• facebook
  • whatsapp
  • telegram

పదార్థం స్థితులు

1. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) ఒక ఘనపదార్థాన్ని వేడిచేసినప్పుడు, వ్యాకోచం అనేది పొడవులోగానీ (దైర్ఘ్యవ్యాకోచం), విస్తీర్ణంలోగానీ (క్షేత్రీయ వ్యాకోచం), ఘనపరిమాణంలోగానీ (ఘనపరిమాణ వ్యాకోచం) ఉంటుంది.
బి) ఒక ఘనపదార్థాన్ని వేడిచేసినప్పుడు α : β : γ = 1 : 2 : 3 గా ఉంటుంది.
సి)  లోహాలను వేడిచేసినప్పుడు వాటి అణువుల మధ్య బంధ దూరం పెరిగి వ్యాకోచిస్తాయి.
డి) పైవన్నీ


2. ఒక ఇనుప గోళాన్ని వేడి చేసినప్పుడు దాని ఏ భౌతిక రాశిలో అధికంగా మార్పు జరుగుతుంది?
ఎ) ఘనపరిమాణం      బి) విస్తీర్ణం  
సి) పొడవు          డి) ద్రవ్యరాశి


3. నీటి అసంగత వ్యాకోచ ఉష్ణోగ్రత విలువ ఎంత?
ఎ) -4°C         బి) 0°C           సి)  4°C          డి) 100°C


4. శీతాకాలంలో సరస్సులు, సముద్రాల పైభాగం గడ్డకట్టినప్పటికీ అడుగు భాగంలో ఉన్న నీరు చల్లారకుండా 4°C వద్ద, జలచరాలు జీవించడానికి అనువుగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి?
ఎ) నీటి స్నిగ్ధత              బి) నీటి తలతన్యత
సి) నీటి అసంగత వ్యాకోచం  డి) పైవేవీకావు


5. శీతాకాలంలో కారు రేడియేటర్లు పగిలిపోవడానికి కారణం ఏమిటి?
ఎ) నీటి అసంగత వ్యాకోచం     బి) నీటి కాఠిన్యత
సి) నీటి తలతన్యత        డి) నీటి ఉష్ణవాహకత


6. కారు రేడియేటర్లలో నీరు గడ్డకట్టకుండా ఉండటానికి నీటిలో కలిపే రసాయన పదార్థం ఏది?
ఎ) అయోడిన్‌         బి) ఇథిలీన్‌ గ్లైకాల్‌ 
సి) ఇథిలీన్‌          డి) బ్యూటేన్‌


7. నీటి ఉష్ణోగ్రతను  8°C నుంచి  2°C కి తగ్గిస్తే, దాని   ఘనపరిమాణం ఏమవుతుంది?
ఎ) నిలకడగా ఉంటుంది      బి) తగ్గుతుంది
సి) మొదట తగ్గి, తర్వాత పెరుగుతుంది   
డి) మొదట పెరిగి, తర్వాత తగ్గుతుంది


8. ఏకాంక ద్రవ్యరాశి ఉన్న పదార్థ ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి అవసరమయ్యే ఉష్ణాన్ని ఏమంటారు?
ఎ) బాష్పీభవన ఉష్ణోగ్రత      బి) విశిష్టోష్టం   
సి) మరిగే ఉష్ణోగ్రత       డి) పైవేవీకాదు


9. కింది పదార్థాల్లో అధిక విశిష్టోష్ణం కలిగినది?
ఎ) అల్యూమినియం        బి) ఇథైల్‌ ఆల్కహాల్‌   
సి) బంగారం           డి) నీరు


10. వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందే ప్రక్రియను ఏమంటారు?
ఎ) మరగడం          బి) బాష్పీభవనం 
సి) సాంద్రీకరణం      డి) ద్రవీభవనం


11. వాహనాల్లో ఇంజిన్లను చల్లబరచడానికి నీటిని ఉపయోగిస్తారు. దీనికి కారణం?
ఎ) నీటి అధిక విశిష్టోష్ణం       బి) నీటి అధిక తలతన్యత
సి) నీటి రంగు         డి) నీటి స్వల్ప విశిష్టోష్ణం


12. శీతాకాలంలో గాలిలోని నీటి ఆవిరి వివిధ చల్లటి ఉపరితలాలపై సాంద్రీకరణం చెంది, ఏర్పడే నీటి బిందువులను ఏమంటారు?
ఎ) ఆమ్లవర్షం           బి) కొల్లాయిడ్‌   
సి) తుషారం          డి) మలినం


13. నీటిలో మలినాలు కరిగి ఉంటే, దాని మరిగే స్థానం (Boiling Point) ఏమవుతుంది?
ఎ) తగ్గుతుంది          బి) పెరుగుతుంది   
సి) స్థిరంగా ఉంటుంది (100°C) 
డి) మొదట పెరిగి, తర్వాత తగ్గుతుంది


14. ఏకాంక ద్రవ్యరాశి గల ఒక పదార్థం, దాని ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా ఒక స్థితి నుంచి వేరొక స్థితిలోకి మారడానికి గ్రహించే లేదా కోల్పోయే ఉష్ణాన్ని ఏమంటారు?
ఎ) విశిష్టోష్ణం           బి) స్కందనం   
సి) గుప్తోష్ణం          డి) అవక్షేపణం


15. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత?
ఎ) 340 కెలోరీలు/గ్రామ్‌   బి) 440 కెలోరీలు/గ్రామ్‌ 
సి) 540 కెలోరీలు/గ్రామ్‌   డి) 100 కెలోరీలు/గ్రామ్‌


16. నీటి విశిష్టోష్ణం విలువ ఎంత?
ఎ)  540 cal/gm°C     బి)  1 cal/gm°C 
సి)  4.18 cal/gm°C      డి)  5.48 cal/gm°C 


17. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎంత?
ఎ) 540 కెలోరీలు/గ్రామ్‌       బి) 1 కెలోరీ/గ్రామ్‌   
సి) 420 కెలోరీలు/గ్రామ్‌      డి) 80 కెలోరీలు/గ్రామ్‌


18. ఒక ఘనపదార్థం నేరుగా వాయుస్థితికి మారే ప్రక్రియను ఏమంటారు?
ఎ) ఘనీభవనం           బి) బాష్పీభవనం   
సి) ఉత్పతనం          డి) ద్రవీభవనం


19. కిందివాటిలో ఉత్పతనం చెందే పదార్థాలేవి?
i) అయోడిన్‌        ii) పొడి సున్నం 
iii) టేబుల్‌ సాల్ట్‌      iv) కర్పూరం
v) నాఫ్తలీన్‌ గోలీ      vi) పొడి మంచు (Dry ice)  
ఎ) i, iv, v, vi           బి)  iv, v, vi          సి) ii, iii, iv, v         డి) i, iv, vi 


20. ఉష్ణోగ్రత పెరిగితే వాయు పదార్థాల స్నిగ్ధత ఏమవుతుంది?
ఎ) స్థిరంగా ఉంటుంది         బి) తగ్గుతుంది
సి) పెరుగుతుంది       డి) కచ్చితంగా చెప్పలేం


21. భారజలం అంటే...?
ఎ) 4°C ఉష్ణోగ్రత వద్ద నీరు      బి) మంచు 
సి) స్మాగ్‌          డి) డ్యుటీరియం ఆక్సైడ్‌  (D2O)


22. వాయువును సులభంగా సంపీడనం చెందించవచ్చు. ఎందుకంటే.. దాని
ఎ) కణాల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది.       
బి) నిర్దిష్ట ఘనపరిమాణం కలిగి ఉంటుంది.   
సి) కణాలు చాలా దగ్గరగా ఉంటాయి.          
డి) కణాలు చాలా తేలికైనవి


23. పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులో లేదా స్థితిలో మార్పు వచ్చి, కొత్త పదార్థం ఏర్పడకపోయే మార్పును ఏమంటారు?
ఎ) రసాయన మార్పు     బి) భౌతిక మార్పు
సి) రసాయన చర్య     డి) పైవేవీ కాదు


24. కిందివాటిలో భౌతిక మార్పు కానిది?
ఎ) నీరు నీటి ఆవిరిగా మారడం 
బి) మంచు గడ్డ నీరుగా మారడం
సి) నీరు మంచుగడ్డగా మారడం 
డి) ఇనుము తుప్పు పట్టడం


25. పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులోనూ మార్పు వచ్చి, కొత్త పదార్థాలు ఏర్పడటాన్ని ఏమంటారు?
ఎ) రసాయన మార్పు     బి) భౌతిక మార్పు
సి) రసాయన చర్య     డి) ఎ, సి


26. కిందివాటిలో రసాయన చర్య కానిది?
ఎ) బొగ్గును మండించడం 
బి) పాలు పెరుగుగా మారడం
సి) ఆహారం జీర్ణం కావడం 
డి) పెట్రోల్‌ ఆవిరిగా మారడం


27. ఆవిరిగా మార్చి లేదా వేడిచేసి ద్రావణాల నుంచి ఘనపదార్థాలను వేరుచేసే ప్రక్రియను ఏమంటారు?
ఎ) స్ఫటికీకరణం         బి) స్కందనం
సి) ఉత్పతనం         డి) ద్రవాభిసరణం


28. కిందివాటిలో ద్రవ పదార్థానికి సంబంధించిన ధర్మాలు ఏవి?
i) కేశనాళికీయత     ii) స్నిగ్ధత
iii) తలతన్యత       iv) వ్యాపనం      v) నిర్దిష్ట ఆకారం  
ఎ) i & ii      బి)  i, ii & iii  
సి) ii, iv & v     డి) i, ii & iv


29. ద్రవం ఉపరితలంపై ఊహారేఖకు లంబదిశలో ఏకాంక పొడవుపై పనిచేసే బలాన్ని ఏమంటారు?
ఎ) బాష్పపీడనం         బి) స్నిగ్ధత
సి) తలతన్యత         డి) కేశనాళికీయత


30. కేశనాళిక గొట్టాన్ని ఒక ద్రవంలో ఉంచినప్పుడు, ఆ ద్రవం అసలు మట్టం కంటే పైకి ఎగబాకటం లేదా తగ్గడాన్ని ఏమంటారు?
ఎ) స్నిగ్ధత         బి) తలతన్యత 
సి) భ్రమణం         డి) కేశనాళికీయత


31. ద్రవ ప్రవాహంలో పొరల మధ్య రాపిడి వల్ల ప్రవాహాన్ని నిరోధించే కొలతను ఏమంటారు?
ఎ) స్నిగ్ధత         బి) బాష్పపీడనం
సి) సాంద్రత         డి) ద్రవపీడనం


32. కింది అంశాలను జతపరచండి.
    ధర్మం             ప్రమాణం
A) స్నిగ్ధత            i) న్యూటన్‌/ మీటర్‌
B) తలతన్యత     ii) పాస్కల్‌
C) బలం             iii) పాయిస్‌
D) పీడనం          iv) న్యూటన్‌
ఎ) A-iii, B-i, C-ii, D-iv 
బి)  A-iii, B-iv, C-i, D-ii    
సి) A-ii, B-i, C-iv, D-iii
డి) A-iii, B-i, C-iv, D-ii


33. ద్రవపదార్థంలో ఒకే రకమైన అణువుల మధ్య గల ఆకర్షణ బలాలను ఏమంటారు?
ఎ) అసంజన బలాలు          బి) సంసంజన బలాలు
సి) అయస్కాంత బలాలు    డి) అపకేంద్ర బలాలు


34. ఒక ద్రవ పదార్థంలో వేర్వేరు అణువుల మధ్య గల ఆకర్షణ బలాలను ఏమంటారు?
ఎ) అభికేంద్ర బలాలు     బి) అపకేంద్ర బలాలు
సి) అసంజన బలాలు        డి) సంసంజన బలాలు


35. వర్షపు చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణమైన ధర్మం ఏమిటి?
ఎ) స్నిగ్ధత         బి) తలతన్యత
సి) ద్రావణీయత         డి) విశిష్టోష్ణం


36. కిందివాటిలో తలతన్యత దేనిపై ఆధారపడుతుంది?
ఎ) ద్రవాల స్వభావం     బి) ఉష్ణోగ్రత
సి) మాలిన్యాలు         డి) పైవన్నీ


37. నిలకడగా ఉన్న నీటి ఉపరితలంపై దోమలు, క్రిమికీటకాలు స్వేచ్ఛగా చలించడానికి కారణం?
ఎ) నీటి తలతన్యత     బి) నీటి స్నిగ్ధత
సి) నీటి బాష్పీభవన స్థానం  డి) నీటి కేశనాళికీయత


38. కిందివాటిలో తలతన్యతకు సంబంధించి సరైంది?
ఎ) నీటికి డిటర్జెంట్‌ పొడిని కలిపినప్పుడు దాని తలతన్యత తగ్గుతుంది
బి) నీటిపై కిరోసిన్‌ నూనెను వెదజల్లినపుడు దాని తలతన్యత తగ్గుతుంది. కాబట్టి దోమలు నీటిలో  మునిగి నశిస్తాయి.
సి) సబ్బునీటి బుడగలు, పాదరసం, బిందువులు గోళాకారంలో ఉండటానికి కారణం తలతన్యత.
డి) పైవన్నీ


39. ద్రవపదార్థాలను వేడిచేసినప్పుడు వాటి తలతన్యత ఏమవుతుంది?
ఎ) పెరుగుతుంది        బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంటుంది  డి) కచ్చితంగా చెప్పలేం


40. కేశనాళికా గొట్టాన్ని ఏ ద్రవ పదార్థంలో ఉంచినప్పుడు, ఆ ద్రవం అసలు మట్టానికంటే పైకి ఎగబాకుతుంది?
ఎ) నీరు         బి) ఆల్కహాల్‌
సి) పాదరసం         డి) ఎ, బి


41. దీపం ప్రమిదలోని ఒత్తి, కిరోసిన్‌ స్టౌవ్‌లోని ఒత్తులు నూనెను పైకి ఎగబాకేలా చేయడంలోని ధర్మం?
ఎ) తలతన్యత         బి) స్నిగ్ధత
సి) కేశనాళికీయత         డి) ద్రవ సాంద్రత


42. i) కేశనాళిక గొట్టంలో నీటి చంద్రరేఖ పుటాకారంలో ఉంటుంది. 
ii) కేశనాళిక గొట్టంలో పాదసరం చంద్రరేఖ కుంభాకారంలో ఉంటుంది
ఎ) i సరైంది, ii తప్పు       బి) రెండూ సరైనవే 
సి) i తప్పు, ii సరైంది       డి) రెండూ సరికావు


సమాధానాలు: 1-డి; 2-ఎ; 3-సి; 4-సి; 5-ఎ; 6-బి; 7-సి;  8-బి; 9-డి; 10-సి; 11-ఎ; 12-సి; 13-బి; 14-సి; 15-సి; 16-బి; 17-డి; 18-సి; 19-ఎ; 20-సి; 21-డి; 22-ఎ; 23-బి; 24-డి; 25-డి; 26-డి; 27-ఎ; 28-బి; 29-సి; 30-డి; 31-ఎ; 32-డి; 33-బి; 34-సి; 35-బి; 36-డి; 37-ఎ; 38-డి; 39-బి; 40-డి; 41-సి; 42-బి.

Posted Date : 02-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌