• facebook
  • whatsapp
  • telegram

విదేశీ వాణిజ్యం

1. ఒక దేశ పౌరులు, ఇతర దేశ పౌరులకు మధ్య జరిగే వ్యాపారాన్ని ఏమంటారు?

1) విదేశీ వాణిజ్యం   2) స్వదేశీ వ్యాపారం    3) దేశీయ వ్యాపారం     4) జాతీయ వ్యాపారం


2. ఒకే దేశంలో ఉండే పౌరులకు మధ్య జరిగే వ్యాపారాన్ని ఏమంటారు?

1) దేశీయ వ్యాపారం    2) బహిర్గత వ్యాపారం   3) అంతర్జాతీయ వ్యాపారం    4) విదేశీ వాణిజ్యం


3. డిసెంబరు-2022లో భారత ఎగుమతులు 12.2 శాతం తగ్గి ఎన్ని బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి?

1) 34.48 బి.డా.   2) 24.48 బి.డా.   3) 44.42 బి.డా.    4) 32.48 బి.డా.


4. నిరపేక్ష వ్యయ అనుకూలత అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు?

1) డేవిడ్‌ రికార్డో    2) జె.ఎం. కీన్స్‌    3) హేబర్లర్‌     4) ఆడంస్మిత్‌


5.తులనాత్మక వ్యయ అనుకూలత అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త..

1)  డేవిడ్‌ రికార్డో    2) మార్షల్‌    3) ఏసీ పిగూ   4) ఆడంస్మిత్‌


6. కింది వాటిలో 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు ఏవి?

1) డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌      2)ఇంజినీరింగ్‌ వస్తువులు, ఆర్గానిక్‌ వస్తువులు

3) ఇన్‌ఆర్గానిక్‌ వస్తువులు      4) పైవన్నీ


7. అంతర్జాతీయ వాణిజ్య/ వ్యాపార కాపలాదారు( watch dog of the world trade) అని దేన్ని పిలుస్తారు?

1) గీవివీ     2) గీవిదీశి     3) ఖిలివీ    4) జూగివీ


8. ప్రపంచ వాణిజ్య సంస్థను( world trade organisation) ఎప్పుడు స్థాపించారు?

1) 1993 జనవరి 1      2)1994 జనవరి 1    3) 1995 జనవరి 1    4) 1996 జనవరి 1


9. భారత్‌ నుంచి అత్యధికంగా ఎగుమతులు జరిగే మొదటి మూడు దేశాలు ఏవి?

1) యూఎస్‌ఏ, యూఏఈ, చైనా     2) జపాన్, చైనా, జర్మనీ

3) ఈయూ, జర్మనీ, జపాన్‌       4) బ్రిటన్, జర్మనీ, ఈయూ


10. 2021-26 విదేశీ వాణిజ్య విధానం ఉద్దేశం ఏమిటి?

1) భారతదేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం    

2) వస్తు, సేవల ఎగుమతుల ద్వారా పొందిన లాభాలను ఉపాధి, వృద్ధి కోసం ఉపయోగించడం

3) 1, 2

4) ఆర్థిక వ్యవస్థను 7 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడం


11. వర్తకలోటు అంటే ఏమిటి?

1) ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ      2) దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువ

3) ఎగుమతులు, దిగుమతులు సమానం      4) దిగుమతులు మాత్రమే తగ్గడం


12. కింది వాటిలో అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత బ్యాంకు..

1) వితితీతిళిదీ    2) ఖిదీతీఖి      3) నిశ్రీఖిలీ తీతివిరీ      4) తిదీతీ


13. విదేశీ వాణిజ్య విధానం - 2023 ముఖ్య ఉద్దేశం ఏమిటి?

1) దేశ ఎగుమతులను పెంచడం     2) రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడం 

3) ఈ-కామర్స్‌ ఎగుమతులకు ప్రయోజనాలు వర్తింపజేయడం     4) పైవన్నీ


14. విదేశీ వాణిజ్య విధానం - 2023 ప్రకారం దేశ ఎగుమతులను 2030 నాటికి ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?

1) 2 లక్షల కోట్ల డాలర్లు      2) 3 లక్షల కోట్ల డాలర్లు        

3) 4 లక్షల కోట్ల డాలర్లు       4) 6 లక్షల కోట్ల డాలర్లు    


15. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ వస్తు, సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్‌ డాలర్ల విలువను అధిగమించే అవకాశముందని అంచనా వేశారు?
1) 665 బి.డా.     2) 765 బి.డా.       3) 865 బి.డా.           4) 965 బి.డా.


16. 2021-22లో భారత్‌ వస్తు, సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి?

1) 676 బి.డా.  2)776 బి.డా.   3) 576 బి.డా.    4) 476 బి.డా.


17. ఈ-కామర్స్‌ ఎగుమతులు 2030 నాటికి ఎన్ని బిలియన్‌ డాలర్లకు చేరతాయని అంచనా?

1)300400 బి.డా .   2) 200300 బి.డా.   3) 400500 బి.డా.  4) 300200 బి.డా.


18. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య సంస్థలో( WTO )సభ్య దేశాల సంఖ్య?

1) 161    2) 162    3) 163     4) 164


19. 202122లో భారత మర్కండైజ్‌ ఎగుమతులు ఎన్ని బిలియన్‌ డాలర్లకు చేరాయి?

1) 422 బి.డా.    2) 421 బి.డా.    3) 423 బి.డా    4) 424 బి.డా


20. భారత ఆర్థిక వ్యవస్థ 6.5 నుంచి 7 శాతం వృద్ధితో సాగి 202526 నాటికి ఎన్ని లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా?
1) 5 లక్షల కోట్ల డాలర్లు       2) 6 లక్షల కోట్ల డాలర్లు

3) 4 లక్షల కోట్ల డాలర్లు       4) 3 లక్షల కోట్ల డాలర్లు


21. భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ తెలిపారు?

1) 6 లక్షల కోట్ల డాలర్లు       2) 7 లక్షల కోట్ల డాలర్లు

3) 8 లక్షల కోట్ల డాలర్లు       4) 9 లక్షల కోట్ల డాలర్లు


22. గత 30 ఏళ్లుగా భారత జీడీపీ డాలర్ల రూపేణా సగటున ఎంత శాతం వార్షిక వృద్ధిని కనబరిచింది?

1) 7%       2) 8%         3) 9%        4) 10%


23. భారత్‌ నుంచి 2022 ఏప్రిల్‌ - నవంబరు  మధ్య అధిక ఎగుమతులు చేసుకున్న దేశాలు?

1) యూఎస్‌ఏ    2) యూఏఈ     3) నెదర్లాండ్స్‌      4) పైవన్నీ


24. భారతదేశ మొత్తం దిగుమతుల్లో ఏ దేశాల వాటా సంయుక్తంగా అధికంగా ఉంది? (2022-23 సర్వే)

1) చైనా, యూఏఈ, యూఎస్‌ఏ      2) జపాన్, జర్మనీ, ఈయూ

3) ఆస్ట్రేలియా, యూకే, చైనా       4) జర్మనీ, ఇంగ్లండ్, ఈయూ


25. భారత్‌కు అత్యధికంగా పెట్రోలియం ఎగుమతి చేసే మూడు దేశాలు?

1) ఇరాక్‌        2) సౌదీ అరేబియా    3) యూఏఈ      4)  పైవన్నీ


26. కింది వాటిలో 2023లో వేటి ఎగుమతులు 21.1 శాతం ఉన్నాయి?

1) పెట్రోలియం   2) ఆయిల్‌     3)లూబ్రికెంట్స్‌      4) పైవన్నీ


27. కింది వాటిలో భారత్‌ అధికంగా దిగుమతి చేసుకునే వస్తువులు...

1) పెట్రోలియం, చమురు ఉత్పత్తులు     2) వ్యవసాయ వస్తువులు    

3) వినియోగ వస్తు ఉత్పత్తులు      4) ఏదీకాదు


సమాధానాలు

1-1      2-1       3-1      4-4       5-1     6-4        7-4        8-3          9-1        10-3         11-1      12-3 

 13-4      14-1      15-2       16-1     17-2      18-4       19-1         20-1         21-2          22-3    23-4 

   24-1     25-4       26-4       27-1

మరికొన్ని....


1. Export & Import Bank (EXIM BANK )ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1)1980      2) 1981   3) 1982   4) 1983


2. 2022-23 అక్టోబరు-డిసెంబరులో మనదేశ కరెంట్‌ ఖాతాలోటు జీడీపీలో ఎంత శాతం తగ్గింది?

1) 2.2 శాతం    2) 1.2 శాతం     3) 3.2 శాతం      4) 1.3 శాతం


3. 2022-23 రెండో త్రైమాసికంలో కరెంట్‌ ఖాతాలోటు జీడీపీలో ఎంత శాతం ఉంది?

1) 2.7 శాతం    2) 3.7 శాతం     3) 4.7 శాతం    4) 5.7 శాతం


4. ఎగ్జిమ్‌ బ్యాంక్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?

1) ఆర్‌బీఐ    2) భారత ప్రభుత్వం     3) ప్రపంచ బ్యాంక్‌     4) ఐఎంఎఫ్‌


5. ప్రపంచ వాణిజ్య సంస్థ( WTO ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) జెనీవా (స్విట్జర్లాండ్‌)   2) జకార్తా (ఇండోనేసియా)      3) మనీలా (ఫిలిప్పీన్స్‌)     4) బీజింగ్‌ (చైనా)


6. 2022-23లో ఏప్రిల్‌-డిసెంబరు మధ్య మొత్తం ఎగుమతుల శాతం?

1)  9 శాతం     2) 10 శాతం     3) 11 శాతం    4) 12 శాతం


7. వస్తు, సేవల అమ్మకం, కొనుగోలును ఏమంటారు?

1) వాణిజ్యం/వ్యాపారం     2) వినిమయం      3) మారకం     4) ఏదీకాదు


8. భారత విదేశీ చెల్లింపుల విషయంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిన సంవత్సరం?

1)1991      2) 1992   3) 1993      4) 1994


9. వాణిజ్య చెల్లింపుల శేషం లెక్కలు నిర్వహించే సంస్థ?

1)  సెబీ      2) కేంద్ర ఆర్థిక శాఖ    3) ఆర్‌బీఐ     4) బీఎస్‌ఈ


10. ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఎగుమతులు ఎంత శాతం వార్షిక వృద్ధిని సాధించాయి?

1) 45 శాతం     2) 55 శాతం    3)65 శాతం    4) 35 శాతం


11. కింది వాటిలో భారత ప్రభుత్వం మొదటి నిశ్రీఖిలీ విధానం ప్రకటించిన సంవత్సరం.....

1)985       2)  1986      3) 1987     4) 1988


12. వ్యాపార చెల్లింపుల శేషం పట్టిక ఆకృతిని సిఫార్సు చేసిన కమిటీ?

1) డా.సి.రంగరాజన్‌ కమిటీ    2) ఎం.నరసింహం కమిటీ     3) వై.వి.రెడ్డి కమిటీ      4) ఎవరూకాదు


13. కింది వాటిలో వ్యాపార చెల్లింపుల శేషంలో ప్రతికూలత ఉండే సందర్భం ఏది?

1) రాబడిని మించి చెల్లింపులు ఉన్నప్పుడు     2) ఖర్చుని మించి రాబడి ఉన్నప్పుడు

3) రాబడిని మించి చెల్లింపులు లేనప్పుడు      4) రాబడిని మించి చెల్లింపులు తగ్గినప్పుడు


సమాధానాలు

1-3      2-1        3-2      4-2     5-1       6-1       7-1        8-1       9-3       10-2

11-1       12-1   13-1

Posted Date : 07-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌