• facebook
  • whatsapp
  • telegram

జంతురాజ్యం (ఏనిమేలియా)

1. ఏ జీవులను జీవపరిణామంలో ఒక అంధశాఖగా పేర్కొంటారు?

1) ప్రోటోజోవా     2) సిలెంటిరేటా 

3) పొరిఫెరా     4) కార్డేటా


2. జంతురాజ్య వర్గీకరణలో ఉపరాజ్యం పారాజోవాలో ఏ జీవులను చేర్చారు?

1) ప్రోటోజోవా     2) ఎనిలిడా 

3) పొరిఫెరా     4) కార్డేటా


3. శరీర త్వచం ద్వారా వ్యాపన పద్ధతిలో శ్వాసక్రియను జరిపే జీవులు?

1) హెల్మెంథిస్‌     2) ఆర్థ్రోపోడా 

3) పొరిఫెరా     4) కార్డేటా

4. నిచ్చెన లాంటి నాడీ వ్యవస్థ ఏ జీవిలో ఉంది?

1) అమీబా         2) వానపాము 

3) సముద్రపు నక్షత్రం  4) మనిషి


5. తమ జీవిత చక్రంలో రాగాన్‌ లార్వాను  కలిగి ఉండే జీవి ఏది?

1) నత్తలు     2) స్పంజికలు 

3) పొరిఫెరా     4) చేపలు

6. కిందివాటిలో ప్రోటోజోవా జీవులకు ఉదాహరణ?

1) నత్తలు     2) పేరమీషియం 

3) స్పంజికలు     4) చేపలు

7. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) యూగ్లీనాలో నిలువు ద్విధావిచ్ఛిÄత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

బి) యూగ్లీనాలో లైంగిక ప్రత్యుత్పత్తి  జరుగుతుంది.

సి) యూగ్లీనాలో క్లోరోప్లాస్ట్, కశాభాలు రెండూ ఉంటాయి.

1) ఎ, బి, సి   2) ఎ   3) బి, సి   4) ఎ, సి

8. కింది ఏ జీవి వల్ల ఆఫ్రికన్‌ ట్రిపనోసోమియాసిస్‌ (ఆఫ్రికా అతినిద్ర వ్యాధి) కలుగుతుంది?

1) ట్రిపనోసోమా     2) సైకాన్‌ 

3) హైడ్రా     4) ఎంటమిబా

9. మలేరియా పరాన్న జీవి ప్లాస్మోడియం జీవిత చక్రాన్ని విశదీకరించిన శాస్త్రవేత్త ఎవరు?

1) హాఫ్‌మన్‌     

2) రొనాల్డ్‌ రాస్‌ 

3) యల్లాప్రగడ సుబ్బారావు 

4) రాబర్ట్‌ గ్రాంట్‌

10. స్పంజికల్లో ప్రధాన నత్రజని వ్యర్థం ఏది?

1) అమ్మోనియా      2) యూరియా 

3) యూరిక్‌ ఆమ్లం     4) క్లోరిక్‌ ఆమ్లం

11. ‘వీనస్‌ ఫ్లవర్‌ బాస్కెట్‌’ అని ఏ జీవిని పిలుస్తారు?

1) యుప్లక్టిల్లా      2) సైకాన్‌ 

3) హైడ్రా       4) యూస్పాంజియ

12. ‘సీపెన్‌’ లేదా ‘సముద్ర కలం’ అని  ఏ జీవిని పిలుస్తారు?

1) స్పొంజియ      2) పెరిపాటస్‌  

3) పెన్నాట్యుల      4) అమీబా

13. ఏ జీవిని ‘బ్లడ్‌ఫ్లూక్‌’ అంటారు?

1) ఫేసియోలా     2) టీనియా 

3) పొరిఫెరా      4) సిస్టోసోమా

14. ‘కటిల్‌ ఫిష్‌’ ఏ వర్గానికి చెందిన జీవి?

1) ఆర్థ్రోపోడా      2) అనిలిడా  

3) పొరిఫెరా      4) మొలస్కా

15. కిందివాటిలో రెండు గదుల హృదయం కలిగిన జీవులు ఏవి?

1) ఆర్థ్రోపోడా      2) అనిలిడా  

3) చేపలు      4) మొలస్కా

16. కింది ఏ జీవి గుడ్లు పెట్టే క్షీరదానికి ఉదాహరణ?

1) తిమింగలం     2) వానపాము 

3) ప్లాటిపస్‌     4) నత్త

17. పెంపుడు కుక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

1) సినాలజీ (Cynology) 

2) ఒఫియాలజీ     3) ఒడెంటాలజీ  

4) డాగాలజీ

18. జ్వాలా కణాలు ఏ జీవుల్లో విసర్జక అవయవాలుగా ఉన్నాయి?

1) ఆర్థ్రోపోడా        2) అనిలిడా  

3) ప్లాటిహెల్మింథస్‌      4) మొలస్కా

19. సకసేరుకాల్లోలా కళ్లు కలిగిన మొలస్కా జీవులు ఏవి?

1) గాస్ట్రోపొడా     2) బైవాల్వియ 

3) పెలిసిపొడా     4) సెఫలోపొడా

20. ‘ఆక్టోపస్‌’ ఏ వర్గానికి చెందిన జీవి?

1) ఆర్థ్రోపోడా      2) అనిలిడా  

3) పొరిఫెరా      4) మొలస్కా

21. మొలస్కా జీవులు ఎక్కువగా ఎక్కడ  జీవిస్తాయి?

1) భౌమ్య ఆవాసాలు 

2) సముద్ర ఆవాసాలు  

3) మంచి నీటి ఆవాసాలు 

4) చెట్లపై భాగాల్లో

22. మొలస్కా జీవుల రక్తం ఎక్కువగా ఏ శ్వాసవర్ణకాన్ని కలిగిఉంటుంది?

1) హీమోసయనిన్‌   2) హీమోగ్లోబిన్‌ 

3) హీమోఎరిత్రిన్‌    4) ఖిమోగ్లోబిన్‌

23. పైలాలో కనిపించే ఆస్ప్రేడియం ఒక....

1) రసాయన గ్రాహకం   2) జ్ఞాన గ్రాహకం 

3) శ్రవణ గ్రాహకం   4) ఆహార గ్రాహకం

24. మొలస్కా జీవుల్లో కర్పరాన్ని స్రవించేది ఏది?

1) రాడ్యులా     2) ఉరఃపంజరం 

3) మాంటిల్‌     4) ఉదరభాగం

25. సీలెంటిరేటా జీవుల్లో ఉండే లార్వా రూపం ఏది?

1) పుల్లేరియా     2) ప్రిమ్యులా 

3) బైపిన్నేరియ     4) ప్లాన్యులా

26. ‘పోర్క్‌ టేప్‌ వర్మ్‌’ అని దేన్ని అంటారు?

1) టీనియా సోలియం  2) ఫేసియోలా 

3) సిస్టోసోమా        4) ఆస్కారిస్‌

27. ‘బీఫ్‌ టేప్‌ వర్మ్‌’ అని దేన్ని పిలుస్తారు?

1) సిస్టోసోమా హిమటోబియం 

2) హెపాటికా     3) టీనియా సాజినేటా 

4) జుగ్లానికా

28. కిందివాటిలో ఆస్కారిస్‌ లుంబ్రికాయిడిస్‌ని ఏమంటారు?

1్శ హుక్‌ వర్మ్‌      2్శ రౌండ్‌ వర్మ్‌ 

3్శ ఎర్త్‌ వర్మ్‌      4్శ ఫైలేరియల్‌ వర్మ్‌

29. ఏంకైలోస్టోమా దడియోడినెల్‌కు ఉన్న మరో పేరు?

1) హుక్‌ వర్మ్‌      2) రౌండ్‌వర్మ్‌ 

3) ఎర్త్‌వర్మ్‌       4) ఫైలేరియల్‌ వర్మ్‌

30. వుకరేరియాబాంక్రాఫ్టీకి ఉన్న మరో పేరు?

1) హుక్‌ వర్మ్‌     2) రౌండ్‌ వర్మ్‌ 

3) ఎర్గ్‌ వర్మ్‌      4) ఫైలేరియల్‌ వర్మ్‌

31. మెటామెరిజం కింది ఏ జీవిలో కనిపిస్తుంది?

1) హుక్‌ వర్మ్‌      2) రౌండ్‌ వర్మ్‌ 

3) ఎర్త్‌ వర్మ్‌     4) ఫైలేరియల్‌ వర్మ్‌

సమాధానాలు

1 - 3  2 - 3  3 - 3  4 - 2  5 - 2  6 - 2  7 - 4  8 - 1  9 - 2  10 - 1  11 - 1  12 - 3  13 - 4  14 - 4  15 - 3  16 - 4  17 - 1  18 - 3  19 - 4  20 - 4  21 - 2  22 - 1  23 - 1  24 - 3  25 - 4  26 - 1  27 - 3  28 - 2  29 - 1  30 - 4 31 - 3  

Posted Date : 20-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌