ఆ ఒక్కటీ వేరుగా ఉంటే!
సృజనాత్మకత, సమర్థ సమాచార విశ్లేషణ, సమస్యల పరిష్కారం తదితర లక్షణాలను అభ్యర్థిలో గుర్తించడానికి రీజనింగ్ ప్రశ్నలను పోటీ పరీక్షల్లో అడుగుతుంటారు. అందులో భిన్న పరీక్ష ఒక విభిన్నమైన అధ్యాయం. దీని ద్వారా ఒక సమూహంలోని నమూనాలను, సారూప్యతలను, వ్యత్యాసాలను గుర్తించగలిగిన సామర్థ్యాలను పరిశీలిస్తారు. తార్కిక నైపుణ్యాలను అంచనా వేస్తారు. ఇచ్చిన అంకెలు, సంఖ్యలు, అక్షరాలు, పదాల శ్రేణుల్లో మిగతావాటి కంటే వేరుగా ఉన్నదాన్ని పట్టుకోగలిగితే జవాబు దొరికినట్లే.
భిన్న పరీక్షకు సంబంధించి ప్రశ్నలో భాగంగా నాలుగు అంశాలను ఇస్తారు. ఇందులో ఏవైనా మూడు అంశాలు ఒక నిర్దిష్టమైన నియమాన్ని పాటిస్తే, మరొకటి మాత్రం భిన్నంగా ఉంటుంది. అభ్యర్థి దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అక్షర శ్రేణి, సంఖ్యా శ్రేణి లాంటి అంశాలపై మంచి అవగాహన ఉంటే భిన్నపరీక్షను సులభంగా సాధన చేయవచ్చు. భిన్న పరీక్ష ప్రధానంగా మూడు రకాలు.
1) అక్షర భిన్న పరీక్ష (Letter odd man out):
ఉదా 1: కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.
1) CI 2) PV 3) WC 4) KR
వివరణ:
మొదటి అక్షరానికి ‘6’ కలపడం ద్వారా రెండో అక్షరం ఏర్పడుతుంది.
సమాధానం: 4
ఉదా 2: కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.
ZA, YE, XI, WO, TU
1) ZA 2) XI 3) WO 4) TU
వివరణ:
సమాధానం: 4
2) సంఖ్యా భిన్న పరీక్ష (Number odd man out):
ఉదా 1: కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.
1) 4203 2) 6021 3) 7520 4) 3240
వివరణ:
సంఖ్యలోని అంకెల మొత్తం 9 కి సమానంగా ఉంది.
సమాధానం: 3
ఉదా 2: కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.
9, 49, 81, 121, 169, 289
1) 289 2) 81 3) 49 4) 169
వివరణ: 9 = 32 121 = 112
49 = 72 169 = 132
81 = 92 289 = 172
ప్రతి సంఖ్యా వర్గ సంఖ్య. కానీ 81 మాత్రమే సంయుక్త సంఖ్య యొక్క వర్గం. మిగతావి ప్రధాన సంఖ్యల వర్గాలు.
సమాధానం: 2
3) పదాల భిన్న పరీక్ష (Word odd man out):
పదాల భిన్న పరీక్షపై పట్టు సాధించడానికి అభ్యర్థికి ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.
దేశాలు - రాజధానులు
రాష్ట్రాలు - రాజధానులు
దేశాలు - కరెన్సీ
పరికరం - ఉపయోగం
జంతువులు/పక్షులు - ప్రదేశాలు
ఆటలు - ఆటస్థలాలు
వస్తువు - ముడిపదార్థం
అంశం - అధ్యయన శాస్త్రం
ఉదా 1: కిందివాటిలో భిన్నమైంది?
1) త్రిభుజం 2) చతుర్భుజం 3) వృత్తం 4) పంచభుజి
వివరణ: త్రిభుజం, చతుర్భుజం, పంచభుజి లాంటివి భుజాలను కలిగి ఉంటాయి. కానీ వృత్తం వక్రాన్ని కలిగి ఉంటుంది.
సమాధానం : 3
ఉదా 2: కిందివాటిలో భిన్నమైంది ఏది?
1) భూమి 2) బుధుడు 3) చంద్రుడు 4) శుక్రుడు
వివరణ: భూమి, బుధుడు, శుక్రుడు అనేవి గ్రహాలు కానీ చంద్రుడు ఉపగ్రహం.
సమాధానం : 3
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో భిన్నమైన/సరిపోలని దాన్ని గుర్తించండి.
1) 525 2) 636 3) 749 4) 516
వివరణ: ప్రతి సంఖ్యలో మొదటి అంకె వర్గం తర్వాతి స్థానాల్లో రాసి ఉంది.
సమాధానం: 4
2. కింది ఐచ్ఛికాల్లో సరిపోలని దాన్ని గుర్తించండి.
1) 6159 2) 7169 3) 4117 4) 853
వివరణ: మొదటి, చివరి అంకెల మొత్తాన్ని సంఖ్య మధ్యలో రాశారు.

సమాధానం: 4
3. కిందివాటిలో భిన్నమైంది ఏది?
1) 84601 2) 9261 3) 38691 4) 9586
వివరణ: 223 = 10648
213 = 9261
273 = 19683
193 = 6859
22, 27, 19 అనే సంఖ్యల ఘనాలను వ్యతిరేకంగా రాయడం ద్వారా ఏర్పడ్డాయి.
సమాధానం: 2
4. కిందివాటిలో భిన్నమైన/సరిపోలని అంకెలను గుర్తించండి.
1) 322 2) 405 3) 392 4) 343
వివరణ:

405 కాకుండా మిగిలిన అన్ని సంఖ్యలు 7 గుణిజాలు
సమాధానం : 2
5. ఇచ్చిన ఆప్షన్లలో భిన్నంగా ఉన్నది ఏది?
1) 482 2) 600 3) 702 4) 930
వివరణ:
సమాధానం : 1
6. కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.
1) P 2) U 3) N 4) L
వివరణ:
P = 16, U = 21, N = 14, L = 12
P, N, L అక్షరాలు సరిస్థానాల్లో ఉన్నాయి.
U బేసి స్థానంలో ఉంది. కాబట్టి U భిన్నమైంది.
సమాధానం: 2
7. కింది అంశాల్లో భిన్నమైంది?
1) XZ 2) ళిRV 3) MD 4) QT
వివరణ: అక్షరమాల క్రమంలో మొదటి అక్షరం తర్వాత రెండో అక్షరం వస్తుంది. కానీ MD లో M తర్వాత D వచ్చింది
సమాధానం: 3
8. కిందివాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి.
1) KMP 2) RTV 3) PRT 4) MOQ
వివరణ:
సమాధానం: 1
9. కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.
1) BGN 2) TYF 3) PUZ 4) MRY
వివరణ:
సమాధానం: 3
10. కింది అంశాల్లో సరిపోలని దాన్ని గుర్తించండి.
1) UMRP 2) APQG 3) EGSR 4) FRCB
వివరణ: ప్రతి సమూహంలో మొదటి అక్షరం అచ్చుగా ఉంది కాబట్టి నీళిదితీ సరైన సమాధానం.
సమాధానం: 4
11. కిందివాటిలో భిన్నంగా ఉన్న దాన్ని తెలపండి.
1) బంగాళదుంప 2) క్యారట్ 3) వంకాయ 4) బీట్రూట్
వివరణ: వంకాయ కాకుండా మిగిలినవన్నీ దుంపలు.
సమాధానం: 3
12. కిందివాటిలో భిన్నమైంది?
1) అంకమధ్యమం 2) బాహుళకం 3) మధ్యగతం 4) విస్తృతి
వివరణ: అంకమధ్యమం, బాహళకం, మధ్యగతం అనేవి కేంద్రీయ స్థానపు కొలతలు. విస్తృతి కాదు.
సమాధానం: 4
13. కింద ఇచ్చిన నెలల్లో భిన్నంగా ఉన్నదాన్ని తెలపండి.
1) సెప్టెంబరు 2) మే 3) జూన్ 4) నవంబరు
వివరణ: సెప్టెంబరు = 30 రోజులు
మే = 31 రోజులు
జూన్ = 30 రోజులు
నవంబరు = 30 రోజులు
సమాధానం: 2
14. కిందివాటిలో భిన్నమైన అంశం?
1) డెబిట్ 2) డిపాజిట్ 3) డిడక్షన్ 4) విత్‌డ్రా
వివరణ: డిపాజిట్ కాకుండా మిగిలినవన్నీ నగదులో తగ్గుదలను సూచిస్తాయి.
సమాధానం: 2
15. కిందివాటిలో భిన్నంగా ఉన్నది ఏది?
1) కుంట 2) సరస్సు 3) వంతెన 4) నది
వివరణ: కుంట, సరస్సు, నది నీటిని కలిగి ఉంటాయి. వంతెన అనేది నీటిపై నిర్మించి ఉంటుంది.
సమాధానం: 3
రచయిత: గోళి ప్రశాంత్‌రెడ్డి