక ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న హోదా పొందాలంటే-
      1) నవరత్న హోదాను కలిగి ఉండాలి.
      2) స్టాక్ మార్కెట్‌లో నమోదై షేర్స్ ట్రేడింగ్ అవుతూ ఉండాలి.
      3) వార్షిక టర్నోవర్ రూ.25,000 కోట్లు ఉండాలి.
      4) అన్నీ
జ: 4(అన్నీ)

9. కిందివాటిలో భూసంస్కరణల పరిధిలో లేనిది ఏది?
      1) కమతాల గరిష్ఠ పరిమితి విధింపు     2) మధ్యవర్తుల తొలగింపు
      3) భూదానోద్యమం                               4) ఏదీకాదు
జ: 3(భూదానోద్యమం)

 

10. కిందివాటిలో Soft loan window ద్వారా రుణాలు అందించేది-
      1) అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ       2) ప్రపంచ బ్యాంకు
      3) అంతర్జాతీయ ద్రవ్యనిధి                4) ప్రపంచ వాణిజ్య సంస్థ
జ: 1(అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ)

 

11. మనదేశంలో భూసంస్కరణల ముఖ్య లక్ష్యం ఏమిటి?
జ: భూమి సాగుచేసే వారికి భద్రత కల్పించడం.

 

12. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: ప్రభుత్వ రంగాన్ని విస్తరించడం.

 

13. భారతదేశంలో హరిత విప్లవం ఏ పంటల దిగుబడిలో ఎక్కువగా విజయవంతమైంది?
జ: గోధుమ, వరి

 

14. జిల్లా పారిశ్రామిక కేంద్రాలు (DIC) అనే భావనను ప్రవేశపెట్టింది-
జ: జనతా ప్రభుత్వం (1977)

15. సభ్యదేశాలకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs)ను కల్పించే అంతర్జాతీయ సంస్థ ఏది?
జ: అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)

 

16. లియాంటిఫ్ వైపరీత్యం దేని దత్తాంశ పరీక్షకు సంబంధించింది?
జ: హెక్సర్ - ఒహ్లిన్

 

17. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏ రూపంలో విదేశీ పెట్టుబడి ఉండాలి?
జ: పోర్టుపోలియో నిధులు

 

18. కిందివాటిలో దేన్ని తగ్గించడం FRBM ముఖ్య లక్ష్యం?
      1) బడ్జెట్ లోటు       2) రాబడి లోటు       3) బహిర్గత లోటు       4) బ్యాంకింగ్ లోటు
జ: 2(రాబడి లోటు)

 

19. 1894 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వానికి కింది ఏ భూమిని తీసుకునే అర్హత ఉంది?
      1) ప్రజా ప్రయోజనార్థం ఎవరి నుంచైనా భూసేకరణ
      2) ప్రైవేటు ఉద్దేశానికి ఎవరి నుంచైనా భూసేకరణ
      3) కార్పొరేట్ రంగం నుంచి భూసేకరణ
      4) ఉన్నత శ్రేణి కుటుంబాల నుంచి భూసేకరణ
జ: 1(ప్రజా ప్రయోజనార్థం ఎవరి నుంచైనా భూసేకరణ)

20. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ను ఎప్పుడు స్థాపించారు?
జ: 1995

 

21. భారత్‌లో చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి కారణం ఏమిటి?
జ: ఉద్యోగ అవకాశాలను విస్తరించడం

 

22. ఒక దేశం విదేశాలతో వ్యాపారం చేయకుండా ఒంటరిగా ఉండిపోతే ఆ ఆర్థిక వ్యవస్థను ఏమంటారు?
జ: ఇనుపతెర ఆర్థిక వ్యవస్థ

 

23. లక్ష్య నిర్ధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేది-
జ: బడుగు, పేదవారికి మాత్రమే

 

24. గ్రామీణ పరపతి కోసం ఏర్పరిచిన శిఖరాగ్ర వ్యవస్థ-
జ: నాబార్డు

 

25. జిల్లా స్థాయిలో గ్రామీణ పారిశ్రామికీకరణను ప్రోత్సహించే మూలాధార ఏజెన్సీ ఏది?
జ: డీఐసీ

 

26. మొదటిసారిగా ఏ దేశంలో పారిశ్రామిక విప్లవం ఏర్పడింది?
జ: ఇంగ్లండ్

 

27. అభిలషణీయ సుంకం అనేది-
జ: వ్యాపార షరతులను మెరుగుపరుస్తుంది

28. మేధోసంపత్తి హక్కులు (IPR) అమలు కావడం వల్ల సంభవించే పరిణామం ఏమిటి?
జ: నూతన ఆలోచనలు, పరిశోధనలను విస్తృతంగా ఉపయోగించడం

 

29. పెట్టుబడిదారీ వ్యవస్థలో ధరల వ్యవస్థ దేని కేటాయింపులను నిర్ణయిస్తుంది?
జ: వనరులు

 

30. అంతర్జాతీయ వ్యాపారంలో ఆంక్షలున్న వర్తక విధానాన్ని ఏమని పిలుస్తారు?
జ: రక్షణ

Posted Date : 24-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌