• facebook
  • whatsapp
  • telegram

కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)కేంద్ర ఆర్థిక సంఘం అంతర్‌ రాష్ట్ర మండలి

1. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు?

1) Vవ భాగం, ఆర్టికల్స్‌ 147 నుంచి 152

2) Vవ భాగం, ఆర్టికల్స్‌ 148 నుంచి 151

3) Vవ భాగం, ఆర్టికల్స్‌ 149 నుంచి 153

4 )VI వ భాగం, ఆర్టికల్స్‌ 147 నుంచి 151


2. ‘‘భారత రాజ్యాంగం సృష్టించిన పదవుల్లో అత్యంత శక్తిమంతమైంది కాగ్‌’’ అని ఎవరు పేర్కొన్నారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌     2) పాల్‌ ఆపిల్‌బీ  

 3) నానీ పాల్కీవాలా   4) జవహర్‌లాల్‌ నెహ్రూ


3. ‘కాగ్‌’కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆర్టికల్‌ 148 (1)ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు.

బి) ఆర్టికల్‌ 148(2) ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

సి) ఆర్టికల్‌ 148(3) ప్రకారం పార్లమెంట్‌ జీతభత్యాలను నిర్ణయిస్తుంది.

డి) ఆర్టికల్‌ 148(4) ప్రకారం పదవీ విరమణ తర్వాత కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఎలాంటి ఉద్యోగాన్ని అయినా చేపట్టవచ్చు.

1) ఎ, బి, డి      2) ఎ, సి, డి    3) ఎ, బి, సి      4) పైవన్నీ


4. కిందివాటిలో కాగ్‌ విధి?

ఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల లావాదేవీలను పరిశీలించడం.

బి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ఖర్చు పరిశీలించడం.

సి) చట్ట ప్రకారం ఉద్దేశించిన ప్రయోజనం కోసం నిర్దేశించిన మొత్తాన్ని వినియోగించారా లేదా అని పరిశీలించడం.

డి) ప్రభుత్వరంగ సంస్థల ఆదాయ, వ్యయాలను నిశితంగా పరిశీలించడం.

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి     3) ఎ, సి, డి      4)పైవన్నీ


5. ‘కాగ్‌’కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) భారతదేశ ప్రజాధనానికి కావలి కుక్క (Watch Dog) గా పేర్కొంటారు.

బి) రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తామని ప్రమాణస్వీకారం చేస్తారు.

సి) 1976లో కాగ్‌ నుంచి అకౌంటింగ్‌ విభాగాన్ని వేరు చేశారు.

డి) కాగ్‌ నివేదికను Post Mortem (శవ పంచనామా)గా పేర్కొంటారు.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి    3) ఎ, బి, డి     4) పైవన్నీ


6. ‘కాగ్‌’కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) మొదటి కాగ్‌ - నరహరిరావ్‌

బి) ప్రస్తుత కాగ్‌ - గిరీష్‌ చంద్ర ముర్ము

సి) పదవీ విరమణ వయసు - పదవి చేపట్టిన తేదీ నుంచి ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండే వరకు.

డి) రాష్ట్రస్థాయిలో తన వార్షిక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తుంది.

1) ఎ, బి, డి    2) ఎ, బి, సి    3) ఎ, సి, డి    4) పైవన్నీ


7. కాగ్‌ను ఏ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ‘తత్వవేత్త, స్నేహితుడు, మార్గదర్శి’(Philosopher, Friend, Guide)  గా పేర్కొంటారు?

1) ప్రభుత్వ ఖాతాల సంఘం     2) ప్రభుత్వరంగ సంఘం 

3) అంచనాల సంఘం    4) దత్తశాసనాల సంఘం


8. పార్లమెంట్‌కి ‘పొడిగించిన చెయ్యి’ (Extended hand) అని కింది ఎవరిని/ దేన్ని పేర్కొంటారు?

1) పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ     2) అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

3) కాగ్‌     4) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం


9. కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.

బి) అయిదేళ్లకోసారి దీన్ని ఏర్పాటు చేస్తారు.

సి) దీనిలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.

డి) ఆర్థిక సంఘం విధులన్నీ కేవలం సలహాపూర్వకమైనవి.

1) ఎ, బి, సి   2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ


10. మొదటి ఆర్థిక సంఘానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) 1951లో ఏర్పడింది.    బి) నివేదికను 1953లో ప్రభుత్వానికి సమర్పించింది.

సి) సిఫార్సుల అమలు 195257    డి) తొలి ఛైర్మన్‌ కె.సి.నియోగి

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి     3) ఎ, సి, డి      4)పైవన్నీ


11. వివిధ ఆర్థిక సంఘాల ఛైర్మన్‌లకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) 10వ ఆర్థిక సంఘం - కె.సి.పంత్‌

2)11వ ఆర్థిక సంఘం - ఎ.ఎం.ఖుస్రో

3) 12వ ఆర్థిక సంఘం - ఎన్‌.కె.పి.సాల్వే

4) 6వ ఆర్థిక సంఘం - కె.బ్రహ్మానందరెడ్డి


12. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) డాక్టర్‌ వై.వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన 2013, జనవరి 2న ఏర్పడింది.

2) ఇది తన నివేదికను 2014, డిసెంబరు 15న సమర్పించింది.

3) దీని సిఫార్సుల అమలుకాలం: 201520

4) గాడ్గిల్‌ ఫార్ములా ఆధారంగా రాష్ట్రాలకు వనరులు కేటాయించాలని సిఫార్సు చేసింది.


13. కేంద్ర నికర పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ఎంత శాతం వాటా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది?

1) 32%  2) 38%   3) 42%    4)51%


14. 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం, మనదేశంలో రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలు ఏవి?

1) గుజరాత్, తెలంగాణ    2) హరియాణా    3) రాజస్థాన్‌     4) పైవన్నీ


15. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) 2017, నవంబరు 27న నందకిశోర్‌ సింగ్‌ అధ్యక్షతన ఏర్పడింది.

బి) 2019, డిసెంబరులో తన నివేదికను సమర్పించింది.

సి) దీని సిఫార్సులు 2020, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

డి) సిఫార్సుల అమలు కాలం 202027

1) ఎ, బి, సి   2) ఎ, సి, డి    3) ఎ, బి, డి     4) పైవన్నీ


16. కిందివారిలో 15వ ఆర్థిక సంఘంలో సభ్యులు కానిది ఎవరు?

1) శక్తికాంతదాస్, అనూప్‌సింగ్‌     2) అలోక్‌ కుమార్‌ లాహిరి

3) రమేష్‌ చంద్‌      4) అరవింద్‌ పనగరియా


17. ఏ సంవత్సర జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 15వ ఆర్థిక సంఘం తన నివేదికను రూపొందించింది?

1) 1971  2) 1991  3) 2001  4) 2011


18. మనదేశంలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2017, జులై 1     2) 2018, ఏప్రిల్‌ 1

3) 2019, జనవరి 1    4) 2020, మార్చి 1


19. అంతర్‌ రాష్ట్ర మండలికి (Inter State Council) సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 263లో పేర్కొన్నారు.

2) ప్రధాని అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

3) వి.పి.సింగ్‌ ప్రభుత్వ హయాంలో 1990, సెప్టెంబరులో నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంది.

4)పి.వి.నరసింహారావు ప్రభుత్వకాలంలో దీన్ని రద్దుచేశారు.


సమాధానాలు

1-2  2-1  3-3  4-4  5-4  6-2  7-1  8-3  9-4  10-4  11-3  12-4  13-3  14-4  15-1  16-4  17-4  18-1  19-4  


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. పార్లమెంట్‌లోని ఏ కమిటీకి కాగ్‌ తన సేవలు అందిస్తుంది? 

(ఏపీ సబ్‌ఇన్‌స్పెక్టర్స్, 2018)

1) ప్రభుత్వ అంచనాల సంఘం  

2) ప్రభుత్వ ఖాతాల సంఘం

3) ప్రభుత్వరంగ సంస్థల సంఘం 

4) ప్రత్యేక హక్కులపై పార్లమెంటరీ కమిటీ


2. కిందివాటిలో ఏ బాధ్యతలు ఆర్థిక సంఘం పరిధిలోకి వస్తాయి? 

(టీఎస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్స్, 2018)

ఎ) పన్నుల నికర ఆదాయాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంచడం.

బి) కేంద్రం, రాష్ట్రాలకు అందించే సహాయాలకు సంబంధించిన నియమాలను సిఫార్సు చేయడం.

సి) రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి అవసరమైన సిఫార్సులు చేయడం.

1) ఎ, బి    2) ఎ, సి    3) బి, సి   4)పైవన్నీ


3. అంతర్‌ రాష్ట్ర మండలికి సంబంధించి కిందివాటిలో సరికానిది? 

(టీఎస్‌ కానిస్టేబుల్స్, 2018)

1) ప్రధానమంత్రి దీనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

2) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిలో సభ్యులుగా ఉంటారు.

3) జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ కమిటీ సిఫార్సుల మేరకు ఇది ఏర్పాటైంది.

4) శాసన సభ్యులు లేని కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు దీనిలో సభ్యులుగా ఉంటారు.


4. కింది వాటిలో సరైనవి? 

(టీఎస్‌ కానిస్టేబుల్స్, 2016)

ఎ) 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులు - వై.వి.రెడ్డి

బి) 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42% నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది.

సి) ఆర్థిక సంఘాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏర్పాటు చేస్తారు.

1) ఎ, సి    2) ఎ, బి    3) బి, సి      4) పైవన్నీ


5. ఆర్థిక కమిషన్‌ను ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారు?     (గ్రూప్‌--II 2012)

1)  ఆర్టికల్‌ 245   2) ఆర్టికల్‌ 270    3) ఆర్టికల్‌ 280    4)ఆర్టికల్‌ 219


6. అంతర్‌ రాష్ట్ర మండలి నిర్ణయాలు కింది ఏ విధంగా తీసుకుంటారు?

1) సర్వసమ్మతితో

2) హాజరైన సభ్యుల సాధారణ మెజార్టీతో 

3) హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మెజార్టీతో 

4) హాజరైన సభ్యుల్లో నాలుగింట మూడువంతుల మెజార్టీతో


7. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి? 

(ఏపీపీఎస్సీ గ్రూప్‌ - I, , 2019)

1) 2016     2) 2020    3) 2022     4) 2023


సమాధానాలు

1-2   2-3   3-3   4-2   5-3   6-1   7-2

Posted Date : 18-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌