• facebook
  • whatsapp
  • telegram

73వ రాజ్యాంగ సవరణ చట్టం

మాదిరి ప్రశ్నలు

1. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించిన ప్రధాని?

1) రాజీవ్‌ గాంధీ 2) విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ 3) పి.వి.నరసింహారావు 4) అటల్‌ బిహారి వాజ్‌పేయీ

2. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికారాలు, విధులను 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో నిర్దేశించారు?
1) 29 2) 19 3) 21 4) 18

3. మన దేశంలో జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?
1) ఫిబ్రవరి 24 2) మార్చి 24 3) ఏప్రిల్‌ 24 4) మే 24

4. కిందివాటిలో గ్రామసభకు సంబంధించి సరికానిది?
1) గ్రామసభ సమావేశాలకు సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు.
2) గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు.
3) ఇది గ్రామ పంచాయతీకి శాసనసభలా వ్యవహరిస్తుంది.
4) గ్రామ పంచాయతీలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు.

5. వివిధ రాష్ట్రాల్లో గ్రామసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి సరికానిది?
1) తెలంగాణ - 6 సార్లు 2) ఆంధ్రప్రదేశ్‌ - 4 సార్లు 3) తమిళనాడు - 2 సార్లు 4) మహారాష్ట్ర - 6 సార్లు

6. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌/అధ్యక్షుడి ఎన్నికను ఎలా నిర్వహించవచ్చు?
1) ప్రత్యక్షంగా 2) పరోక్షంగా 3) పాక్షిక పరోక్షం 4) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా

7. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు నిర్దేశించిన రిజర్వేషన్లు?
1) 1/2వ వంతు 2) 1/3వ వంతు 3) 2/3వ వంతు 4) 1/4వ వంతు

8. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్థానిక సంస్థను పదవీకాలం పూర్తికాకుండానే రద్దు చేస్తే ఎంతకాలంలోపు ఎన్నికలు నిర్వహించాలి?
1) 3 నెలలు 2) 4 నెలలు 3) 6 నెలలు 4) 12 నెలలు

9. శ్రీలేఖ అనే మహిళ నర్సీపట్నం అనే మండల పరిషత్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె కనీస వయసు ఎంత?
1) 18 సంవత్సరాలు 2) 21 సంవత్సరాలు 3) 25 సంవత్సరాలు 4) 30 సంవత్సరాలు

10. పంచాయతీరాజ్‌ సంస్థలకు మొత్తం 29 రకాల అధికారాలు, విధులను బదిలీ చేసిన రాష్ట్రాల జాబితాలో లేనిది?
1) మహారాష్ట్ర, గుజరాత్‌ 2) కేరళ, కర్ణాటక 3) రాజస్థాన్‌, తమిళనాడు 4) సిక్కిం, పశ్చిమ్‌ బంగ

11. అయిదేళ్లకు ఒకసారి రాష్ట్ర‌ ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?
1) గవర్నర్‌ 2) ముఖ్యమంత్రి 3) రాష్ట్రపతి 4) కేంద్ర ఆర్థికసంఘం

12. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలపై నిర్వహించే ఆడిట్‌లో లేనిది?
1) లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ 2) డిపార్ట్‌మెంటల్‌ ఆడిట్‌ 3) నార్మల్‌ ఫండ్‌ ఆడిట్‌ 4) జనరల్‌ ఫండ్‌ ఆడిట్‌

13. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది?
1) ముఖ్యమంత్రి 2) రాష్ట్రపతి 3) హైకోర్టు 4) సుప్రీంకోర్టు

14. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 నుంచి మినహాయించిన రాష్ట్రాల్లో లేనిది?
1) నాగాలాండ్‌ 2) మిజోరం 3) గోవా 4) మేఘాలయ

15. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఇదివరకే అమల్లో ఉన్న శాసనాలను ఎప్పటి వరకు కొనసాగించవచ్చు?
1) 1994, ఏప్రిల్‌ 23 2) 1995, ఏప్రిల్‌ 23 3) 1996, ఏప్రిల్‌ 23 4) 1993, ఏప్రిల్‌ 23

16. పంచాయతీరాజ్‌ వ్యవస్థ 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి సరికానిది?
1) ఆర్టికల్‌ 243 (A) - గ్రామసభ 2) ఆర్టికల్‌ 243 (D) - రిజర్వేషన్లు
3) ఆర్టికల్‌ 243 (E) - రాష్ట్ర ఆర్థికసంఘం
4) ఆర్టికల్‌ 243 (K) - రాష్ట్ర ఎన్నికల సంఘం

 

సమాధానాలు: 1-3; 2-1; 3-3; 4-2; 5-3; 6-4; 7-1; 8-3; 9-2; 10-1; 11-1; 12-3; 13-2; 14-3; 15-1; 16-3.

Posted Date : 16-03-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు